Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 2

   
    
    నడుముకి వున్న బెల్ట్ ని లాగాడు.
     ఛెళ్ ఛెళ్ మని తగులుతున్న బెల్టు దెబ్బలని వాళ్ళు లెక్క చేయడం లేదు.
    బెల్టుతో వాళ్ళని ప్రతిఘటించడం కష్టమని అభినయ్ కి అర్ధం అయిపోయింది. దాన్ని పక్కకి విసిరి సింహంలా గర్జిస్తూ గాలిలోకి ఎగిరాడు.
    ఒక పాదం ఒకడి మొహానికి, రెండో పాదం మరొకడి గుండెల మీద, చేతి ముష్టిఘాతాలు మరో ఇద్దరినీ నేల కరిపించాయి.
    మిగిలినవాడు అభినయ్ ని వెనకనించి ఎత్తిపట్టుకుని గిరగిర తిప్పి విసిరికొట్టాడు అంత చీకటిలోనూ, ఆ దుండగులని లెక్కచెయ్యకుండా ఎదిరించిన అభినయ్ మొండిధైర్యంతో చేతికి దొరికిన చెట్టుకొమ్మని లాఘవంగా పట్టుకున్నాడు. దాన్ని అలాగే పట్టుకొని ఊగుతూ ఊగి వాడి మీదికి విరుచుకొని పడ్డాడు.
    మహా పర్వతంలా మీదికి విరుచుకుని పడి వడి వడి గుద్దులతో ఊపిరి సలపకుండా ఆతడు కొడుతుంటే కేకలు పెట్టసాగాడు దుండగులు.
    వాళ్ళు అయిదుగురు.
    అతనొక్కడు.
    అయినా భయమన్నది ఏ కోశానా అతనికి లేదు.
    అతని దగ్గర ఆయుధం అన్నది లేదు. వాళ్ళు ఏదన్నా ఆయుధం ఉపయోగిస్తే తన పరిస్థితి ఏమిటి? అన్న ధ్యాస కూడా అతనికి లేదు.
    ఆవేశం, ఉద్రేకం, కోపం, అతనిలో అణువణువునా వ్యాపించగా వేటగాళ్ళ మీదికి దూకిన కొదమసింహంలా ఉరికాడతను.
    అతడి వేగాన్ని, చేతి లాఘవాన్ని ఊహించలేకపోతున్నారు. దెబ్బ తినకుండా పాదరసంలా జారిపోతూ దెబ్బతీస్తున్నాడు.
    దీనాతిదీనమైన పరిస్థితిలో లేచి నిలబడిన ఆ యువతి చేతులతో గుండెలని కప్పుకొని తెప్పరిల్లి చూస్తోంది. ఆమె తండ్రి నిస్సహాయంగా నిలబడి చూస్తున్నాడు.
    ఆగంతకుడి చేతిలో పిడిబాకు తళుక్కున మెరిసింది అభినయ్ దాన్ని గమనించేలోగానే అది అతని జబ్బని చేరేసింది "అబ్బ" అన్నాడు చేత్తో క్షణం తడుముకొని.
    వెచ్చగా జిడ్డుగా రక్తం తగిలింది. దాంతో రెచ్చిపోయాడు. పిడికిలి బిగించి వాడి ముక్కు దూలం విరిగిపోయేలా కొట్టాడు.
    అదే సమయంలో అప్పటివరకూ శ్రోతలా చూస్తూ వున్న అమ్మాయిలో చలనం వచ్చింది గభాల్న కారు దగ్గరికి పరుగుతీసి కారు లోంచి కారు హాండిల్ ని బయటికి తీసింది. పోరాటం జరుగుతోన్న వాళ్ళకి దగ్గరికి వచ్చి అభినయ్ కి హాండిల్ అందేలా విసిరింది.
    హాండిల్ ఒకడి వీపుపైన తగిలింది.
    "చచ్చాన్రో!" అన్న కేక.
    మరొకడి కాళ్లు విరిగాయి.....
    ఇంకొకడి భుజాలు విరిగినయ్.
