Previous Page Next Page 
వరమివ్వని దేవత పేజి 3

     "అప్పట్లో నా గురించి నీ అభిప్రాయమేమిటి?"   
    "కలవారిబిడ్డని ....." అని ఆగాడు రామారావు.
    "ఇంకా?"   
    "అల్లరిచిల్లరిగా తిరిగేవాడివి ....." తటపటాయించాడు రామారావు.   
    "ఊ _ చెప్పు...."   
    "చెప్పడాని కేముందిందులో? ఎవరితత్వం వారిది" అన్నాడు రామారావు.   
    "కావచ్చు. కానీ ఇప్పటికీ నా తత్వం మారలేదు" అన్నాడు మోహన్.   
    "అంటే ?" అన్నాడు రామారావు.   
    "కాఫీ హొటల్లోకి  నడు __నా గురించి చెబుతాను. అన్నీ విన్నాక కూడా నీ ఇంటికి రమ్మంటే తప్పకుండా వస్తాను" అన్నాడు మోహన్.   
    ఇద్దరూ కాఫీ హొటల్లోకి నడిచారు. ఓ చోట స్థిమితంగా కూర్చున్నాక మోహన్ చెప్పానారంభించాడు.
    "చాలామందికి నేను ఆడపిల్లల వెంటాపడతానన్న దురభిప్రాయముండేది. కానీ అది నిజం కాదు. నా రూపానికి మోజుపడి, నా డబ్బుకి ఆశపడి కొందరు ఆడపిల్లలే నా వెంట బడేవారు . వెంట బడ్డవాళ్ళను వదులుకోవడం నా అలవాటు కాదు. అందుకుని వాళ్ళతో ఆనందించేవాణ్ని ఐతే నా మనసు కోత్తదానాన్ని కోరుకునేది. నా రూపాన్ని ఎరగా చూపించేవాణ్ని. పడ్డవాళ్ళు పడేవారు. అనుభవించలేదు. ఇది నా కాలేజీ జీవితం...." అని ఆగాడు మోహన్.   
    "ఇది నాకు తెలియంది కాదు" అన్నాడు  రామారావు.   
    "ఇప్పటికీ ఇదే నా జీవితం" అన్నాడు మోహన్.   
    "అంటే?"   
    "ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి చేయడం లేదు. అలాగని నాకు తీరుపడీలేదు. ఎందుకంటే కొత్త కొత్త పిట్టల్ని పట్టడానికి పతకాలు అలోచిస్తూండాలి. ఆచరణలో పెడుతూండాలి."   
     రామారావు సీరియస్ గా , ఇదంతా నా కెందుకు చెబుతున్నావ్?" అన్నాడు.   
    "నువ్వు నన్ను నీ ఇంటికి రమ్మన్నావు కాబట్టి" అని ఒక్క క్షణం ఆగి, రామారావు ముఖంలోకి సూటిగా చూశాడు. మోహన్. "నన్ను కన్నప్పుడే నా కన్నతల్లి కన్ను మూసింది. నా తండ్రి మళ్ళీ పెళ్ళిచేసుకోలేదు గానీ ఇంట్లో అద్భుతమైన విలాసజీవితం అనుభవించాడు. తాననుభావించే జీవితానికి నన్నెంత దూరంగా ఉంచాలని ప్రయత్నించినా అదంతా నేను గమనిస్తూనే వచ్చాను ఆ జేవితం నన్నాకర్షించింది. నాకు తోడబుట్టిన చెల్లేళ్ళు లేరు. అందువల్లనే ఏమో ఆడవాళ్ళను చూడగానే నాలో ఉద్రేకం తప్ప మరో భావం కలగదు. మామూలుగా ఇళ్ళల్లో వుందే వావివరుసలో నాకు నిమిత్తం లేదు. స్నేహితుల భార్యలన్న విచక్షలేదు. అది నా బాలహీనత. నా ప్రయత్నాలు నేను చేసుకుంటూనే పోతున్నాను. అందువల్ల క్రమంగా నాకు స్నేహితులు తగ్గిపోసాగారు.  తెలిసిన వాళ్ళందరూ నన్ను దూరంగా వుంటున్నాను."   
