విభజనకు కిరణ్ ఒప్పుకున్నారా?

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒప్పుకున్నాడా ? ఆయన సీడబ్లూసీ తీర్మానాన్ని ఆమోదించాడా ? కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ చెబుతున్న దాని ప్రకారం ఆయన తెలంగాణకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. “ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తొలగించే పరిస్థితి లేదు. ఆయన అధిష్టానానికి విశ్వాస పాత్రుడు. ఆయన తండ్రి కూడా కాంగ్రెస్ లోనే పనిచేశారు. వారి కుటుంబ సభ్యులు అందరూ కాంగ్రెస్ కు విధేయులే. ముఖ్యమంత్రిగా ఆయన మాటలు ఆయనకే సంబంధం. సీడబ్లూసీ నిర్ణయానికి ఆయన ఒప్పుకున్నారు. ఎవరయినా దానికి కట్టుబడి ఉండాల్సిందే” అని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు.

 

సీమాంధ్ర లోని సమస్యలను పరిష్కరించడానికి జీవోఎం ఉందని, ఏ సమస్యలయినా దాని దృష్టికి తేవాలని,తెలంగాణ విషయంలో వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని, తమ పార్టీ యూటర్న్ తీసుకునే పార్టీ కాదని, ఈ నెలాఖరులో అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని దిగ్విజయ్ తెలిపారు.