ఇంట్లోనే అందుబాటులో ఉన్నవాటితో బ్రాండ్ ను తలపించే బాడీ లోషన్!

ఇంట్లోనే అందుబాటులో ఉన్నవాటితో  బ్రాండ్ ను తలపించే బాడీ లోషన్!   చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు అధికం అవుతాయి. వీటిని తేలిగ్గా తీసుకుంటే ఆ తరువాత చాలా నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగానే అమ్మాయిలు చాలా మంది మార్కెట్లో బోలెడు బాడీ లోషన్లు కొనుగోలు చేస్తారు. బ్యూటీ ఉత్పత్తి దారులు కూడా చలికాలం మొదలైందంటే బాడీ లోషన్, మాయిశ్చరైజర్లకు సంబంధించి యాడ్స్ తో సావగొడుతుంటారు. అయితే ఇవన్నీ రసాయలతో కూడినివి కావడంతో వీటిని కొనుగోలు చేయడంలో చాలా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉన్న పదార్థాలతో బ్రాండెడ్ బాడీ లోషన్ల లాగా  ఫలితాలు ఇచ్చే బాడీ లోషన్ ను తయారుచేయవచ్చు. దీనికి కావలసిన పదార్థాలేంటో.. పూర్తీగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. బాడీ లోషన్ తయారీకి కావసిన పదార్థాలు చాలా సింపుల్ గా ఇంట్లో లభ్యమయ్యేవే.. ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె నిమ్మకాయ అరచెక్క విటమిన్-ఇ క్యాప్సుల్స్ మూడు నుండి నాలుగు తయారుచేసుకునే విధానం.. ముందుగా  నిమ్మకాయ రసం తీయాలి. ఒక కప్పు కొబ్బరినూనెను ఒక గిన్నెలో వేసుకునే సన్నని మంట మీద కొద్దిగా వేడి చేయాలి. ఇందులో విటమిన్-ఇ క్యాప్సూల్, నిమ్మరసం వేయాలి. దీని ప్రభావం మరింత ధృడంగా ఉండటానికి దీనికి కొబ్బరి నూనెతో పాటు బాదం నూనెను సమంగా తీసుకుని ఉపయోగించవచ్చు. ఇవన్నీ కలిసి బాగా మిక్స్ చేసిన తరువాత దీన్ని ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని అప్లై చేస్తూంటే ఏ బ్రాండ్ బాడీ లోషన్ కూడా ఇవ్వని గొప్ప ఫలితాలు ఇస్తుంది.                                       *నిశ్శబ్ద.

ముఖ చర్మం పాడవుతోందా.. మీరూ  ఈ తప్పులు  చేస్తున్నారేమో.!

ముఖ చర్మం పాడవుతోందా... మీరూ  ఈ తప్పులు  చేస్తున్నారేమో!     అమ్మాయిలలో ఎక్కువగా ఆకర్షించేది ముఖమే. ముఖం అందంగా ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ మరింత ఆకర్షణగా మారుతుంది.  చర్మం రంగు ఏదైనా సరే ముఖం చక్కగా, కాంతివంతంగా, మొటిమలు, మచ్చలు ఏవీ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. కానీ  అలాంటి ముఖం చాలా తక్కువ మందికి ఉంటుంది.  అయితే ముఖం మీద మచ్చలు, ముడతలు, మొటిమల తాలూకు గుర్తులు ఏవీ లేకుండా ఉండటం కోసం ఎన్నో రకాల బ్యూటీ ఉత్పత్తులు వాడతారు. ఫేస్ క్రీములు, లోషన్లు, ఫేస్  వాష్ లు ఇలా చాలా ఉపయోగిస్తారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ ఉత్పత్తులన్నీ మంచి వాసన వస్తాయి తప్ప చర్మాన్నిమాత్రం బాగు చెయ్యవు.  చర్మం చక్కబడాలంటే దానికి కావల్సింది  వాణిజ్య ఉత్పత్తులు ఉపయోగించడం కాదు, చర్మాన్ని శుభ్రం చేసే విధానం తెలుసుకోవడం. ఫేస్ వాష్ చేయడంలో  చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో తెలుసుకుని వాటిని  సరిచేసుకోవడం అవసరం. క్లెన్సర్.. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సరైన క్లెన్సర్ ఎంచుకోవడం తప్పనిసరి. చాలామంది కొంటున్నారనో, మార్కెట్లో వైరల్ అవుతోందనో క్లెన్సర్ కొనుగోలు చేయకూడదు.  చర్మాన్ని బట్టి క్లెన్సర్ ఎంచుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి ఎటువంటి నష్టం కలగదు. ఆశించిన ఫలితాలు కూడా ఇస్తాయి. ఒకవేళ ఏదైనా క్లెన్సర్ ఉపయోగించగానే ముఖం మీద గుల్లలు, దద్దుర్లు, ముఖ చర్మం ఎర్రబడటం వంటివి జరిగితే అలాంటి క్లెన్సర్ కు దూరం ఉండాలి. వేడినీరు వద్దు.. ముఖం శుభ్రం చేసుకోవడానికి కొందరు వేడినీరు ఉపయోగిస్తారు. దీనివల్ల చర్మం శుభ్రపడుతుందని అంటారు. కానీ వేడినీటితో ముఖం కడిగితే ముఖ చర్మంలో ఉన్న తేమ కోల్పోతారు. అదే చల్లని నీటితో కడితే ముఖ చర్మం తేమ కోల్పోదు. రుద్దకూడదు.. ముఖం కడిగేటప్పుడు   క్లెన్సర్ లేదా సోప్ వంటివి ఉపయోగించే ముందు ముఖాన్ని గట్టిగా రుద్దుతూ ఉంటారు. ఇలా చేస్తే చర్మం దెబ్బతింటుంది.  మృదుత్వం కోల్పోయి చర్మం రఫ్ గా మారిపోతుంది. అంతేకాదు చర్మ రంధ్రాలు కూడా సాగిపోవడానికి అస్కారం ఉంటుంది. ముందు జాగ్రత్త.. ముఖం కడుక్కోవడానికి ముందు చేతులు  శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. చేతులు శుభ్రం చేసుకోకుండా ముఖం కడుక్కుంటే  చేతులలో ఉన్న మురికి ముఖ చర్మానికి అంటుకుంటుంది. ఇది ముఖం మీద మొటిమలు, గుల్లలు, దద్దుర్లు, ముఖం రంగుమారడం వంటి సమస్యలకు కారణం అవుతుంది.                                                    *నిశ్శబ్ద.

