మెడికల్ స్కాం కింగ్ పిన్ సజ్జల సన్నిహితుడు?

దేశంలో ఏ మూల ఏ స్కాం జరిగినా అందులో వైసీపీ నేతలు కచ్చితంగా ఉంటారు. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా ఇలా ఏ నేరం జరిగినా.. అందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు తేలుస్తున్నాయి. అంతేనా కబ్జాలు, దౌర్జన్యాలు, హత్యల కేసులలో కూడా వైసీపీ నేతలపై కేసులు నమోదౌతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వైసీపీలో ఉండేందుకు నేరాలు చేయడం ఒక అర్హత అని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. అది పక్కన పెడితే తాజాగా తాజాగా మెడికల్ కాలేజీల్లో తనిఖీలు చేసే వారికి లంచాలు ఆఫర్ చేసి క్లీన్ సర్టిఫికెట్లు ఇప్పించే బృందం ఇటీవల సీబీఐకి పట్టుబడింది. ఆ నేర బృందంలోనూ ఓ వైసీపీ నేత పాత్ర కీలకంగా ఉంది. అంతే కాదు.. సదరు వ్యక్తి వైసీపీలో దాదాపు నంబర్ 2గా వెలిగిపోతున్న ఆ పార్టీ సీనియర్, కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితుడనీ చెబుతున్నారు.  దేశవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల ఇన్ స్పెక్షన్లలో ముడుపుల దందా చ చేసిన కేసులో సీబీఐ 34 మందిపై కేసు నమోదు చేసింది.  ఈ కేసులో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, జాతీయ మెడికల్ కమిషన్ తనిఖీ బృందం డాక్టర్లు, పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రతినిథులు ఉన్నారు.  ఈ కేసులో ముడుపులకు మధ్యవర్తిగా వ్యవహరించినది వైసీపీ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ అని సీబీఐ పేర్కొంది. కదిరి సమీపంలోని ఆయన నివాసంలో ఇటీవల సీబీఐ సోదాలు కూడా నిర్వహించింది.   ఇంతకీ ఆయన మధ్యవర్తిత్వం ఏమిటయ్యా అంటే.. మెడికల్‌ కాలేజీల్లో వసతులు లేకపోయినా, తగినంతమంది బోధనా సిబ్బంది లేకపోయినా.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీ బృందాలకు ముడుపులు ముట్టచెప్పి క్లీన్ సర్టిఫికెట్, అనుమతులు ఇప్పించడం.  చెన్నైలో స్థిరపడిన ఈయన  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని మెడికల్‌ కాలేజీల తనిఖీలకు వచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రతినిథులకు ఆయా కాలేజీలకు మధ్యవర్తిత్వం నెరపి ముడుపుల దందా సాగించారు. దీంతో వందల కోట్ల రూపాయల ఆస్తులనూ పోగేశారు. ఈ బత్తల హరిప్రసాద్ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. గత ఎన్నికలలో కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు.  అయితే టికెట్ దక్కలేదనుకోండి అది వేరు సంగతి. ఇప్పుడా బత్తల హరిప్రసాద్  మెడికల్ కాలేజీల ముడుపుల యవ్వారంలో సీబీఐ నజర్ లో ఉన్నారు. 

కేరళలో నిఫావైరస్ డేంజర్ బెల్స్.. క్వారంటైన్ లు, మాస్కులు మస్ట్!

కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో కరోనా నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్వారంటైన్ జోన్లు, మాస్కులు అనివార్యం అయ్యాయి. నిఫా వైరస్ విజృంభణతో కేరళ గజగజలాడుతోంది. మలప్పురం జిల్లా  చెట్టియారంగడిలో నిపా వైరస్ కారణంగా  18 ఏళ్ల బాలిక మరణించింది.   నిపా కాంటాక్ట్ అనుమానితుల జాబితాలో 345 మంది ఉన్నారని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మలప్పురం పాలక్కాడ్  కోజికోడ్ లలో హై అలర్ట్ ప్రకటించారు.   పాలక్కాడ్ అయితే నిఫా వైరస్ వ్యాప్తి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  నిపా వైరస్ సోకిన వ్యక్తి కాంటాక్ట్ అయిన 58 మందిని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. వ్యాధి సోకిన వ్యక్తి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో వార్డులను జిల్లా కలెక్టర్ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.  ఈ ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు విధించారు. బహిరంగ సభలను నిషేధించారు.   మెడికల్ స్టోర్స్ మినహ, దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల  వరకూ మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంస్తలకు సెలవు ప్రకటించారు. కంటైన్ మెంట్ జోన్ లలోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించారు.  

ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన గిల్ సేన

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ ముందుండి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ విజయంతో సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో  భార‌త్ బ్యాటింగ్, బౌలింగ్ లో ఇంగ్లాండ్ ను ఔట్ ప్లే చేసి 336 పరుగుల ఆధిక్యతతో అద్భుత విజయాన్ని చేజిక్కించుకుంది. తొలుత టీమ్ ఇండియా బ్యాటర్లు.. ఆ తరువాత బౌలర్లు అద్బుత ప్రదర్శన చేశారు. శుభమన్ గిల్ టీమ్ ఇండియా టెస్టు జట్ట పగ్గాలు చేపట్టిన తరువాత ఇదే తోలి విజయం. అలాగే ఎడ్జ్ బాస్టన్ లో టీమ్ ఇండియా విజయాన్ని అందుకోవడం కూడా ఇదే తొలిసారి.   కెప్టెన్ గిల్ అద్భుత బ్యాటింగ్ కారణంగా రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కు టీమ్ ఇండియా భారీ లక్ష్యన్ని నిర్దేశించింది. ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరుగురు ఇంగ్లాండ్ బ్యాటర్లను ఔట్ చేయడంతో   608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్  కేవలం 271 పరుగులకే ఆలౌటై భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.   తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా 587 పరుగుల భరీ స్కోరు సాధించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో రాణించారు. ఇక యశస్వి జైస్వాల్ 87 పరుగులు, రవీంద్ర జడేజా 89 పరుగులు చేశారు. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 407 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ 158, జేమ్ స్మిత్ 184 నాటౌట్ సెంచరీలతో  మెరిశారు. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లోనూ స్కిప్పర్ శుభమన్ గిల్ 161 పరుగులతో భారీ సెంచరీ చేశాడు. అతడికి రిషభ్ పంత్ 65, జడేజా 69 సహకారం అందించారు. దీంతో భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ లక్ష్య సాధనకు ప్రయత్నించలేదు. డ్రా కోసం బజ్ బాల్ రిథమ్ లోకి వెళ్లకుండా ఢిఫెన్స్ ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు 271 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 336 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.  ఎడ్జ్ బాస్టన్ లో టీమ్ ఇండియా గొప్ప విజయం సాధించిందంటూ  టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కింగ్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమ్ ఇండియా గెలుపుపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో స్పందిచిన కోహ్లీ..   శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్, కెప్టెన్సీ స్కిల్స్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఎడ్జ్ బాస్టన్ లోని ఫ్లాట్ పిచ్ పై సిరాజ్, ఆకాశ్ దీప్ లు చేసిన బౌలింగ్ ప్రదర్శన గొప్పగా ఉందని పేర్కొన్నారు.  మరో మాజీ కెప్టెన్ గంగూలీ కూడా శుభమన్ గిల్ సేన విజయంపై స్పందించాడు.  శుభ్‌మన్ గిల్ అండ్‌ టీమ్‌ బ్యాట్‌తో, బాల్‌తో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆకాష్ దీప్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.బుమ్రా లేని లోటు కనబడనీయలేదని పేర్కొన్నాడు. అలాగే గిల్ బాధ్యతతో చాలా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. 

ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల లో ఈ నెల 15, 16 తేదీలలో శ్రీవారి బ్రేక్ దర్శనాలు ఉండవు. ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.  జులై 16న శ్రీవారి ఇలయంలో ఆణివారం ఆస్థానం నిర్వహించనున్నట్లు పేర్కొన్న టీటీడీ.. అంతకు ముందు రోజు అంటే జులై 15న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ కారణంగా ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా జులై 14న కూడా ప్రొటోకాల్ వినా.. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల పర్యటనను ప్లాన్ చేసుకోవాలని కోరింది.   

ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం జలాశయానికి నో ప్రాబ్లం.. కన్నయ్యనాయుడు

రిటైర్డ్ ఇంజినీర్, ప్రాజెక్టుల గేట్లు నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు శ్రీశైలం జలాశయాన్ని  పరిశీలించారు.    జలాశయం అధికారులతో కలిసి జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని పరిశీలించిన కన్నయ్యనాయుడు   శ్రీశైలం జలాశయం 10వ నంబర్ గేట్ల ద్వారా వచ్చే  నీటి లీకేజీ వల్ల ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.  10 వ గేటు నుంచి నీటి లీకేజీ 10 శాతం కంటే తక్కువగానే ఉందన్నారు.  శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని అధికారులకు సూచించారు.  2010 తర్వాత గేట్లను పెయింటింగ్ వేయలేదని, అలానే జలాశయం ప్రారంభమై 40 సంవత్సరాలు అవుంతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం మెయింటెనెన్స్ బాగుందని, ఇదే విధంగా మెయిన్ టెయిన్ చేస్తే..   మరో రెండు దశాబ్దాల వరకూ శ్రీశైలం జలాశయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.  వీలైతే  ఐదేళ్లలో శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల స్థానంలో కొత్తవి అమర్చాలని చెప్పారు.  శ్రీశైలం జలాశయం గేట్ల నిర్వహణకు తగినంత నిధులు ప్రభుత్వం కేటాయిస్తే బాగుంటుందని కన్నయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా జలాశయం ముందు భాగంలో ఏర్పడిన ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం జలాశయానికి ప్రమాదం లేదన్నారు. జలాశయం నుండి సుమారు 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్  ఉందని దాని వలన జలాశయానికి ఇబ్బంది లేదని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు.

