Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 3


    
    "ఎందుకు నవ్వుతున్నావు?"
    అభినయ్ వణుకుతున్న చేతులతో సిగరెట్ వెలిగించాడు.
    "నవ్వొచ్చిందీ - నవ్వాను తప్పు కాదే!"
    "అజే ఎందుకు నవ్వావు?" బాపినీడు గొంతు కరకుగా పలికింది.
    "మీరు చూపిస్తున్న ఆదరణకి నవ్వాలే తప్ప ఏడవకూడదు మిస్టర్ బాపినీడూ!"
    "మానవత్వం ఘనీభవించిన ఓ మహా మనిషీ! ప్రజా ప్రతినిధి అయిన మీ ప్రాణం విలువ. నీ ప్రాణంతో ప్రాణమైన నీ కూతురి మాన, ప్రాణం విలువ వెరసి వందరూపాయలేనా అని నాకు జాలితో నవ్వొచ్చింది" అన్నాడు.
    అతని మాటలకి బాపినీడులోని అహం దెబ్బతింది. కోపంతో పిడికిలి బిగుసుకుంది. ఆ పిడికిలిలో వందరూపాయల కాగితం గరగరమని శబ్దంచేస్తూ ప్రపంచంలో కృంగి కృశించిపోతున్న మానవత్వంలా నలిగిపోయి ముడుచుకుపోయింది.
    అభినయ్ మొహంలోకి చూసిన జయశ్రీ తండ్రి చేతిపైన చేయి వేసింది.
    "మీరు పదండి డాడీ!" అంది.
    వాళ్ళిద్దరి మధ్య మాటకిమాట పెరిగిపోతుందని ఆమె గ్రహించింది.
    తండ్రి కెదురు చెప్పలేకపోయినా, అభినయ్ ఎలాంటి ఉపకారం తనకి చేశాడో ఆమెకి తెలుసు. ఆమెలోని అణువణువూ కృతజ్ఞతా భావంతో నిండిపోయింది.
    అప్పటికే అభినయ్ కిందపడిన సైకిల్ ని లేవనెత్తి దానిమీద ఎగిరి కూర్చుని, తూనీగలా చీకటిలో కలిసిపోయాడు.
    "రాస్కెల్!" అని పెదాలు కొరుక్కున్నాడు బాపినీడు.
    కళ్ళకేమీ కనపడని ఆ నిశీధిలో అతను వెళ్ళిన దిక్కు కేసి కొన్ని క్షణాలు అలాగే చూసి ఏదో తియ్యని బాధకి గురవుతూ జయశ్రీ కారు దగ్గరికి నడిచింది.

