పదిరోజులు ముందుగా వెళ్ళి సాధించవలసిందే సాదించారు మీరు_" అంది వసంత.
అందులోని గుప్తార్ధం రాజారావుకు మాత్రమె తెలుసు.
మరో పది నిముషాల్లో మూడు రిక్షాలూ చలమయ్య ఇంటి ముందు ఒకదాని వెనుక ఒకటి వరసుగా ఆగాయి.
2
చలమయ్యది పెద్ద యిల్లు, విశాలమైన దొడ్డి దొడ్లో నుయ్యి, నూతిలోంచి నీరు తోడుకోడానికి శ్రమలేకుండా కరెంట్ కుళాయీ, సెప్టిక్ లేట్రీస్ _ ఈ సదుపాయాలతో ఆయనిల్లు నిజంగానే పత్నవాసపుటిళ్ళను మించి ఉంది.
చలమయ్య వయసు యాభైపై చిలుకు. అయనకారు గురు పిల్లలు .
పెద్దకొడుకు బసవయ్య ముప్ఫై ఏళ్ళవాడు. వ్యవసాయంతో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అతడికీ పెళ్ళయింది. నలుగురు పిల్లు కూడా. చలమయ్య వూళ్ళోనే మరో యిల్లువుడడంవల్లనూ, కోడలు కాస్త గయ్యాళి కావడం వల్లనూ అతడు వేరు కాపురం మాత్రం పెట్టాడు.
బసవయ్య తర్వాత వరసుగా ముగ్గురాడ పిల్లలు. ముగ్గురికీ పెళ్ళిళ్ళయి అత్తావారిళ్ళలో కాపురం చేసుకుంటున్నారు. అయిదోవాడు గురవయ్య కిరవైఏళ్ళు౦టాయి. చెడుస్నేహాలతో అతడికి చదువు రావడంలేదు . ఇటు తండ్రికి వ్యవసాయం పనుల్లో సాయం చేయడు. ఆఖరివాడు చంద్రయ్యకు పన్నెండేళ్ళు స్కూల్లో చదువుకుంటున్నాడు. అతడికీ తెలివి చదువంటే శ్రద్ద ఉన్నాయి.
ఈ వివరాలన్నీ చలమయ్య భార్య లక్షమ్మ ద్వారా తెలుసుకుంది వసంత. అదీ తను ఒక్క ప్రశ్న కూడా అడక్కుండానే చెప్పిందావిడ.
లక్షమ్మ వారి వంటి వ్యక్తులను కథల్లోనూ, సినిమా ల్లోనూ తప్ప ఇంతవరకూ వాస్తవంలో చూడని వసంతకు నిజంగానే ఆశ్చర్యం కలిగింది. ఆవిడ తన వయసు నలభై రెండేళ్ళని చెప్పితే వసంత నమంలేదు. . బలంగా . ఆరోగ్యంగా ఉన్న ఆమెకు ఆరుగురు పిల్లలున్నారనీ _ అందులో నలుగురు పిల్లలు పెళ్ళిళ్ళయి కాపురాలు చేసుకుంటున్నారనీ అంటే నమ్మడం కష్టం. వసంత అంచనాలలో ఆవిడవయసు ముప్ఫైకి మించదు.
కుటుంభానికి సంబంధించిన వివరాలింకా చాలా చెప్పిందావిడ . అయితే వసంత అవన్నీ సరిగ్గా వినలేదు. చాలమయ్యగారికో యాభై ఎకరాల మాత్రం తెలుస్కుని మిగతా విషయాలు గాలికి వదిలేసింది.
చలమయ్యగారిసంగతలూ వదిలి పెడితే _ ఆ ఊరు కూడా బాగున్నట్ట్లే వసంతకు తోచింది.
ఊళ్ళో కరెంటు౦ది. డబ్భిస్తే కాలవనుంచి నీళ్ళు తెప్పించుకోవచ్చు. మామూలుగా నీళ్ళు వాడకానికి దొడ్లో నుయ్యింది. నీరు తోడుకోవాలనే బాధలేదు. ఊళ్ళో అన్ని వస్తువులూ దొరుకుటాయి. వంటక్కూడా చాలామంది రాజమండ్రి నుంచి కాల గ్యాసు తెప్పించుకుంటారు. వసంత తను కూడా అలాంటి ఏర్పాటు చేసుకోవాలనుకుంటోంది. ఇంతకు మించిన సదుపాయలేపల్లెటూళ్ళో మాత్రముంటాయి?
ఎప్పుడైనా సినిమాలు చూడాలనిపిస్తే రాజమండ్రివెళ్ళి నాల్రోజులుండి వెళ్ళినాల్రోజులుండి రావచ్చు. పేరవరం నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే లాంచీ ప్రయాణం కలుపుకున్నా రెండుగంటలకు మించదు.
వసంత, రాజారావు నెమ్మదిగా ఈ ఊళ్ళో సేతిలవు తున్నారు. వాళ్ళక్కడికి మే నేల మధ్యలో రావడం వల్ల నీల రాజమండ్రిలో కాన్వెంట్లో చేర్చాలని భర్త అంటే వసంతి ఒప్పుకోలేదు.
