నాసల్ ఎలర్జీ కి చిట్కాలు

  నాసల్ ఎలర్జీ కి చిట్కాలు నాసల్ బ్లాకేజ్ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు మీకోసం. 1. ఒక కప్పు వేడి వేడి టీని తాగాలి. కొన్ని సందర్భల్లో ఇటువంటి వేడి, వేడి పానీయాలో ముక్కు కారడాన్ని మరియు అసౌకర్యాన్ని నయం చేడంలో బాగా సహాయపడుతాయి.వేడి వేడి గ్రీన్ టీ మరియు పెప్పర్ మింట్ టీ మరియు అల్లం టీ వంటివి నాసికా మరియు సైనస్ నొప్పిని నుండి ఉపశమనం కలిగించడంలో గొప్పగా సహాయపడుతాయి. 2. ఆవిరి పట్టడం అనేది పురాతన కాలం నుండి వస్తున్న గొప్ప ఔషధం లాంటిది. ఇది ముక్కు మూసుకుపోవడాన్ని మరియు సైనస్ రద్దీ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది. ఒక పెద్ద పాత్ర లేదా గిన్నెలో వేడి నీటిని తీసుకొని అందులో, మూడు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి, ఆ వచ్చే ఆవిరిని పూర్తిగా ముక్కు, నోటితో పీల్చాలి. ఇలా చేయడం వల్ల మూసుకుపోయిన ముక్కుకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. 3. ఎప్పుడైతే ముక్కు మూసుకుపోయినట్టు మరియు సైనస్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వేడి నీళ్ళతో స్నానం చేయడం మంచిది. వేడి నీటి స్నానం వల్ల మూసుకుపోయిన ముక్కును శ్వాసపీల్చడానికి సులభతరం చేస్తుంది. 4. నాసల్ బ్లాకేజ్ నుండి తక్షణ ఉపశననం పొందడానికి ఒక చక్కటి పరిష్కార మార్గం ఉల్లిపాయలు. ఉల్లిపాయలను అతి దగ్గరగా పెట్టుకొని, చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల వల్ల నాసల్ పాసేజ్ ఫ్రీగా అవుతుంది. మరియు పచ్చి ఉల్లిపాయను తినడం ద్వారా నాసికా ప్రతిష్టంభన నుండి ఉపశమనం పొందవచ్చు. 5. నాజల్ బ్లాకేజ్ నుండి ఉపశనం పొండానికి హాట్ టమోటో జ్యూస్ ను తాగాలి. ఈ టమోటో జ్యూస్ ను వేడి వేడిగా రోజుకు రెండు సార్లు తాగడం వల్ల నాసల్ బ్లాకేజ్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

ఆరోగ్యమైన కన్నుల కోసం....

