బంగాళదుంప గురించి మీకు తెలియని నిజం.. ఇలా ముఖానికి రాస్తే..!

బంగాళదుంప గురించి మీకు తెలియని నిజం.. ఇలా ముఖానికి రాస్తే..!     బంగాళదుంప ఎంతో రుచిగా ఉంటుంది.  ఇది ఏ కర్రీలోకి అయినా ఇట్టే ఇమిడిపోతుంది.  బంగాళదుంపల చిప్స్, ఫ్రెంచ్ ప్రైస్ మొదలైనవి కూడా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. అయితే బంగాళదుంపలను ముఖానికి కూడా ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా బంగాళదుంపను కింద చెప్పుకున్నట్టు ముఖానికి రాస్తే ముఖం మెరిసిపోతుందట.   బంగాళదుంపల స్టార్చ్.. బంగాళదుంపల నుండి పిండిని తయారు చేసి దాన్ని ముఖానికి పట్టిస్తే ముఖం మెరిసిపోతుందట.  వందలు, వేలు ఖర్చు పెట్టిన క్రీములు ఇవ్వని ఫలితాన్ని బంగాళదుంపల స్టార్చ్ వల్ల లభిస్తుందట. బంగాళదుంప ముఖానికి ఎందుకంత ఎఫెక్ట్.. బంగాళాదుంపలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది  చర్మంపై మచ్చలను తేలికపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్లు  చర్మం  ఛాయను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.  బంగాళాదుంప పిండి   బంగాళాదుంప రసం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి, నల్లటి వలయాలను తగ్గించడానికి, టానింగ్, పిగ్మెంటేషన్,  ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. కావసిన పదార్థాలు.. బంగాళదుంప రసం - 1 గిన్నె నిమ్మరసం - 1/2 టీస్పూన్ పాలపొడి - 1 టీస్పూన్ తయారు విధానం.. ముందుగా కొన్ని బంగాళదుంపలను తీసుకుని తురుముకోవాలి.  రసం తీసి ఆ రసాన్ని గిన్నెలో ఉంచుకోవాలి. ఒక గాజు గిన్నెలో 1-2 గంటలు పక్కన పెట్టాలి. తర్వాత గిన్నె అడుగున తెల్లగా  పేరుకుపోయినట్లు మీరు కనిపిస్తుంది. ఇప్పుడు బంగాళాదుంప రసాన్ని గిన్నె వంకరగా వంచుతూ రసాన్ని  వేరే గిన్నెలో పోయాలి. గిన్నె దిగువన తెల్లటి పదార్థం కనిపిస్తుంది.  దానిలో ఒక చెంచా బంగాళాదుంప రసాన్ని అలాగే ఉంచాలి. అడుగున ఉన్న ఈ తెల్లని పిండే బంగాళదుంప స్టార్చ్. ఇప్పుడు ఈ గిన్నెలో కొన్ని చుక్కల నిమ్మకాయ రసం,   ఒక చెంచా పాలపొడి వేసి బాగా కలపాలి. ముఖాన్ని కాంతివంతం చేసి డార్క్ స్పాట్‌లను లైట్ చేసే ఫేస్ ప్యాక్  రెడీ  అయినట్టే. దీన్ని  ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత ముఖం కడుక్కోవాలి.  మొదట సారి వాడన తరువాతే చాలా మార్పు కనిపిస్తుంది.                                                          *రూపశ్రీ.  

బాబోయ్.. తెల్ల జుట్టును నల్లగా మార్చడం ఇంత సులువా!

  బాబోయ్.. తెల్ల జుట్టును నల్లగా మార్చడం ఇంత సులువా!   తెల్లజుట్టు ఇప్పట్లో చాలా మందికి సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలామంది ఈ సమస్యకు బాధితులు అవుతున్నారు.  అయితే తెల్లజుట్టును వదిలించుకోవడం అంత సులువు ఏమీ కాదు.. దీని బాధ భరించలేక కొందరు హెయిర్ డైతో సరిపెట్టేస్తుంటారు. కానీ తెల్లజుట్టును కవర్ చేసే ఈ  హెయిర్ డై వల్ల జుట్టు మరింత తెల్లగా మారుతుంది. రంగు వెలిసిపోయినప్పుడు అది చాలా దారణంగా కనిపిస్తుంది.  పైగా ఇందులోని రసాయనాల వల్ల మెదడు లోపలి నరాలు చాలా బలహీనం అవుతాయి. చిన్నతనంలోనే మతిమరుపు సమస్యలు వస్తాయి.  అయితే ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా చాలా నేచురల్ గా తెల్ల జుట్టును మాయం చేసే చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి.   అలాంటి చిట్కా ఒకటి ఇప్పుడు చెప్పుకుంటే.. ఆయుర్వేదంలో చాలా మంది మహర్షులు, ఋషులు చాలా రకాల వైద్య విధానాలను,  మొండి రోగాలను కూడా పోగొట్టే చికిత్సలను తెలియజేశారు.  వీరిలో బాలరాజ మహర్షి ఒకరు.  తెల్లజుట్టును నల్లగా మార్చడానికి బాలరాజ మహర్షి చెప్పిన సింపుల్ చిట్కా ఉంది.  దీనికి ఖర్చు కూడా తక్కువ. కానీ ఫలితం మాత్రం ఉహించనంత అద్భుతంగా ఉంటుంది.   చిన్న పిల్లల నుండి పెద్దవారు కూడా తెల్లజుట్టును తగ్గించుకోవడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. తెల్లజుట్టు నల్లగా మారడానికి బాలరాజ మహర్షి చెప్పిన నూనె చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు.   ఈ నూనె తయారీ కోసం కావలసిన పదార్థాలు.. ఆవాల నూనె.. ఒక కప్పు.. గోరింటాకు.. ఒక కప్పు.. తయారీ విధానం.. ఒక మందంగా ఉన్న కడాయి తీసుకుని దాన్ని స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. ఇందులో కప్పు ఆవాల నూనె పోయాలి. కప్పు గోరింటాకును కచ్చాపచ్చాగ దంచుకోవాలి.  కచ్చాపచ్చాగ దంచుకున్న గోరింటాకును ఆవాలనూనెలో వేయాలి. దీన్ని సన్న మంట మీద బాగా ఉడికించాలి.  నూనెలో గోరింటాకు బాగా ఉడికి ఆకులు నల్లగా మారిపోయిన తరువాత  స్టౌ ఆఫ్ చేయాలి.  ఆ తరువాత దీన్ని వడగట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను వారంలో రెండు సార్లు తలకు పెడుతుంటే చాలా గొప్ప మార్పులు ఉంటాయి.  తలకు పెట్టుకుని వీలును బట్టి గంట సేపు.. వీలున్నవారు రెండు గంటల సేపు తలకు ఉంచుకుని కెమికల్స్ లేని షాంపూ లేదా షీకాయతో స్నానం చేయాలి.  లేదంటే రాత్రి సమయంలో ఈ నూనెను తలకు పెట్టుకుని మరుసటి రోజు ఉదయాన్నే తల స్నానం కూడా చేయవచ్చు.  ఈ నూనెను వాడుతూ  నువ్వులు, పల్లీలు, బెల్లం, పాలు, గుడ్లు, గుమ్మడి విత్తనాలు మొదలైనవి క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది. వీటిని ఆహారం నుండి మిస్ చేసుకోకుండా ఉంటే ఎంత వయసు పెరిగినా జుట్టు తెల్లబడటం అనే సమస్య చాలా వరకు ఉండదు.                                            *రూపశ్రీ.

వేలాది రూపాయల ఖరీదైన  క్రీమ్ కూడా దీని ముందు దిగదుడుపే..!

వేలాది రూపాయల ఖరీదైన  క్రీమ్ కూడా దీని ముందు దిగదుడుపే..!   చర్మ సంరక్షణ ఎప్పటికీ పాతబడని అంశం. కాలం మారే కొద్ది చాలామంది చర్మం సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఇంటి టిప్స్ నుండి మార్కెట్లో దొరికే వాణిజ్య ఉత్పత్తుల వరకు చాలా రకాలు ఉపయోగిస్తారు. వీటిలో రెటినోల్ కూడా ఒకటి.  రెటినోల్ అంటే  విటమిన్-ఎ1.  ఇది చర్మంలో కొల్లాజెన్ నష్టాన్ని నిరోధిస్తుంది.  ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.  అయినప్పటికీ ఇది చాలా ఖరీదైనది.  వేలాది రూపాయలు ఖర్చు చేసి ఇలాంటి క్రీములు కొనే బదులు ఇంట్లోనే దానికి సమానమైన ఫలితాలు ఇచ్చే క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు.  దీనికి కావలసిన పదార్థాలు.. తయారీ విధానం గురించి తెలుసుకుంటే.. విటమిన్ ఎ  చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యాన్ని నివారిస్తుంది.  విటమిన్ ఎ  మరింత ప్రభావవంతమైన రూపం రెటినోల్. వృద్దాప్యం కనిపించకుండా చర్మం యవ్వనంగా ఉంచడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. ఇంట్లోనే రెటినోల్ వంటి క్రీమ్.. ఇంట్లోనే సాలిసిలిక్ యాసిడ్ ఎలా తయారు చేయాలో కింద చెప్పబడింది. వంటగదిలో లభించే వస్తువుల నుండి రెటినోల్‌ను ఎలా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. బియ్యం పిండి - 2 స్పూన్లు తాజా కలబంద జెల్ - 1 టీస్పూన్ రైస్ సీరం - 3-4 చుక్కలు(రైస్ సీరమ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు) నీరు - 1 గ్లాసు తయారీ విధానం.. ముందుగా పాన్ తీసుకుని అందులో నీటిని పోసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో బియ్యప్పిండి వేసి చిక్కని పేస్ట్ తయారయ్యే వరకు ఉడికించాలి. దీని తర్వాత ఆ పేస్ట్‌లో రైస్ సీరమ్,  కలబంద జెల్  వేసి బాగా కలపాలి. ఇలా చేస్తే  తెల్లటి పేస్ట్ సిద్ధం అవుతుంది.  హోమ్ మేడ్ రెటినోల్ క్రీమ్ తయారైనట్టే.. దీన్ని ఉపయోగించడం వల్ల  చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటుంది. ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే.. బియ్యంతో తయారు చేసిన ఈ రెటినోల్ క్రీమ్‌ను ఉపయోగించడం వల్ల  చర్మం కాంతివంతం అవ్వడమే  కాకుండా గ్లాస్ స్కిన్ లభిస్తుంది.  చర్మం అద్భుతంగా మారుతుంది. చర్మం మీద ఉండే  పెద్ద రంద్రాలను తగ్గించి చర్మపు రంగును సమం చేస్తుంది.                          *రూపశ్రీ.  

మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలంటే.. ఇలా చేయండి..!

మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలంటే.. ఇలా చేయండి..!   అమ్మాయిల అందాన్ని మరింత పెంచడంలో సహాయపడేది మేకప్. ఇప్పట్లో చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వారి వరకు ప్రతి ఒక్కరూ కొద్దో, గొప్పో మేకప్ అప్లే చేస్తూనే ఉన్నారు.  ఇక పార్టీలు, పంక్షన్ల సమయంలో మేకప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మేకప్ అనేది చాలా వరకు ముఖ చర్మాన్ని దెబ్బతీస్తుంది. మేకప్ వాడకుండా అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం మంచి క్లెన్సర్ తో ముఖాన్ని కడుక్కోవాలి.  చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి మాయిశ్చరైజర్ క్రమం తప్పకుండా అప్లై చేయాలి.  మాయిశ్చరైజర్ కూడా హానికరమైన రసాయనాలు లేకుండా ఉన్నదే వాడాలి.   వారానికి ఒకసారి ముఖాన్ని పూర్తీగా, లోతుగా శుభ్రం  చేసుకోవాలి.  ఇది మృతకణాలను తొలగించడంలోనూ, చర్మంలో పేరుకున్న మలినాలు తొలగించడంలోనూ సహాయపడుతుంది. ఇందుకోసం ఫేషియల్, స్ర్కబ్బింగ్,  ఎక్స్పోలియేషన్ చేసుకోవాలి.  ఇంటి చిట్కాలతో దీన్ని ఆరోగ్యకరమైన రీతిలో చేసుకోవచ్చు. ఎండలోకి వెళ్లైముందు సురక్షితమైన సన్ స్క్రీన్ ను అప్లై చేయాలి.  నీరు పుష్కలంగా తాగాలి.  ప్రతిరోజూ 2 నుండి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.  దీని వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాి.   సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి.  ఇది చర్మం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  పండ్లు, కూరగాయలలో ఫైబర్,  నీటి శాతం బాగా ఉన్నవి తీసుకోవాలి. ఇవి చర్మానికి మెరుపును ఇస్తాయి.  శరీరం డీహైడ్రేషన్ కు లోను కాకుండా ఉంటుంది. జుట్టు సంరక్షణ కూడా ముఖం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  తలలో చుండ్రు,  పుండ్లు, జుట్టు పొడిబారి ఉండటం,  లేదా జిడ్డుగా ఉండటం వంటివి జరిగితే అది ముఖ చర్మం మీద ర్యాషెస్,  గుల్లలు,  మొటిమలు,  దద్దుర్లు వంటివి రావడానికి కారణం అవుతుంది. చర్మం పైన మచ్చలు, వడదెబ్బలు,  వేడి గుల్లలు వంటివి వస్తే వాటిని తగ్గించుకోవడానికి అలోవెరా జెల్, విటమిన్-సి సీరమ్ వంటి తేలికపాటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడాలి. ఇవి చర్మానికి హాని చేయకుండా సమస్య తగ్గిస్తాయి.                                              *రూపశ్రీ  

చలికాలంలో కాలి మడమల పగుళ్లు తగ్గించే సూపర్ టిప్స్..!

  చలికాలంలో కాలి మడమల పగుళ్లు తగ్గించే సూపర్ టిప్స్..! వింటర్ సీజన్ దగ్గరయ్యే  కొద్దీ చర్మం పొడిబారడం,  పగుళ్లు ఏర్పడటం మొదలవుతుంది. ముఖ్యంగా మడమలు చాలా పగుళ్లు వస్తాయి. పగిలిన మడమలు అసహ్యంగా  కనిపించడమే కాకుండా వాకింగ్ చేసేటప్పుడు బట్టలు,  కార్పెట్‌తో పదేపదే తగలడం వల్ల   నొప్పి పెరుగుతుంది. ఈ పరిస్థితి అనుభవించే ప్రతి మహిళ   శీతాకాలంలో తన పాదాలు సాధారణ సీజన్ లో లాగా మృదువుగా ఉండాలని కోరుకుంటుంది. ఇందుకోసం మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కూడా వాడతారు. కానీ వీటి వల్ల ఫలితాలు పెద్దగా ఉండవు. అయితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోని వస్తువుల సాయంతో వాటిని చక్కదిద్దుకోవచ్చు. పగిలిన మడమలను నయం చేయడానికి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు.  ఇందుకోసం ఏ టిప్స్ ఫాలో కావాలి తెలుసుకుంటే.. కొబ్బరినూనెతో మడమలకు క్రీమ్ తయారుచేయడం.. కొబ్బరి నూనె  చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ నూనె శతాబ్దాలుగా చర్మ సంరక్షణకు ఉపయోగించబడుతోంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్,  మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మానికి తేమను అందించి మృదువుగా చేస్తాయి. ఇంట్లోనే క్రాక్ క్రీమ్ చేయడానికి  కిందిపదార్థాలు అవసరం. కొబ్బరి నూనె - 4 టీస్పూన్లు పెట్రోలియం జెల్లీ - 1 టీస్పూన్ విటమిన్ ఇ క్యాప్సూల్- 1 కర్పూరం పొడి - 1/2 టీస్పూన్ తయారు విధానం.. ముందుగా ఒక గిన్నెలో 4 చెంచాల కొబ్బరి నూనె వేసి వేడి చేసి అందులో ఒక చెంచా పెట్రోలియం జెల్లీ వేసి బాగా కలపాలి. దీని తరువాత  కరిగించిన నూనెలో విటమిన్ ఇ క్యాప్సూల్,  అర టీస్పూన్ కర్పూరం పొడి వేసి బాగా కలపాలి. ఇది పేస్ట్ లాగా మారేవరకు కలపాలి.   ఈ మిశ్రమాన్ని ఒక జాడీలో నింపి చల్లారనివ్వాలి. పాదాల పగుళ్లను నయం చేయడానికి ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్ పాదాలకు రాసుకుంటే మంచిది. స్క్రైబ్.. మడమలు రీసెంట్ గానే పగుళ్లు ప్రారంభమైనట్లయితే, వాటిని ఎప్పటికప్పుడు స్క్రబ్ చేయడం చాలా ముఖ్యం. స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి.  ఇందుకోసం  ఓట్స్ స్క్రబ్‌ని ఉపయోగించవచ్చు.  ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. దీన్ని తయారు చేయడానికి కింది పదార్థాలు అవసరం. ఓట్స్ - 3 స్పూన్లు పాలు - 1 చిన్న గిన్నె గ్లిజరిన్ - 1 టీస్పూన్ తయారీ విధానం.. ముందుగా ఓట్స్ గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పాలు, గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.  హీల్స్ డెడ్ స్కిన్‌ను శుభ్రం చేసే స్క్రబ్ రెడీ అయినట్టే. దీన్ని  మడమల మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 10-15 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో  పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఈ స్క్రబ్ పగిలిన మడమలను నయం చేయడంలో మాత్రమే కాకుండా చర్మాన్ని మృదువుగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.                                *రూపశ్రీ.

మేకప్ రిమూవర్ లేకుండా మేకప్ తొలగించడానికి సింపుల్ టిప్స్ ఇవీ..!

