ఓ రోజున రాజారావు గ్రామ పెద్దలందరికీ తేనేటి విందుకు _ ఆహ్వానాలు పంపాడు. ఆహ్వానితులు కరణం కనకరాజు, మునసబు భద్రం , ప్రెసిడెంటు రమాకాంతం, పెద్ద షాహుకారు ముత్యాలయ్య.
ఎవరో ఊరూ పేరూ లేనివాడు తమ ఊరు రావడం, ఏ పనీ లేకుండా ఊరికే అక్కడ మకాం పెట్టడానికి మించి ఊరి పెద్దలకీ ఆహ్వానం విచిత్రంగా తోచింది. ఇది వాళ్ళ గ్రామ చరిత్రలోనే అపూర్వం. అయినా అందరూ వెళ్ళాలనే అనుకున్నారు. రాజారావు గురించి కొన్ని వివరాలు తెలియవచ్చునని వారి ఆశ!
రాజారావింట్లో కలుసుకునే దాకా __ అతడేవరెవరిని ఆహ్వానించాడో ఎవరికీ తెలియదు. అందరూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్ల _ అక్కడ అయిదుగురు పెద్దమనుషులూ ఒకరినొకరు విచిత్రంగా చూసుకున్నారు,
వచ్చిన పెద్దలందర్నీ రాజారావు స్వయంగా ఎదురువెళ్ళి పలకరించి గదిలోకి ఆహ్వానించి కూర్చోపెట్టాడు.
వచ్చిన పెద్దలు గదిలో సుఖాసీనులై పరిసరాలను పరికించారు.
గది నీటుగా ఉంది. ఒక అందమైన సోఫా సెట్ కాక మరో నాలుగు అందమైన కుర్చీలు. గోడలకు రెండు పెయింటింగ్సు వ్రేలాడుతున్నాయి. వాటిలో ఒకటి ఆధునిక చిత్రకళ.
పరస్పర పరిచయానంతరం రాజారావోసారి అక్కడకు చేరిన వారందర్నీ పరిశీలనగా చూశాడు.
ప్రెసిడెంట్ రమాకాంతం ఖద్దరు దుస్తులలో దేశ నాయుకులకు గుర్తు తెస్తూ చాలా హుందాగా వున్నాడు. అప్పుడే నేరుస్తూన్న మీసాలు _అయన ఠీవికి కొంత సహశరిస్తున్నాయి. మనిషి ఆజానుబాహుడు . తెల్లని పసిమిఛాయ. కళ్ళలో వినయం, కార్యదీక్ష కనబడుతున్నాయి. వయసు యాభై దాటి ఉండవచ్చు.
కరణం కనకరాజు తెల్లని గ్లాస్కోపందెమీద పెద్దాపురం సిల్కు చొక్కా వేసుకున్నాడు. మనిషి దగ్గర సెంటు వాసన గుప్పుమంటోంది. వయసు ముప్ఫైఅయిదుప్రాంతాల ఉంటుంది. చూడ్డానికి కులాసావురుషుడనిపిస్తాడు.
మునసబు భద్రానికి వయసు పాతికేళ్ళకు మించదు .మనిషి గగా నలుపు ముఖంలో మంచి కళ వుంది. తండ్రి చనిపోగా ఆ ఉద్యోగం తను చేస్తున్నాడు. వేషంచూడగానే కాలేజిస్టూడెంటనిపిస్తుంది.
ముత్యాలయ్య ముతకపంచి, కొద్దిగా మాసినపోడవాటి లేత నీలిరంగు చొక్కాలో వీళ్ళమధ్య వెలవెల బోతున్నాడు. మనిషి అరవయ్యోపడిలో పడుతున్నాడు. చిరుబొజ్జ వున్నా మనిషి దృఢంగా ఉన్నాడు.
ఇంచుమించు ముత్యాలయ్యదీ చలమయ్యదీ ఒక్కటే వేషం ఎటొచ్చి చలమయ్య బట్టలు చూసిలేవు అదనంగా భుజమ్మీద ఓ కండువా ఉంది.
