Previous Page Next Page 
అనూహ్య పేజి 3

    నా పెళ్ళి నిశ్చయం అయిపోయింది.
    అమ్మమ్మ హడవుడికి అంతులేకకుండా  అనసూయమ్మ మనవరాలి పెళ్ళి' అని దండో రాళా మర్ర్మోగెటట్లు చేసింది. పెళ్ళికొడుకు డాక్టర్ అని మా ఊళ్ళో బొడ్డు ఊడని బుడ్డాడికి కూడా తెలిసికుంటూ. ఆర్భాటంగా నాకు నగలూ నట్రా చేయిస్తోంది.
    మల్లెపందిరి క్రింద కూర్చుని వినేక్  ఏంచేస్తూ వుంటాడా అని ఆలోచించసాగాను పెళ్ళి కుదిరిన క్షణంనుండి ఆడపిల్ల బిజీగా  చేసే పని  అదేగా!
    "నీది చాలాసుఖమా ....రాముని సన్నిధి సుఖమా  అమ్మ గొంతు మధురంగా వినిపిస్తోంది. ఆమె చేతివేళ్ళు వీణమీద అలవోకగా కదులుతూ గమకాలు స్పష్టిస్తున్నాయి. మనసు  ఆనందంగా వుంటే  ప్రతిది ఆహ్లాదంగా వుంటుంది.
    లేచి లోపలికి వెళ్ళి అమ్మ భుజంమీద తల ఆన్చి కూర్చున్నాను.
    "సరసూ! పాపకి మువ్వల వడ్డాణం కూడా చేయించేద్దమా పనిలో పని" అంటూ అమ్మమ్మ వచ్చింది.
    అమ్మ ఎప్పటిలా చిరునవ్వు నవ్వి "నాకేం తెలుసమ్మా?" అంది.
    "నీకు దాన్ని కనడంతప్ప ఏం చాతనయిందనీ నీ సలహా అడగడం?" అమ్మమ్మ విసుక్కుంటూ వెళ్ళిపోయింది.
    అమ్మవైపు చూస్తూ "ఏమీ పట్టించుకోవు ఎందుకమ్మా?" అన్నాను.
    అమ్మ  నా నుదటిమీద ముద్దుపెట్టుకుని, కళ్ళనిండా నీళ్ళతో "నాన్నవుంటే పట్టించుకునేవారేమో! అంది.
    అమ్మ నన్నాని తలుచుకోవడం చాలా అరుదైన విషయం! అమ్మమ్మ వుండగా ఎన్నడూ  జరగదు!
    "పాపా.... గాజులకి అది ఇద్దువుగాని రా!" అని అమ్మమ్మ పిలిచింది.
    "ఆ ....వస్తున్నా" అని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను.
    ఆరిస అప్పడాలన్నీ చేటలోకి ఎత్తుతోంది అమ్మమ్మ ఆవిడ్ని చూస్తే నాకు జాలేసింది. వయసు కూడా చూసుకోకుండా ఎంతో హైరానా పడుతోంది రాత్రింబగళ్ళు పెళ్ళిపనులంటూ రెక్కలు ముక్కలు చేసుకుంటోంది అసలే ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చింది. కూడానూ! జాగ్రత్తగా వుండాలి. పనివాళ్ళమీద పని వదిలేయడం అన్నమాటే పడనీయదు. చాదస్తంలా కనిపించే  అతిప్రేమ!
    మంచి పాఠకుల చేతిలో  పడిన పుస్తకం 'మంచి పుస్తకం' అనిపించుకున్నా అది అందరికీ విపులంగా అర్ధంకావాలంటే విమర్శకుల చేతిలో పడాల్సిందేనట! అలాగే  మనుషులు కూడా.
    వివేక్ వివరాన్ని పూసగుచ్చినట్లు ఉత్తరంలో వ్రాసి పెళ్ళిశుభలేఖతో బాటు విజయకి పోస్ట్ చేశాను.