మేకప్ రిమూవర్ లేకుండా మేకప్ తొలగించడానికి సింపుల్ టిప్స్ ఇవీ..! మేకప్ ఇప్పటి అమ్మాయిలకు చాలా సాధారణ విషయం.  పార్టీలు,  ఫంక్షన్లు, పెళ్లిళ్ళలో మాత్రమే కాకుండా   సాధారణంగా బయటకు వెళ్లేటప్పుడు కూడా ఫౌండేషన్, లిప్స్టిక్,  కాజల్, ఐ లైనర్ వంటివి అప్లై చేస్తారు.  అయితే వీటిని శుభ్రంగా తొలగించాలంటే మేకప్ రిమూవర్ అవసరం అవుతుంది.  మేకప్ రిమూవ్ చేయకుండా అలాగే ఉంచి పడుకుంటే చర్మం పాడైపోతుంది. కానీ మేకప్ రిమూవ్ చేయడానికి మేకప్ రిమూవర్ లేకపోతే  కొన్ని సింపుల్ మార్గాలలో మేకప్ తొలగించవచ్చు. కొబ్బరినూనె.. ముఖం మీద మేకప్ తొలగించడానికి కొబ్బరినూనె ఉపయోగించడం ఉత్తమ మార్గం.  మేకప్ రిమూవర్ లేదు అనే చింత లేకుండా కొబ్బరినూనెతో మేకప్ ను తొలగించవచ్చు.  కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇది చర్మాన్ని మెరుస్తూ, మృదువుగా చేస్తుంది.  అదే సమయంలో చర్మం మీద మేకప్ ను కూడా చాలా క్లియర్ గా తొలగిస్తుంది. బాదం నూనె.. బాదం నూనె కూడా మేకప్ తొలగించడంలో బాగా సహాయపడుతుంది.  కాకపోతే బాదం నూనె చాలా ఖరీదైనది.  కానీ ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఇవి ముఖ చర్మం మీద ఉండే డల్ నెస్ ను తొలగించడంలో సహాయపడతాయి. ఆలివ్ నూనె.. ఆలివ్ ఆయిల్ వంటల్లోనే కాదు జుట్టు సంరక్షణ, చర్మ సంరక్షణలో కూడా బాగా సహాయపడుతుంది.  ముఖం మీద దుమ్ము, ధూళిని మాత్రమే కాకుండా.. వాటర్ ఫ్రూఫ్ మేకప్ ను కూడా సులభంగా తొలగించడంలో ఆలివ్ నూనె సహాయపడుతుంది. సన్ ఫ్లవర్ ఆయిల్.. ఈ నూనె ముఖం నుండి మేకప్ తొలగించడంలో గొప్పగా సహాయపడుతుంది.  సన్ ఫ్లవర్ ఆయిల్ ల విటమిన్-ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా చేస్తుంది. ముఖానికి మేకప్ వేసుకున్నప్పుడు రిమూవర్ లేకపోతే.. పై నూనెలను ఉపయోగించి ముఖానికి మేకప్ ను తొలగించవచ్చు.  ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి కూడా.  చర్మానికి ఎలాంటి హాని చేయవు.                                                    *రూపశ్రీ.

హెర్బల్ స్కిన్ కేర్ రొటీన్ ఎప్పుడైనా ఫాలో అయ్యారా..

హెర్బల్ స్కిన్ కేర్ రొటీన్ ఎప్పుడైనా ఫాలో అయ్యారా..     హెర్బల్.. దీన్ని తెలుగులో మూలిక అని అంటారు.  మూలికలు ఆయుర్వేదంలో భాగంగా చెబుతారు. ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. పూర్తీగా సహజమైన పదార్థాలు , చర్మానికి నష్టం కలిగించని పదార్థాలు ఉంటాయి. అందుకే హెర్బల్ ఉత్పత్తులకు కూడా ఆదరణ పెరిగింది.  ఇప్పటి కాలంలో అమ్మాయిలు స్కిన్ కేర్ రొటీన్ బాగా ఫాలో అవుతుంటారు. అయితే హెర్బల్ స్కిన్ కేర్ ఫాలో అయితే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుందట. ఇంతకీ ఇందులో ఏమేమి వాడాలో తెలుసుకుంటే.. రోజ్ వాటర్ చర్మానికి చాలా మంచిది.  కానీ దీన్ని ఎక్కువగా వాడరు. రోజ్ వాటర్ లేదా పసుపుతో చేసి ఫేస్ వాష్ వంటి తేలికపాటి హెర్బల్ ఫేస్ వాష్ తో చర్మాన్ని శుభ్రపరచాలి. ఇది ఉదయాన్నే చేయాలి. రోజు ఉదయం దీనితో చర్మాన్ని శుభ్రం చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.  రాత్రి వరకు చర్మానికి కలిగిన అలసట పోతుంది. చర్మం మీద మురికి, జిడ్డు వంటివి పోతాయి.  చర్మం తాజాగా ఉంటుంది. చర్మానికి టోనర్ వాడటం చాలా మంచిది. చర్మ రంధ్రాలను కవర్ చేసి చర్మాన్ని తాజాగా ఉంచే రోజ్ వాటర్ లేదా కీర దోసకాయ వంటి పదార్థాలతో తయారు చేసిన హెర్బల్ టోనర్లను వాడాలి. ఫేస్ సీరమ్ కూడా చర్మానికి మేలు చేస్తుంది.  అలోవెరా, విటమిన్-సి, వేప వంటి హెర్బల్ సీరమ్ లు ఎంచుకోవాలి.  ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. చర్మం మీద మచ్చలు,మొటిమల తాలూకు గుర్తులు ఉంటే పసుపు, వేప, తులసి రసం వంటివి అప్లై చేయాలి.  ఇవన్నీ మచ్చలు, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో మాయిశ్చరైజర్ చాలా బాగా సహాయపడుతుంది.  ఇందుకోసం తేనె,  అలోవెరా, ఆర్గాన్ ఆయిల్ వంటి హెర్బల్ మాయిశ్తరైజర్లను ఎంచుకోవాలి. బయటకు వెళ్లే ముందు సన్ స్క్రీన్ ను వాడటం తప్పనిసరి.  అయితే సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి గ్రీన్ టీ లేదా జియోలిన్ వంటి హెర్బల్ సన్ స్క్రీన్ లను ఉపయోగించుకోవాలి. పై హెర్బల్ స్కిన్ కేర్ ఫాలో అయితే చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.  ఇది చర్మానికి లోతుగా పోషణ ఇస్తుంది.  చర్మం ఆరోగ్యంగా ఉంచుతుంది.                                          *రూపశ్రీ.  

చర్మం మెరిసిపోవాలంటే.. ఈ సీరమ్ ను వాడాలి..!

  చర్మ సంరక్షణ అమ్మాయిల లైఫ్ స్టైల్ లో చాలా ముఖ్యమైపోయింది. ఆహారం దగ్గర అయినా రాజీ పడతారేమో కానీ.. చర్మ సంరక్షణ దగ్గర ఏమాత్రం తగ్గేది లేదంటారు ఈ కాలం అమ్మాయిలు. అయితే ముఖం ఎప్పుడూ మెరుస్తూ ఉండాలన్నా.. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా,  వయసు పెరిగినా యవ్వనంగా ఉండాలన్నా చర్మానికి సీరమ్ చేసే మేలు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా విటమిన్-సి సీరమ్ అయితే చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా,  చర్మం మెరుస్తూ ఉండాలన్నా విటమిన్-సి సీరమ్ ను ఎంచుకోవడం తెలివైన మార్గమని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు.  ఇంతకీ విటమిన్-సి సీరమ్ వాడటం వల్ల కలిగే మేలు ఏంటో తెలుసుకుంటే.. విటమిన్-సి సీరమ్  మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఈ మెలనిన్ ఎక్కువ అయితే ముఖం మీద మచ్చలు,  పిగ్మెంటేషన్ వంటివి వస్తాయి. అదే మెలనిన్ ఉత్పత్తి తగ్గితే  చర్మం క్లియర్ గా ఉంటుంది. అంతే కాదు.. చర్మాన్ని బిగుతుగా యవ్వనంగా, దృఢంగా ఉంచడంలో కూడా విటమిన్-సి సీరమ్ సహాయపడుతుంది. విటమిన్-సి గొప్ప యాంటీ ఆక్సిడెంట్.. ఇది చర్మాన్ని రక్షిస్తుంది.  ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మం  దెబ్బతినే సమస్యను తగ్గిస్తుంది.  విటమిన్-సి చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. సన్ స్క్రీన్ తో పాటు విటమిన్-సి సీరమ్ వాడుతుంటే  హానికరమైన సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు.   విటమిన్-సి యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది.  ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని సాగేలా చేస్తుంది.  చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది.  ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది.   చర్మం మీద కొన్ని మచ్చలు వస్తాయి.  ఇవి మెలిస్మా,  పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యల వల్ల వస్తాయి.   ఇవి తగ్గిపోవడంలోనూ, చర్మం తిరిగి సాధారణ రంగులోకి వచ్చి కాంతివంతంగా మారడంలోనూ విటమిన్-సి సహాయపడుతుంది. ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత  టోనర్  ను అప్లై చేయాలి. ఇలా చేస్తే చర్మం PH స్థాయి బ్యాలెన్స్ గా ఉంటుంది. దీని తరువాత ముఖానికి విటమిన్-సి సీరమ్ ను కొన్ని చుక్కలు తీసుకుని అప్లై చేయాలి.  ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.  చర్మానికి సీరమ్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే చర్మం రోజంతా మృదువుగా, కాంతివంతంగా,  ఆరోగ్యంగా ఉంటుంది. పగటి సమయంలో విటమిన్-సి సీరమ్ ను ముఖానికి అప్లై చేస్తే గనక దాని తరువాత ఎల్లప్పుడూ సన్ స్క్రీన్ ను అప్లే చేయాలి. 10-15%  విటమిన్-సి ఉన్న సీరమ్ ను ఉపయోగించాలి.  ఇది చర్మం చికాకును, వాపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.                                              *రూపశ్రీ.

