భారతి ఆమెని చూడగానే కంగారుపడింది. తను వచ్చింది కరెక్ట్ నెంబరు కాదా అని ఓసారి తలుపు పైన వున్న నెంబరువంక పరీక్షగా చూసింది.
506.
నెంబరు కరెక్టే. మరి ఆ ఇంట్లో ఆమె ఎవరు? తనకి తెలిసినంత వరకూ ప్రశాంత్ ఒక్కడే అపార్టుమెంట్ లో వుంటాడు.
బాబ్డ్ చేసిన జుత్తు మొహం మీదకి పడుతోంది.
ఆమె భుజం మీద పవిట నిలవడంలేదు. లోనెక్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొంది. బ్రా వేసుకొని ఆ బ్లౌజుకింద నుంచి సహం పైగా బయట పడిన గుండ్రని వక్షోజాలు.... మధ్య సన్నని చీలిక.
ఆమె కళ్ళు మత్తుగా మారిపోతున్నాయి. కళ్ళెత్తి భారతిని చూడడానికి ఆమె ప్రయత్నించినప్పడు చూసింది ఆ కళ్లలోని ఎర్రజీరలని భారతి.
"ఎస్ ప్లీజ్! ఎవరు కావాలి?" ఆమె పెదిమలని అష్ట వంకరలు తిప్పుతూ అడిగింది.
ఆమె నోటినించి విస్తీవాసన గుప్పున కొట్టింది.
బొడ్డు కిందగా కట్టుకొన్నచీర, కుచ్చెళ్లు పెట్టుకొన్న తీరు అంతా అస్తవ్యస్తంగా వున్నాయి.
తను తలుపుకొడితే ఆమె హడావుడిగా చీర కట్టుకొని వచ్చి తలుపు తీసినట్టుగా భారతికి అర్దమైంది.
ఆమె నవ్వడానికి ప్రయత్నిస్తూ.
"ఎవరు కావాలో చెప్పలేదు" అంది.
భారతి తేరుకుంది.
"ప్రశాంత్" అంది.
ఆ యువతి మైకంలో నవ్వింది.
"ప్రశాంత్ ...నిద్రపోతున్నాడు" తలని అదోలా ఊపుతూ మొహం మీదకి పడుతోన్న బాబ్ చేసిన జుత్తుని చేత్తో వెనక్కి తోసుకుంటూ అన్నదామె.
అసలే అలజడి చెందిన మనసుతో అక్కడికి వచ్చింది భారతి. ఆమెని చూస్తే చిరాకు కలుగుతోంది. కానీతప్పదు.
ఆమె ఎవరో?
ప్రసాంత్ కి ఏమవుతుందో భారతికి తెలీదు. అందుకే అంది బారతి.
"లేచే వరకూ వెయిట్ చేస్తాను."
"ష్యూర్" అని అడ్డం తల తిప్పుకుందా యువతి.
ఓ అపరిచితురాలి అనుమతితో తను ప్రశాంత్ కోసం ఎదురు చూడవలసి వచ్చినందుకు మనసుని ముల్లుతో పొడిచినట్టనిపించింది భారతికి.
లోపల కొచ్చి సోఫాలో కూర్చుంది భారతి.
తల పగిలి పోతోంది!
నీరసంగా వుంది. సోఫాలో వెనక్కి వాలి కళ్లు మూసుకొంది భారతి.
ఆమె ఊపిరి బలంగా తీస్తుండడటం చేత వక్షోజాలు కిందికి పైకి
కదులుతున్నాయి. ఆమె తలుపువేసి బోల్టుపెట్టి... లోపలకి వెళ్లి విస్కీ సీసా, గ్లాసు జగ్ లో నీళ్లు తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది.