"చెప్పండి"
జస్వంతరావు చెప్పడం మొదలెట్టాడు.
"పంతొమ్మిదో శతాబ్దం మొదటి భాగంలో మొదలయింది ఈ కధ.
అప్పట్లో ధగ్గులు. పిండారీలు అనే దారుణమైన ప్రవృత్తి దొంగలు ఉండేవాళ్ళు. దగ్గులు దారికాచి , బాటసారులని దోచి, గొంతుపిసికి, కాళిక అమ్మవారికి బాలి ఇస్తుండేవారు. పిండారీలు అంటే గుర్రాల మీద వచ్చి దోచుకునే మహారాష్రదొంగలని చెప్పుకోవచ్చు. అత్యంత భీభత్సం సృష్టించేవాళ్ళు పిండారీలు. గుర్రాలమీద వచ్చి ఉళ్ళకి ఉళ్లు దోచుకోవడమే కాకుండా, మనుషులని బస్తాల్లో కుక్కి, ఆ బస్తాల్లో బూడిద పోసి, వాళ్ళు ఉపిరాడక ఉక్కిరిబిక్కిరై చస్తూ ఉంటే ఆనందించే వాళ్ళు.
అలాంటి పిండారీలు దండు ఒకటి ఒకసారి మాధవయ్య వాళ్ళ ఊరికి వచ్చింది. అంతకుముందే ఆ పిండారీలు దండు అనేక ఉళ్ళని సర్వనాశనం చేసి ఉండడంవల్ల వాళ్ళు మాధవయ్య వాళ్ళ ఊరివైపు వస్తున్నారనే తెలిసి తెలియగానే ఆ ఊరి ప్రజలు ప్రాణాలు అరచేతబట్టుకుని పారిపోయారు.
కానీ మాధవయ్య మాత్రం అనారోగ్యంవల్ల పారిపోలేక తన ఇంటి వెనకనే ఉన్న బావి దగ్గర ఒక గడ్డిమోపు ఉంటే అందులో దాక్కుని, తన కుటుంబాన్ని మాత్రం పట్నానికి పంపించేశాడు.
పిండారీల దండు ఊరినంతా దోచుకుంది. అందులో ఒక పిండారీ గుర్రం మీద మాధవయ్య ఇంటివైపు వచ్చాడు. అతని గుర్రం మీద మోయ్యలేనంత బరువు గల బంగారం , నగలు, నాణ్యాలు, సంచుల్లో వెళ్ళాడుతున్నాయి.
ఆ దొంగ బాగా ఆకలి మీద ఉన్నాడు. గుర్రాన్ని అక్కడ కట్టేసి, బావిలో నీళ్ళు తోడుకుని తాగి, ఇంట్లో ఏమన్నా తినడానికి దొరుకుతుందేమోనని చూడడానికి వెళ్ళాడు.
అక్కడ కాస్త గంజీ, కొన్ని పళ్ళు ఫలాలు కనబడితే వాటితో ఆకలి తీర్చుకోవడం మొదలుపెట్టాడు.
గడ్డివాములో నక్కివున్న మాధవయ్య ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. అప్పుడు వచ్చింది అతనికా ఆలోచన!
దొంగ ఇంట్లోకి వెళ్ళాడు. అతను బయటికి వచ్చేలోగా, ఈ గుర్రం వీపున వేళ్ళాడుతున్న నగల సంచులని బావిలో పడేసి గుర్రాన్ని కనక తరిమేస్తే..........?
తన అదృష్టం బాగుండి, బతికి బయటపడితే, ఆ తర్వాత తను భోగభాగ్యాలు అనుభవించవచ్చు.
అలా అనిపించగానే, అతనికి ఎక్కడలేని తెగింపు వచ్చింది.
తక్షణం గడ్డివాములోంచి బయటకు వచ్చేసి లాఘవంగా గుర్రం వీపు మీద వున్న నగల సంచులని బావిలో పడేశాడు. గుర్రాన్ని విప్పేసి, అడవిలోకి తరిమేశాడు. తర్వాత మళ్ళీ తను వచ్చి గప్ చిప్ గా గడ్డి వాములో నక్కి కూర్చున్నాడు.
ఈ లోగా
ఇంట్లో ఫలహారం ముగించిన పిండారీ దొంగ పక్క ఇళ్ళకెళ్ళి అక్కడి వస్తువుల్లో తనకి, నచ్చినవి ఒక గోతాంలో వేసుకుని, మళ్ళీ బావి దగ్గరికి వచ్చేసరికి అతని గుండె గుభేలుమంది.
అతని గుర్రం అక్కడలేదు.
గుర్రం ఎమయిపోయిందో అతనికి అర్ధం కాలేదు.
తన గుర్రం కట్టు తెంపుకుని పారిపోయిందా? లేకపోతే తన ముఠాలోని వాళ్ళెవరన్నా వచ్చి గుర్రాన్ని తీసుకెళ్ళిపోయారా?
కాసేపు అక్కడే కూలబడి విచారించి, తర్వాత తన తోడు దొంగలని వెదుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆ పిండారీ.
దొంగల దండు ఊరు వదిలి వెళ్ళిపోయాక, గడ్డివాములోంచి బయటికి వచ్చాడు మాధవయ్య. తర్వాత ఊరి ప్రజలందరూ తిరిగివచ్చారు. మాధవయ్య కుటుంబం కూడా వచ్చింది.
తన కొడుకుని చాటుగా పిల్చి జరిగినదంతా చెప్పాడు మాధవయ్య.
ఆ తర్వాత వాళ్ళు ఆ దొంగ బంగారాన్ని కరిగించి , పట్నంలో అమ్మి సొమ్ము చేసుకున్నారు.
అలా అపరిమితమైన ధనం సమకురగానే, ఇంక మాధవయ్యకి అధికారం మీదకి మనసు మళ్ళింది.
మాధవయ్య, మాధవయ్య కొడుకు, కలిసి, తమ దగ్గరున్న డబ్బు వెదజల్లి కండపుష్టి వున్నవాళ్ళని, కొంతమందిని చేర్చి ఒక చిన్న సైన్యాన్ని తయారు చేశారు.
పిండారీలు నేర్పిన అనుభవంతో, అన్ని వాళ్ళ పద్దతులే పాటిస్తూ గుర్రాలమీదెక్కి ఉళ్ళని దోచడం మొదలెట్టారు!
అయితే పిండారీలులా వుళ్ళని దోచుకోవడంతో ఊరుకోకుండా ఆ వుళ్ళని, ఆక్రమించుకుని తమ పెత్తనం కిందికి తెచ్చుకున్నారు. కొన్ని ఉళ్ళని రాజు దగ్గర కొనేశారు. కొన్నిటిని గుత్తకు తీసుకున్నారు. కొన్నిటిని ఆక్రమించుకున్నారు. ఆ విధంగా ప్రారంభం అయింది మాధవయ్యగారి ఎస్టేటు!
ఊళ్ళు కలుస్తున్నకొద్దీ అది పెరిగి ఒక సంస్థానంగా మారింది. మాధవయ్య మార్తాండ సింహుడిగా మారాడు. బ్రిటీషువారికి తొత్తుగా వుంటానని ఒక ఒప్పందానికి వచ్చి, తన రాజ్యాన్ని పదిలం చేసుకున్నాడు. బ్రిటీషు వారు అతనికి కొన్ని బిరుదులు, లాంచనాలు దయచేయించారు.
"ఆ మార్తాండ సింహుడు మీ పుర్వికుడు" అన్నాడు జస్వంతరావు.
"మీరు విఠలాచార్యగారి జానపద చిత్రం ఏదన్నా చుపిస్తున్నారా ఏమిటి?" అన్నాడు డైమండ్ రాజా వ్యంగ్యంగా.
"కాదు ఇది అక్షరాలా చారిత్రిక సత్యం! ఇకపోతే - రాజామార్తాండసింహుడు గద్దెనెక్కి పాలనచేస్తూ వున్నప్పుడే ఒక సంఘటన జరిగింది! అది పూర్తిగా నీకు సంబంధించినది!" అన్నాడు.
వద్దనుకుంటున్న రాజా మనసులో ఆసక్తి పెరిగింది.
"ఏమిటది?" అన్నాడు!
చెప్పడం మొదలెట్టాడు జస్వంతరావు.
* * *
ఎడతెగకుండా ఆలోచిస్తూనే వుంది మీనాక్షి. తన తల్లిని పోషించడానికి ట్రీట్మెంట్ ఇప్పించడానికి గానూ తనకు ఉద్యోగం అవసరం!
డాన్సు తప్ప తనకి ఇంకేమి రాదు! తన చదువేమో అర్ధంతరంగా ఆగిపోయింది.
అందుకని తను ఇంకేమన్నా హోటల్లో చేరక తప్పేటట్లులేదు.
కానీ-
ఈసారి తను బలిపశువులా ఆత్మార్పణ చేసుకోవడానికి వెళ్ళట్లేదు!
మెత్తటి పులిలా, ఉరుములేని పిడుగులా వెళ్ళి, వాళ్ళతో కలిసి వుంటూనే తన శీలం చెడకుండానే వాళ్ళ పని పట్టడానికి వెళుతోంది.
తన సామర్ధ్యం మీద తనకి చాలా నమ్మకం వుంది. చాలా!