ఈ నాలుగు పదార్థాల ముందు బ్యూటీ పార్లర్ లో ఖరీదైన ఫేషియల్స్ కూడా పనికిరావు.!

 ఈ నాలుగు  పదార్థాల ముందు  బ్యూటీ పార్లర్ లో ఖరీదైన ఫేషియల్స్ కూడా పనికిరావు.. అమ్మాయిలకు చర్మ సంరక్షణ మీద ఆసక్తి ఎక్కవ. చాలా మంది చర్మ సంరక్షణ పేరుతో  దృష్టి అంతా ముఖ కాంతిని పెంచడంపైనే ఉంచుతారు.   ముఖంలో  మెరుపు కనిపిస్తూ ఉంటే చాలు తాము యవ్వనంగా ఉన్నామని అనుకుంటారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్ లో వందలాది రూపాయలు ఖర్చు చేస్తారు.  పండుగలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్లు, పార్టీలు చాలా చిన్న వేడుకలలో కూడా అమ్మాయిలు తమ అందాన్ని మెరిపించడానికి ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. బ్యూటీ పార్లర్లలో కాస్త ఖరీదైన ఫేషియల్ క్రీములు ఉపయోగించి వేలాది రూపాయలు  తీసుకుంటారు. వీటిని వాడటం వల్ల చర్మం మెరుపు వచ్చినా అది తాత్కాలికమే. కానీ బ్యూటీ పార్లర్ ఫేషియల్స్ ను తలదన్నే  పదార్దాలు చాలా సులువుగా, తక్కువ ధరకే  లభిస్తాయి. వీటిని ఉపయోగిస్తే ముఖం దగదగ మెరిసిపోతుంది. పచ్చిపసుపు.. పచ్చిపసుపు ముఖానికి మెరుపు ఇవ్వడంలోనూ, ముఖం మీద మచ్చలు, మొటిమలు, మొటిమల తాలుకూ గుర్తులను తగ్గించడంలోనూ బాగా సహాయపడుతుంది. రెండు చెంచాల పచ్చిపసుపును ఒక చెంచా శనగపిండితో కలపాలి. దీంట్లో తగినంత రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత చేతులను కొద్దిగా తడి చేసి ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేయాలి. దీన్ని రెండు లేదా మూడు రోజులకు ఒకసారి వాడాలి. కేవలం మూడు సార్లు వాడటంతోనే ముఖం లో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీన్ని లైప్ స్టైల్ లో భాగం చేసుకుంటే ముఖానికి ఏ క్రీములు అక్కర్లేదు. జాజికాయ.. చర్మంపై మచ్చలు మరియు మచ్చలను తొలగించడంలో జాజికాయ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. జాజికాయను గ్రైండ్ చేసి, దాని పొడిని తయారు చేసుకోవాలి. ఈ పొడికి  తేనెను కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మొత్తం ముఖం మీద లేదా మచ్చలు, మొటిమలు ఉన్న ప్రాంతంలో అయినా   చేయవచ్చు. దీన్ని రాత్రి ముఖానికి రాసుకుని అలాగే వదిలేయవచ్చు.  తెల్లారేసరికల్లా ముఖం మెరిసిపోతుంది. దీన్ని పాలో అవుతుంటే అసలు ముఖానికి ఏ ఇతర ఉత్పత్తులు వాడక్కర్లేదు. చందనం.. చందనం చలువ చేస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు తగ్గిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. రెండు చెంచాల గంధపు పొడికి రోజ్ వాటర్ వేసి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.  దీన్ని ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తరువాత తడి చేత్తో సున్నితంగా స్ర్కబ్ చేస్తూ కడిగేసుకోవాలి. దీని వల్ల టానింగ్ సమస్య తొలగిపోయి గ్లో పెరుగుతుంది. దాల్చిన చెక్క.. వంటల్లోకే కాదు ముఖ సౌందర్యంలోనూ దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కను  మిక్సీలో వేసి  పొడి చేసుకోవాలి. అందులో పండిన అరటిపండు వేసి బాగా  కలపాలి. దీన్ని మెత్తని గుజ్జులా తయారుచేసుకోవాలి. ఇందులో ఒక చెంచా తేనె కలపాలి. దీన్ని ముఖానికి పట్టించాలి.  ఆరిన తరువాత శుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఇది చర్మం మెరుపును మెరుగుపరుస్తుంది. ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.                                                           *నిశ్శబ్ద.

గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. ఇలా వాడిచే అందాన్ని కూడా మెరిపిస్తుంది..

గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. ఇలా వాడితే  అందాన్ని  కూడా మెరిపిస్తుంది..   ఆరోగ్యం మీద స్పృహ ఉన్న చాలామంది  గ్రీన్ టీ తప్పకుండా తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తాగితే కొలెస్ట్రాల్ అదుపులో ఉండటం నుండి, బరువు తగ్గడం వరకు, ఇమ్యునిటీ పెరగడం నుండి రోజంతా ఉల్లాసంగా ఉండటం వరకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గ్రీన్ టీని కేవలం ఆరోయానికే కాదు, అందాన్ని మెరిపించడానికి కూడా ఉపయోగించవచ్చు. మారుతున్న జీవనశైలి, వాతావరణ ప్రభావం, ఆహారపు అలవాట్లలో మార్పు, దుమ్ము, ధూళి కారణంగా చర్మం దెబ్బతింటుంది. దీన్ని తిరిగి మెరిసేలా చేయడానికి బ్యూటీ పార్లర్లలో బోలెడు డబ్బు పోస్తుంటారు. కానీ అవన్నీ వద్దండోయ్.. కేవలం  గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ లు చర్మాన్ని మెరిపిస్తాయి. గ్రీన్ టీ తో తయూరుచేసి వాడాల్సిన ఫేస్ ప్యాక్ లు ఏంటో ఓ లుక్కేస్తే.. ముల్తాని మట్టి, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్.. జిడ్డు చర్మం ఉన్నవారికి ముల్తానిమట్టి చాలా  ఉపయోగకరంగా ఉంటుంది. ఒక చెంచా ముల్తానీ మట్టికి 2 చెంచాల గ్రీన్ టీ వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మందంపాటి పొరగా ముఖం మీద అప్లై చేసి కనీసం 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది జిడ్డును తొలగించడమే కాదు మృదువుగా ఉంచుతుంది. ముఖ చర్మాన్ని మెరిపిస్తుంది. ఆరెంజ్ పీల్, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్.. ఆరెంజ్ తొక్కలను  ముఖానికి ఉపయోగించడం ద్వారా చర్మం మెరుస్తుంది. ఇక దీనికి గ్రీన్ టీ కూడా జోడిస్తే రెట్టింపు ఫలితాలు పొందుతారు.  . తాజా నారింజ తొక్కలను అయినా ఉపయోగించవచ్చు. లేదా నారింజ తొక్కల పొడిని అయినా ఉపయోగించవచ్చు.  ఒక చెంచా గ్రీన్ టీలో ఒక చెంచా నారింజ తొక్క పొడి,  అర చెంచా తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను  ముఖం,  మెడపై  అప్లై చేయాలి. దీన్ని 15నిమిషాల పాటు అలాగే ఉంచాలి.  ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. నిమ్మ, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్.. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఒక చెంచా గ్రీన్ టీ నీటిలో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేయాలి. దీన్ని అప్లై చేసే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. దాదాపు 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో కడగాలి. అంతే కేవలం మూడే మూడు ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల పార్లర్ టైప్ మెరుపు సొంతమవుతుంది.                                                         *నిశ్శబ్ద.

పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే వారి చదువు ఎలా ఉండాలో తెలుసా!

పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే వారి చదువు ఎలా ఉండాలో తెలుసా?   చదువుకోరా గాడిదా అని చిన్నపిల్లలను  పెద్దలు ఒక్కసారి అయినా తిట్టే ఉంటారు, ఇప్పటి పెద్దలు కూడా తమ చిన్నతనంలో  తమ తల్లిదండ్రులతో తిట్టించుకునే ఉంటారు. చదువుకోవాల్సిన వయసులో దాని విలువ అర్థం కాలేదు, వయసైపోయిన తరువాత చదువు విలువ అర్థం అవుతుందని చాలామంది చెబుతారు. ఈ కారణంగానే  పెద్దలు తమ పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటుంటారు. కానీ పిల్లలు అందరూ ఒకేలా చదవరు, ఒక్కొక్కరు  ఒకోవిధంగా చదువుతుంటారు. చదువుతున్నప్పుడు పిల్లలు తరచూ ఒక అంశాన్ని పునరావృతం చేస్తూ  నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, దీనిని రోట్ లెర్నింగ్ అని తెలుగులో బట్టీ పట్టడం అని అంటారు. ఒకరి జ్ఞాపకశక్తి ఎంత మెరుగ్గా ఉంటే పరీక్షలో సమాధానాలు అంత బాగా వ్రాస్తారని, దాని ద్వారా వచ్చే  ఫలితం ఆధారంగా అతన్ని తెలివైన పిల్లవాడు అని పిలుస్తారు. అయితే లోతుగా ఆలోచిస్తే అలాంటి పిల్లలు నిజంగా తెలివైన వారా?  నిజంగా భవిష్యత్తులో  గొప్పగా మారుతార? అంటే ఖచ్చితమైన సమాధానం లేదు! పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే  పిల్లలు  ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోవడంలో చాలా మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు.  కానీ  జీవితానికి సంబంధించిన నిజమైన జ్ఞానాన్ని కోల్పోతారని పరిశోధకులు కూడా చెబుతున్నారు.   వారు  తమ చదువును కూడా సరిగా వినియోగించుకోలేరు.  విద్య అంటే నేర్చుకోవడం.  జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి  పాఠశాల విద్య ఆధారమవుతుంది. అందువల్ల జీవితంలో సక్సెస్ కావడానికి ఏ విషయాన్ని అయినా లోతుగా అర్థం చేసుకోవడం కావాలి తప్ప విషయాన్ని గుర్తుంచుకోవడం కాదు కావాల్సింది. అంటే పిల్లలు ఏదైనా విషయాలను గుర్తుంచుకోవడం కంటే ఆ విషయాలను అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోవడం వల్ల పిల్లల  జీవితం  అటు విద్యాపరంగానూ, ఇటు జీవితపరంగానూ  ఎదుగుతుంది. గుర్తుంచుకోవడం కంటే విషయాలను అర్థం చేసుకోవడం ఎందుకు మంచిదంటే.. బట్టీ పట్టడం ద్వారా పిల్లలు  శబ్ద జ్ఞానాన్ని పొందుతారు అప్పుడు వారికి  పదాలు మాత్రమే మనస్సులో నిలిచిపోతాయి. పిల్లవాడు ఇలా చదివితే అతను  కంఠస్థం చేసిన పదాల సంఖ్యకు అతని అభివృద్ది  పరిమితమవుతుంది.  అదే ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే విషయ పరిజ్ఞానం పెరుగుతూ పోతుంది. బట్టీ పట్టే ప్రక్రియ కారణంగా పిల్లల మానసిక ఎదుగుదల  సరిగా ఉండదు. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం అనేది ఒకరి మేధో సామర్థ్యాన్ని పెంచే విషయాలపై మంచి అవగాహనకు దారి తీస్తుంది. బట్టీ పట్టడం వల్ల పిల్లలు అలసిపోతారు. పిల్లలు కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోకుండా విషయాలను కంఠస్థం చేసినప్పుడు  నీరసం వస్తుంది. మెదడు అలసిపోతుంది. బట్టీ పట్టి చదివే పిల్లలు నిజ జీవితంలో ఏ విషయాన్ని ఒక పద్దతి ప్రకారం ఆచరించలేరు.  విషయాన్ని అర్థం చేసుకోవడం,  రాయడం ద్వారా పిల్లలు మరింత సమర్థవంతంగా ఉంటారు.  జీవితంలోని కష్ట సమయాల్లో కూడా  ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల వారి ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. జ్ఞాపకం అనేది స్వల్పకాలిక ప్రక్రియ. ఇది కొద్దికాలం మాత్రమే  ప్రభావవంతంగా ఉంటుంది. కొన్నిరోజుల తరువాత విషయాన్ని మరచిపోతారు. అందుకే పదే పదే రివిజన్ చేయాల్సి ఉంటుంది. అదే  విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత  దాన్ని రాయడం అలవాటు చేసుకుంటే అది చాలాకాలం పాటు గుర్తిండిపోతుంది. అందుకే పెద్దలు పిల్లలకు విషయాన్ని అర్థం చేసుకుని చదివే దిశగా మార్గనిర్దేశం చేయాలి.  అవసరమైతే చిన్న చిన్న ఉదాహరణలు చెబుతుండాలి. ఎంతసేపు మార్కుల కోణంలో పిల్లలను సతాయించకుండా పిల్లల ఆలోచనా పరిధి ఏంటి అనే విషయాన్ని గుర్తించాలి.                                                                  *నిశ్శబ్ద. 