  1. మీరు మంచి దృష్టి మరియు రీడింగ్ లో ఎలాంటి సమస్య అయినా కనీసం సంవత్సరంనకు ఒకసారి చెకప్ కు వెళ్ళండి. వివిధ కంటి సంబంధిత రోగాలను గుర్తించడం మరియు సరైన చికిత్స కు చాలా మంచి మార్గంగా ఉంటుంది. 2. నిరంతరం మీ కళ్ళు రెప్పలు మూసి తెరవటం వల్ల మీ కళ్ళను తాజాగా ఉంచటానికి మరియు కంటి అలసట నివారించేందుకు చాలా సులభమైన మార్గంగా ఉంటుంది. సాదారణంగా కంప్యూటర్ యూజర్లు కళ్ళు రెప్పలు మూసి తెరవటం చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వారు తమ కళ్ళును ప్రతి మూడు నాలుగు సెకన్లు ఒకసారి మూసి తెరుస్తూ వ్యాయామం చేయాలి. 3. మేము దగ్గరగా ఉన్నవస్తువుల వద్ద ఎక్కువ సమయం గడిపిన తరువాత దూరపు వస్తువులను చూడటం ఒక అలవాటుగా పాటించాలి. వాకింగ్ లేదా కూర్చొని ఉండగా మీ చుట్టూ దూరంగా ఉన్న వస్తువులను చూడటానికి ప్రయత్నించండి. 4. మీ కారు లేదా మీ కార్యాలయం నుండి ఎయిర్ కండిషన్డ్ గాలి మీ కళ్ళలో తేమ లేకుండా చేస్తుంది. ఎల్లప్పుడూ మీ A/C ప్యానెల్ ను క్రిందికి లేదా మీ ముఖం నుండి దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఎయిర్ కండీషనర్ గాలి తీవ్రమైన పొడి,అంధత్వం లేదా ఇతర కంటి రుగ్మతలకు కారణం కావచ్చు. 5. దుమ్ము, దూలి వంటి వాటితో మీ కళ్ళు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి దుమ్ము, ధూలి, రసాయనాలతో పని చేసేవారు,క్రాకర్లు పగిలిపోవటం వల్ల,ఈత సమయంలోను,ఆటలు ఆడుకొనేటప్పుడు తప్పనిసరిగా రక్షణకు కళ్ళద్దాలు ధరించాలి. 6. మీ కళ్ళు ఒత్తిడిగా ఉన్నాయని భావిస్తే వాష్ రూంకి వెళ్లి పూర్తిగా మీ కళ్ళును కడగాలి. దీనిని రోజువారీ పనిగా అలవాటు చేసుకోండి. నీటితో మీ కళ్ళు కడగటం వల్ల అధిక ఒత్తిడి నుండి మీ కళ్ళు ఉపశమనం పొందటానికి మరియు వాటిని తాజాగా ఉంచటానికి సహాయం చేస్తుంది. 7. పడుకొనే ముందు మీ కంటి మేకప్ ను తొలగించుకోవాలి. రాత్రి మీరు కంటి మేకప్ తీయకపోతే ఇరిటేషన్ రావచ్చు. అంతేకాక ఆ మేకప్ కన్ను లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 8. నిద్ర లేకపోవడం వలన మీరు అలసట,తలనొప్పి మరియు మీ చూపు మసకగా ఉండేలా చేస్తుంది. అందువల్ల నిద్ర బాగా ఉంటె మంచి చూపుకు మరియు కంటి కండరాల విశ్రాంతికి సహాయం చేస్తుంది. 9. గుడ్లు తినడం వల్ల గుడ్డులో ఉండే పోషక పదార్థాలు చురుకైన చూపుకు,వయస్సు సంబంధిత కంటి వ్యాధులను తగ్గిస్తున్నది. 10. మీ ఆహారంలో కనీసం వారంలో రెండు సార్లు చేపలు ఉండేలా చూసుకోండి. చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండుట వల్ల డ్రై-ఐ సిండ్రోం నివారించేందుకు ఉపయోగపడుతుంది. 11. నీరు మీ అన్ని సమస్యలకు ఉత్తమమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. తరచుగా మసకగా ఉన్న దృష్టి నిర్జలీకరణ వలన కావచ్చు. అందువల్ల క్రమమైన విరామాల్లో నీటిని త్రాగుతూ ఉండాలి. 12. మీ ఆహారంలో పాలకూర ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పాలకూర అనేక కంటి సంబంధిత సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది.

వీటితో మీ ఆరోగ్యం క్షేమం...!

  బాదం పాలు పిల్లలకు మంచి పోషకాలనిస్తాయి. బాదం పాలును తీసుకునే పిల్లల్లో మేధాశక్తి పెంపొందడమే గాకుండా కండరాలు పటిష్టమవుతాయి. జుట్టు బాగా పెరుగుతుంది. ఖర్జూర పండ్లను బాగా కాచిన పాలలో రోజూ కలుపుకుని తీసుకుంటే ఐరన్ శక్తి లభిస్తుంది. పిల్లలు, గర్భిణీ మహిళలు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకోవడం చాలా అవసరం. ఖర్జూర పండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇక ఆఖ్రోట్ పండ్లను తీసుకుంటే రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. గుండెపోటుకు చెక్ పెట్టాలంటే ఆఖ్రోట్ పండ్లను రోజూ రెండేసి తీసుకోవడం మంచిది. ఇందులో ఒమెగా 3 ఫాట్ ఆమ్లాలున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. ఐరన్ శక్తినిచ్చే ఎండు ద్రాక్షల్ని తీసుకోవడం ద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చును. మీ పిల్లలు బరువు పెరగకపోతే.. ఐదు ఎండు ద్రాక్షల్ని రోజూ తినిపిస్తే ఫలితం ఉంటుంది. అజీర్ణానికి కూడా ఎండుద్రాక్ష చెక్ పెడుతుంది. జీడిపప్పులో విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి జీడిపప్పు గుండెను కాపాడుతుంది.

ఖర్జూరంతో ఆరోగ్య ప్రయోజనాలు

  ఖర్జూరంలో ఎన్నో పోషక విలువలు దాగివున్నాయి. 1. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఖర్జూరాల్లో ఐరన్, విటమిన్, మినరల్స్ ఉన్నాయి. తద్వారా నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చును. 2. ఖర్జూరంలోని పీచు పదార్థం క్యాన్సర్‌ను మన దరికి చేరనివ్వదు. 3. ఖర్జూరాలు తినడం వలన చేతులు, కాళ్లు, మోకాలి నొప్పులకు చెక్ పెట్టవచ్చు. 4. విటమిన్ A లోపంతో కంటి సమస్యలకు ఖర్జూరాలతో చెక్ పెట్టవచ్చు. ఖర్జూరాన్ని తేనెలో నానబెట్టి తింటే రోగాలన్నింటినీ దూరం చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ఖర్జూరాలను తీసుకోవచ్చు. 5. మహిళలకు నెలసరి సమయాల్లో ఏర్పడే రక్తస్రావంతో క్యాల్షియం తగ్గిపోతుంది. అందువల్ల వారికి అధికంగా క్యాల్షియం అవసరం. అందుచేత క్యాల్షియం అధికంగా ఉండే ఖర్జూరాలను తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు.

