Read more!
 Previous Page Next Page 
అరుణ పేజి 3


    
    "ఓహో ఇంక తమరు పల్లెలనిఉద్దరించదానికి నడుంకడతారన్నమాట" హాస్యంగా అన్నాడు.
    "హాస్యంకాదన్నయ్యా సీరియస్ గా అంటున్నాను." అరుణ గంభీరంగా అంది.    
    "మతిగాని పోయిందా నీకు? ఆ వెధవ ఊళ్ళలో ఒక్కరోజు ఉండగలమా: ఓ ఇల్లా? రోడ్లా? లైట్లా? సినిమాలా...... నాలుగు రోజులుంటే బోర్ ఎత్తుతుంది. మహా అయితే ఆ ప్రకృతి సౌందర్యం అంటూ నాలుగు రోజులు చూడవచ్చు తరువాత మాట్లాడుదామన్న కాస్త చదువుకున్న మనిషి కనపడక విసుగెత్తిపోతాం. అబ్బ: కేసులగురించి అప్పుడప్పుడు వెడుతుంటాను. ఎప్పుడొచ్చేస్తానా అనిపిస్తుంది."    
    "అలాచెప్పరా ఏదో తమాషాఅనుకుంటూంది." రామారావుగారు అరుణవైపు చూస్తూ అన్నారు.    
    "హాయిగాఉన్న ఊళ్ళో ఉద్యోగంమానేసి ఎక్కడో పల్లెటూళ్ళు వెదుక్కుంటూ వెళ్ళేఖర్మ ఏమిటి? అందులోనీవు ముందునించిసిటీ లైఫ్ కి అలవాటుపడినదానివి. ఒక్కోరోజు ఉండలేవు."   
    "ఎందుకుఉండలేను? మొదటకొత్తగా ఉన్నా అదే అలవాటవుతుంది. ఏదో వ్యాపకం అంటూ ఉంటేతోచక పోవటం ఎందుకుంటుంది? నాకీ సిటీలైఫ్ మీద ఏం మోజులేదు. ఈ సినిమాలు, షికార్లు నాకంతగా అక్కరలేదన్నసంగతి మీకు తెలుసు."    
    "అసలింతకీనీకీ బుద్ది ఎందుకుపుట్టిందిట?"    
    "నిన్నఎవరో మంత్రిగారు ఉపన్యాసం ఇచ్చారట అది విని ఈమెకళ్ళు తెరుచుకున్నాయిట" వ్యంగ్యంగా అన్నారు రామారావుగారు. 
    "సరిపోయింది. ఇంత చేసి ఇదా? ఉపన్యాసాల కేం భాగ్యం" నేనూ ఇస్తాను. ఆ చెప్పిన మినిస్టర్ తను వెళ్ళి ఓ పల్లెలో ఉండగలడేమో నాలుగురోజులు లేకపోతే తన కొడుకునో, కూతుర్నో ఉంచుతాడేమో......ఓ, ఈ కబుర్ల కేం: దిక్కుమాలిన ఊళ్ళలో, ఏ సదుపాయాలూ లేని ఊళ్ళలో ఎలా ఉండగలరు ఎవరైనా?" 
    అరుణనవ్వుతూ అన్నగారివైపుచూసింది. "నాన్నా నీవునన్ను భయపెట్టి, నా ప్రయత్నం మానిపిద్డామనిచూస్తున్నారు. మీ మాటలకి భయపడే దానినికాను అసలింతకీ ఏదో నేనుకాని పని చేస్తున్నట్లు, తప్పుడు పని చేయబోతున్నట్లు, ఏదో కొంప మునిగేటట్లు ఎందుకు మాట్లాడుతున్నారు? నే చేస్తానన్నది అంత నేరమా? నా ఆశయాన్ని ప్రోత్సహించడంపోయి, మీరు నామీద ఎందుకుఇలా దాడిచేస్తున్నారు?    
    మీరన్నట్టు ఆ ఊర్లో ఉండలేకపోతేనేను మానుకుంటాను.    