పొన్నూరు ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తుంది : ధూళిపాళ్ల

  పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నాయకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ నేతలు  కాపు కాశారని ఆరోపించారు. గతంలో టీడీపీ నేత బండ్లమూడి బాబురావు, అశోక్‌పై దాడి చేసేందుకు వైసీపీ వర్గీయులు కుట్రపన్నారని ఆరోపించారు.  గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. కూటమిమ ప్రభుత్వంపైన బురద జల్లేందుకు, తమను అప్రతిష్ట  పాలు చేసేందుకు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ నేతలు ప్లాన్ చేశారని  ధూళిపాళ్ల  ఆరోపించారు 

ఏపీలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ

  ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్యూఆర్ కోడ్‌‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కోటిన్నర అగ్రిలో పంపిణీ చేయనుంది. నేతల ఫోటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్దిదారు ఫోటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది..బ్యాంకు ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్‌ కోడ్‌తో ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డును రూపొందిస్తున్నారు. ఈ కార్డుల జారీకి పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది.  స్మార్ట్‌ రేషన్‌ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటాయి. ఆ రేషన్‌ కార్డు నంబరు, రేషన్‌షాపు నంబరు తదితర వివరాలుంటాయి. కార్డు వెనుకవైపు లబ్ధిదారు కుటుంబ సభ్యుల వివరాలుంటాయి. ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డును రేషన్‌ డీలర్ల వద్ద ఉండే ఈ-పోస్‌ యంత్రాల సహాయంతో స్కాన్‌ చేస్తే ఆ ఫ్యామిలీ సంబంధించిన వివరాలతోపాటు రేషన్‌ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రత్యక్షమవుతుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ఈ కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ముద్రణ కోసం ఏపీటీఎస్‌ ద్వారా టెండరు ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం ముద్రణ దశలో ఉన్న కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు

ఉగ్ర బంధాలపై గురి...రాయచోటి ఘటనపై లోతుగా విచారణ

  అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలకలం రేపిన ఉగ్ర భంధాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.  రాయచోటిలో దొరి కిన ఉగ్రవాదులతో సన్నిహితంగా మె లిగిన వాళ్లకు సహకరించిన వాళ్లను పోలీసులు గత రెండు మూడు రోజులుగా రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ మొత్తం కేంద్ర స్థాయిలోని.  అత్యున్నత దర్యాప్తు సంస్థలు, నిఘవర్గాల కనుసన్నుల్లో జరుగుతున్నట్టు  తెలుస్తోంది.ఈ విచారణలో రాష్ట్రస్థాయిలోని దర్యాప్తు నిఘ వర్గాల సైతం పాల్గొంటున్నట్టు సమాచారం.  అత్యంత చాకచక్యంగా ఉగ్రవాదులను తమిళనాడు ఐబి, అన్నమయ్య పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాదుల నుంచి బాంబులు,పెద్ద ఎత్తున బాంబు తయారీ పదార్థాలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఉగ్రవాదుల భార్యలను సైతం అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.  అంతటితో ఆగకుండా... మూడు దశాబ్దాలకు పైగా. రాయచోటిలో మకాం వేసిన ఉగ్రవాదుల గత చరిత్ర మొత్తం తవ్వే పనిలో పోలీసులు పడ్డారు. రాయచోటీలో ఉగ్రవాదులకు ఆవాసం కల్పించింది ఎవరు. వాళ్లతో అతిస న్నితంగా మెలిగింది ఎవరు. ఉగ్రవాదులు ఇద్దరికీ. ఈ ప్రాంతంలో పెళ్లి చేసింది ఎవరు. అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పట్టణంలోని పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారంలో సాగుతోంది. ప్రస్తుతం పోలీసు విచారిస్తున్న వారిలో  కొందరు. గతంలో రాయచోటిలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారంలో ఉంది. అదుపులోకి తీసుకున్న వారిని. వేర్వేరు ప్రదేశాలలో  ఉంచి పోలీసులు విచారిస్తున్నారని సమాచారం. వారి భంధాలపై   పోలీసులు అబూబకర్, మహమ్మద్ అలీ అనే ఉగ్రవాదులను  అదుపులోకి తీసుకున్నప్పటికీ ప్రస్తుతం విచారణ మొత్తం అతని బంధాల చుట్టే తిరుగుతున్నట్టు తెలుస్తోంది. అబూబకర్ అరెస్టు తర్వాత అతని ఇంట్లో పోలీసులు జరిపిన సో దాలలో  భారీ సంఖ్యలో బాంబు తయారీ పదార్థాలు దొరికడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ చదివిన. అబూబకర్ బాంబులు తయారీలో నిష్ణాతుడు.. 1995లో తన నేర చరిత్రను మొదలుపెట్టిన అబుబకర్ దక్షిణాది రాష్ట్రాలలో పలుచోట్ల బాంబు పేలుళ్ల నేరాలు పాల్పడ్డాడు.  అక్కడ కొన్ని కేసులలో  పోలీసులు చిక్కినప్పటికీ బెయిల్ మీద బయటకు వచ్చి రాయచోటి చేరిపోయాడు. ఇక్కడే స్థిరపడ్డాడు. గత 30 సంవత్సరాల లో రాయచోటిలో మూడు ప్రాంతాలలో అతను నివాసం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఇంటి ఓనర్లను,అతనికి ఇల్లు ఇప్పించిన వాళ్లను విచారిస్తున్నట్టు ప్రచారంలో ఉంది.2021లో  అతనికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసిన వా రిని విచారిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా మొహమ్మద్ అలీ కి ఇక్కడ ఇల్లు ఇప్పించిన వాళ్లను,పెళ్లి చేసిన వాళ్లను కూడా పోలీసులు వి చారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టౌన్ లో ఎక్కడ చూసినా ఈ విషయాలపైనే చర్చ నడుస్తోంది. *రాయచోటి కే పరిమితమా! రాయచోటిలో పట్టుబడ్డ ఉగ్రవాదులు అబూబకర్ ,మహమ్మద్ అలీ రాయచోటికే పరిమితం అయ్యారా?ఇక్కడ నుంచే  కార్యకలాపాలు నిర్వహించారా! లేక ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లోని  మరే ప్రాంతాల్లో అయినా వీరికి సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 30 ఏళ్లుగా రాయచోటి కేంద్రంగా వీరు రహస్యంగా ఉన్నారంటే వీరి కార్యకలాపాలకు ఎవరైనా సహకారం అందించి ఉంటారేమో అన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఉమ్మడి కడప జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా ఏమైనా పరిచయాలు ఉన్నాయా,  ఎవరైనా సహకారం అందిచారా  అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు బృందాలు ,జిల్లా పోలీసు బృందాలు లోతుగా విచారిస్తుండడంతో తీగ లాగితే డొంక కదిలినట్టు ఎలాంటి  సమాచారం బయటికి వస్తుందో నన్ను ఆందోళన వ్యక్తం అవుతోంది.

అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

  తెలంగాణలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాది కొత్తగూడెంలో పాల్వంచ, లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతొ కలిసి  అందజేశారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం, చింతపెంటిగూడెంలో హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తొలి ఏకాది శుభ దినాన ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేయం చాలా సంతోషంగా ఉందని  మంత్రి పొంగులేటి అన్నారు.  ఈ విడతలో ఇండ్లు రాలేదని ఏ ఆడబిడ్డ నిరుత్సాహ పడవద్దు.రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాము. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు  ఇస్తున్నాము. ఈ నియోజకవర్గంలో మరో 1500 అదనంగా ఇండ్లకు జాబితా తయారు చేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా మా ప్రభుత్వం మాయ మాటలు చెప్పదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుద్రంపూరం చెందిన శివ అనే యువకుడు తనకు ఇండ్ల పట్టాలు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని టవర్ ఎక్కాడు. ఆనాడు మేము అధికారంలో లేము. అయినా మేము అధికారంలోకి రాగానే ఇండ్ల పట్టా ఇస్తామని ఆరోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకే ఇప్పుడు ఇండ్ల పట్టా ఇచ్చామని మంత్రి తెలిపారు.  ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు.. ఇందిరమ్మ ఇండ్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అని అన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు వారి  సౌలభ్యం, ప్రయోజనాల కోసం పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం ప్రజా శ్రేయస్సు కోసమే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గోదావరి నీటిని ఆంధ్రకు తరలించేందుకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పాలకులే. ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు.  ఇప్పుడు అనేక అంశాలపై అవాకులు, చెవాకులు పేలుతున్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అధికారంలో ఉండి వాళ్లు చేయలేనిది మేము చేసి చూపిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.

తొలి ఏకాదశి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల కిటకిట

  తొలి ఏకాదశి సందర్బంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆషాడ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే నమ్మకంతో వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చాయి. దీంతో లిఫ్ట్‌దారి, ఘాట్‌ రోడ్డు వైపు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు త్వరితగతిన దర్శనాలు పూర్తిచేసుకుని కొండపై నుంచి దిగువకు పంపేందుకు ఈవోశీనానాయక్‌ తో పాటు ఏఈవోలు, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా రద్దీని ఈవో పరిశీలిస్తున్నారు. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలకు అనుమతిపై నియంత్రణ విధించారు.  తొలి ఏకాదశి  పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యంతో పులకించిపోయాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పవిత్రమైన ఈ రోజున శ్రీమహావిష్ణువును దర్శించుకోవడం, ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఆలయ ప్రాంగణాలు “గోవిందా.. గోవిందా..” నామస్మరణతో మార్మోగిపోయాయి.

నెల్లూరులో వైభవంగా ప్రారంభమైన రొట్టెల పండుగ

  నెల్లూరులోని ప్రసిద్ద బారాషషీద్ దుర్గ వద్ద రొట్టెల పండుగ ఇవాళ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగ ఐదు రోజుల పాటు జరిగే పాటు జరగనున్నది. తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునే ఈ విశిష్టమైన ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో దర్గా ప్రాంగణం, స్వర్ణాల చెరువు పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి.  తమ అనుకున్న కోరికలు తీరాలని ఆశిస్తూ, గతంలో కోరిక తీరిన వారి నుంచి రొట్టెను స్వీకరించడం, తమ కోరిక తీరితే ఇతరులకు రొట్టెను ఇవ్వడం ఈ పండుగలోని ప్రధాన ఆచారం. దీని కోసం భక్తులు స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో రొట్టెలను మార్చుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రాంగణంలో ప్రత్యేక టెంట్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత భోజన వసతి కల్పించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పండుగ ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో పూర్తి పండుగ వాతావరణం నెలకొంది.  