చలికాలంలో పాదాలు చల్లగా ఉంటున్నాయా...ఇలా వెచ్చగా ఉంచుకోండి..!

చలికాలంలో పాదాలు చల్లగా ఉంటున్నాయా...ఇలా వెచ్చగా ఉంచుకోండి..!   చలికాలం చర్మానికి పరీక్ష కాలం.  ఉదయం నుండి రాత్రి వరకు బయటకు వెళ్ళాలన్నా,  తిరగాలన్నా పాదాలే ఆధారం. ముఖ్యంగా వాష్ రూమ్ వెళ్లాలంటే చాలా మంది భయపడతారు. దీనికి కారణం పాదాల చల్లదనం.  కాళ్లకు ఏ మాత్రం నీరు తగిలినా చాలు.. మంచులో ముంచి తీసినట్టు పాదాలు చాలా చల్లగా అవుతుంటాయి.  శరీరాన్ని కవర్ చేయడానికి వెచ్చగా ఉన్న దుస్తులు వేసుకుంటారు.  స్వెట్టర్లు గట్రా వేసుకుని వెచ్చదనాన్ని అనుభూతి చెందుతారు. కానీ పాదాలు, చేతులు మాత్రం చలికి బుక్ అయిపోతాయి.  ముఖ్యంగా  నీళ్లు ఎక్కువగా తగిలే శరీర భాగాలలో కాళ్లు, చేతులే ఎక్కువ ఉంటాయి.  భారతీయులు అయితే బాత్రూమ్ కు వెళితే కాళ్లు, చేతులు కడగనిది బయటకు రారు. దీనివల్ల మరీ ఇబ్బంది ఏర్పడుతుంది.   అలా కాకుండా ఈ చలికాలంలో పాదాలు వెచ్చగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. శరీరం వెచ్చగా ఉంటే పాదాలు, చేతులు చాలా వరకు వెచ్చదనంగా ఉంటాయి.  సీజన్ కు తగ్గట్టు ఈ చలికాలంలో మందంగా ఉన్న దుస్తులు,  ఉన్ని,  బొచ్చుతో కూడిన దుస్తులు, ఊలు దుస్తులు ధరించాలి. ఇవన్నీ ఇప్పట్లో ఫ్యాషన్ తో కూడుకుని మరీ డిజైన్ చేస్తున్నారు,  కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా వీటిని ధరించవచ్చు. అలాగే రాత్రి నిద్రపోయే సమయంలో లేదా ఒకే చోటు కూర్చుని వర్క్ చేసుకునే సమయంలో కాళ్లకు మందం పాటి సాక్స్ ధరించాలి.  ఇంట్లో కూడా అటు ఇటు తిరిగేటప్పుడు సాక్స్ ధరించవచ్చు. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా  రాళ్ల ఉప్పు వేసి పాదాలను ఆ నీటిలో నానబెట్టాలి.  సుమారు 20 నిమిషాలు ఇలా నానబెట్టిన తరువాత పాదాలను శుభ్రమైన పొడి గుడ్డతో తుడిచి పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఇలా చేస్తే పాదాలు వెచ్చగా ఉంటాయి. చలి కారణంగా పాదాలు పగుళ్లు రావడం,  దెబ్బతినడం జరగదు. ఒక వేళ పాదాలను నీటిలో నానబెట్టడం కుదరకపోతే పాదాలను నూనెతో మసాజ్ చేయాలి. ఇందుకోసం ఆవాల నూనె లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల పాదాలు వెచ్చగా ఉంటాయి.  ముఖ్యంగా ఆవాల నూనెతో పాదాలకు మసాజ్ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి.  ఆవాల నూనె వేడి గుణం కలిగి ఉంటుంది.  దీంతో పాదాలకు మర్దనా చేస్తే పాదాలలో రక్తప్రసరణ పెరిగి పాదాలు వెచ్చగా ఉంటాయి. అల్లం, వెల్లుల్లి,  నల్ల మిరియాలు వంటి పదార్థాలలో వేడి గుణం ఉంటుంది.  అల్లం పాలు,  మిరియాల పాలు,  పసుపు పాలు వంటివి తాగాలి.  ఇవి తాగితే శరీరం, పాదాలు వెచ్చగా ఉంటాయి. వ్యాయామం శరీరానికి గొప్ప ఔషధం లాంటిది.  శరీరంలో కొన్ని జబ్బులు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయామం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది.  ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. చలికి పాదాలు చాలా ఇబ్బందిని అనుభవిస్తుంటే హాట్ ప్యాక్ బ్యాగ్ తీసుకుని పాదాల మీద ఉంచుకోవచ్చు. వెచ్చని దుప్పటిని పాదాలకు కవర్ చేయవచ్చు.  పాదాలు చలికి గురి కాకూడదు అంటే పదే పదే నీటిలో తడవకూడదు.  వంటింట్లో పనులు ఏవైనా ఉంటే అవన్నీ చలి లేని సమయంలో మధ్యాహ్నం వంట చేసిన సమయంలో కడుక్కోవాలి. దీని వల్ల వంట చేసిన వేడి గదిలోనే ఉండి పెద్దగా ఎఫేక్ట్ పడదు.                                             *రూపశ్రీ.

నిద్రపోయేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హెయిర్ లాస్ పెరుగుతుంది..!

నిద్రపోయేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హెయిర్ లాస్ పెరుగుతుంది..!   హెయిర్ లాస్.. చాలా మంది పొడవాటి జుట్టు కలను నాశనం చేసే సమస్య ఇది.  హెయిర్ లాస్ ఎక్కువగా ఉన్న అమ్మాయిలు వారికి తెలియకుండానే డిప్రెషన్ లోకి వెళుతుంటారు.  హెయిర్ లాస్ కు చాలా కారణాలు ఉంటాయి.  వాటిలో తెలిసీ తెలియక అమ్మాయిలు చేసే కొన్ని పనులు జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో పడుకునేముందు చేసే  కొన్ని పనులు జుట్టు రాలే సమస్యను అధికం చేస్తాయి.  అవేంటో తెలుసుకుంటే.. తడి జుట్టు.. రోజంతా అలసిపోయినప్పుడు రాత్రి పూట స్నానం చేయడం చాలామంది అలవాటు.  రాత్రి తల స్నానం చేయడం వల్ల తొందరగా తడి ఆరదు.  కొందరు తడి జుట్టుతో అలాగే నిద్రపోతుంటారు.  మరికొందరు వర్షం కారణంగా వర్షంలో తడిచి తల పూర్తీగా ఆరక ముందే తడి జుట్టుతో పడుకుంటూ ఉంటారు.  తడి జుట్టుతో నిద్రపోయినప్పుడు జుట్టు తొందరగా విరిగిపోతుంది. దిండు కవర్.. దిండు కవర్ విషయంలో జాగ్రత్తలు పాటించేవారు చాలా తక్కువగా ఉంటారు.  సిల్క్ లేదా శాటిన్ దిండు కవర్లు వాడితే అవి జుట్టు రాపిడిని చాలా తగ్గిస్తాయి. కానీ ఇవి కాకుండా కాటన్ తో సహాఇతర దిండు కవర్లు వాడితే అవి జుట్టును చిక్కులు పడేలా చేయడంలో ఎక్కువ  పాత్ర పోషిస్తాయి. జుట్టు వదిలేయడం.. ఇప్పటి ఫ్యాషన్ కారణంగా చాలా మంది జడ వేసుకోవడం మరచిపోయారు. ఎనీ టైం జుట్టు వదులుగా ఉంచుతారు.  మహా అయితే పోనీ టైల్ వేసుకుంటారు. జుట్టు వదులుగా ఉంచి నిద్రపోతే జుట్టు చాలా తొందరగా చిక్కులు పడుతుంది. అందుకే జుట్టును జడ వేసుకుని అది కూడా మరీ గట్టిగా బిగించకుండా జడ వేసుకుని పడుకోవాలి. నూనె.. జుట్టుకు నూనె రాసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. వారంలో కనీసం రెండుసార్లు  అయినా జుట్టుకు నూనెతో మసాజ్ చేయాలి.  రాత్రంతా అలాగే ఉంచి ఆ తరువాత ఉదయాన్నే తలస్నానం చేయాలి.  ఇది జుట్టుకు పోషణ ఇస్తుంది. జుట్టు చిట్లకుండా చేస్తుంది. చిక్కులు.. సాధారణంగా జుట్టు చిక్కులు పడటం సహజం.  ప్రతిరోజూ రెండు పూటలా జుట్టును చిక్కులు లేకుండా ఆరోగ్యంగా సున్నితంగా దువ్వుకోవాలి.  ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది.                                                           *రూపశ్రీ.

శీతాకాలంలో జుట్టు బాగా రాలుతుందా.. ఇలా చెక్ పెట్టండి!