    అక్కడనచ్చకపోతే అప్పుడే వచ్చేస్తాను. ముందునించి అనవసరంగా లేనిపోనివి ఊహించుకోవడం ఎందుకు? నన్నక్కడ ఎవరూ ఉండమని బలవంతంగా పట్టుకోరుగా?" తండ్రికొడుకులు మొహాలు చూసుకున్నారు. రామారావుగారు చిన్నగా నిట్టూర్చాడు. "ఏమోనమ్మా: నా మట్టుకునాకు నిన్ను అలా పంపడం, నీవా ఊళ్ళలో ఒంటరిగాఉండడం అదీ ఇష్టంలేదు......ముందే చెపుతున్నాను ఆ తరువాత నీ ఇష్టం. చదువుకున్నదానివి......ఇంతకంటే ఏం చెప్పను?"        
    అప్పుడే పావుగంట ననించి తండ్రి, కూతుళ్ళ మధ్య సంభాషణ అంతా విందికమలమ్మ. ఆమెకి సంగతేమిటో పూర్తిగా అర్ధంకాకపోయినా, అరుణ ఏదో పల్లెటూరిలో ప్రాక్టీసు పెట్టాలనుకోవడం అర్ధం అయింది.        
    "ఏమిటంటుంది అరుణ?" భర్తని అడిగింది.   
    "సరిపోయింది రెడ్దొచ్చి మొదలాడుమన్నట్టుంది" విసుక్కున్నాడు ఆయన. 
    కృష్ణమూర్తి తల్లికి సంగతంతా వివరించాడు. "అదేమిటే మతిగాని పోతూందా? ఆడపిల్లవి. ఎక్కడో వెళ్ళి ఉండడం ఏమిటి, వున్నఊళ్ళో ఉద్యోగం మానుకుని?"   
    "అబ్బబ్బ అందరూ ఒకటే పాట. ఆడపిల్ల ఆడపిల్ల ఏం ఆడపిల్ల నయితే నాకేం తక్కువయింది. మగవాడి కంటే? ఆడపిల్ల ఎందుకు వుండలేదో చూపిస్తాను." విసుక్కుంటూ అరుణ లేచి లోపలికి వెళ్ళిపోయింది.    
    "ఊ...... బాగుంది. నాకు ముందేతెలుసు. ఇంత చదివించాక అది మన చెప్పుచేతల్లో ఉండదని." రామారావుగారు గొణిగారు.    
    "తానుపట్టిన కుందేలికిమూడే కాళ్ళంటుంది, గాని మంచీ చెడ్డా ఆలోచించే వివేకందానిక? ఎక్కడ ఉంది ఆడపిల్ల ఒక్కర్తి ఎలా ఉంటుంది? కమలమ్మ అందుకుంది.    
    "ఏదో ఆశయాల, ఆదర్శాలమోజుతో ఉంది. వెళ్ళి ఓ నెల రోజులుఉంటే కష్టం సుఖం తెలిస్తే అదే మానుకుంటుంది. వెళ్ళనీయండి నాన్నా మనం వద్దన్నావినేలా లేదు." కృష్ణమూర్తి అన్నాడు.    
    "బాగుందిరా! దానికి లేకపోతే మనకుండద్దూ ఆలోచన? పెళ్ళికావలసిన పిల్ల!" సాలోచనగా అన్నారు రామారావుగారు.    
    "అవును పెళ్ళయ్యే వరకుదాని మంచి చెడ్డల భారం మనదే. ఆ పెళ్ళి ఏదో అయితే ఇంకదాని ఇష్టం, దాని మొగుడిఇష్టం."   
    "అవునునాన్నగారూ, అమ్మ అన్నది రైటు దాని హౌస్ సర్జెన్సీ మూడు నాలుగు నెలల్లో అయిపోతుంది. ఈ లోపలపెళ్ళి నిశ్చయించి ఆ పెళ్ళికాస్త జరిపిస్తే ఆ తరువాత ఇంక వాళ్ళిద్దరూ ఏ ఆదర్శాలు వల్లించినా మనకి బాధలేదు. "కొడుకూ అదే సలహాఇచ్చాడు.    