గుడ్లుతో బ్రెస్ట్ క్యాన్సర్ దూరం...

  1. గుడ్లు వంటి బలవర్థక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది.   2. బి కాంప్లెక్స్ విటమిన్‌ను కలిగివుండే కోలైన్ పదార్థం ఎక్కువగా ఉండే గుడ్లను ఆహారంలో తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 24 శాతం తగ్గిపోతాయని ఈ అధ్యయనంలో తేలింది.   3. కణాలు సాధారణ రీతిలో పనిచేసేందుకు కోలైన్ చాలా అవసరం. వయసు, లింగంతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ కోలైన్ అధికంగా ఉండే పదార్ధాలను తీసుకోవచ్చు. మహిళలకు, ప్రత్యేకించి పిల్లలను పెంచే వయసులో ఉన్న మహిళలకు ఇది చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.   4. మనం తీసుకునే ఒక గుడ్డులో కనీసం 125.5 మిల్లీ గ్రాముల కోలైన్ ఉంటుంది. రోజూ మనం తీసుకోవాల్సిన కోలైన్ శాతంలో ఇది పావుభాగం అన్నమాట. అందుకే ఆహారంలో తప్పనిసరైన ఈ పోషక పదార్థాన్ని పొందాలంటే గుడ్లు తినడం చాలా అవసరం.   5. గుడ్డులోని పచ్చసొనలో కోలైన్ అధికంగా ఉంటుంది. ఇకపోతే కాలేయం, గోధుమ మొలకలు, కాలిఫ్లవర్స్‌లో కూడా తగుమాత్రంలో కోలైన్ ఉంటుంది.   6. కణాల సాధారణ పనితీరులో కోలైన్ కీలక పాత్ర వహించడమే కాకుండా... మెదడు, నరాలు, కాలేయ జీవ రసాయన ప్రక్రియ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. పైగా శరీరమంతటా పోషకపదార్థాలను సరఫరా చేయడంలో కూడా ఇది ఉపకరిస్తుంది.   7. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడమే కాక, మన జ్ఞాపకశక్తిని కూడా మెరుగు పరుస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

పాలకూర ఉపయోగాలు

  పాలకూర ఉపయోగాలు  :   1. పాలకూరలో లభించే విటమిన్‌ C, Aలు మరియు మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. 2. ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. 3. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువ. 4. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 5. జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. 6. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది. 7. స్ర్తీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. 8. పాలకూరను వెజిటబుల్‌ సూప్‌లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ.. అనేక రకాలుగా వాడుకోవచ్చు. 9. ఇతర ఆకుకూరల్లాగా పాలకూరను కూరలాగా, వేపుడు చేసుకుని కూడా తినవచ్చు. 10. ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

చిలకడ దుంపతో ఆరోగ్య ప్రయోజనాలు

  చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం మేలు.   శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలుగడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎదిగే పిల్లలకు స్వీట్‌ పొటాటోను ఉడికించి తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విషరసాయనాలు సులభంగా బయటకు పంపిస్తుంది. మరి పెద్దవారిలో ఈ స్వీట్ పొటాటో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం..   1. విటమిన్‌ B6(గుండె ఆరోగ్యానికి): చిలగడదుంపల్లో విటమిన్‌ B6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ B6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి. 2. పొటాషియం(అధిక రక్తపోటు): ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.   3. విటమిన్‌ A(కళ్ళు ఆరోగ్యానికి): చిలగడదుంపల్లో విటమిన్‌ A లేదా బీటా కెరటిన్‌ ఎక్కువ. ఇది ఎండకు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. చూపు తగ్గిపోకుండా చూస్తుంది.   4. విటమిన్‌ C (పళ్ళు మరియు గమ్స్ హెల్త్): వీటిల్లోని విటమిన్‌ C రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అంతే కాదు పళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది మరియు పళ్ళనుండి రక్తం కారడాన్ని అరికడుతుంది.   5. విటమిన్ E(చర్మ సౌందర్యానికి): విటమిన్‌ E మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది. వయస్సు మీద పడనియ్యకుండా చేసి, ముడతలను అడ్డుకుంటుంది.   6. పీచు(జీర్ణవ్యవస్థకు): బంగాళాదుంప, కందగడ్డల్లో కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.   7. మెగ్నీషియం(మధుమేహానికి): చిలగడదుంపల్లో దండిగా ఉండే సహజ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. అందువల్ల రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా చూస్తాయి. ఇలా బరువు పెరగకుండా, నిస్సత్తువ రాకుండా కాపాడతాయి. 8. రోగనిరోధక శక్తి: శరీరంలోకి ఇన్‌ఫెక్షన్లు, వైరస్ వంటి క్రిములు ప్రవేశించకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ A కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ A కొరవడితే ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు శరీరంపై దాడి చేసి అనారోగ్యం పాల్జేస్తాయి.   9. కేన్సర్: కేన్సర్ కణాలను అణచివేయడంలో కూడా విటమిన్ A చురుకైన పాత్ర పోషిస్తుంది.   10. మాంగనీసు(ఎముకల బలానికి): పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి. మ్యాంగనీస్ ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది.   11. ఒత్తిడి తగ్గిస్తుంది: ఇందులో ఉండే పాంథోనిక్ యాసిడ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండి విటమిన్ B శరీరానికి కావల్సిన శక్తి సామార్థ్యాలను అంధిస్తుంది.   12. కండర పుష్టికి: శరీరానికి అవసరమయ్యే న్యూటియంట్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి ఈ రుచికరమైన, శక్తినందించే స్వీట్ పొటాటోను మీ డైలీ డయట్ లో చేర్చుకోండి.