    "చాలా విచిత్రంగా వుంది నీ కధ " అని నిట్టూర్చాడు రామారావు. "నువ్వు చెప్పే పద్దతిని చూస్తూంటే నీ జీవిత విధానాన్ని నీ బలహీనతగా నువ్వు గుర్తించినట్లే వుంది. ఆ బలహీనతను జయించాదాని కేమీ ప్రయత్నాలు చేయలేదా?"   
    మోహన్ పకపకా నవ్వి, "ఎందుకు? నా శరీరాన్ని కానందాన్ని ఇచ్చే బలహీనతను నేనెందుకు జయించాలి?" అన్నాడు.   
    "అయితే స్నేహితుల్ని కోల్పోతున్నందుకు నీకు బాధగా లేదా?" అన్నాడు రామారావు.   
    "స్నేహితుల్నే కాదు, చాలామంది బంధువుల్ని కూడా నేను కావుల్పావుతున్నాను. అయితే నాకు బాధలేదు __ ఆయా వ్యక్తులవల్ల జాలి తప్పితే?'   
    "జాలా?" అన్నాడు రామారావు ఆశ్చర్యంగా.   
    "జాలిపడక ఆరాధించమంటవా? ప్రతి మగవాడూ నన్ను చూసి భయపడడమే! వారి వారి స్రీలను నమ్మేవాళ్ళెవ్వరూ నాకు కనబడలేదు. అలాంటి వాళ్ళను చూసి జాలిపడక ఏం చేయను?"
    "ఇంట్లో లేడి ఉన్నప్పుడు పులుల బారినుండి రక్షించుకో వలసిన బాధ్యత యజమాని కుంటుంది. కదా? అందులో తప్పేముంది?" అన్నాడు రామారావు.
    మోహన్ నవ్వి __" అందుకే నేను వాళ్ళమీద జాలిపడేది. ఆడవాళ్ళను లేళ్ళ స్థాయికి దించేదెవరు? ఆడదాన్ని ఆ స్థాయికిదించేక నాలాంటి సామాన్యులు కూడా వాళ్ళ దృష్టికి పెద్ద పులుల్లా కనబడుతున్నారు. నా సంగతి నీకు తెలియలేదేమో! నే నిన్తవరకూ బలవంతంగా ఏ అడదాన్నీ లోబర్చుకోలేదు." అన్నాడు.
    "నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. కానీ నువ్వు సమాజ న్యాయాన్ని వ్యతిరేకిస్తున్నావు. సమాజంలో ఉమ్తున్నపుడు మనకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని విధులు పాటించి తీరాలి" అన్నాడు రామారావు.
     "అక్కడే ఇబ్బంది వచ్చింది. నేను సమాజ న్యాయాన్ని వ్యతిరేకిమ్చలేదు. అది పాటించడం వల్లనే అందరికీ శత్రువు నయ్యాను. ఉదాహరణకు నేను ఓ ఎక్స్ పెళ్ళాన్ని మోహించాను. వల విసిరాను. నెమ్మది మీద అది నా వల్లో పడింది. ఇద్దరం కొంత కాలం హాపీగా గడిపాం. మన సమాజ న్యాయమేమిటి? తప్పు చేయెచ్చుకానీ, రహస్యంగా ఉంచాలి. నా తప్పును ఏ ఎక్స్ క్కూడా తెలియనంత రహస్యంగా ఉంచాలనే ప్రయత్నించాను. ఆ రహస్యం ఎలాగో బయటపడింది. అది నా తప్పు కాదు. బయట పడేసిన వాళ్లది. దక్యమతో మిగతా వాళ్ళు జాగ్రత్త పడి నన్ను దూరం చేయడం మొదలు పెట్టారు."
    రామారావు అదోలా నవ్వి, "అందరాడవాళ్ళు ఎక్స్ భార్యల్లా ఉండరు. అలంటి వాళ్ళను నీ ప్రవర్తనలో బాధ పేట్టినట్లేకదా?" అన్నాడు.

 Previous Page Next Page