ముప్పై ఏళ్ళకే  ముఖం మీద ముడతలా.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

ముప్పై ఏళ్ళకే  ముఖం మీద ముడతలా.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు! వయసు పెరిగే కొద్దీ దాని ప్రభావం మొదట  ముఖంపైనే కనిపిస్తుంది. వృద్ధాప్యం అనేది ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి, కానీ  దాని కారణంగా ముఖం ముసలిగా కనిపిస్తుంది.  ముఖ్యంగా  30 ఏళ్లు దాటిన తర్వాత ముఖంపై  గీతలు,  ముడతలు క్రమంగా చోటు చేసుకోవడం గమనించవచ్చు. వీటిని చూసి చాలామంది అమ్మాయిలు చాలా నీరసపడతారు, అందం గురించి భయపడతారు. ముడతలు పోగొట్టుకోవడం కోసం మార్కెట్లో లభించే ఖరీదైన క్రీములు,  లోషన్ల కోసం డబ్బు ఖర్చు చేస్తుంటారు.   కానీ ఇవి ధీర్ఘకాలిక  ఫలితాలను ఇవ్వవు. అయితే ఆయుర్వేదంలో యాంటీ ఏజింగ్  రెమిడీస్ ఉన్నాయి. ఇవి  పురాతన వైద్య శాస్త్రంలో ప్రస్తావించిన ఔషదాలు. ఇవి  చర్మ సంరక్షణకు, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో అధ్బుతంగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఎంత వయసయినా యవ్వనంగా కనిపిస్తారు. తులసి.. ఇది యాంటీ ఏజింగ్ గుణాలు కలిగిన ఔషదం. ఇది ముడుతలతో పోరాడటానికి చక్కగా  సహాయపడుతుంది. ముఖంపై తులసిని పూయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది, ఎందుకంటే ఇది తేమను లాక్ చేస్తుంది.  ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనితో చర్మం  మీద ఉండే కరుకుదనం పూర్తిగా తొలగిపోయి చర్మం నునుపుగా మారుతుంది. అశ్వగంధ.. అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  చర్మం  రూపాన్ని చాలా వరకు  మార్చవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల  చర్మం యవ్వనంగా,  మునుపటిలా చిన్న వయసు వారిలా మెరిసిపోతుంది . అంతే కాదు ఇది ముడతలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా మార్చేందుకు  సహాయపడుతుంది. ఉసిరి.. యాంటీ-ఆక్సిడెంట్లు,  విటమిన్ సి ఆమ్లా లేదా అమలాకిలో లేదా ఉసిరిలో  సమృద్ధిగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా  మెరుగుపరుస్తుంది, జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. జిన్సెంగ్.. జిన్సెంగ్ ఒక యాంటీ ఏజింగ్ హెర్బ్ . జపనీస్,  కొరియన్ బ్యూటీ ఉత్పత్తులలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ హెర్బ్‌లో ఉండే ఫైటోకెమికల్స్ వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతాయి. ఇది   చర్మం సూర్యరశ్మి వల్ల కలిగే నష్టంతో పోరాడటానికి సహాయపడుతుంది. సరస్వతి.. సరస్వతి మరొక అత్యంత ముఖ్యమైన,  ప్రభావవంతమైన యాంటీ ఏజింగ్  ఔషదం. ఇందులో ఫ్లేవనాయిడ్లు,  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిస్తాయి,  వృద్ధాప్య సంకేతాలతో పోరాడటానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ మూలిక శరీరం  మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. పసుపు.. పసుపు ఒక అద్భుత మూలిక. పసుపులో ఉండే కర్కుమిన్ వయసును  తగ్గించడంలో  అద్బుతంగా సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా పోరాడుతుంది.  సూర్య కిరణాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. పసుపు ఆహారంలో తీసుకోవడం, ముఖానికి  పూయడం రెండూ ముఖంలో మెరుపును తెసుకొస్తాయి.                                         *నిశ్శబ్ద. 

ఇవి తింటే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!

ఇవి తింటే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!   వయసు పెరిగే కొద్దీ మన స్కాల్ప్, హెయిర్, స్కిన్ అన్నీ తమ మెరుపును కోల్పోతాయి. మన చర్మం మెరిసిపోవడానికి మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. అంతే కాకుండా మనం తిన్న తర్వాత మన శరీరంలో జరిగే ప్రక్రియలు కూడా కారణం. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని లోపలి నుండి కాపాడుకోవచ్చు. వయస్సు పెరుగుతున్నా... యవ్వనంగా కనిపించాలంటే వీటిని తినడం అలవాటు చేసుకోండి. బొప్పాయి పండు: బొప్పాయి పండులో యాంటీ ఏజింగ్ గుణాలతోపాటు..యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా లైకోపీన్ బొప్పాయి పండు ఎరుపు రంగులో ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు చర్మం కూడా మెరుస్తుంటుంది. దానిమ్మ పండు: దానిమ్మలో చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు కొల్లాజెన్ ఉత్పత్తిలో పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకున్నట్లయితే  చర్మ ఆరోగ్యం క్షీణించదు. అంతేకాదు  చర్మ సమస్యలు కూడా ఉండవు. పెరుగు: పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం. ఇది మన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మనం తినే ఏ ఆహారం మన శరీరంలో బాగా జీర్ణమైతే అది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు తినడం వల్ల మన చర్మానికి అవసరమైన విటమిన్ బి12 ఎలిమెంట్స్ కూడా అందుతాయి. ఇది మన చర్మం యొక్క గ్లోను పెంచుతుంది. అంతేకాదు కణాల అభివృద్ధికి చాలా సహాయపడుతుంది. ఆకు కూరలు: ఆకుకూరల్లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.  క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల మన చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. టమోటా: టొమాటోలో లైకోపీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి రంగును ఇస్తుంది. టమోటా పండు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఇదే. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన చర్మం  తాజాగా మెరుస్తూ ఉంటుంది. నిత్యం వీటిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  

