బాబు గారి పెంపుడు కుక్కను కంట్రోల్ చేయాలి....కేశినేని తెగించారా ?
ఏపీలో మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీకి రోజూ ఏదో ఒక టెన్షన్ మామూలు అయిపొయింది. ఓపక్క పలువురు నేతలు పార్టీని వీడుతుండగా మరోవైపు పార్టీలోని నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కడం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కేశినేని నాని ఆదివారం ట్విటర్ వేదికగా బుద్ధా వెంకన్నపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
అయితే దీనికి బుద్దా కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈరోజు పోద్దుపోద్దున్నే కేశినేని ట్విటర్ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు గారు.. నన్ను వద్దనుకుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధం. నాలాంటి వాళ్లు పార్టీలో ఉండాలంటే.. మీ పెంపుడు కుక్కను కంట్రోల్ చేయండి’ కేశినేని ట్విటర్‌లో పేర్కొన్నారు.
అయితే కేశినేని ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దాని మీద క్లారిటీ లేకున్నా, ఆ వ్యాఖ్యలు బుద్ధా వెంకన్నను ఉద్దేశించినవేనని అంటున్నారు విశ్లేషకులు. నిన్న కూడా పేరు ప్రస్తావించకుండా ‘‘రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు, గుళ్లో కొబ్బరి చిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవిదారులకి అవసరం. నాకు అవసరం లేదు’’ అంటూ నాని ట్వీట్ చేశారు.
మొన్నటి ఎన్నికల్లో విజయవాడ నుండి రెండో సారి ఎంపీగా గెలిచిన ఆయన ఆనాటి నుండే ట్వీట్ల ద్వారా పార్టీలో సంచలనంగా మారారు. పేర్లు ఆయన ఎక్కడా ప్రస్తావించకున్నా ఆయన కృష్ణా జిల్లాకు చెందిన పార్టీలో అధికారం చెలాయిస్తున్న ఇద్దరు నేతలను లక్ష్యంగా చేసుకొని ఈ రచ్చ చేస్తున్నారని అర్ధమయ్యింది. అయితే ఆ మధ్య పార్లమెంటరీ నేత ఎన్నిక సమయంలో కూడా ఆయన రచ్చ రేపుతుండడంతో చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు.
అయితే తాత్కాలికంగా అప్పటికీ సైలెంట్ అయినా మళ్ళీ ట్వీట్ల రచ్చ మొదలుపెట్టారు. ముందుముందుగా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు మినహా' అంటూ ఓ ట్విట్, మొదలుపెట్ట్రిన ఆయన ఆ తర్వాత నేను పార్టీలో ఎప్పుడూ ధిక్కార స్వరం వినిపి స్తూనే ఉంటా.. అది నా నైజం.. నేను నిజం మాత్రమే మాట్లాడతా.' అంటూ మరో ట్విట్ చేశారు. అయితే నిజానికి ఈయన టార్గెట్ చేస్తున్నది ఆ జిల్లా మాజీ మంత్రి, జిల్లా మొత్తానికి టీడీపీ ఫైనలైజర్ లీడర్ అయిన ఉమాని, అలాగే ఆయన అనుచరుడుగా పేరొందిన బుద్ధా వెంకన్నని.
ఉమాకి.. ఎంపీ కేశినేని నానికి మధ్య దూరం ఉందన్న విషయం ఇటీవల నాని పోస్టులతో స్పష్టమవుతోంది. రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలన్న పార్టీ అధినేత నిర్ణయం ఈ ఇద్దరు నేతల నడుమ దూరానికి కారణమైందని అంటున్నారు. వీరి నడుమ అంతరాన్ని తగ్గించేందుకు అధినేత చోరావ్ అ చూపినా ఫలితం లేకుండా పోయింది. నిజానికి కొద్ది రోజుల క్రితం వీఎంసీ తాజా మాజీ కార్పొరేటర్లతో నాని ఏర్పాటు చేసిన సమావేశం మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది.
ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో నాగుల్ మీరా పశ్చిమ నుంచి పోటా చేస్తారన్న సంకేతాలను నాని పంపారు. ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత బుద్ధా వెంకన్న కొందరు పార్టీ నేతల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ అధినేత అనుమతి లేకుండా నాని ఎలా ప్రకటిస్తారని వెం కన్న కొందరు నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆ వ్యాఖ్యలను కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నానికి చేరవేశారు.
దీంతో వీరిద్దరి నడుమ దూరం పెరిగింది. అప్పటి నుండి ఈయన కూడా కేశినేనికి టార్గెట్ గా మారారు. ఈ రచ్చ చంద్రబాబునే ఇబ్బంది పెట్టె స్థాయికి చేరింది. తాజాగా నాలుగు ఓట్లు సంపా దించలేనివాడు నాలుగు పదవులు సంపా దిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు.. నాలుగు వాక్యాలు రాయలేనివాడు.. ట్వీట్లు చేస్తున్నాడు.. దౌర్భాగ్యం' అంటూ నాని ట్వీట్ చేశారు. నిజానికి ఇప్పుడు బుద్ధా వెంకన్న నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, దీంతో ఈ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించినవే అని అంటున్నారు.
దీనికి వెంకన్న కూడా వెంటనే స్పందించారు. ‘సంక్షోభ సమయం లో పార్టీ కోసం నాయకుడు కోసం పోరా డేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశ వాదులు కాదు. చనిపోయే వరకు చంద్ర బాబు కోసం సైనికుడిలా పోరాడే వాడు కావాలి' అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో కేశినేని నానికి మద్దతుగా పార్టీ నేత నాగుల్ మీరా ట్వీట్ చేసారు.
‘పార్టీ కష్టకాలంలో చంద్రన్న ఆదేశంతో బాధ్యత తలకెత్తుకుని కోట్లాది రూపా యలు ఖర్చు పెట్టి వస్తున్నా మీకోసం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించి, విజయవాడ పార్లమెంటు నియోజక వర్గాన్ని విజయపథంలో నడిపించిన కేశినేని నాని కష్టంతోనే నీకు, నాకు పదవులు దక్కాయి. గుర్తుపెట్టుకో’ అంటూ నాగుల్ మీరా, బుద్దా వెంకన్నను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఎంపీ కేశినేని నాని తాజా ట్వీట్ చూస్తుంటే ఆయన తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యారనే విషయం అర్దం అవుతోంది. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌లో పార్టీలో తాను అసవరం లేదని భావిస్తే ఆ విషయం తనకు స్పష్టం చేయా లని తాను ఎంపీ పదవితో పాటుగా పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ట్వీట్ ద్వారానే చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేసా రు. అదే సమయంలో పెంపుడు కుక్కను కంట్రోల్ చేయండి అంటూ పరోక్షంగా తాను ట్వీట్ల ద్వారా యుద్దం చేస్తున్న నేత గురించి ప్రస్తావించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఏమి చేస్తారో అనే విషయం ఆసక్తికరంగా మారింది.