    గావుకేకలు.....
    ఆగంతకులు చెల్లాచెదురయినట్లు పారిపోయారు.
    అభినయ్ కిందపడివున్న చీరని పట్టుకొని వణుకుతోన్న చేతితో కారు దగ్గరికి వచ్చాడు అప్పటికే చాలా రక్తం పోయి చేయి నొప్పిగా వుంది.
    ఒంటి మీద లంగా తప్ప మరే అఛ్ఛాదనాలేని పరిస్థితిలో ఆ పిల్ల తెగించి హాండిల్ ని అందించి సహాయపడింది. ఆ చీరని ఆమె ఒంటిపైన కప్పుతూ ఆమెను పరీక్షగా చూశాడతను. అతను ఊహించలేదు. కొన్ని క్షణాలు పట్టింది తేరుకోవడానికతనికి. ఆమె..... ఆమె.........
    ఆమె తన కాలేజీమేట్ జయశ్రీ.
    "నువ్వా?" ఆశ్చర్యంగా అడిగాడు అభినయ్.
    "న్......న్...నే....నే.!" అంది గొణుగుతూ.
    అభినయ్ పెదవుల మీద గర్వంతో కూడిన చిరునవ్వు కదిలింది.
    జయశ్రీ......
    ఎన్నాళ్ళకి చిక్కింది తనకి?
    ఆమె ఎంత పొగరుబోతో అభినయ్ కి తెలుసు.
    ఆమె తండ్రి బాపినీడు యం.ఎల్.ఏ
    దాంతో ఆమె గర్వానికి అంతులేదనే చెప్పాలి.
    కాలేజీలో ప్రతి విషయంలోనూ తనని ఎద్దేవా చేయటం, అవమానించడానికి ఎన్నోసార్లు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది.
    కానీ అభినయ్ ఎప్పుడూ ఆమెని పట్టించుకోలేదు. సమయం దొరికినప్పుడు బుద్ది చెప్పాలనుకున్నాడే తప్ప, ఇలా ఆమే తన సాయంతో మాన ప్రాణాలని కాపాడుకొనే స్థితిలో తారస పడుతుందని అనుకోలేదు అతను.
    ఆమె తల దించుకొని నించుంది.
    ఇప్పుడు తలెత్తి తన మొహంలోకి చూసే ధైర్యం ఆమెకి లేదని అతనికి తెలుసు.
    అలాంటి సమయంలో ఆమెని అవమానించడం ధర్మంకాదు అనుకున్నాడు.
    జబ్బనుంచి రక్తం కారుతోంది. ఆయిన గాయానికి జేబులోంచి కర్చీఫ్ తీసి చుట్టుకున్నాడు.
    చెయ్యి చాలా పోటుగా వుంది. సన్నగా వణుకు కూడా వస్తోంది -
    "ఇదిగో మిస్టర్!"
    జయశ్రీ తండ్రి బాపినీడు పిలిచాడు.
    ఆయన చేతిలో వంద రూపాయల కాగితం రెప రెపలాడుతోంది.
    "ఏమిటది?" అర్ధం కానట్లుగా అడిగాడు అభినయ్.
    "నువ్వు చేసిన సహాయానికి ప్రతిఫలం" అన్నాడు బాపినీడు నిర్లక్ష్యంగా.
    ఒక్కక్షణం ఆలచోనలలోకి జారాడు అభినయ్.
    తనా సమయంలో అక్కడికి వచ్చి వుండకపోతే ఏం జరిగేది?
    జయశ్రీ దారుణంగా మానభంగం చేయబడేది.
    ఆ తర్వాత ఆ దుండగులు వాళ్ళిద్దర్నీ చంపి రెడ్డుమీద పడేసి వెళ్ళిపోయేవాళ్ళు.
    అలాంటి దారుణస్థితి నుంచి కాపాడినందుకు బాపినీడు తనపట్ల కనబరుస్తున్న ఉదారత ఎంత గొప్పది?
    అభినయ్ పకపకమని నవ్వాడు.

 Previous Page Next Page