దంతాలు తెల్లగా అవ్వాలంటే...

  1. తులసి ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి దాంతో పళ్లు తోముకున్నా దంతాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారేవారికి కూడా ఇది మంచి మందు. 2. జామ, యాపిల్‌, క్యారెట్‌, చెరకు, దోస… ఇవన్నీ కూడా సహజ వైట్‌నర్లు. వీటిని తరచుగా తింటుంటే వాటిలో ఉండే రసాయనాలు పంటిపై ఉండే మరకల్ని తొలగిస్తాయి. 3. వేప, నల్ల తుమ్మ పుల్లలతో తోముకున్నా కూడా దంతాల మీది మరకలు త్వరగా పోతాయి. వేపలో ఉండే యాస్ట్రింజెంట్లు, యాంటీ సెప్టిక్‌ గుణాలు పంటికి రక్షణ కల్పించి, దుర్వాసనను పోగొడతాయి. 4. టమాట, ఉసిరి, స్ట్రాబెర్రీ... వీటితో పళ్లపై రుద్దినా అదే ఫలితం లభిస్తుంది. రాత్రిపూట పడుకోబోయే ముందు నారింజ తొక్కతో పళ్లు రుద్దుకుంటే అందులోని సి విటమిన్‌ రాత్రంతా సూక్ష్మజీవులతో పోరాడుతుంది. 5. అర చెంచాడు బేకింగ్‌ సోడాలో రెండుచుక్కల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి కలిపి, ఆ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తోముకుంటే క్రమంగా పళ్లు తెల్లగా అవుతాయి. 6. అర టేబుల్‌స్పూన్‌ బేకింగ్‌ సోడాలో అంతే పరిమాణంలో వినెగర్‌, చిటికెడు ఉప్పు కలిపి తోముకుంటే పళ్ల పచ్చదనం పోయి తెల్లగా అవుతాయి. అక్కడ బ్యాక్టీరియా కూడా నిల్వ ఉండలేదు.

నెయ్యితో ప్రయోజనాలు

  నెయ్యిలో ఔషధగుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.పాలు, పాల పదార్థాలు కొందరికి నచ్చదు అలాంటి వారు లాక్టోజ్‌ శాతం తక్కువగా ఉండే నెయ్యిని వాడొచ్చు. ఇందులో లభించే పోషకాలు శరీరంలోని క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. కాలేయం, పేగులు, గొంతులోని మలినాలను బయటకు పంపుతుంది. నెయ్యి తీసుకొంటే కొలెస్ట్రాల్‌ సమస్య వస్తుందని అందరి నమ్మకం. అయితే ఇది అందర్నీ బాధిస్తుందని మాత్రం చెప్పలేం. ముందు నుంచి కొలెస్ట్రాల్‌ సమస్య ఉన్నవారు నెయ్యి వాడకం తగ్గించాలి. ఒక్కోసారి శరీరంలో కొవ్వు శాతం పెరగడానికి శారీరక మార్పులు, ఇతర మార్పులు, ఇతర ఆహార పదార్థాలుకూడా కారణమయ్యే అవకాశం ఉంది. నెయ్యి బలహీనంగా ఉన్న వారికి చాలా మేలు చేస్తుంది. వాతాన్ని తగ్గిస్తుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది. మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. నిపుణులు దీన్ని మానసిక సమస్యలకు ఔషధంగా కూడా ఇస్తారు. ఇంకా తీసుకొన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆకలి మందగించినప్పుడు మిరియాల పొడిలో నెయ్యి కలిపి మొదటి ముద్దలో తీసుకొంటే చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముక పుష్టిగా ఉండేందుకు గ్లాసు పాలలో చెంచా నెయ్యి వేసి తాగిస్తే మంచిది. అరటి పండు గుజ్జులో, కాసిని పాలు, కొద్దిగా నెయ్యి కలిపి పిల్లలకు తినిపిస్తే అవయవాలు దృఢంగా అవుతాయి. బరువు పెరుగుతారు. పొడి చర్మతత్వం, ఎగ్జిమా, సోరియాసిస్‌ వంటి సమస్యలతో బాధపడేవారు పావు చెంచా వేప గింజల పొడిలో, పావుచెంచా నెయ్యి జోడించి మొదటి ముద్దతో కలిపి తింటే సత్వర ఉపశమనం దొరుకుతుంది. కాలిన బొబ్బల మీద నెయ్యిని పైపూతగా రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగా మానిపోతాయి. ముక్కు నుంచి రక్తస్రావమవుతుంటే రంధ్రాల్లో మూడు నాలుగు చుక్కలు నెయ్యి వేస్తే ఫలితం కనిపిస్తుంది. పసి పిల్లలకు నెయ్యి లేదా వెన్నను ఒంటికి రాసి కాసేపయ్యాక స్నానం చేయిస్తే చర్మం మృదువుగా మారుతుంది. క్షయవ్యాధి, మలబద్ధకం, విరేచనాలు, జ్వరంతో బాధపడేవారు, వృద్ధులు నెయ్యికి దూరంగా ఉండాలి.