చుండ్రు తగ్గించే తేలికైన ఉపాయాలు

చుండ్రు తగ్గించే తేలికైన ఉపాయాలు ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల రోజు రోజుకి చుండ్రు సమస్యలు ఎక్కువైపోతున్నాయి . చుండ్రు వల్ల జుట్టు రాలిపోవటం, పేలు రావడం, దురద లాంటివి మొదలవుతాయి. ఈ సమస్యను అరికట్టాలంటే చిన్న చిన్న చిట్కాలు చేయాల్సిఉంటుంది . అవేంటో చూసేద్దాం రండి .. * వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. దురదను తగ్గించడమే కాదు.. చుండ్రు పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది. రెండు గుపిళ్ల నిండుగా వేపాకు, కొద్దిగా మందారకు,కొద్దిగా కలబంద గుజ్జు ఈ మూడింటిని మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారైన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. * పిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు. ఇందుకోసం వెనిగర్ ను, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. * కొబ్బరి నూనెతోనూ చుండ్రు ని తరిమేయొచ్చు. కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది. ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 - 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి. తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది. ఒకవేళ టీ ట్రీ ఆయిల్ లేకపోతే మామూలు కొబ్బరినూనె లో కొద్దిగా కర్పూరం పొడి వేసి కలిపి తలకి పెట్టుకున్న చుండ్రు తగ్గుతుంది. * తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి. నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.చుండ్రు తగ్గే వరకూ ఇలా చేయాలి. * పులిసిన పెరుగును మాస్క్‌గా వేసుకోవడం వల్ల కూడా చుండ్రు తగ్గుముఖం పడుతుంది. ఇందుకోసం ఒక గ్లాస్ పెరుగు లో ఒక స్పూన్ మెంతి పొడి కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం పూట తలకు పట్టించి గంటపాటు అలా వదిలేయాలి. తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.

ఈ ఫేస్ ప్యాక్‎లతో ముఖంపై ముడతలకు చెక్!

ఈ ఫేస్ ప్యాక్‎లతో ముఖంపై ముడతలకు చెక్..!! అందం మనకు భగవంతుడిచ్చిన వరం. దాన్ని సరిగ్గా ఉపయోగించాలంటే మనం టెక్నిక్ తెలుసుకోవాలి. మితిమీరిన మేకప్ కూడా మంచిది కాదు. ఉన్న అందాన్ని ఎక్కువ కాలం నేచురల్ గా మెయింటైన్ చేయాలంటే దాని కోసం నేచురల్ టిప్స్ ఫాలో అవడం మంచిది. అంటే సహజసిద్ధమైన పదార్థాలతో అందాన్ని కాపాడుకోవడం. ఇటీవలి వ్యక్తులలో గమనించదగ్గ ఒక లక్షణం ఏమిటంటే వారు చిన్న వయస్సులో ఉన్నప్పటికీ వారు వృద్ధాప్యంగా కనిపిస్తారు. అలాంటి వారి కోసమే ఈ కథనం. ఇక్కడ కొన్ని అద్భుతమైన నేచురల్ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్‌లు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఎగ్ వైట్ , లెమన్ జ్యూస్ ఫేస్ ప్యాక్! గుడ్డులోని తెల్లసొనలో ఉండే ప్రొటీన్ మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముడతలను తగ్గిస్తుంది.  నిమ్మరసం విటమిన్ సి కంటెంట్‌ను కలిగి ఉంటుంది, ఇది మన శరీరం చర్మానికి ఉపయోగపడే కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి: -కోడి గుడ్డు నుండి పచ్చసొనను తొలగించి తెల్లసొన తీసుకోండి. -దానిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి -ఒక చెంచా సహాయంతో గుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలపండి. -ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి వేలికొనలతో అప్లై చేయండి. -ఇది సుమారు 15 నుండి 20 నిమిషాలు ఆరనివ్వండి. -ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. క్యారెట్,బాదం నూనె ఫేస్ ప్యాక్: ముఖంపై ముడతలను పోగొట్టడంలో,  మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో క్యారెట్ చాలా బాగా పని చేస్తుంది, తద్వారా మీ చర్మం ఎల్లప్పుడూ తాజాగా కనిపిస్తుంది. ఇది కాకుండా, బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ ప్యాక్ ను ఇలా ఉపయోగించండి: -మీడియం సైజులో ఉండే రెండు క్యారెట్లను తీసుకుని వాటి పై తొక్క తీసి మెత్తగా ఉడికించాలి. -తర్వాత క్యారెట్‌లను బాగా మగ్గనివ్వాలి -ఇప్పుడు క్యారెట్‌లో ఒక టీస్పూన్ బాదం నూనె వేసి కలపాలి -దీన్ని ఒక గంట పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, మీ చెంపలపై, కళ్ల చుట్టూ, గడ్డం మీద అప్లై చేయండి. -ఇలా అరగంట అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. బొప్పాయి ఫేస్ ప్యాక్: బొప్పాయి పండులో పాపైన్ ఉండటం వల్ల, ఇది మృత చర్మ కణాలను తొలగించడంలో పనిచేస్తుంది. ఇది చర్మాన్ని చాలా సాగేలా, దృఢంగా చేస్తుంది. బొప్పాయిలో మెగ్నీషియం,  ఫోలేట్ కూడా ఉన్నాయి, కాబట్టి ఇది ఆరోగ్యకరమైన చర్మం,  మృదువైన చర్మానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ ఎలా ఉపయోగించాలి: -బాగా పండిన బొప్పాయి పండు కొన్ని ముక్కలను తీసుకోండి -దీన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి - మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి -తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి -ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీ చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. దోసకాయ ఫేస్ ప్యాక్: దోసకాయ మీ శరీరానికి యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ను అందిస్తుంది. ఇది మీ చర్మంపై ముడతలను తొలగిస్తుంది. అలాగే నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఈ ప్యాక్ ఎలా ఉపయోగించాలి: -సగం దోసకాయ తీసుకుని బాగా తురుముకోవాలి -దీనికి బీట్ చేసిన గుడ్డులోని తెల్లసొన భాగాన్ని జోడించండి -ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి -దీన్ని మీ చర్మంపై పూయండి. -తర్వాత 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి -ఇలా రోజు విడిచి రోజు అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న ఫైన్ లైన్స్ తొలగిపోతాయి

సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖ సౌందర్యాన్ని పెంచుకునే సింపుల్ టిప్స్ ఇవే..!!

సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖ సౌందర్యాన్ని పెంచుకునే సింపుల్ టిప్స్ ఇవే..!! నేచురల్ గా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం అందాన్ని పెంచుకోవాలంటే కెమికల్ ప్రొడక్ట్స్ వాడే బదులు నేచురల్ ఫేస్ ప్యాక్స్ వాడటం అలవాటు చేసుకోవాలి. చాలామందికి నలుగురిలో తామే స్మార్ట్ గా, అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కువగా ఉంటుంది. దీనికోసం మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. తాత్కాలికంగా ముఖ అందాన్ని పెంచినప్పటికీ...సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. కానీ ఇలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్ ఎలిమెంట్స్ ఒక్కసారి ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. దీని తర్వాత మళ్లీ అందం మసకబారుతుంది! కాబట్టి అనవసరమైన కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం, డబ్బు ఖర్చుపెట్టి ముఖ సౌందర్యాన్ని పాడుచేసుకోవడం కాకుండా కొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను వాడితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలాంటి సహజసిద్ధమైన ఉత్పత్తులేంటో నేటి కథనంలో చూద్దాం... పండిన అరటి: సాధారణంగా, అరటిపండు ఎక్కువగా పండినట్లయితే, గుజ్జు మెత్తగా మారుతుంది. అలాంటప్పుడు వాటిని తినాలని అనిపించదు. దానిని చెత్తబుట్టలో పడేస్తుంటాము. అయితే ఇకపై అలా చేయకండి, ఈ పండును పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుంటే చిన్న వయసులో కనిపించే వృద్ధాప్య లక్షణాలు క్రమంగా మాయమవుతాయి. - ముందుగా, బాగా పండిన అరటిపండును తీసుకుని.. పేస్ట్‌లా చేసుకోవాలి. -ఇందులో అర టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ గట్టి పెరుగు కలపాలి. -ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖం, మెడ భాగంలో మందంగా అప్లై చేసి, పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. పాలు : పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా పాలు, దాని ఉత్పత్తుల పేరు ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి. పూర్వ మహారాణులు  తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి పాలతో చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ తో స్నానం చేసేవారని పురాణాలు కూడా చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్. ఇది చర్మంపై మచ్చలు, మొటిమలను తొలగిస్తుంది, ముఖం యొక్క అందం, కాంతిని పెంచుతుంది - కొంచం కుంకుమపువ్వును పాలలో కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. దాదాపు అరగంట తర్వాత స్నానం చేయాలి. - రెండు టేబుల్‌స్పూన్‌ల క్రీమ్‌లో అర టీస్పూన్ పసుపు, ఒక చిన్న చెంచా శనగ పిండి వేసి బాగా కలపాలి. -ఆ తర్వాత వేళ్ల సహాయంతో ముఖానికి పట్టించి వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఐదునిమిషాలపాటు ఉంచి నీళ్లతో కడిగేయాలి. కలబంద: సహజంగా లభించే ఈ కలబంద గురించి మనం మాట్లాడుకుంటే, ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఉన్నాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు, చిన్న వయసులో కనిపించే ముసలితనం సంకేతాలు, చర్మంపై దద్దుర్లు మొదలైనవి చాలా త్వరగా తొలగిపోతాయి. -ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ -తేనె సగం టీస్పూన్ -గట్టి పెరుగు అర టీస్పూన్ -ఒక చిన్న టీస్పూన్ రోజ్ వాటర్ పైన పేర్కొన్న మిశ్రమాలన్ని  ఒక గిన్నెలో వేసి బాగా కలపండి, మందపాటి పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు వేళ్ల సహాయంతో, ఈ పేస్ట్‌ను ముఖంపై సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయండి.  పావుగంటపాటు పేస్టును ముఖంపై ఉంచి..గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి.   పసుపు:  పసుపును పొగబెట్టినా తక్కువే. ఎందుకంటే దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మన అందానికి ఈ పసుపుతో మంచి సంబంధం ఉంది.  ఈ రోజుల్లో పెద్ద బ్రాండ్ బ్యూటీ కంపెనీలు కూడా తమ చర్మ సంరక్షణ ఉత్పత్తులలో పసుపుపై ఆధారపడుతున్నాయి. ఒక గిన్నెలో అర చెంచా పసుపు పొడి, ఒక టీ చెంచా నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలిపి పేస్టులా చేసుకోవాలి. వేళ్ల సహాయంతో వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి. పదిహేను నిమిషాల తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. దీంతో ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గడమే కాకుండా ముఖ సౌందర్యం కాంతివంతంగా మారుతుంది.

