ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: బాబు

 

 

 

“మార్చి మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఓట్లు, సీట్ల కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం విభజిస్తోంది. బొగ్గు కుంభకోణంతో ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతింటోందని తేలింది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది” అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో దేశంలోని విద్యావంతులు ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయవద్దని విజ్ఞప్తి చేశారు.

 

 

కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనంతో రూపాయి విలువ క్షీణిస్తుందని, ఎఫ్ డీఐలను ఆహ్వానించినా రూపాయి విలువ పెరగడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో కొత్త ప్రాజెక్టులు కూడా రావడం లేదని, దేశ ఆర్థిక వ్యవస్థ 1999కంటే ముందున్న రేటుకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ ఓట్లేయరని …గ్రామాలలో చదువుకోని వారు కాంగ్రెస్ కు ఓటేయకుండా కార్యకర్తలు చైతన్యం చేయాలని సూచించారు.