పేలుడు పదార్థాల కేసులో కాంగ్రెస్ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్

  పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్  పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డిలోని కేపీఆర్ కాలనీలో పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిజామాబాద్ జైలుకు తరలించిన పోలీసులు. ఈ కేసులో గతంలో అరెస్టయిన ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు.  తాము సేకరించిన పేలుడు పదార్థాలను చంద్రశేఖర్‌రెడ్డి వద్ద నుంచే తెచ్చినట్లు నిందితులు పోలీసులకు తెలియజేశారు. ఈ సమాచారం ఆధారంగా, పోలీసులు జూలై 3న రాత్రి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని, నిజామాబాద్ జైలుకు తరలించారు. ఈ కేసులో చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడు సూర్య కూడా నిందితుడిగా ఉన్నాడని, ప్రస్తుతం పరారీలో ఉన్న సూర్య కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.   

వీళ్లిద్ద‌రి బ‌తుకు రెంటికి చెడ్డ రేవ‌డైందా?

  ఉన్న పార్టీలో ఉన్న‌ట్టు ఉండి ఉంటే వీళ్ల ప‌రిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదేమో. కానీ అత్యాశ కొంప ముంచేసింది. పెట్టిన చేతినే క‌ర‌వ‌డంతో పాము, మొస‌లినే మించి పోయారీ ఇద్ద‌రూ. కార‌ణం ఈ భూ ప్ర‌పంచంలో పెట్టిన చేతినే క‌రిచే బుద్ధి కేవ‌లం పాము, మొస‌లికి మాత్ర‌మే ఉంటుంద‌ట‌. ఆ పార్టీలో ఉండి ఏమైనా పేరు సాధించారా అంటే అదీ లేదు. కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ వ‌ల్లే మేం ఓడాం అంటూ కాసు మ‌హేష్ రెడ్డి వీళ్ల‌పై చూపించిన కోపం తాపం అంతా ఇంతా  కాదు. వంశీ చేసిన కామెంట్లు మాకు చేటు తెచ్చాయ‌ని వాళ్లు కూడా వీళ్ల‌ను చూస్తే అస‌హ్యం వెళ్ల‌గ‌క్కుతున్నారు జోగి ర‌మేష్ వంటి వైసీపీ లీడ‌ర్లు కూడా. ఇక వీళ్ల ప‌రిస్థితి చూస్తే.. సూర్య చంద్రుల‌కే గ్ర‌హ‌ణం ప‌ట్టించిన రాహుకేతుల‌కే గ్ర‌హ‌ణం ప‌డితే ఎలా ఉంటుందో అలా త‌యార‌య్యారు. ఒక‌డు ఇప్ప‌టికే తాను చేసిన ద్రోహాల‌న్నీ ఆ మొహం మీద విల‌య తాండ‌వం చేస్తుంటే.. ప్ర‌త్య‌ర్ధుల‌కే జాలి క‌లిగేలా త‌యార‌య్యాడు.మ‌రొక‌డు గుడివాడ ఓట‌రు జ‌నాలు కొట్టిన దెబ్బ‌కు దిమ్మ తిరిగి గుండాప‌రేష‌న్ చేయించుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. అత్యంత ద‌యనీయంగా.. క‌ట్లు క‌ట్టుకుని తిరుగుతున్నాడు. అదే ఉన్న‌పార్టీలో ఉండి.. ప‌ద్ద‌తిగా బిహేవ్ చేసి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌న్న కోణంలో సోష‌ల్ మీడియా కామెంట్లు హోరు మంటున్నాయ్ ఈ జంట ద్రోహుల మీద‌.

అతి సర్వత్రా జగనేత్!