తాజా కొత్తిమీరలో ఉన్న హెల్త్ సీక్రెట్స్

  కొత్తిమీరను సాదారణంగా వివిధ ఆహార పదార్దాల తయారీలో ఉపయోగిస్తాము. ప్రతి ఒక్కరి రిఫ్రిజరేటర్ లో కొత్తిమీరకు ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్తిమీరకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. కానీ ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనదిగా ఉంటుంది. ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసనతో పాటు అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. కొత్తిమీర ఆరోగ్య పరంగా ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందామా...!   1.కంటి లోపాలు: తాజా కొత్తిమీరలో విటమిన్-C, విటమిన్-A,యాంటి ఆక్సిడెంట్లు,భాస్వరం వంటి ఖనిజాలు గొప్ప వనరులుగా ఉండుటవల్ల కళ్ళ ఒత్తిడికి,దృష్టి లోపములకు,కండ్ల కలక, కంటి వృద్ధాప్యం వంటి వాటి నివారణకు సహాయకారిగా ఉంటుంది. కొత్తిమీర ఆకులను తీసుకోని నలిపి వాటిని నీటిలో వేసి కాచి ఒక శుభ్రమైన వస్త్రంతో ద్రవాన్ని వడకట్టాలి. ఆ ద్రవంను కొన్ని చుక్కలు తీసుకోని రాస్తే కన్ను నీరు కారటం, కంటి దురద,నొప్పి వంటివి తగ్గుతాయి. 2.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: తాజా కొత్తిమీరలో ముఖ్యమైన నూనెలు మరియు సమృద్ధిగా వాసన కలిగి ఉండుట వలన అద్భుతమైన ఆకలికి పనిచేస్తుంది. పొట్టలో ఎంజైమ్లు మరియు జీర్ణ రసాల స్రావాల ఉద్దీపనకు సహాయపడుతుంది. అందువలన ఇది జీర్ణక్రియకు మరియు పెరిస్తాలిటిక్ మోషన్ ఉద్దీపనకు సహాయపడుతుంది. కొత్తిమీర అనోరెక్సియా చికిత్సను అందించడంలో కూడా సహాయపడుతుంది. 3.ముక్కు నుంచి రక్తస్రావం జరిగితే : 20 గ్రాముల తాజా కొత్తిమీర ఆకులు, కొద్దిగా కర్పూరం తీసుకోని రెండింటిని బాగా నలిపి రసం తీయాలి. ఈ రసంను రక్తస్రావం ఆపడానికి ముక్కు రంధ్రాలలోకి రెండు చుక్కలు వేయాలి. అంతేకాక ముక్కు నుండి రక్తస్రావం ఆపడానికి నుదుటిపైన ఈ పేస్ట్ ను రాయవచ్చు. తాజా కొత్తిమీర ఆకులు వాసన కూడా సహాయకారిగా ఉంటుంది. 4.కొలెస్ట్రాల్ స్థాయి మీద ప్రభావం: తాజా కొత్తిమీరలో ఒలియిక్ ఆమ్లం,లినోలెనిక్ ఆమ్లం,స్టియరిక్ ఆసిడ్,పల్మిటిక్ ఆమ్లం మరియు ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్-C) రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన మంచి వనరులుగా ఉన్నాయి. అంతేకాకుండా ధమనులు మరియు సిరలు లోపల పొర వెంబడి ఉన్న కొలెస్ట్రాల్ నిక్షేపాలను తగ్గించి తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 5.చర్మ వ్యాధులు: తాజా కొత్తిమీరలో యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, క్రిమి సంహారిణి లక్షణాల కారణంగా కొన్ని చర్మ వ్యాధులచికిత్సలో సహాయపడుతుంది. దద్దుర్లు నుండి ఉపశమనం పొందడానికి రసం త్రాగటం లేదా చర్మం మీద పేస్ట్ ను రాయటం చేయండి. చర్మం మీద బొబ్బలు / దద్దుర్లు కోసం తాజా కొత్తిమీర రసం & తేనె కలిపి ఆ పేస్ట్ ను ప్రభావితమైన చర్మ ప్రాంతంలో రాయాలి. రాసిన 15 నిముషాలు తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. 6.నోటి పుళ్ళు: కొత్తిమీరలో ఉన్న ముఖ్యమైన నూనె సిత్రోనేలోల్ ఒక అద్భుతమైన క్రిమినాశకంగా పనిచేస్తుంది. నోటిలో గాయాలను మరియు హీనస్థితిలో ఉన్న పూతలను నిరోధిస్తుంది. ఇది యాంటీ సూక్ష్మజీవి మరియు స్వస్థత ప్రభావాలను కలిగి ఉంటాయి. 7.గర్భధారణ సమయంలో వికారం మరియు వాంతులు (వేవిళ్ళు): అనేక మంది గర్భిణీ స్త్రీలకు గర్భం ప్రారంభంలో వికారం మరియు వాంతులు ఎదురవుతాయి. ఈ పరిస్థితి లో ఒక కప్పు కొత్తిమీర,ఒక కప్పు పంచదార,నీరు వేసి మరిగించి చల్లారిన తర్వాత త్రాగాలి.

