"చూడు రామారావ్! చాలా బాగుందనుకుని సినిమాకు వేడతావు. కానీ నీకు మిగిలేది తలనొప్పె కావచ్చు. అందుకు సినిమాకు తప్పు పట్టలేం. అందుకే మన ప్రయత్నం మనం చేయాలి. ఏ ఆడది ఎక్స్ భార్యలాంటిదో తెలుసుకోవాలంటే ముఖం చూసి చెప్పలేం గదా? అందులోనూ ఈ అడవాళ్ళున్నారు చూశావూ _ వాళ్ళు పరమ అమాయకంగా కనబడతారు కానీ, వాళ్ళలో నీ ఊహకందని ఊహలుంటాయి. వాటికి నాలాంటి వాళ్ళు కారణంగా ఫెయిల్ కాలేదు" అన్నాడు మోహన్.
"సరేలే __ నీ సంగతులకేం. కానీ, ముందు ఇంటికిరా. జీవితంలో సెక్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సరదాగా మా ఇంట్లో రెండ్రోజులుండి మేడపువుగాని" ఆనాడు రామారావు.
"నన్ను రమ్మనమని ఆహ్వానించండి గోక్కోవడమే " అన్నాడు మోహన్.
"నువ్వు పెద్దపులి కాని పక్షంలో మా ఇంట్లో లేళ్ళు లేవు. నిన్ను నేను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను" అన్నాడు రామారావు.
"ఎందుకీ ఆహ్వానం?" అన్నాడు ఆశ్చర్యంగా మోహన్.
"ఎందుకేమిటి? కొన్నేళ్ళు తర్వాత కలుసుకున్న స్నేహుతుడు నువ్వు. అది మొదటి కారణం. రేండో కారణం. కావాలంటే నాకు నీమీద జాలి " అన్నాడు రామారావు.
"కానీ...." అని అడిగాడు మోహన్.
రామారావు అతన్ని మాట్లాడనివ్వకుమ్డా, నీకు కొంతమంది మగవాళ్ళమీద జాలి అని చెప్పావు. నేను ఆ తరగతికి చెందను. నన్ను చూపిన ఎవరైనా అసూయపడితే అభ్యంతరంలేదు. కానీ జాలిపడడం మాత్రం సహించలేను" అన్నాడు.
"అయితే సరేలే! ఊళ్ళో నాకు కొన్ని పనులున్నాయి. ఇంకా ఇక్కడ కొద్ది రోజులుంతాను. వెళ్ళే ముందు నీ ఇంటికి తప్పకుండా వస్తాను " అన్నాడు మోహన్.
* * *
'మోహన్ తప్పకుండా తనింటికి వస్తాడు. వచ్చినపుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది.? అతని ప్రవర్తనలో లోపముంటే దాన్ని లత ఎలా భరిస్తుంది?"
రావారావును లతపై అవిశ్వాసం లేదు. లత కారణంగానే అతనికి ఆడవాళ్ళపై ఆరాధన పెరిగింది. స్రీతత్వంపట్ల ప్రత్యేకగౌరవం కలిగింది. కానీ మోహన్ స్రీతత్వాన్ని అవమానించాడు. స్రీత్త్వాన్ని కేమీ ప్రత్యేకత లేడనీ, ఎవరైనా తన కాళ్ళముందు దాసోహం అనవలసిందేననీ, అటువంటి పరిస్థితి వస్తుందన్న భయంతోనే అందరూ తనను దూరంగా ఉంచుతున్నారనీ అన్నాడు.
అతని మాటలు లతకు పెద్ద సవాల్!
"ఈ సవాలును లత ఎదుర్కోన గలుగుతుంది. ?