                                         2

    జువాలజీ లెక్చరర్ రమాదేవి అనర్గళంగా లెక్చర్ ఇస్తోంది.
    జువాలజీ సబ్జెక్ట్ లో ఆమే ఎక్స్ పర్ట్. ఆమె క్లాసు సాధారణంగా ఎవరూ ఎగ్గొట్టరు.
    రమాదేవి స్టూడెంట్స్ తో కలుపుగోలుగా వుంటుంది.
    థియరీ క్లాసులో అయినా, ప్రాక్టికల్స్ లోనయినా సరే తను నవ్వుతూ విద్యార్ధులని నవ్విస్తూ తన సబ్జెక్టు వాళ్ళకి వంటబట్టేలా చేయడం ఆమె పద్దతి.
    "మే ఐ కమిన్ మేడమ్!" అన్న పిలుపుకి చెపుతున్న పాఠాన్ని ఆపి గుమ్మంకేసి చూసిందామె.
    గుమ్మం దగ్గర అభినయ్ నిలబడి వున్నాడు.
    ఆమె చేతి వాచీలోకి చూసుకొని "యు ఆర్ లేట్ బై హాఫ్ ఎన్ అవర్" అంది.
    "అయితే నేను వెళ్ళిపోతున్నాను" అని చటుక్కున వెనక్కి తిరిగాడు అభినయ్. అతనలా చేస్తాడని ఆమె అనుకోలేదేమో! వెంటనే "ఏయ్ ఆగు" అంది రమాదేవి.
    అభినయ్ ఆగాడు.
    "నువ్వు అరగంట లేటుగా వచ్చావని అన్నానుగానీ వెళ్ళిపొమ్మని అనలేదే?" అంది.
    అభినయ్ చిరునవ్వుతో లోపలకొస్తుంటే అతని చేతికి కట్టివున్న కట్టు చూసి -
    "అరే. ఏమయ్యింది? ఏమిటా బ్యాండేజీ. ఏక్సిడెంటా? లేక ఎక్కడన్నా యుద్దం చేసి వచ్చావా?" అతను నవ్వాడు.
    "ఏక్సిడెంటల్ గా యుద్దం చేయించాల్సి వచ్చింది."
    "ఒక్కరోజు కుదురుగా వుండి ఏడవడం తెలీదు ఛీ" అంది చిరుకోపంతో.
    అభినయ ఆమెకేసి చూశాడు. తనకి దెబ్బ తగలడం ఇష్టం లేనట్టుగా ఆమె మొహంలో భావం స్పష్టంగా కదలాడుతోంది.
    అదే సమయంలో ఆమె మెడలోంచి వేలాడుతోన్న బంగారు గొలుసుకి కట్టివున్న డాలర్ ఆమె గుండెల బిగువుల మధ్యగా వేలాడుతూ కనబడింది.
    అభినయ్ ఆమెకి దగ్గరగా నడిచాడు. ఆమె కంగారుగా చూసింది. "ఏం కావాలి?" అంది.
    అతని మొహంలో చిరునవ్వు అలాగే మెరుస్తోంది.
    ఆమె మెడ గొలుసులోని డాలర్ ని చేత్తో పట్టుకున్నాడతను.
    అతని చేతివేళ్ళు ఆమె బరువయిన మెత్తని గుండెలకి నొక్కుకుంటున్నాయి.
    "ఇది ఎంత బాగుందో తెలుసా?" అన్నాడు.
    "ఛీ ఏమిటీ పని? అందరూ చూస్తున్నారు" అంది మెల్లగా.
    "అయితే ఎవరూ చూడకపోతే పరవాలేదా?" ఆమెకి మాత్రమే వినబడేలా అడిగాడు అభినయ్.
    "ఆ" అని "వెళ్లి కూర్చో. ఇలాంటిది కావాలంటే నీ పెళ్లికి నీ పెళ్ళానికి బహుమతిగా ఇస్తాన్లే?" అంది రమాదేవి నవ్వుతూ.
    క్లాసులో అందరూ ఆ మాటలకి గొల్లున నవ్వారు.
    అభినయ్ వెళ్లి తన సీటులో కూర్చున్నాడు.
    రమాదేవి తన ఉపన్యాసాన్ని కొనసాగించింది.
    అతను కొంటె చూపులు చూస్తూ, చిలిపిగా నవ్వుతుంటే కొన్ని క్షణాల క్రితం డాలర్ పట్టుకొన్నట్టు నటిస్తూ అతను చేతి వేళ్ళతో గుండె అంచులని నొక్కిన అనుభూతివల్ల ఆమె వక్ష సంపదలో స్పందన ప్రారంభము అయ్యింది. ఆమె ఊపిరి బరువుగా తీసి వదులుతూ చాలా ఇబ్బందిగా లెసన్ చెబుతోంది.
    కానీ మనసులో మాత్రం అన్నీ అతని గురించిన ఆలోచనలే.
    చిలిపివాడు.
    తననింతగా రెచ్చగొట్టగల చిలిపితనం అతనిలో వుందా?
     తనకేదో అయిపోతోంది.
    ఎందుకని?
    తనింత బలహీనురాలా?
    నో! కాదు. కానీ......మనసులో అలజడి మాట.
    శరీరంలో వేడి సెగలు మొదలవుతున్నాయి. ఇది అభినయ్ ప్రభావమేనా?
    చలి! అబ్బ! ఇంతలోనే చలి ఎక్కడినుంచి వచ్చింది?
    తన గుండె తలుపుల్ని తట్టి తలపులని రేపి.. ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోతున్నాయి.
    అది అభినయ్ గమనిస్తే పరవాలేదు. కానీ మిగిలిన విద్యార్ధులు పసిగడితే?
    ఖర్మ......
    తలెత్తి వాళ్ళకేసి చూడగలదా తను?
    ఒళ్ళు విరుచుకోవాలనుంది.
    కానీ అది క్లాస్ రూం.
    వెంటనే ఇంటికెళ్ళి పోవాలనుంది.
    లాభంలేదు. ఒక్కక్షణం నిలబడలేదు. క్లాసు విడిచిపెట్టేయాలి అనుకుంటున్న తరుణంలోనే గంట మోగింది.
    కర్చీఫ్ తో మొహాన్ని అద్దుకుని ఊపిరి విడిచి క్లాసులోంచి బయటికి వచ్చింది లెక్చరర్ రమాదేవి.
    ఏదో పెద్ద రిలీఫ్ కలిగినట్లుగా వుంది.
    ఆమె వడివడిగా అడుగులు వేస్తోంది. వెనక ఎవరో వస్తున్నారు?
    ఎవరు?
    మెడ తిప్పి వెనక్కి చూసింది.
    అభినయ్.
    ఏమిటీరోజు ఇంత సాహసం చేస్తున్నాడు. అతన్ని కట్ చెయ్యాలి. లేకపోతే....... లేకపోతే చాలా దూరం వచ్చేసేలా వున్నాడనుకుంది.
    ఆమె ఆగింది.

 Previous Page Next Page