జీలకర్ర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు

జీర్ణక్రియ : జీర్ణక్రియ ప్రాధాన్యత అందరకు తెలిసిందే. సాధారణంగా భోజనం తర్వాత చాలామంది జీలకర్రను ఎంతో కొంత మొత్తంలో నోటిలో వేసుకొని చప్పరించటం చూస్తూ వుంటాం. తిన్న పదార్ధాలకు జీర్ణక్రియ బాగా జరగాలంటే, అజీర్ణం వంటివి ఏర్పడకుండా వుండాలంటే, ఈ జీలకర్ర తినటం ఎంతో మేలు చేస్తుంది. పొట్టనొప్పి, అజీర్ణం, డయోరియా, వాంతి వికారం, మార్నింగ్ సిక్ నెస్ వంటి అనారోగ్యాలకు జీలకర్రను బాగా వేయించి కొద్దిగా ఉప్పు కలిపి తినటం చేస్తారు. మహిళలలో వచ్చే అపసవ్య రుతుక్రమాలకు జీలకర్ర చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మొలలు బాధిస్తున్నాయా? అయితే జీలకర్ర తగుమాత్రంగా ప్రతిరోజూ తీసుకోండి. దీనిలో వుండే పీచు పదార్ధం ఎంతో మలబద్ధకాన్ని పోగొడుతుంది. నేటికి విరేచనం సాఫీగా జరగాలంటే మనదేశంలోని చాలా ప్రాంతాలలో జీలకర్రను ఉప్పుతో కలిపి తినటం చూస్తూనే వుంటాం. జీలకర్ర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎలా వుంటాయనేది గమనిస్తే.... సాధారణ జలుబు : జీలకర్రలో వుండే యాంటీ సెప్టిక్ గుణాలు ఫ్లూ లేదా సాధారణ జలుబును తగ్గించేందుకు బాగా తోడ్పడతాయి. ఇది మీలోని రోగ నిరోధకతలను మెరుగుపరుస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో జీలకర్ర, అల్లం, తులసి ఆకులు వేసి బాగా మరిగించి ఆ మిశ్రమానికి కొద్దిపాటి తేనె కలిపి తాగితే, జలుబు వెంటనే తగ్గుతుంది. రక్త హీనత : జీలకర్ర విత్తనాలలో ఐరన్ అధికం. ఆక్సిజన్ శరీరంలోని భాగాలకు బాగా అందాలంటే రక్తం ఎంతో అవసరం. మరి ఆ రక్తంలో వుండే హెమోగ్లోబిన్ ఏర్పడాలంటే ఐరన్ కావాలి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. రక్తహీనత లేదా ఎనీమియా ఏర్పడిన వారిలో రక్తంలో తక్కువస్ధాయిలో హెమోగ్లోబిన్ వుంటుంది. ప్రత్యేకించి మహిళలు, పిల్లలు, టీనేజ్ పిల్లలలో ఈ పరిస్ధితి వస్తుంది. వీరికి ప్రతిరోజూ జీలకర్ర వంటకాలలో కలిపి అంటే, పరోటాలు, చపాతీలు, కూరలు, సూప్ లు, రైస్, వంటి తిండ్లలో కలిపి తినిపిస్తే రక్తహీనతనుండి వీరు దూరం అవుతారు.

