ఓటింగ్ కు టిడిపి ఎంపిల డుమ్మా: చంద్రబాబు టార్గెట్
posted on Dec 8, 2012 @ 10:18AM
ఎఫ్ డి ఐ లఫై రాజ్య సభ లో జరిగిన ఓటింగ్ లో యూపిఏ ప్రభుత్వం గట్టెక్కేలా ఓటింగ్ కు ముగ్గురు తెలుగు దేశం పార్టీ ఎంపి లు దూరంగా ఉన్న సంఘటన సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది. అసలు ఈ విషయం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు కు తెలియదనే కధనాలు కూడా మీడియాలో వస్తున్నాయి.
డాక్టర్ అపాయింట్మెంట్ ఉండనే కారణంతో దేవందర్ గౌడ్, తన బంధువులకు ఆరోగ్యం బాగా లేదని గుండు సుధా రాణి, జలుబుకు మందు తీసుకోవాల్సిన కారణంగా సుజన చౌదరి ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్న దానికి కారణంగా చెప్పినట్లు తెలుస్తోంది. తమ అధినేత కు ఈ ముగ్గురు నాయకులు ఈ విధమైన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పరువు తీసిన ఈ ముగ్గురు నేతలఫై బాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు తనకు ఈ విషయంలో స్వయంగా వివరణ ఇవ్వాలని బాబు వారిని ఆదేశించినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తమకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా ఈ ముగ్గురు ఎంపి లఫై వత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
తెలుగు దేశం పార్టీ నేతలు సైతం ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు పార్టీ చంద్ర బాబు చేతిలో ఉందాఅని సిపిఎం నేత సీతారాం ఏచూరి అన్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాలో సైతం పార్టీ కి వ్యతిరేక కధనాలు రావడంతో పార్టీ తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.