పరిశీలనకు రాజారావుకు రెండు నిముషాలు మాత్రం పట్టింది. ఈ రెండు నిముషాల్లోనూ వాళ్ళ వేషధారణ తీరు తెన్నులు గమనించిన అతడు _ "వేష ధారణలో అందరూ తలోరకంగా కనబడుతున్నప్పటికీ _ అందరి ముఖాల్లోనూ ఒకే రకమైన భావం కనిపిస్తోంది. అది ఆశ్చర్యమూ, కుతూహలమూ మేళవమైన ఒక విచిత్ర భావం .... అనుకున్నాడు."
" ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ....." అంటూ ప్రారంభించాడు రాజారావు __ "మీరంతా గ్రామానికి పెద్దలు. మీ వల్లనే ఈ ఊరు ఏ సమస్యలూ లేకుండా ఉందని నేను విన్నాను. నేనీ ఊరికి కొత్త. కానీ ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇకనుండి మీరు మీ గ్రామ పౌరులతో నన్నూ ఒకడిగా భావించినా సహకారాన్ని తీసుకుంటూ __ మీ సహకారాన్ని నాకంద జేస్తూంటారని ఆశిస్తున్నాను. అందుకే ముందుగా మీ అందరితో పరిచయం చేసుకుందామని ఉద్దేశపడ్డాను ....."
"ఇంతకు ముందు తమరెక్కడు౦డేవారు? అనడిగాడు రమాకాంతం.
"ఓ పెద్ద పట్టణంలో ఎనిమిదో౦దల జీతం మీద కంపెనీ ఉద్యోగం చేస్తూండేవాడ్ని. ఎందుకోనాకు విసుగునిపించి ఏదైనా పల్లెటూరు స్థిరపడిపోవాల నిపించింది. కొన్ని కారణాల వల్ల నాకీఊరు నచ్చింది. ఏ కారణాలంటే చెప్పలేను. దాచాలని కాదు. జవాబు నాకే తెలియదు కనుక ......"
"ఎందుకు తెలియదంటారు?" అన్నాడు కనకరాజు కానీ _ పట్నవాసంలో ఉండే సదుపాయాలన్నీ కావాలి అంతేకాదు. ఆ పల్లె పట్నానికి దగ్గరగా ఉండాలి. ఎందుకో నాకు తీరాన ఉండాలి. ఇవన్నీ ఈ పల్లెకు సరిపోయాయి. కానీ అలా సరిపోయే పిలల్లు ఇంకా ఉంటే ఉండొచ్చు . అయినా ఈ ఊరికే నచ్చిందంటే ఎందుకో నాకే తెలియదు......"
"ఇక్కడ భూములేమైనా కొందామానుకుంటున్నారా?" అంటూ ముత్యాలయ్య తనూ ఓ ప్రశ్న వేశాడు.
"కొనాలనేఉంది కానీ వ్యవసాయం చేసే తెలివీ నాకు లేదు భూమి కోనేట౦త స్తోమతూ లేదు ....."అన్నాడు రాజారావు.
"వ్యవసాయం చేస్తానంటే మీకు సాయపడ్డానికీ ఊళ్ళో చాలా మందున్నారు. మీకీ ఊళ్ళో ఉద్యోగం దొరకదు ..... మరి మీ జీవినాధారం?" సూటిగా అడిగేశాడు కనకరాజు.
మిగతావాళ్ళు కూడా ఈ ప్రశ్నే అడగాలనుకుని మొహమాటం అడగేయడంతో __ రాజారావు నొచ్చుకుంటాడేమోనని వాళ్ళు కలవరపడ్డారు.
"నారు పోసినవాడే నీరు పోస్తాను నాకు జీవితంగురించిన బెంగేమీ లేదు __" అన్నాడు రాజారావు తాఫీగా అతడు జవాబిచ్చిన పద్దతిని బట్టి అతడేమో నొచ్చుకోలేదనే అనిపిస్తోంది.