కీళ్లనొప్పుల కోసం కొన్ని చిట్కాలు

  కీళ్లనొప్పులు వేధిస్తున్నాయా అయితే ఈ చిట్కాలు పాటించండి. రోజూ మీరు తీసుకునే ఆహారంలో చింతపండును తగ్గించండి. కొత్త చింతపండును ఆహారంలో తక్కువగా తీసుకుంటే. అది మన శరీరంలోని ఎముకల చుట్టూ ఉన్న కార్డిలేజ్‌కు ఎలాంటి ముప్పు తలపెట్టదు. అలాగే బంగాళాదుంపలు వంటివి ఆహారంలో ఎక్కువగా చేర్చుకోకండి. పసుపు పొడి, వెల్లుల్లి పాయలను తీసుకుని బాగా పేస్ట్ చేసుకుని మోకాలి పట్టిస్తే కీళ్ల నొప్పులు మటుమాయం అవుతాయి. ఇంకా కూల్‌డ్రింక్స్‌ను తీసుకోవడం ద్వారా ఎముకలు బలహీన పడతాయి. కాబట్టి కూల్‌డ్రింక్స్‌ను తాగడం ఆపేస్తే మంచిది.   ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కీళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు.

భోజనం తర్వాత మొక్కజొన్న తింటే...?

  1. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న గింజలు, చిక్కుళ్లు, పప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఆకలిగా వున్నప్పుడు తీసుకోవచ్చు. లేత గింజల్లో పోషకవిలువలు ఎక్కువగా వుంటుంది. వందగ్రాముల మొక్క జొన్నల్లో 365 కిలో కెలోరీల శక్తి ఉంటుంది. 2. గింజల్లో కొవ్వు పదార్థాలు అంటే వెన్న, నూనె, క్రీమ్ వంటివి వేయకుండా తింటే త్వరగా అరుగుతాయి. వీటిలో ఉండే నూనెలు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అలానే పొత్తుల చివరన ఉండే పీచు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ నల్లటి పీచును ఉడికించి ఆ నీళ్లను వడకట్టి తీసుకుంటే మూత్రాశయానికి సంబంధించి ఏ ఇబ్బందులూ ఉండవు. వీటిని ఇతర ఏ పదార్థాల్లోనూ కలిపి తీసుకోకూడదు. తీసుకున్న వెంటనే గోరువెచ్చటి నీళ్లు తాగడం తప్పనిసరి. 3. మొక్కజొన్నల్లో గ్లూటిన్, సెల్యూలోజ్, పీచుపదార్థాలు ఉంటాయి. అవి పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపి.. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. చక్కెర వ్యాధితో బాధపడేవారు, బరువు తగ్గాలనుకొనేవారు. ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధికి అడ్డుపడతాయి. గుండె పని తీరు సక్రమంగా ఉంటుంది. 4. అరుగుదల సరిగా లేనివారు... పాత బియ్యం, పెసలు, పేలాలు, చేపలు, బాగా ఉడికిన మాంసం, లేత ముల్లంగి, వెల్లుల్లి, పచ్చి అరటి, అనప, బీర, పొట్ల, వంకాయ, బీన్స్, క్యారెట్, దానిమ్మ, నారింజ, ఆవు పాలతో చేసిన మజ్జిగ వంటివి తీసుకోవాలి.

దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి?

  1. ఒక కప్పు నీటిలో అర టీ స్పూన్ అల్లం తురుము, కొద్దిగా టీ పొడి, రెండు మూడు తులసి ఆకులు వేసి పది నిమిషాల పాటు మరిగించి దింపాలి. చల్లారిన తరువాత ఈ కషాయాన్ని తాగితే గొంతులో గరగర పోతుంది.   2. మూడు కప్పుల నీళ్ళలో రెండు తమలపాకులు వేయాలి. నాలుగు మిరియాలను పొడిగా చేసి ఇందులో కలపాలి. అన్నీ కలిపి 15 నిమిషాలపాటు మరగబెట్టి దింపేయాలి. ఇందులో టీ స్పూన్ తేనె కలుపుకుని ఉదయం, సాయంత్రం తాగాలి. ఈ కషాయం తాగడం వల్ల పొడి దగ్గు తగ్గడమే కాకుండా ఛాతీలో పట్టినటుగా ఉన్నా కూడా ఉపశమనం లభిస్తుంది.   3. కప్పు నీటిలో మూడు మల్బరీ ఆకులను వేసి పది నిమిషాల పాటు మరగబెట్టి దింపి చల్లార్చాలి. ఇందులో కోడిగుడ్డులోని తెల్ల సొన కలుపుకుని తాగాలి. దీర్ఘకాలంగా బాధిస్తున్న దగ్గు తగ్గుతుంది.

పాలతో క్యాన్సర్‌ ఆటకట్టు

  క్యాన్సర్ బాధితులకు ఒక శుభవార్త..! నిత్యం రెండు గ్లాసులు పాలు తాగితే క్యాన్సర్ నుంచి కొంతలో కొంతైనా ఉపశమనం పొందొచ్చంటున్నారు నిపుణులు. పాలలో ఉండే ‘మిల్క్ ప్రొటీన్’ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ లండన్, స్వీడన్ నిపుణులు గుర్తించారు.   మిల్క్ ప్రొటీన్ గల ఏ పదార్థాలైనా సరే అవి.. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేయగల గుణం మిల్క్ ప్రొటీన్‌కు ఉంది. ఎక్కువ మిల్క్ ప్రొటీన్ తీసుకునే వారిలో క్యాన్సర్ సమస్యలు పెద్దగా కనిపించలేవని నిపుణులు తమ అధ్యయనంలో గుర్తించారు. పాలు ఆరోగ్యానికే కాదు... క్యాన్సర్ రోగానికి కూడా మందు లాంటిదే.