    విజయనుండి వెంటనే జవాబు రాలేదు. ఆలస్యంగా వచ్చింది.
    'డియర్ హనీ! నీ హీరోని కలిశాను. ఇద్దరం నిన్న క్రేజీ కార్నర్ లో కలిసి సంగీత్ లో 'కోమా' లో  పడ్డాం గుడ్  సెలక్షన్ కానీ అతనితో నువ్వు గెటాన్ అవడం కష్టం అనుకుంటా.... ఆలోచించుకో! నీ పాతచింత కాయపచ్చడి భావాలూ, సనాతన సాంప్రదాయలూ అతనికి పడవేమో!
    అతను ఇప్పుడు 'నేను  కాదంటే ఏమై పోతాడు పాపం' అని ఆలోచించకు నేను  వున్ననుగా చూసుకోవడానికి! స్నేహితురాలిగా ఆ మాత్రం సర్దుకో లేమా? ఏవంటావ్?' అని వ్రాసింది.
    ఆ ఉత్తరం పూర్తయ్యేసరికే నాకు గుండెల్లోంచి చిన్నమంటలాంటిది బయల్దేరి ఒళ్ళంతా వ్యాపించింది.
    విజయకి బుద్దిలేకపోతే పోనీ అతనికి వుండద్దూ? కాబోయే భార్యస్నేహితురాలితో ఆ షికార్లేమిటి? ఉక్రోషం కళ్ళ నుండి జాలువారుతుండగా అతనికో పెద్ద ఉత్తరం వ్రాసిపడేశాను.
    రెండురోజులు మథనపడ్తూ నరకం అనుభవించాకా రెండు ఉత్తరాలూ ఒకే సారి  వచ్చాయి. ఒకటి విజయ దగ్గర్నుండి, రెండోది వివేక్ దగ్గర్నుండి.   
   'నువ్వు  స్వంతంచేసుకోవాలి అనుకుంటున్న మగవాడి గురించి నీ స్నేహితురాలు ఎంతటి ఆప్తురాలైనా సరే  చర్చించకు! పోతే.... అసలు  విషయం  నేను వివేక్ ని కలవనే లేదు. పెళ్ళిపీటల మీద చూస్తానులే" నీ విజ్జి'
    విజయ వేసిన ప్రాక్టికల్ జోక్ కీ  నాకు ఒళ్ళుమండినా, దాని సారాంశం ఎంతో  హాయిని ఇచ్చింది. వివేక్ కీ తొందరపడి నేను వ్రాసిన ఉత్తరం గుర్తొచ్చి  భయం భయంగా అతని ఉత్తరం విప్పాను.
    'అనూహ్యా  ఈర్ష్యతో మెదడుపని చెయ్యడం మానేస్తే. ప్రేమతో మనసు నిండిపోయిందని అర్ధం  పెళ్ళికి ఇంకా  వారం రోజులు టైమ్ వుంది. ఒకసారి నువ్వు హైద్రబాద్ రాకూడదూ ఫస్ట్ వైట్  డిన పాయింట్ మెంట్స్ లేకుండా రిహార్సల్స్ వేద్దాం' అనివుంది.
    నా బుగ్గల్లోకి వెచ్చని ఆవిర్లు ఎగజిమ్మాయి 'ఏమిటి మనిషి సిగ్గు లేకుండా?' అనుకున్నాను.
    విజయా, వివేక్ ఇద్దరూ నన్ను పరి పూర్ణంగా అర్ధంచేసుకోగలరు. ఇంక నా జీవితంలో సమస్యలే రావనిపించింది.
    ఏ ఘడియలో విజయ అతనితో 'గెటాన్' అవడం కష్టం  అందోకానీ, ఆ విషయం నా పెళ్ళిరోజునుండె నిజం కావడం  ప్రారంభం అయింది!  
     

 Previous Page Next Page