    తనకివచ్చిన ఆలోచనేభార్యా కొడుకూ వెల్లడించడంలో అలాగే చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చారాయన. అరుణ ఉద్దేశం తెలుసుకుని వేణుగోపాల్ తో అన్నీ మాట్లాడి నిశ్చయించాలి ఈ లోపల. రామారావుగారు తల పంకించారు.  
    "ఊ.....దాని అభిప్రాయం కనుక్కుంటాను. వేణుతోమాట్లాడతాను. దేవుడి దయవల్ల అనుకున్నవి అనుకున్నట్టుజరిగితే నా బాధ్యత తీరుతుంది. ఈ ఒక్క బాధ్యతా తీరిపోతే ఇంకా నాకునిశ్చింత?" రామారావుగారుకిదాదాపు అరవై ఎనిమిదేళ్ళుంటాయి.    
    గంభీరమైన విగ్రహం దట్టమైనకనుబొమ్మలు, పొడుగు ముక్కు వయసులో ఆకర్షణీయంగానే ఉండిఉంటారనిపిస్తుంది. ఆయన్ని చూడగానే ఒత్తయిననల్లని నొక్కులజుత్తు స్థానే ఇప్పుడు పలచనగానాలుగు తెల్లవెంట్రుకలు మిగిలాయి, కనుబొమలు దుబ్బుగా ఉంటాయి. అవీ ఈ మధ్య నే తెల్లబడ్డం ఆరంభించాయి, గోధుమరంగు, గంభీరమైన కళ్ళు, ఆయన్ని చూస్తే ఎవరికైనా గౌరవంతో పాటు కాస్త జంకుకూడకలుగుతుంది. కాని గంభీరతవిగ్రహం, ఆకారంలో మాత్రమేననీ ఆయన మనసు హృదయం నవనీతం లాంటివని ఎవరైనా గ్రహిస్తారు. కొద్దిపాటి పరిచయం కలిగితే.  
    ఆయన కాలంలో ప్లీడరు చేసి రెండు చేతులా ఆర్జించారు ఆయన చేపట్టినకేసు ఎలాంటిదైనా ఆయన చేతిలో ఓడిపోలేదు ఎప్పుడూ ఆయనా వాగ్ధాటి అలాంటిది. జడ్జీలుసైతం అలా నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయేవారు, ఆయన వాదిస్తున్నంతసేపూ, పేరుకి పేరు, డబ్బుకు డబ్బు రెండూ పుష్కలంగా ఆర్జించిఇల్లూ, పొలాలు అన్నీ ఏర్పాటు చేసుకున్నారు.    
    అరవైఏళ్ళురాగానే చేతికందిన పెద్దకొడుకు చేతిలో తనప్రాక్టీసు, తనబాధ్యతలు...... అన్నీ పెట్టేశారు. నిశ్చింతగా మిగతా కాలం కొంత దైవచింతతోనే గడిపేయాలని నిశ్చయించుకున్నారు ఆయన. అక్షరాలా అలాగే జరుగుతూంది ఈనాటివరకు.    
    కమలమ్మ భర్త దగ్గిర చాలాపొట్టిగా,  పీలగా కనిపిస్తుంది. పచ్చగా పొట్టిగా, పీలగా ఉండి ఏభై అయిదేళ్ళ వయసున్నట్టు మనుమల నెత్తినట్లేకనిపించదు: మనిషిలాగేమనసు కూడ అతి కోమలమైంది. తన కక్కరలేనివిషయాలలో కలగజేసుకునేఅలవాటు ఆమె కెన్నడూలేదు. ఇల్లు, పిల్లలు, పని చూసుకోవడంతోనే ఆమె రోజులు గడిచిపోయాయి. కొడుకుల పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్దకూతురు పెళ్ళి అయింది. కోడళ్ళువచ్చారు. కూతుళ్ళకి, కొడుకులకీ తేడా చూపడం, ఆమె ఎరగదు. ఇప్పుడు ఇంటి పెత్తనంఅంతా పెద్దకోడలిమీద వదిలేసింది.