  క్యాప్షన్ కొత్తగా ఉందన్న మాటే కానీ మేటర్ మాత్రం చాలా చాలా పాతదే. పెద్దగా కంగారు పడకండి. కారణం ఏంటంటారా? అప్పుడే అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారట అతి- ఉత్సాహి జగన్. ఇప్పటికే వంద మంది పేర్లు వంద సీట్లకు ఖరారు చేసేశారట.. శ్రీమాన్ శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనుల వారు.మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకూ అభ్యర్ధుల జీవితాలను అగమ్య గోచర పరిస్థితిలోకి నెట్టిన జగనన్న తాజాగా.. ముందస్తు ఎన్నికల్లాగా- ముందస్తు అభ్యర్ధుల ఖరారు ప్రకటనలు చేస్తున్నారట. ఇప్పటికి ఓకే అయిన వాటిలో మచ్చుకు కొన్ని పేర్లు.. ఎవరివీ, ఏంటని చూస్తే వాటిలో తొలిపేరు సర్వేపల్లి నుంచి- కాకాణి గోవర్ధన రెడ్డిదేనట. ఇక వరుసగా చూస్తే.. నరసన్న పేట- ధర్మాన కృష్ణదాస్, గననవరం- నుంచి వల్లభనేని వంశి, మచిలీపట్నం- నుంచి పేర్ని నాని, గుడివాడ- నుంచి కొడాలి నాని, దెందలూరు- నుంచి అబ్బయ్య చౌదరి, తాడికొండ- నుంచి  నందిగం సురేష్, మాచర్ల- నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరి పేట- నుంచి విడదల రజనీ, తాడిపత్రి- నుంచి పెద్దారెడ్డి, రాఫ్తాడు- నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ధర్మవరం- నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పాతపట్నం- నుంచి రెడ్డి శాంతి.. ఇలా ఒక లిస్ట్ అప్పుడే లీక్ చేశారట. అంటే గతంలోలా పార్టీకి డిమాండ్ లేక పోవడం.. దానికి తోడు కేడర్ కూడా తీవ్ర నిరాశా నిస్పృహలకు లోను కావడంతో ఒక బూస్టింగా ఉంటుంది లెమ్మని జగన్ సార్ ఈ తరహాలో ముందుకెళ్తున్నట్టు తాజా కబర్. ఒక సమయంలో ఎమ్మెల్యేలను కలవడానికే అపాయింట్లు ఇవ్వని.. ఒక వేళ ఇచ్చినా వారిని నిలబెట్టే మాట్లాడే కల్చర్ గల జగనన్న.. ఇటీవల నేనూ మారాను బాస్! అని తెలియ చెప్పడంలో భాగంగా ఈ అడ్వాన్స్డ్ అనౌన్స్ మెంట్స్ ఒక పాలసీగా తీసుకున్నట్టు సమాచార్. రేపటికి రెడ్డెవరో- రాజెవరో అన్నది పాత నాటు సామెత. కానీ ఆ రేపటి ని కూడా ఇప్పటి నుంచే మార్చేసి.. తనకు తాను ఎప్పటిలాగానే అధినాయకుడిలా కాకుండా 'అతి'నాయకుడిలా వ్యవహరిస్తున్నారట జగన్. దానికి తోడు ఇప్పటికే ఈ అతి మీద పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైసీపీ నేత రవిచంద్రారెడ్డి మాటలను బట్టీ చెబితే.. ఈ వైనాట్ 175 వంటి టూ మచ్ స్లోగన్స్ ఎవరి ఐడియాలో తెలియవు కానీ, ఇవన్నీ పార్టీని నిలువునా ముంచాయని అంటారాయన. దీంతో సామాన్యంగా వ్యవహరించాల్సిన జగన్ అత్యుత్సాహం కొద్దీ ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీ మైలేజ్ మరింత డ్యామేజ్ గా మారుతున్నట్టు సమాచారం.  మరి చూడాలి. జగన్ సార్ ఇదే ఫ్లో మెయిన్ టైన్ చేసి. ఆ పదకొండు కూడా పోగొట్టుకుంటారా అన్నది తేలాల్సి ఉందంటున్నాయి.. పార్టీ శ్రేణులు. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. ఎన్నికలు వచ్చినట్లు నాలుగు ఏళ్ల ముందే ఊహించడం, తామే గెలుస్తామ‌ని క‌ల‌లు క‌న‌డం.. ఆ ఊహ‌ల్లో తేలియాడ‌టం.. అలా బతికేయడాన్ని ఏమనుకోవాలి? మానసిక సమస్యా.. లేక వేరే వ్యూహమా? నేతల్ని, కార్యకర్తలను తనతో నిలుపుకోవడం లో భాగమా? అన్న‌ది కూడా ఒక చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే జ‌గ‌న్  చేసిన ప్ర‌తి ఓవ‌రాక్ష‌న్ బెడిసికొట్ట‌డంతో.. ఇలాంటి విష‌యాల‌ను పార్టీలో కొంద‌రు బాహ‌టంగానే వ్య‌తిరేకిస్తున్నార‌ట‌.

తెలంగాణ ఎవరి జాగీర్?