శీతాకాలంలో జుట్టు బాగా రాలుతుందా.. ఇలా చెక్ పెట్టండి!   చలికాలంలో చర్మ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తాయి.  అయితే కేవలం చర్మ సంబంధ సమస్యలు మాత్రమే కాకుండా జుట్టు సంబంధ సమస్యలు కూడా చలికాలంలో ఎక్కువ ఉంటాయి.  ముఖ్యంగా చుండ్రు సమస్య ఎక్కువ కావడం,  జుట్టు రాలడం ప్రధానంగా ఉంటుంది.  చల్లని గాలుల కారణంగా తల చర్మం చాలా పొడిగా మారుతుంది.  జుట్టు కూడా పొడిగా తయారవుతుంది.  పైగా ఈ చలికాలంలో నీరు తాగడం తగ్గుతుంది. ఈ కారణంగా తల చర్మం పొడిబారి తొందరగా జుట్టు బలహీనం అవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చలికాలంలో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆయిల్ మసాజ్.. కనీసం వారానికి ఒకసారి తలకు ఆయిల్ మసాజ్ చేయాలి.  దీని వల్ల తల చర్మంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.  జట్టు పొడిబారడాన్ని నిరోధిస్తుంది.  ఇందుకోసం కొబ్బరి నూనె,  బాదం నూనె,  ఆలివ్ నూనె మొదలైన నూనెలతో జుట్టుకు మసాజ్ చేయాలి.  జుట్టు కుదుళ్లలోకి నూనె ఇంకడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.  ఈ నూనెలు జుట్టుకు పోషణను ఇస్తాయి.  జుట్టును బలంగా మారుస్తాయి. తలస్నానం.. తలస్నానం చేయడంలో చాలామంది చేసే తప్పు నీరు ఎంచుకునే విధానం.  చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేస్తుంటారు.  దీని వల్ల తల చర్మంలో ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి.  అందుకే ఎంత చలిగా ఉన్నా తల స్నానానికి గోరు వెచ్చగా ఉన్న నీటిని మాత్రమే వాడాలి.   కండీషనింగ్.. కండీషనింగ్ అనేది జుట్టును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.  వారానికి ఒకసారి డీప్ కండీషనింగ్ చేసుకోవాలి.  ఇది జుట్టుకు తేమను అందించి జుట్టును మృదువుగా ఉంచుతుంది.  జుట్టు పొడిబారే సమస్యకు చెక్ పెడుతుంది. హెయిర్ మాస్క్.. జుట్టు రాలడాన్ని ఆపాలన్నా, జుట్టు ఆరోగ్యంగా,  దృఢంగా మారాలన్నా హెయిర్ మాస్క్ లు చక్కగా సహాపడతాయి.  ఇందుకోసం గుడ్డు, పెరుగు, తేనె లేదా కలబందతో తయారు చేసిన హెయిర్ మాస్క్ ను అప్లై చేయాలి.  ఇవి జుట్టుకు పోషణను ఇచ్చి దృఢంగా మారుస్తాయి. ఆహారం.. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ప్రోటీన్లు,  విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.  సమతుల ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తీసుకునేది శాకాహారం అయినా,  మాంసాహారం అయినా శరీరానికి తగిన పోషణ అందేలా జాగ్రత్త పడాలి.  ఇది జుట్టు ఆరోగ్యానికి చక్కగా సహాయపడుతుంది. ఒత్తిడి.. మంచి ఆహారం,  కేశ సంరక్షణ తీసుకున్నా సరే.. జుట్టు రాలుతోందంటే అది మానసిక ఒత్తిడి వల్ల అనే విషయాన్ని గ్రహించాలి.  ఏ విషయాల వల్ల అయినా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.  యోగ, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.  ఒత్తిడికి కారణమయ్యే విషయాలు,  వ్యక్తులకు కాస్త దూరంగా ఉంటూ యోగ, ధ్యానం చేస్తుంటే తొందరగా దాన్నుండి బయటపడతారు. ప్రొటెక్షన్.. చలికాలంలో చల్లని గాలులు జుట్టును, చల చర్మాన్ని దెబ్బతీస్తాయి.  అందుకే తలను, జుట్టును కప్పి ఉంచాలి. ఉల్లిపాయ రసం.. ఉల్లిపాయ నేటికాలంలో జుట్టు సంరక్షణ కోసం చ ాలా రికమెండ్ చేయబడుతోంది.  ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేస్తుంటే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు నల్లగా,  మందంగా మారుతుంది. కనీసం వారానికి ఒకసారి అయినా జుట్టుకు ఉల్లిపాయ రసం పెట్టుకోవాలి.   చలిగాలుల కారణంగా ఇబ్బంది పడేవారు కాస్త ఎండ ఉన్న సమయంలో పెట్టుకుని ఒక అరగంట నుండి గంట సేపు ఎంత సమయం వీలైతే  అంతసేపు పెట్టుకుని తరువాత జుట్టు కడిగేయాలి.  ఇది మంచి ఫలితాలు ఇస్తుంది.                                                      *రూపశ్రీ.  

యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్.. వారానికి రెండుసార్లు వేసుకుంటే చాలు.. యవ్వనంగా కనిపిస్తారు!

  యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్.. వారానికి రెండుసార్లు వేసుకుంటే చాలు.. యవ్వనంగా కనిపిస్తారు!   యవ్వనంగా ఉండాలన్నది ప్రతి అమ్మాయి కల. కానీ ఇంకా పట్టుమని 30 ఏళ్లు కూడా దాటకనే ముసలి వారిలాగా ముడతలు, గీతలు పడిన చర్మంతో కనిపిస్తుంటారు కొందరు. దీన్ని అధిగమించడానికి మార్కెట్లో దొరికే బోలెడు ఉత్పత్తులను కూడా వాడుతుంటారు. అయితే వీటి వల్ల తాత్కాలిక ఫలితం తప్ప దీర్ఘకాలిక ఫలితం ఉండదు.  ఇందుకోసం యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ లు బాగా సహాయపడతాయి.  చర్మ సంరక్షణ నిపుణులు సూచించిన యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు అప్లై చేస్తుంటే చాలు.. ఏ ఫేస్ క్రీములు అవసరం లేదని.. చర్మం యవ్వనంగా కనిపిస్తుందని అంటున్నారు.  ఇంతకీ ఆ ఫేస్ మాస్క్ ఏంటో తెలుసుకుంటే.. కేవలం రెండు పదార్థాలతో.. కేవలం రెండు పదార్థాలతో ఇంట్లోనే అద్బుతమైన యాంటీ ఏజింగ్  ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చట.  దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం ఎప్పుడు హైడ్రేట్ గా ఉంటుంది.  చర్మం కాంతివంతంగా మెరుగుస్తుంది.  చర్మం రంగు మెరుగవుతుంది.  చర్మానికి తగినంత యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.  ముఖ్యంగా చర్మం చాలా స్లిమ్ గా స్మూత్ గా మారుతుంది. ఫ్రెంచ్ గ్రీన్ క్లే.. గ్రీన్ టీ.. ఈ మధ్యకాలంలో  ఫ్రెంచ్ గ్రీన్ క్లే చాలా వైరల్ అవుతోంది.  ఆకుపచ్చ రంగులో ఉంటే ఇది ముల్తానీ మట్టిని పోలి ఉంటుంది.  దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది.  ఈ ఫేస్ మాస్క్ ఎలా చేయాలంటే.. రెండు స్పూన్ల ఫ్రెంచ్ గ్రీన్ క్లే.. ఒక స్పూన్ గ్రీన్ టీ ఆకులతో గ్రీన్ టీ తయారుచేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో ఫ్రెంచ్ గ్రీన్ క్లే పౌడర్ వేసి అందులో గ్రీన్ టీ నీరు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని పేస్ ప్యాక్ పేస్ట్ లాగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఫ్రెంచ్ గ్రీన్ క్లే టోనింగ్ తో గట్టిపడుతుంది.  ఇది చర్మం మీద ఆరిపోయే కొద్దీ చర్మ రంధ్రాలను బిగుతుగా మారుస్తుంది.  ముఖ చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మంచి ఆకారంలోకి మారుతుంది. ఫ్రెంచ్ గ్రీన్ క్లే ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటే చర్మం ముడుతల బారిన పడదు.  చర్మం మీద అప్పటికే ఉన్న ముడతలు, గీతలు తగ్గుతాయి. గ్రీన్ టీ లో కూడా యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి.  గ్రీన్ టీ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.  ముఖం మీద మచ్చలను తగ్గిస్తుంది.  వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ ఫేస్ మాస్క్ ను వాడుతుంటే చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి.  ఒక వేళ పొడి చర్మం ఉన్నవారు అయితే ఫ్రెంచ్ గ్రీన్ క్లే లోకి గ్రీన్ టీ పాటు కొద్దిగా పాలు వేసుకోవాలి.  లేకపోతే కొంచెం తేనెను వేసుకోవచ్చు.  ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.                                                            *రూపశ్రీ.

ఈ బయోటిన్ పౌడర్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది..!