ఇది పూర్తిగా అడతనానికీ, అహంకార పురుషుడికీ చెందిన సమస్య. ఈ సమస్యను లత ఎలా ఎదుర్కోనవల్సిందిగా అది పూర్తిగా ఆమెకే వదిలేయాలి. ఇందులో ఆమెకు తన సహాయం లభించలేదు. లత వ్యక్తత్వానికీ, మోహన్ వ్యక్తిత్వానికీ పోటీ పేట్టి, తను కేవలం సాక్షిగా నిలిచి పోవాలి.
పోటీలో మోహన్ నెగ్గితే సమాజ న్యాయం ఆడదాన్ని బలహీనంగా, వ్యక్తిత్వం లేనిదానిగా తయారు చేస్తున్నట్లు రుజువౌతుంది. అప్పుడు సమాజ న్యాయంలో లోపాలు పరిశీలించి వాటి సవరణకు పాటు పడాలి.
అలాకాక లత నెగ్గితే, మోహన్ మనిషి అనిపించుకో గలుగుతాడు. అతన్ని మనిషిగా మలిచిన లతకే దక్కుతుంది!
అనవసరపు విషయంలో తల దూర్చి తను, నిక్షేపంలా ఉన్న తన జీవితం జీవితంతోనే ఆటలాడుకుంటున్నానేమోనన్న భయం రామారావుకు కలిగింది. కానీ లతవంటి భార్య ఉన్న టని ఇలాంటి విషయాల్లో ఉపేక్షించరాదనీ, స్నేహితుడి దురభిప్రాయాలను పోగొట్టే ప్రయత్నం చేయాలనీ అతనికి అనిపించింది. అందుకే అతను మోహన్ గురించి తనకు తెలిసిన విషయాలేవీ లతకు చెప్పదలచుకోలేదు.
2
లత మెడలోని బంగారు గులుసును పరీక్షిగా చూస్తూ"నీ పచ్చటి శరీరం పైన బంగారం కూడా నల్లగా కన్పిస్తోంది." అన్నాడు రామారావు.
"అదేం కాదు డానికి కాస్త మట్టికొట్టింది. రేపో సారి సబ్బు పేట్టితోమాలి" అంది లత.
రామారావు తల పకించి__ "ఆహా! బంగారం ఎంత తెలివైనది" అన్నాడు.
"అదేంటండీ?" అంది లత ఆశ్చర్యంగా.
"చేమటవల్ల శరీరంమీద కొంత మురికి విధిగా చేరుతుంది. అయినప్పటికీ నీ వంటి మేరుపు తగ్గడం లేదు. నీ చయకూ. మెరుపుకూ అసూయపడే బంగారం నే వంటిమీద మట్టిని ఎప్పటికప్పుడు తనే గ్రహిస్తూ _ మట్టి నీ వంటి మెరుపును తగ్గించలేదన్న నిజాన్ని ప్రపంచానికీ తెలియకుండా చేస్తోంది" అన్నాడు రామారావు.
లత సిగ్గుపడుతూ __"మరీ అంతలా పరేక్షిగా చూడకండీ! నాకు సిగ్గు కూడా వేస్తోంద" అంది.
"అజంతా శిల్పాన్ని ఎంతసేపు చూస్తె తనివి తీరుతుంది?" అన్నాడు రామారావు.
"అందానికి కాకపోయినా ఇప్పుడు ఇప్పుడు చూడ్డానికి అజంతా శిల్పంలాగే ఉన్నాన్లెండి" అంది లత చిరుకోపాన్నభినయిస్తూ.
ఆ సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది.
"అబ్బా! ఇప్పుడెవరు?" అంది లత విసుగ్గా. అప్పుడు రాత్రి పదిగంటలు దాటింది.
"ఎవరైనప్పటికీ మన ప్రేమ మధ్యకు దాపరికన్ని తీసుకు వచ్చారు. బట్టలు వేసుకో" అన్నాడు రామారావు. భార్యతో గడిపే ఈ మధురక్షణా లతనికి ఎంతో విలువైనవి. నిరుత్సాహం అతని కళ్ళలో కొట్టోచ్చినట్లు కనబడుతోంది.