  హైద‌రాబాద్ న‌డి బొడ్డున 1982 మార్చి 29న పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీఆర్ఎస్ అయినా పుట్టిన పుష్క‌ర  కాలానికిగానీ అధికారంలోకి రాలేదు. అదే టీడీపీ ఏకంగా 9 నెల‌ల్లోనే అధికారం చేప‌ట్టి ప్ర‌పంచ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే మ‌రెవ‌రికీ సాధ్యం కాని ఒక చ‌రిత్ర‌ను సృష్టించింది. హైద‌రాబాద్ ప్ర‌తిష్ట‌ను ఆనాడే ఆకాశానికి అంటేలా చేసింది. అంతేనా ఇదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీడీపీలో చేర‌క ముందు ఎలా ఉండే వారో కూడా ఎవ్వ‌రికీ ఊహ‌కంద‌ని విష‌యం. గురువు ద‌గ్గ‌ర రాజ‌కీయం నేర్చుకుని ఆయ‌న మీదే పోటీ చేసిన ఘ‌నుడైన కేసీఆర్ ని కూడా ద‌గ్గ‌రకు చేర్చి.. ఆద‌రించింది టీడీపీ. ఆయ‌న‌కు అప్ప‌ట్లో ర‌వాణా మంత్రిత్వం ఇచ్చింది కూడా టీడీపీనే. త‌ర్వాత త‌న సాటి కుల‌స్తుడికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో.. అది చూసి ఓర్వ‌లేక కొత్త పార్టీ పెట్టారు కేసీఆర్.నిజంగా వైయ‌స్ అన్న‌ట్టు ఆనాడు బాబు మంత్రి ప‌ద‌వి  ఇచ్చి ఉండి ఉంటే కేసీఆర్ గానీ ఆయ‌న బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఉండేదా? అస‌లీ సోయ‌లోనే లేక పోయావారు ఆయ‌న, ఆయ‌న పార్టీ స‌భ్యులు. ఒక‌సారి మంత్రిత్వం ఇస్తే దాన్ని స‌రిగా నిర్వ‌హించ‌లేద‌ని గుర్తించిన చంద్ర‌బాబు.. కేసీఆర్ ని ప‌క్క‌న పెట్ట‌డంతో పుట్టిన ముస‌లం.. తెలంగాణ వాదం.  ఆనాటి నుంచి ఆయ‌న అది  ప‌నిగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని విభిజించ‌డ‌మే ధ్యేయంగా.. యువ‌త‌ను రెచ్చ‌గొట్టి.. వారి ఆశల మేడ‌లపై త‌న పార్టీ పునాదును నిర్మించుకున్నారు టిడిపి వర్గాలు. అదే బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్.అప్ప‌టికి ఎటు నుంచి ఎటు చూసినా అడ‌వుల‌ను త‌ల‌పించిన హైటెక్ సిటీ ప‌రిస‌ర ప్రాంతాన్ని ఇవాళ ఐటీ కారిడార్ గా మ‌ల‌చింది టీడీపి.. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గ‌జ‌ కంపెనీలు రావ‌డానికి కార‌కుడైంది.. నాటి  టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు. అప్ప‌ట్లో పెద్ద పెద్ద ప్ర‌ధానుల‌కు సైతం దొర‌క‌ని బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ ని దొర‌క‌బుచ్చుకుని నిమిషాల్లో ముగించాల‌ని వారు చెబితే, దాన్ని సుమారు గంట‌కు పొడిగించుకుని.. ఆపై యూఎస్ వెళ్లి అక్క‌డి మైక్రోసాఫ్ట్ యాజ‌మాన్యాన్ని హైద‌రాబాద్ లో ఒక క్యాంప‌స్ ఏర్పాటు  చేయాల్సిందిగా వేడుకుని, ఎట్ట‌కేల‌కు ఇక్క‌డికి ర‌ప్పించి.. ఒక ఐటీ బూమ్ క్రియేట్ చేసింది చంద్ర‌బాబు. ఆయ‌న  వెన‌కున్న టీడీపీ. ఆ త‌ర్వాత అనూహ్యంగా ఈ ప్రాంతం మ‌రో సింగ‌పూర్ లా క‌నిపించ‌డంతో.. క‌న్నుకుట్టి.. ఇదంతా త‌మ‌దేనంటూ తెలంగాణ  ప్ర‌జానీకాన్ని  రెచ్చ‌గొట్టి.. రాష్ట్రం రెండుగా చీలిపోయేలా చేసింది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు టిడిపి వారు. ఆయ‌న పార్టీ. ఆ త‌ర్వాత కూడా రాష్ట్ర విభ‌జ‌న‌లో ద‌క్కాల్సిన ప‌దేళ్ల రాజ‌ధాని హోదాను ఏపీకి ద‌క్క‌కుండా త‌న  టెలిఫోన్ టాపింగ్ ద్వారా చేసిన ఘ‌న‌త వ‌హించింది కేసీఆర్ కాదా అంటున్నారు.త‌న స్వార్ధం కోసం జ‌గ‌న్న రెడ్డితో కుమ్మ‌క్క‌య్యి.. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రాంతాలు రెండింటినీ మోసం చేసిన ఘ‌న‌త కూడా కేసీఆర్ దే. అంతేనా.. కాళేశ్వ‌రం వంటి అన‌వ‌స‌ర ఖ‌ర్చు దండ‌గ ప్రాజెక్టుల ద్వారా కోట్లు కుమ్మ‌రించుకున్నార‌ని ఆరోపించిన రాజ‌లింగం లాంటి వారిని లేకుండా చేసింది మీరు కాదా? అన్న‌ది స‌గ‌టు తెలంగాణ వాదులు సంధిస్తోన్న ప్ర‌శ్న‌. ఒక‌రిద్ద‌రు కాదు కేసీఆర్ లాంటి ఎంద‌రో తెలంగాణ  వారిని రాజ‌కీయ ధురంద‌రులుగా తీర్చి దిద్దింది టీడీపీ. కేసీఆర్ నుంచి మొద‌లు పెడితే తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న ఏ పొలిటీషియ‌న్ అయినా స‌రే టీడీపీ త‌ల్లి పాలు తాగిన వారు కాదా? అదంతా మ‌ర‌చిపోయి.. ఇప్పుడిలా మాట్లాడ్డం.. త‌ల్లిపాలు తాగి ఆ రొమ్ము గుద్ద‌డంతో స‌మానం కాకుండా పోతుందా? అని  నిల‌దీస్తున్నారు స‌గ‌టు తెలంగాణ ప్ర‌జ‌లు. ఎస్ ఇది టీడీపీ జాగీరే. అప్పుడ‌ప్పుడూ ఓట‌ములు ఎదురు కావ‌చ్చుగాక‌.. కానీ కాల‌గ‌మ‌నంలో ఓట‌మి కూడా ఒక మ‌జిలీయే. ప్ర‌స్తుతం టీడీపీ జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తిరిగి  పోటీకి నిలిస్తే మాత్రం త‌ప్పేంటి? ఎందుకంత  ఉలుకు. త‌ల్లిలాంటి పార్టీ అంటే ఎందుకంత చిన్న‌చూపు? అని నిల‌దీస్తోంది స‌గ‌టు తెలంగాణ ప్రజానీకం. ఆద‌రించ‌డానికి మేం సిద్ధం.. మీకెందుకా సంశ‌యం.. అయినా ఇంకెక్క‌డుందా తెలంగాణ వాదం.. మీ పార్టీలో తెలంగాణ అన్న ప‌దం తీసెయ్య‌డంతోనే అది తెలిసిపోవ‌డం లేదా అని తెలంగాణ  ప్ర‌జ‌లే మీ  పార్టీపై తిర‌గ‌బ‌డుతున్న వేళ‌.. ఇంకా ఎందుకా? మేక‌బోతు గాంభీర్యాలు అంటున్నారు తెలంగాణ తెలుగుదేశం అభిమానులు.