    ఆమె ఇంట్లో పెద్దదిక్కుగా.....మధ్యాహ్నంపూటమడికట్టుకుని ఇంతవండి భర్తకు పెట్టి, తను తినడంవరకే ఆమె పని. మిగతాదంతా కోడలిమీదే వదిలేసింది. ఏ భగవద్గీతో, మరి ఏ పుస్తకమో పట్టుకుని ఎన్ని గంటలైనా గడిపేస్తుంది ఆమె. ఇంకా ఏమన్నా పని ఉందంటే అది మనవళ్ళని దగ్గిర కూర్చోపెట్టుకుని ఆడించడం...... కోడలు పని చేసుకుంటుంటే. అదే ఆమెకి కాలక్షేపం. ఆమెతన అదృష్టానికి తనేగర్విస్తూంటుంది. దేవుడులాంటి ఓ భర్త ముత్యాలలాంటిబిడ్డలు,  సిరిసంపదలు.......తనకేం లోటు అని మురిసిపోతూంటూంది. పిల్లలు నలుగురూ పెద్ద వాళ్ళయ్యారు. పైకి వచ్చారు. వాళ్ళబ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఎటొచ్చీ ఆఖరి కూతురికికూడ తాము ఉండగానే మూడుముళ్ళు పడితే తనింక కోరుకునేదేంలేదని అనుకుంటుంది.   
    పెద్దకొడుకు కృష్ణమూర్తి పితృవాక్యపరిపాలకుడు, చిన్నప్పుడూ, పెద్దప్పుడూ ఈనాటివరకు తండ్రిమాట ఏ విషయంలోనూ జవదాటలేదు. తండ్రి కోరిక ప్రకారం లాచదివి తండ్రిప్రాక్టీసు అందుకుని తండ్రి ఏ చిన్న కేసు విషయమైనా తండ్రితో చెప్పకుండా, తండ్రి సలహాఅడగకుండా ఏదీ చెయ్యడు. ఇంటి పెద్దకొడుకుగా తన బాధ్యతలు అక్షరాలా నిర్వహిస్తాడు. సుపుత్రుడని పొంగిపోయేవారు రామారావుగారు. కృష్ణమూర్తి అని కాక 'రాముడు' అని పేరు పెడితేసరిగా అతికి ఉండేదనుకుంటారు ఆయన.    
    కృష్ణమూర్తి తరువాత ఒక కూతురు రుక్మిణి. రుక్మిణి అచ్చు తల్లిలాఉంటుంది. రూపంలో తల్లినిపోలినా, ఆమె శాంతం ఆమెఅణుకువ రుక్మిణికి లేవు. కాస్త కోపం ఎక్కువే. ఏదీ సర్దుకునే స్వభావంకాదు ఆమెది. మొహంమీద అనేస్తుంది ఎవరినైనా సరే. రుక్మిణి స్కూలు ఫైనల్వరకు చదివింది. తరువాత ఓ డాక్టరుతో వివాహం చేశారు. రుక్మిణి భర్తప్రసాదరావు భార్యకి పూర్తిగా వ్యతిరేకం. అతిసాధుస్వభావం, రోగులు, రోగాలు...... అదే అతని ప్రపంచం, డబ్బు తెచ్చి భార్య చేతిలోపోయడం వరకే అతని బాధ్యత. ఇంటివిషయాలు, ఏవీ పట్టించుకోడు. రుక్మిణి ఏం చేసినా అతను పట్టించుకోడు. భార్య తిడుతున్నా ఊ ఆ అనికూడా అనడు, అసలు భార్యకోపమే గుర్తించడు. అని అని విసుగెత్తి రుక్మిణిఊరుకోవాలి. అలాంటి జడపదార్ధం భర్తగా లభించినందుకు విచారించాలో, సంతోషించాలోకూడా అర్ధంకాదు రుక్మిణికి. ప్రసాదరావు నామమాత్రుడు అరుణ ఇంట్లో ఇంటివిషయాలు ప్రాపంచిక విషయాలు పట్టించుకోడుగాని, అతని వృత్తిలో మాత్రం ఘటికుడు. చదువుకునే రోజులలో కూడా చాలా తెలివైనవాడనిపేరు ప్రాక్టీసు పెట్టాక రెండేళ్ళలోపలే మంచిపేరు సంపాదించి, పెద్దపెద్ద డాక్టర్లని మించినవాడని ఖ్యాతికొన్నాడు.

 Previous Page Next Page