ఈ బయోటిన్ పౌడర్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది..! జుట్టు రాలే సమస్య అందరినీ వేధిస్తోంది. కానీ కారణాలు అందరికీ భిన్నంగా ఉండవచ్చు. కొందరికి నీటి వల్ల జుట్టు రాలిపోతే, మరికొందరికి చుండ్రు వంటి పోషకాల కొరత వల్ల జుట్టు రాలిపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సమస్యకు కొన్ని రకాల ఇంటి నివారణలు,  ఔషధాలను ప్రయత్నించారు. జుట్టు రాలడాన్ని నివారించడానికి చిట్కాలు: జుట్టు రాలడాన్ని తగ్గించడానికి.. మీ జుట్టును ఒత్తుగా మార్చడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. విటమిన్ B7, కొన్నిసార్లు విటమిన్ H లేదా బయోటిన్ అని పిలుస్తారు.ఇది జుట్టును బలపరిచే, జుట్టు రాలడాన్ని తగ్గించే సప్లిమెంట్ బయోటిన్ కొత్త కణాల నిర్మాణం రేటును పెంచుతుంది.  జుట్టు పల్చబడడాన్ని నివారిస్తుంది. సహజంగా జుట్టు తంతువులను బలోపేతం చేయడానికి మృదుత్వాన్ని పెంచుతుంది. బయోటిన్ లోపం: బయోటిన్ లోపం అసాధారణం అయినప్పటికీ..అది లోపించినప్పుడు జుట్టు రాలుతుంది.  సమతుల్య ఆహారం తీసుకునేవారిలో లోపం చాలా అరుదు. ఇంట్లోనే బయోటిన్ పౌడర్‌ను తయారు చేసుకోవడానికి ఇక్కడ ఒక సాధారణ పద్ధతి ఉంది.అవేంటో చూద్దాం. వీటిని ఆహారంలో  చేర్చుకుంటే: కాయధాన్యాలు, సోయాబీన్స్,  ఇతర చిక్కుళ్ళు బయోటిన్‌ను అందిస్తాయి. వోట్స్, బార్లీ,  హోల్ వీట్ వంటి తృణధాన్యాలు బయోటిన్ యొక్క మంచి మూలాలు. బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గింజలు,  వాల్‌నట్ వంటి నట్స్‌లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. సాల్మన్,  ట్యూనాతో సహా కొన్ని రకాల చేపలలో బయోటిన్ ఉంటుంది.వీటిని పొడిరూపంలో కూడా తీసుకోవచ్చు. ఇంట్లోనే బయోటిన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి? కావలసినవి: ½ కప్ బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గింజ, వాల్‌నట్ పౌడర్ ½ కప్ వోట్స్ లేదా బార్లీ ½ కప్పు శనగపిండి, చిక్‌పీస్ ½ కప్పు చియా గింజలు ½ కప్పు అవిసె గింజలు తయారీ విధానం: పై పదార్థాలన్నింటిని గ్రైండర్ లో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడొక జార్ తీుసకుని ఆ పొడిని అందులో వేసుకోవాలి. ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. దీనిని మీరు స్మూతీ లేదా టీలో కానీ కలుపుని తీసుకోవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ బయోటిన్ పౌడర్ కలుపుకుని తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం తాగుతే మంచి ఫలితం ఉంటుంది.

చలికాలంలో  ఈ ఒక్క పని చేస్తే  చర్మం  మెరిసిపోతుంది!

 చలికాలంలో  ఈ ఒక్క పని చేస్తే  చర్మం  మెరిసిపోతుంది! చలికాలంలో చర్మం పొడిబారడం, దురద, తామర, చర్మం తెల్లబడటం, చర్మం పొలుసుగా పైకి లేవడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా శరీరంలో తేమ లేకపోవడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు తదితర సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలను నివారించడానికి, గోరువెచ్చని ఉప్పు నీటితో స్నానం చేయడం  చాలా సహాయపడుతుంది. రోజూ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపి స్నానం చేస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు,  చర్మం మెరుపు సంతరించుకుంటాయి. చలికాలంలో చాలా సార్లు పరిశుభ్రత లేకపోవడం, తడి బట్టలతో ఉండటం. చలికారణంగా  శరీరంలో దద్దుర్లు, దురదలు, తామర వంటి సమస్యలు వస్తాయి. వీటన్నింటిని పరిష్కరించడానికి ఉప్పు సహాయపడుతుంది.  ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటికి  చర్మంపై ఉండే బ్యాక్టీరియా,  క్రిములను తొలగించే శక్తి ఉంటుంది. ఇది చర్మసంబంధ   వ్యాధులను నివారిస్తుంది. సాధారణంగా వేసవి కాలంతో పోలిస్తే శీతాకాలంలో చర్మం  మెరుపు తగ్గడం ప్రారంభమవుతుంది. దీనికి మొదటి కారణం చలి వల్ల నీరు సరిపడినంత తీసుకోకపోవడం. శరీరంలో నీటి శాతం లోపిస్తే చర్మ సమస్యలు సులభంగా వస్తాయి. చర్మం కూడా నిర్జీవంగా మారుతుంది.  ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారిలో సమస్య అధికంగా ఉంటుంది.  గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. ఇది  చర్మ రంధ్రాలలో ఉండే మురికిని తొలగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. దీన్ని ఫాలో అయితే  అందం చెక్కుచెదరకుండా ఉంటుంది.   ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడేవారికి కూడా ఉప్పునీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఒత్తిడిగా ఉన్నప్పుడు కండరాలు ఉద్రిక్తంగా ఉంటాయి. ఇలాంటి  పరిస్థితిలో ఉప్పు కలిపిన గోరువెచ్చని నీరు  మంచి పరిష్కారంగా మారుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల కండరాలకు ఉపశమనం కలుగుతుంది.   అలసట తొలగిపోతుంది. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది.                                                    *నిశ్శబ్ద.

ముఖం మీద మచ్చలు తగ్గాలంటే.. కొబ్బరినూనెలో వీటిని కలిపి రాయండి..!

  ముఖం మీద మచ్చలు తగ్గాలంటే.. కొబ్బరినూనెలో వీటిని కలిపి రాయండి..!   మచ్చలేని చర్మం ప్రతి అమ్మాయి కల. కానీ చాలామందికి ముఖం మీద మచ్చలు మొటిమలు, మొటిమల తాలూకు గుర్తులు.. వీటితో ముఖం అంతా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నిజానికి ఎంత అందంగా ఉన్న అమ్మాయిలను అయినా ఈ మచ్చలు, మొటిమలు, వాటి తాలూకు గుర్తులు వికారంగా కనిపించేలా చేస్తాయి. వీటిని తొలగించుకోవడం కోసం చాలా రకాల వాణిజ్య  ఉత్పత్తులు వినియోగిస్తూ ఉంటారు. అయితే మచ్చలేని చర్మం కోసం వందలు, వేలు ఖర్చు చెయ్యక్కర్లేదు.. ఇంట్లోనే ఉండే కొబ్బరి నూనెలో కొన్ని పదార్థాలు కలిపి రాస్తుంటే చాలు.. కొబ్బరినూనెను రోజూ ముఖానికి రాసుకుని ఫేస్ మసాజ్ చేసుకుంటూ ఉంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.  ముఖం మీద మచ్చలు, గీతలు క్రమంగా తగ్గిపోతాయి.  ఒక వేళ మచ్చలు, ముడతలు, గీతలు చాలా ఎక్కువగా ఉంటే కొబ్బరినూనెలో కలబంద జెల్ కలపి వాడాలి.  ఒక స్పూన్ కలబంద జెల్,   ఒక స్పూన్ కొబ్బరినూనె కలిపి బాగా మిక్స్ చేయాలి.  దీన్ని రాత్రిపూట ముఖానికి పట్టించాలి.  ముఖానికి పట్టించాక కొన్ని నిమిషాలు ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి.  తరువాత రాత్రంతా దీన్ని అలాగే వదిలేయాలి.  మరుసటిరోజు ఉదయాన్నే చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.  ఈ టిప్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే ముఖం మీద మచ్చలు,  ముడతలు,  గీతలు,  మొటిమల తాలూకు గుర్తులు అన్నీ మాయమవుతాయి. కొబ్బరినూనెలో కలబంద మాత్రమే కాకుండా పసుపు రాసి ముఖానికి పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.  ఇందుకోసం రెండు నుండి మూడు స్పూన్ల పసుపును తీసుకుని ఒక పాన్ మీద వేసి సన్నని మంట మీద బాగా వేయించాలి. నల్లగా మారే వరకు పసుపును వేయించిన తరువాత స్టౌ ఆఫ్ చేయాలి. పసుపును ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి.  చల్లారిన పసుపులోకి కొద్దిగా కొబ్బరి నూనెను వేసి పేస్ట్ లా కలపాలి.  ఈ పేస్ట్ ను ముఖం మీద అప్లై చేయాలి.  20 నిమిషాల తరువాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.  వారానికి రెండు సార్లు ఈ చిట్కా పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.                                                    *రూపశ్రీ.   

జుట్టు మోకాళ్ల వరకు పెరగాలంటే.. ఉసిరికాయలో ఇదొక్కటి మిక్స్ చేసి రాయాలి..!