ఆమె అలా దీర్ధంగా ఆలోచిస్తూ వుండగానే తలుపు చప్పుడు అయింది.
లేచి , తలుపు తీసింది మీనాక్షి.
ఎదురుగా మల్ హోత్రా నిలబడి ఉన్నాడు. హోటల్ మేనేజర్ మల్ హోత్రా!
అతని చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ వుంది.
మల్ హోత్రాని చూడగానే మీనాక్షి మొహం అప్రసన్నంగా అయిపొయింది.
మీనాక్షిని చూడగానే మల్ హోత్రా మొహం మాత్రం చాటంత అయింది.
"అమ్మయ్యా! నువ్వు దొరుకుతావో లేదో అని ఆరాటపడిపోయాను" అన్నాడు గుండెలమీద చెయ్యి వేసుకుంటూ-
"నాతొ నీకేం పని?" అంది మీనాక్షి కటినంగా.
"చాలా పని వుంది! నువ్వు నాకు వచ్చావ్! నువ్వు మాములు ఆడపిల్లని కావని, చాలా స్పెషల్ గర్ల్ వి అని నేను గ్రహించాను! లోపలికి వచ్చి మాట్లాడవచ్చా?" అన్నాడు.
"అవసరం లేదు"
నిస్సిగ్గుగా అక్కడే నిలబడి సిగరెట్ తీసి అంటించాడు మల్ హోత్రా.
"ఇంకో కొత్త ప్రపోజల్ తో వచ్చాను" అన్నాడు.
మీనాక్షి అతనేప్పుడేళ్ళిపోతాడా అన్నట్లు చూస్తూ అసహనంగా నిలబడి వుంది.
"పారడైజ్ హోటల్ సగం పైగా ధ్వంసం అయిపోయింది - ఎయిర్ క్రాప్ట్ ఎక్స్ ప్లోడ్ కావడం వల్ల! ప్రోపయిటర్ దాన్ని రిపెయిర్ చేయించి రినోవెట్ చేయ్యదానికం కనీసం ఆర్నెల్లు పడుతుంది. అర్లెన్న పాటు నేను గోళ్ళు గిల్లుకుంటూ కుర్చోలేను. అందుకని ఓ ప్లాన్ వేశా!" అన్నాడు మల్ హోత్రా.
అది ఏమిటని అడగలేదు మీనాక్షి.
"నేనే ఓ కొత్త హోటల్ ఓపెన్ చేసేస్తున్నా!" అన్నాడు మల్ హోత్రా డ్రమెటిక్.
మీనాక్షి మోహంలో ఏ భావం కనబడలేదు. అయినా మల్ హోత్రా చెబుతూనే వున్నాడు.
"ఈ మల్ హోత్రాలో ఒక గొప్ప టాలెంటు వుంది తెలుసా! అదేమిటంటే ఎదుటివాళ్ళలో వున్న టాలెంటుని గుర్తు పట్టేయ్యగలగడం అన్న మాటా! మీనాక్షి! టాలెంటు మూడు రకాలుగా వుంటుంది. ఒకటి. కొంతమంది పుట్టుకతోనే గొప్ప టాలెంటుతో పుడతారు. వాళ్ళు కళాకారులో, రచయితలో, మేధావులో అయివుంటారు . పొతే - రెండోరకం టాలెంటు ఏమిటంటే, ఒరిజనల్ గా తమలో వున్న టాలెంటుని వెలుగులోకి తెచ్చి, పదిమందికి తెలిసేలా చేసి, డబ్బూ పేరూ సంపాదించుకోవడం. కానీ ఈ టాలెంటు చాలా కొద్దిమందికి మాత్రమే వుంటుంది. అందుకనే అపారమైన ప్రజ్ఞాపాటవాలు వున్నవాళ్ళు అనేకమంది మట్టిలో మాణిక్యాలలాగా, నివురుగప్పిన నిప్పుల్లాగా వుండిపోతారు.
ఇకపోతే ముడోరకం టాలెంటు - ఎక్కడ టాలెంటు వుందో కనిపెట్టి, దాన్ని వెలుగులోకి తెచ్చి, వాళ్ళని పైకితెచ్చి , వాళ్లద్వారా తను కుడా బాగుపడటం-
ఈ టాలెంటు నాలో పుష్కలంగా వుంది మీనాక్షి.
మీనాక్షి! నువ్వు కేవలం మంచి డాన్సర్ వీ, అందగత్తెని మాత్రమే కాదు --
యుగాట్ దట్ సమ్ థింగ్ ఎక్స్ ట్రా!
నువ్వు చాలా గోప్పదానివి కాబోతున్నావు.
నిన్ను పైకి తెచ్చి, నీ కొంగుపట్టుకుని నేను కుడా పైకి రాదలుచుకున్నాను!