"ఊళ్ళో హైస్కూలుంది, ఎలిమెంటరీ స్కూలుంది. పిల్లకింకా పట్టుకుని నాలుగేళ్ళు లేవు పదో తరగతి దాకా ఇక్కడే చదువుకుంది. ఆ తర్వాత స్థలం మార్పు సంగతి చూసుకోవచ్చు. పిల్లనిప్పుడే రాజమండ్రిలో జేర్పించేఉద్దేశ్యముంటే __ ఈ ఊర్నించి పోయి రాజమండ్రిలోనే మకాం పెడదాం_" అందామె.
"నేను రాజమండ్రిలో ఎందుకు మకాం పెట్టనో నీకు తెలుసు పిల్లదాని చదువంటావా __ నువ్వెలాగంటే అలాగే __" అన్నాడు రాజారావు.
వీళ్ళు నెమ్మదిగా ఆ ఊళ్ళో స్థిరపడుతుండగా __ ఊళ్ళో వాళ్ళకు __ వీళ్ళ విషయమో చర్చనీయా౦శమయింది.
ఎవరీ విచిత్ర దంపతులు? ఈ ఊరేందుకొచ్చారు? ఓ ఉద్యోగంలేదు, భూమీ పుత్రా లేదు. ఖర్చులకు డబ్బెక్కడ్నించి వస్తుంది? బ్యాంకులో బాగా డబ్బుందా? ఉంటే మాత్రం అది ఎన్నాళ్ళు కూర్చుని తిన్నా తరగదా? అసలీ ఊళ్ళో వీళ్ళేనాళ్ళు౦టారు?
ఇలాంటిప్రశ్నలు ఊళ్ళో చాలామందిని బాధించాయి. చూడ్డానికి రాజారావు చెప్పుకో తగ్గ ఆస్థిపరుడిలా లేడు.
ఎవరి అస్థికైనా ఆ పల్లెటూళ్ళో స్త్రీలు ధరించే నగలే గీటురాళ్ళు. వసంతవంటిమీద అయిదారు తులాలకు మించదు బంగారం. ఆమె కట్టేవి మరీ సాదా చీరలు కాకపోయినా చాలా వాటి ఖరీదు. వందలోపే! రాజారావు టేరిలీన్ బట్టలు వేసుకున్నప్పటికి _ ఈ రోజుల్లో కాస్త సంపాదించుకునే ప్రతివాడూ ఆ మాత్రం వేసుకుంటున్నాడు.
అది పల్లెటూరు. అందులోనూ జనాభా తక్కువ. అందువల్ల రాజారావు దంపతుల గురించిన ఆలోచనలు ఊరి పెద్దల బుర్రల్లో కూడా ప్రవేశించాయి.
మొట్టమొదట రాజారావు వైద్యం ప్రాక్త్రీసుచేయడానికా ఊరు వచ్చేడని చాలామంది అనుమానించారు. అందుక్కారణం లేకపోలేదు. అతడు _ ఇంటి ముందు డాక్టర్ రాజారావు అని బోర్డు తగిలించాడు. ఆ బోర్డు చూసిన చలమయ్యే ఓ రోజున అతడి దగ్గర చేయి చూపించుకోబోగా రాజారావు నవ్వి __" ఈ డాక్టరు వేరండీ _ ఏదైనా ఒక విషయంమీద తీవ్రంగా పరిశోధించి ఒక కొత్తవిశేషం కనిపెట్టి అ పరిశోధన వివరాలను పుస్తక రూపంలో రాసి యూనివర్సిటిలో యిస్తే __ వాళ్ళు డాక్టరు డిగ్రీ యిస్తారు. నాకు వైద్యం గిరిమ్చేమీ తెలియదు __" అని విపులంగా చెప్పుకున్నాడు. అతడు చెప్పిందంతా చలమయ్యకు సరిగా అర్ధం కాకపోయినా __ "ఇతడు మందులిచ్చే డాక్టరు మాత్రం కాడు" అనుకున్నాడు.
రాజారావు వచ్చిన వార రోజుల్లోనూ ఊరు ఊరంతా అతడి గురించి చెప్పుకున్నారు చలమయ్యగారింట్లో అతిడుంటూ౦డడంవల్ల ఆయనకూ ప్రాముఖ్యత వచ్చింది. చాలా మంది చలమయ్యను పని కట్టుకుని పలకరించి _ కాసేపాకబురూ ఈ కబురూ చెప్పి తర్వాత నెమ్మదిగా రాజారావు గురించిన విషేషాలడుగుతూండేవారు. తనకు హఠాత్తుగా లభించిన ఈ విశిష్టతను గుర్తించిన చలమయ్య కూడా కొంచెంగానే జావిబులిచ్చి వాళ్ళకుతూహలన్ని మరింత పెంచుతూండేవాడు. అయితే ఆవకాశం అయన కేన్నాళ్ళో లభించిన లేదు.