  జుట్టు మోకాళ్ల వరకు పెరగాలంటే.. ఉసిరికాయలో ఇదొక్కటి మిక్స్ చేసి రాయాలి..!   జుట్టు అందంగా, ఆరోగ్యంగా  పెరగాలని కోరుకోని వారు ఉండరు. అయితే జుట్టు పెరుగుదల ఇప్పట్లో చాలా అరుదుగా కనిపిస్తోంది.  కొందరు జుట్టు పెరుగుదల జీన్స్ మీద ఆధారపడి ఉంటుందని అంటారు. కానీ జుట్టు పెరుగుదలకు తగిన జీన్స్ ఉన్నా కొన్ని కారణాల వల్ల  జుట్టు పెరుగుదల సరిగా ఉండదు.  కాలుష్యం, ఆహారం సరిగా తీసుకోక పోవడం,  జుట్టు సంరక్షణ చర్యలు పాటించకపోవడం, జుట్టుకోసం చాలా హానికరమైన రసాయనాలున్న ఉత్పత్తులు వాడటం. ఇలా చాలా విషయాలు జుట్టు పెరగకపోవడానికి కారణం అవుతాయి. అయితే ఉసిరికాయలో ఒక్క పదార్థం మిక్స్ చేసి రాస్తే చాలు.. జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందట. ఉసిరి, కొబ్బరినూనె.. ఉసిరికాయ పొడి సాధారణంగా హెన్నా, హెయిర్ మాస్క్ మొదలైన వాటిలో ఉపయోగిస్తుంటారు.  ఉసిరికాయ పొడిలో కొబ్బరినూనె కలిపి రాస్తే జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుందట.  దీన్ని రెండు విధాలుగా రెఢీ చెసుకోవచ్చు. ఉసిరి రసం, కొబ్బరినూనె.. తాజా ఉసిరికాయలు అందుబాటులో ఉన్నవారు దీన్ని ట్రై చేయవచ్చు.  ఉసిరికాయలను తురిమి రసం  తీసుకోవాలి.  ఈ రసానికి సమాన పరిమాణంలో కొబ్బరినూనె తీసుకోవాలి.  ఈ రెండింటిని ఇనుప కడాయిలో వేసి సన్నని మంట మీద మరిగించాలి. రసం అంతా ఇగిరిపోయిన తరువాత స్టౌ ఆఫ్ చేయాలి.  నూనె చల్లారిన తరువాత గాజు సీసాలో పోసి భద్రపరుచుకోవాలి.  ఈ నూనెను తల స్నానం చేయడానికి గంట ముందు తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.  కుదిరితే నూనెను డబుల్ బాయిల్ పద్దతిలో వేడి చేసి గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. గంట తరువాత గాఢత లేని షాంపూ లేదా శీకాయ లేదా కుంకుడుకాయ పొడితో తలస్నానం చేయాలి.  ఇలా చేస్తుంటే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.  వారంలో రెండు సార్లు దీన్ని అప్లై చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఉసిరి పొడి, కొబ్బరినూనె.. తాజా ఉసిరికాయలు అందుబాటులో లేనప్పుడు ఉసిరికాయ పొడిని ఉపయోగించవచ్చు.  కల్తీ లేని ఉసిరికాయ పొడిని తీసుకుని అందులో సమాన పరిమాణంలో కొబ్బరి నూనె కలపాలి.  దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట సేపు అలాగే ఉంచాలి.  ఆ తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. లేకపోతే ఉసిరికాయ పొడిలో కొబ్బరినూనె వేసి దీన్ని సన్నని మంట మీద ఉడికించి తరువాత వడగట్టి కూడా వాడవచ్చు.  ఉసిరికాయను ఇలా కొబ్బరినూనెతో కలిపి వాడుతుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జుట్టు పెరుగుదల వేగంగా ఉంటుంది. అయితే జుట్టు పెరుగుదలకు సహకరించే బయోటిన్, బీటా కెరోటిన్, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, విటమిన్-సి వంటివి ఉన్న ఆహారాలు. గుమ్మడి గింజలు పుష్కలంగా తీసుకుంటూ ఉండాలి.  ఇలా చేస్తే జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది.                                                         *రూపశ్రీ.  

ప్రతి అమ్మాయి తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచుకోవాల్సిన 5 బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవే..!

ప్రతి అమ్మాయి తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచుకోవాల్సిన 5 బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవే..! నేటి రన్-ఆఫ్-ది-మిల్ జీవితంలో, మనం ఎప్పుడూ చాలా విషయాల గురించి గందరగోళంలో ఉంటాము. వీటిలో ఒకటి మేకప్ ఉత్పత్తులు. అమ్మాయిలు అందంగా కనిపించడానికి ఇష్టపడతారని మనందరికీ తెలుసు. కానీ మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, మన రూపాన్ని కాపాడుకోవడానికి, మనం ఎల్లప్పుడూ కొన్ని వస్తువులను మన బ్యాగ్‌లో ఉంచుకోవాలి. సహజంగానే  మొత్తం మేకప్ కిట్‌ను  బ్యాగ్‌లో అన్ని సమయాలలో ఉంచుకోలేము. అటువంటి పరిస్థితిలో, మన బ్యాగ్‌లో ఎల్లప్పుడూ ఉండవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువుల జాబితా గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. సన్స్క్రీన్: సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని UVA UVB నుండి రక్షిస్తుంది. అంటే సూర్యుని హానికరమైన కిరణాలు, కాలుష్యం నుండి కూడా రక్షిస్తుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా, కనీసం 5 నుండి 10 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ అప్లై చేసి, కొన్ని గంటల తర్వాత మళ్లీ అప్లై చేయండి. మీరు సన్‌స్క్రీన్‌ను ఇండోర్, అవుట్‌డోర్‌లో ఉపయోగించవచ్చు. కాజల్ పెన్సిల్: కాజల్ పెన్సిల్ మహిళల రూపాన్ని తక్షణమే పెంచడానికి పనిచేస్తుంది. ఇది మీ కళ్లను అందంగా మార్చడం ద్వారా మీ ముఖానికి మరింత అందాన్ని ఇస్తుంది. మీరు స్నేహితుడిని కలవాల్సి వచ్చినా లేదా ఎవరితోనైనా డిన్నర్ కు  వెళ్లాల్సి వచ్చినా ఎల్లప్పుడూ స్మడ్జ్ ప్రూఫ్, వాటర్‌ప్రూఫ్ కాజల్‌ని ఉపయోగించండి. వెట్ వైప్స్: మీ బ్యాగ్‌లో వెట్  వైప్స్ చిన్న ప్యాకెట్ ఉంచడం మర్చిపోవద్దు. మీరు ఆఫీసుకు, కాలేజీకి లేదా బయట ఎక్కడికైనా వెళితే, మీ ముఖంలోని మురికిని శుభ్రం చేయడంలో ఇది సహాయపడుతుంది. మీరు జిడ్డుగల లేదా పొడి చర్మం కలిగి ఉన్నారా, ఇది అందరికీ పని చేస్తుంది.   కాంపాక్ట్: టచ్-అప్‌ల కోసం మీ బ్యాగ్‌లో చిన్న అద్దంతో కూడిన మేకప్ కాంపాక్ట్ తప్పనిసరిగా ఉండాలి. తరచుగా టచ్‌అప్‌లతో, మీరు మీ మేకప్‌ను అతుక్కొని ఉంచుకోవచ్చు. లిప్ బామ్‌: మన పెదవులకు ఎల్లవేళలా పోషణ, తేమ అవసరం. మారుతున్న సీజన్‌లో, మన పెదాలు చాలా పొడిగా, పగిలిపోయేలా చేస్తాయి. కాబట్టి దీనిని నివారించడానికి, మీరు తప్పనిసరిగా మీతో లిప్ బామ్‌ను ఉంచుకోవాలి. లిప్ బామ్‌లు పర్యావరణ కాలుష్యం నుండి మీ పెదాలను రక్షించడంలో కూడా సహాయపడతాయి.  

మీ హైట్ తక్కువా? ఇలా చీర కడితే పొడవుగా కనిపిస్తారు..!

  మీ హైట్ తక్కువా? ఇలా చీర కడితే పొడవుగా కనిపిస్తారు..! మనిషి రూపం మనిషి అందాన్ని నిర్ణయిస్తుంది.  ముఖ్యంగా అందానికి మారు పేరుగా చెప్పే అమ్మాయిలు అందంగా కనిపించే విషయంలో ఎక్కడా రాజీ పడరు.  శరీరంలో ఏం తక్కువైనా సరే.. ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి చూపరులను ఆకట్టుకుంటారు.  కొందరు అమ్మాయిలు చాలా పొట్టిగా ఉంటారు. ఇలాంటి వారు ఎలాంటి దుస్తులు వేసినా చిన్న పిల్లల్లా కనిపిస్తారు.  ముఖ్యంగా పెద్దరికానికి మారు పేరుగా చెప్పుకునే చీరను ధరించాలంటే  పొట్టిగా ఉన్న అమ్మాయిలు సతమతం అవుతారు.  కానీ చీర కట్టుకుని అందంగా మెరిసిపోవడం ప్రతి అమ్మాయి కల.  అయితే పొట్టిగా ఉన్న అమ్మాయిలు కొన్ని టిప్స్ పాటిస్తూ చీర కడితే వారి హైట్ ను హైడ్ చేయవచ్చు. అదెలాగో తెలుసుకుంటే.. ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు చీరల సెలక్షన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి.  కంటికి బాగా కనిపించడం కాదు.. తమ ఒంటికి ఏవి నప్పుతాయో.. తమ హైట్ ను ఏవి బాగా కవర్ చేస్తాయో తెలుసుకోవాలి.  హైట్ తక్కువగా ఉన్నవారు బోల్డ్ గా ఉన్న చీరలు,  పెద్ద ప్రింట్లు ఉన్న చీరలు ధరించకూడదు.  ఇలాంటి చీరలు పొట్టిగా ఉన్న అమ్మాయిలను మరింత పొట్టిగా కనిపించేలా చేస్తుంది. పొట్టిగా ఉన్న అమ్మాయిలు షిపాన్ ఫాబ్రిక్ చీరలు ఎంపిక చేసుకోవడం మంచిది.  ఇవి శరీరానికి అతుక్కున్నట్టు ఉంటాయి.  అందంగా కనిపించేలా చేస్తాయి.  బొమ్మకు కట్టినట్టు చక్కగా ఇమిడిపోతాయి. వేరే చీరలు అయితే కుచ్చిళ్లు,  కొంగు, నడుము భాగంలో సరిగా సెట్ కావు. ఇవి బాగా లావుగా కనిపించేలా చేస్తాయి.  దీని కారణంగా అప్పటికే ఉన్న పొట్టిదనం ఇంకా పొట్టిగా కనిపించేలా చేస్తుంది.  కాబట్టి పొట్టిగా ఉన్నవారు షిఫాన్ ఫాబ్రిన్ ఎంచుకోవాలి. షిఫాన్ చీరలు కేవలం సాధారణ సమయాలలోనే కాదు.. వేసవి కాలంలో కూడా బాగా సెట్ అవుతాయి.  ఈ ఫాబ్రిక్ తేలికగా ఉంటుంది కాబట్టి వేసవిలో చిరాకు,  అసహనానికి దారితీయవు. పైగా ఈ చీరలు ఎత్తు ఎక్కువగా కనిపించడంలో సహాయపడతాయి. షిఫాన్ చీర మాత్రమే కాకుండా జార్జెట్ చీర కూడా పొట్టిగా ఉన్నవారికి బాగా సెట్ అవుతుంది. ఎత్తు తక్కువగా ఉన్నవారు చిన్న ప్రింట్లు ఉన్న చీరలను ఎంచుకుంటే మంచిది. పొట్టిగా ఉన్నవారు బనారసీ సిల్క్, ఆర్ట్ సిల్క్, అస్సాం సిల్క్ వంటి చీరలు కట్టుకోకపోతేనే బెస్ట్.  ఇవి చాలా హెవీగా ఉంటాయి.  హైట్ ను హైడ్ చేయడానికి బదులు ఆ బరువు చీరలు ఇంకా పొట్టిగా కనిపించేలా చేస్తాయి. ఒక వేళ సిల్క్ చీరల మీద ఇష్టం ఉంటే పేపర్ సిల్క్ చీరలను ఎంచుకోవడం బెస్ట్.                                                   *రూపశ్రీ.