కొవ్వు వల్ల చక్కర వ్యాధి

  పొట్ట పరిమాణం ఎనభై సెంటీ మీటర్లు ఉంటే మధుమేహం ప్రమాదం ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. కాబట్టి సన్నగా ఉన్నవాళ్లు కూడా తమ పొట్ట పరిమాణాన్ని గమనించుకుంటూ ఉండాలి. పొట్ట దగ్గర ఉండే కొవ్వు విడుదల చేసే కొన్ని రకాల రసాయనాలు, రక్తంలో చక్కర స్థాయుల పనితీరులో చేరి సమస్యను మరింత తీవ్రం చేస్తాయట. అందుకే పొట్ట పరిమాణంపై తప్పక దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.   వీలయితే ప్రతీరోజు మొదట తీసుకునే ఆహారంలో "ఓట్స్" చేర్చుకోవటానికి ప్రయత్నించాలి. ఇందులో ఉండే పీచు పదార్థంఆరోగ్యానికి మంచిది. కూరగాయలు, పళ్ళు, నడక, వ్యాయామం ఇవన్నీ కూడా ఎలాంటి అనారోగ్యాన్ని అయిన దూరంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటే మన అందం, ఆరోగ్యం మన చెంతనే ఉంటుంది.

ఆరోగ్యమైన కళ్ళ కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు

  కళ్ళు మనిషికి చాల ప్రధానమైనవి. అంధకారమైన జీవితము ఊహించడానికి కూడా సాహసించరు. కళ్ళను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి అలాంటప్పుడు మన కళ్ళ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇపుడు చూద్దాం. చదివేటపుడు : పుస్తకము 30 సెం.మీ. దూరము లో ఉంచుకోవాలి. నిటారుగా కూర్చొని చదవాలి. పడుకొని చదవకూడదు. సరిపడా వెలుతురు ఉండాలి. కదులుతున్న కుర్చీలో కూర్చొని చదివితే కళ్ళకు శ్రమ కలుగుతుంది. టెలివిజన్ చూస్తున్నప్పుడు : ఒక గంటకు మించి విడవకుండా టివి చూడడము మంచిదికాదు. టీ.వీ. చూస్తున్నపుడు శరీరాన్ని పలురకాల భంగిమల్లో ఉంచడం చాలామందికి అలవాటు. అయితే వెన్నెముకకి ఊతమిచ్చే కుర్చీలో కూర్చొని tv చూడడము కంటికి మేలుచేస్తుంది. TV చూసేటపుడు మనకు tv కి కనీసము 3 మీటర్లు దూరము ఉండాలి. చీకటిగా ఉన్న గదిలో కూర్చోని టీ.వీ. చూడడం కంటికి శ్రేయస్కరము కాదు. టివి చూస్తున్నపుడు వెలుతురు సరిపడా ఉండాలి. ఆ లైటు కూడా టివి వెనకవైపు ఎత్తులో ఉంటే మంచిది. బండి నడిపేటప్పుడు : బండి నడిపేటప్పుడు సన్ గ్లాసెస్ ని వాడాలి. సూర్యుని నుంచి వచ్చే అతి నీలిలోహిత కిరణాలు యు.వి. (ultra violet rays) కిరణాలు తాకిడికి కళ్ళకు హానికలగకుండా, దుమ్మి, ధూళి పడకుండా కళ్ళకు రక్షణగా ఉంటాయి. రాత్రులు బండి నడిపేటప్పుడు యాంటి గ్లేర్ గ్లాస్లు వాడాలి, ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్ల కాంతిని తగ్గించి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి. కంప్యూటర్ తో పనిచేస్తున్నపుడు : కంప్యూటర్ తెర మధ్యభాగానికి కాస్త పైన మీ చూపు ఉంటే మంచిది. రెప్ప వేయకుండా పనిచేయడము మంచిదికాదు. తరచుగా రెప్పలు వేస్తూ ఉండాలి. నిరంతరము పనిచేయకుండా మధ్యలో విరామము ఇవ్వాలి. కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చొవాలి. మీ దృష్టి మరీ అంత తీక్షణముగా ఉండకూడదు. మరింత కాంతివంతముగా కనిపించేలా మానిటర్ లైటింగ్ యేర్పాటు చేసుకోవాలి. మానిటర్ మీద యాంటిగ్లేర్ స్క్రీన్ యేర్పాటు చేసుకుంటే మంచిది.