రాజారావు చాలా విషయాలు దాస్తున్నాడని ఊరిపెద్దలు గ్రహించేశారు. అతడు ప్రస్తుతం పరిచయాలకు మాత్రమె పిలిచాడనీ __ తన్ను గురించిన విశేషాలేమీ బైటపెట్టుకోవడంలేదనీ అందరికీ అర్ధమైపోయింది.
"ఇంతకీ మన పరస్పరసహకారం స్వభావం ఏమిటండీ?" అన్నాడు రామాకాంతం.
రాజారావు నవ్వి __ " ఏం చెప్పగలం? అన్ని రోజులూ మనివి కాదు. ఎప్పుడేవరికె సహకారమవసరపడుతోంది. తెలియదు కదా. అటువంటప్పుడు ఎటువంటి సంకోచాలూ మన మధ్య వుండకూడదని నా అభిప్రాయం __ " అన్నాడు.
"మీరు తమాషా మనిషిలాగున్నారు......" అన్నాడు భద్రం.
"నాకూ మిమ్మల్ని చూస్తె అలాగే అనిపిస్తోంది. పరిచయం పెరిగిన కొద్దీ తమాషాలు తగ్గిపోతాయి __" అన్నాడు రాజారావు.
ఉన్నట్లుండి ముత్యాలయ్య _ "మిమ్మల్నేక్కడో చూసినట్లుంది. మీరీ ఊరికి కొత్తకాదనిపిస్తోంది...." అన్నాడు.
"నాకూ అలాగే అనిపిస్తోంది........" అన్నాడు చలమయ్య .
రాజారావు తడబడి _ "మీరలాగనడం నాకశ్చర్యంగా ఉంది ...." అని _ "అన్నట్లు మీ అందరికీ నా కుటుంబాన్ని పరిషయం చేయడం మరచిపోయాను ...." అంటూ _ "వసూ పాపా అని పిలిచాడు.
అతడి పులుపుకు సమాధానంగా ముందు నీలవచ్చింది.
"నా ఏకైక పుత్రిక __ నీల!" అన్నాడు రాజారావు. పాప అందరికీ నమస్కరించింది. ఆ పాప సంస్కారానికి ముగ్ధులై అంతా ముచ్చటగా చూశారు.
ఇంతలో ట్రేలో టిఫిన్ ప్లేట్స్ పేట్టి పట్టుకుని వచ్చింది. వసంత . కళ్ళప్పగించి కాకపోయినా . అదోరకంగా చూసేరంతా ఆమె వైపు. ఇలాంటి పరిచయాలక్కాడు౦డవు భార్యను పరాయి మగవాడికి పరిచయం చేయదమన్నదే అక్కడ అరుదు.
మిగతా వారందరూ వయసులో పెద్దవాళ్ళుకావడంవల్ల ఓసారి చూసి చూపులు మరల్చుకున్నా భద్రం మాత్రం రెండు మూడుసార్లామేను కాక, వయసులో చిన్నది కావడం కూడా అందుక్కారణం.
ట్రే టీపాయ్ మీద పేట్టి ఆమె నిలబడ్డాక _ " ఈమె నా భార్య _ వసంత!" అన్నాడు రాజారావు.
ఆమె అందరికీ నమస్కరించింది వాళ్ళు ప్రతినమస్కార౦ చేశారు. రాజరావామెకు వాళ్ళందర్నీ పరిచయం చేసి _ టిఫిను ప్లేట్ల౦దరికీ తనే అందించాడు . మంచినీళ్ళు తేవడానికి ట్రే తీసుకుని లోపలకు వెడుతూ ఓసారి భర్తవంక చూసింది ఆ చూపుకర్ధం తెలిసిన రాజారావు భార్య వెనుకనే లోపలి వెళ్ళాడు తల్లితండ్రులననుసరించి నీల కూడా లోపలకు వెళ్ళింది.