అరటిపండుతో ఇలా ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి.. ముఖం మెరిసిపోతుంది..!

అరటిపండుతో ఇలా ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి.. ముఖం మెరిసిపోతుంది..! అమ్మాయిలు చర్మ సంరక్షణ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  వీటిలో చాలా ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఫేస్ ప్యాక్ లు. కొందరు శనగపిండి, పసుపు, పెరుగు వంటి వంటింటి పదార్థాలతో ఫేస్ ప్యాక్ వేస్తుంటారు.  మరికొందరు పండ్లతో ఫ్రూట్ ఫేస్ ప్యాక్ వేస్తుంటారు.  పండ్లతో ఫేస్ ప్యాక్ తయారుచేసుకుని వేసుకోవడం వల్ల ముఖ చర్మానికి పోషణ లభిస్తుంది.  చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మారుతుంది.  అరటి పండుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడితే అద్బుతమైన ఫలితాలు ఉంటాయట. అరటిపండుతో ఎన్ని రకాల ఫేస్ ప్యాక్ లు వేసుకోవచ్చు? వాటిని ఎలా తయారు చేసుకోవాలంటే.. అరటిపండు- తేనె ఫేస్ ప్యాక్.. అరటిపండును బాగా గుజ్జులాగా చేసి అందులో తేనె కలపాలి.  ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత కడిగెయ్యాలి.  ఈ ఫేస్ ప్యాక్ పొడి చర్మానికి బాగా నప్పుతుంది.  ఈ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, మెరిచేలా చేస్తుంది. అరటిపండు- పెరుగు.. బాగా  పండిన అరటిపండులో రెండు చెంచాల పెరుగు వేయాలి.  దీన్ని మెత్తగా చేసుకోవాలి.  ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖం మీద మచ్చలు తగ్గిస్తుంది.  చర్మాన్ని టోన్ చేస్తుంది. అరటి పండు- ఓట్స్.. అరటిపండు, ఓట్స్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. డెడ్ స్కిన్  సెల్స్ తొలగిస్తుంది.  పండిన అరటిపండులో 2 చెంచాల ఓట్స్ పౌడర్ వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 15 నిమిషాలు అలాగే ఉంచాలి.  ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.  చర్మం మృదువుగా కూడా మారుతుంది. అరటిపండు-అలోవెరా.. అరటిపండు, అలోవెరా ఫేస్ ప్యాక్ ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.  చర్మం చికాకులు తగ్గిస్తుంది. పండిన అరటిపండులో రెండు చెంచాల అలోవెరా జల్ వేసి బాగా మిక్స్ చేయాలి.  ఈ మిశ్రమాన్ని పేస్ ప్యాక్  వేసుకుని 15 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.   అరటిపండు- పసుపు.. అరటిపండు, పసుపు ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. చర్మం మీద మచ్చలను తగ్గిస్తుంది.  పండిన అరటిపండులో అరటీస్పూన్ పసుపు వేసి కలపాలి.  దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. అరటిపండు- బాదం.. ఈ ఫేస్ ప్యాక్ పొడి చర్మం ఉన్నవారికి చాలా మంచిది. చర్మానికి పోషణ ఇస్తుంది.  పండిన అరటిపండులో నానబెట్టి తొక్క తీసి మిక్సీ వేసిన బాదం పేస్ట్ వేయాలి.  లేదంటే పండిన అరటిపండుతో కలిపి నానబెట్టిన బాదం ను మిక్సీ వేసుకోవాలి.  ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.                                           *రూపశ్రీ.

జుట్టు దువ్వుకోవడానికి చెక్క దువ్వెన వాడచ్చా? ఈ నిజాలు మీ కోసమే..!

  ఆరోగ్యకరమైన జుట్టు కోసం చాలా రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. తలకు పెట్టుకునే నూనె నుండి, షాంపూ, కండీషనర్ వాడటం వరకు.  విడిగా తమకంటూ టవల్ ఉపయోగించడం  నుండి.. తల స్నానం తరువాత జుట్టును ఆరబెట్టడం వరకు.. ఇలా ప్రతి దశలో చాలా కేర్ తీసుకునేవారు చాలామంది ఉంటారు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకునేవారు దువ్వెన విషయంలో మాత్రం పప్పులో కాలు వేస్తుంటారు. ఉపయోగించే దువ్వెన కూడా జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మధ్య కాలంలో కొందరు చెక్క దువ్వెనలు వాడుతున్నారు.  ఇవి కూడా మేలు రకం చెక్కతో, ఆయుర్వేదం సూచించిన కలపతో తయారుచేసినవి ఉపయోగిస్తుంటారు.  ఇంతకీ చెక్క దువ్వెనలు ఉపయోగించడం వల్ల జరిగేదేంటంటే..  ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువసేపు రబ్ చేసినప్పుడు అందులో నుండి విద్యుత్ పుట్టడం గమనించే ఉంటాం.  ప్లాస్టిక్ దువ్వెనలు కూడా ఇదే విధంగా పనిచేస్తాయి.  ప్లాస్టిక్ దువ్వెనతో తలలో దువ్వెటప్పుడు అవి ఉత్పత్తి చేసే విద్యుత్ కారణంగా జుట్టు, తల చర్మం దెబ్బ తింటుంది. ఇది జుట్టు బలహీనం కావడానికి, జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. కానీ చెక్క దువ్వెనలతో ఈ సమస్య ఉండదు.  పైగా చెక్క దువ్వెనల దంతాలు పెద్దవిగా ఉండటం వల్ల జుట్టుకు మేలు జరుగుతుంది. చెక్క దువ్వెన ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది. ఇది తలలో తేమ నిలిచి ఉండటానికి సహాయపడుతుంది. చెక్క దువ్వెన వెడల్పుగా, పెద్దగా ఉన్న దంతాలు కలిగి ఉంటుంది.  దీంతో దువ్వుడం వల్ల తలకు తేలిక పాటి మసాజ్ చేసినట్టు ఉంటుంది. అంతే కాదు.. జుట్టు చిక్కులను కూడా సులువుగా వదిలిస్తుంది. ఈ కారణంగా ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల స్కాల్ప్ నుండి డెడ్ స్కిన్, చుండ్రు, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. చెక్క దువ్వెనలు జుట్టుకు సహజ నూనెలు సమాంతరంగా పంపిణీ అయ్యేలా చేస్తాయి.  ఇది జుట్టు ఆరోగ్యంగా, షైనింగ్ గా ఉండేందుకు సహాయపడుతుంది. చెక్క దువ్వెనలో ఎలాంటి రసాయనాలు ఉండవు.  ఇవి కొన్ని ఆయుర్వేదం సూచించిన కలపతో తయారవుతాయి. కాబట్టి ఇవి తల చర్మానికి మేలు చేస్తాయి తప్ప చర్మాన్ని దెబ్బతీయవు.  కాబట్టి అలర్జీలు వచ్చే అవకాశం తక్కువ. ఆయుర్వేదంలో చెక్క దువ్వెనకు చాలా ప్రాముఖ్యత ఉంది.  పైగా చెక్క దువ్వెనలు ఉపయోగించడం పర్యావరణానికి కూడా మంచిది. ప్లాస్టిక్ దువ్వెనతో పోలిస్తే చెక్క దువ్వెనలు చాలా కాలం మన్నిక వస్తాయి.                                           *రూపశ్రీ.