సిగాచీ ప్రమాదంలో 41కి చేరిన మృతుల సంఖ్య

  సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆస్పుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో  మృతుల సంఖ్య 41కి చేరింది.  మరో 11 మంది ఆచూకి లభించలేదు. మరికొందరు ఆసుపత్రిలో చికత్స పొందుతుండగా పలువురి పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది.పేలుడు ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగించే పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. తమ వారి జాడ తెలియకపోవడంతో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.  

కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన ఎలాన్ మస్క్

  ప్రపంచ అపర కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికా పార్టీ పేరుతో నూతన పార్టీ ప్రకటించారు. అగ్రరాజ్యంలో ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్చ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలాన్ మస్క్ తెలిపారు.  మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు మీ స్వేచ్చను తిరిగి ఇవ్వడానికి అమెరికా ఏర్పడింది అంటు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అవినీతితో మన దేశాన్ని దివాళా తీయించే విషయంలో మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఒకే పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాం. ఈరోజు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అంటూ ఆయన ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో అమెరికాలో ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలతో పాటు మూడో పార్టీ వచ్చి చేరింది. తమ పార్టీ 2026లో జరిగే మధ్యంతర ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. రెండు నుంచి మూడు సెనేట్ స్థానాలు, 8 నుంచి 10 ప్రతినిధుల సభ స్థానాల్లో పోటీ చేసి, కీలక చట్టాలపై నిర్ణయాత్మక శక్తిగా మారడమే తమ లక్ష్యమని వివరించారు. అయితే, మస్క్ పార్టీ ప్రకటన చేసినప్పటికీ, ఇప్పటివరకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని అధికారికంగా నమోదు చేయలేదు. అమెరికాలో కొత్త పార్టీని స్థాపించడం అంత ఇజీ కాదు. ప్రతి రాష్ట్రంలోనూ కఠినమైన నిబంధనలు, లక్షలాది సంతకాల సేకరణ వంటి సవాళ్లు ఉంటాయి. మస్క్ వద్ద అపారమైన సంపద ఉన్నప్పటికీ, 'డువర్జర్ సూత్రం' ప్రకారం రెండు పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో మూడో పార్టీ ఓట్లను చీల్చడానికే పరిమితమవుతుందని, గెలుపువడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.  

భారత్ డిక్లేర్ .. ఇంగ్లాండ్‌ ముందు భారీ లక్ష్యం

  ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్  427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్‌ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం  ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌ (161) చెలరేగిపోయాడు. పంత్‌ (65), జడేజా (69*), కేఎల్‌ రాహుల్‌ (55) అర్ధశతకాలు బాదేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జోష్‌, బషీర్‌ చెరో 2, రూట్‌, బ్రైడన్‌ తలో వికెట్‌ తీశారు.  అంతకుముందు, తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా  587 పరుగుల భారీ స్కోరు చేయగా, ఇంగ్లండ్ 407 రన్స్ ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 180 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ప్రస్తుతం మ్యాచ్‌లో ఇంకా ఐదు సెషన్ల ఆట మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో, భారత బౌలర్లు రాణిస్తే ఈ టెస్టులో భారత్ గెలిచే ఛాన్స్ ఉంది.