ఇవి తింటే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!

ఇవి తింటే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు! వయసు పెరిగే కొద్దీ మన స్కాల్ప్, హెయిర్, స్కిన్ అన్నీ తమ మెరుపును కోల్పోతాయి. మన చర్మం మెరిసిపోవడానికి మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. అంతే కాకుండా మనం తిన్న తర్వాత మన శరీరంలో జరిగే ప్రక్రియలు కూడా కారణం. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని లోపలి నుండి కాపాడుకోవచ్చు. వయస్సు పెరుగుతున్నా... యవ్వనంగా కనిపించాలంటే వీటిని తినడం అలవాటు చేసుకోండి. బొప్పాయి పండు: బొప్పాయి పండులో యాంటీ ఏజింగ్ గుణాలతోపాటు..యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా లైకోపీన్ బొప్పాయి పండు ఎరుపు రంగులో ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు చర్మం కూడా మెరుస్తుంటుంది. దానిమ్మ పండు: దానిమ్మలో చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు కొల్లాజెన్ ఉత్పత్తిలో పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకున్నట్లయితే  చర్మ ఆరోగ్యం క్షీణించదు. అంతేకాదు  చర్మ సమస్యలు కూడా ఉండవు. పెరుగు: పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం. ఇది మన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మనం తినే ఏ ఆహారం మన శరీరంలో బాగా జీర్ణమైతే అది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు తినడం వల్ల మన చర్మానికి అవసరమైన విటమిన్ బి12 ఎలిమెంట్స్ కూడా అందుతాయి. ఇది మన చర్మం యొక్క గ్లోను పెంచుతుంది. అంతేకాదు కణాల అభివృద్ధికి చాలా సహాయపడుతుంది. ఆకు కూరలు: ఆకుకూరల్లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.  క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల మన చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. టమోటా: టొమాటోలో లైకోపీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి రంగును ఇస్తుంది. టమోటా పండు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఇదే. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన చర్మం  తాజాగా మెరుస్తూ ఉంటుంది. నిత్యం వీటిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  

బంగాళాదుంపతో పిగ్మెంటేషన్ దెబ్బకు మాయమవుతుంది!

బంగాళాదుంపతో పిగ్మెంటేషన్ దెబ్బకు మాయమవుతుంది! చర్మ సమస్యలు మొటిమలు,  చిన్న మచ్చలు మాత్రమే కాదు, చర్మం అక్కడక్కడా రంగుమారడం కూడా ముఖ చర్మాన్ని దెబ్బతీస్తుంది. హైపర్పిగ్మెంటేషన్  తీవ్రమైన  చర్మ సమస్యగా పరిగణిస్తుంటారు. ఒకసారి ఈ సమస్యలు మొదలైతే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. స్కిన్ పిగ్మెంటేషన్ అనేక కారణాల వల్ల కావచ్చు. వీటిలో ముఖ్యమైనది అధిక మెలనిన్ ఉత్పత్తి. దీని కారణంగా ముఖం మీద పెదవుల చుట్టూ, ముక్కు ఇరువైపులా, కళ్లకింది భాగంలోనూ చర్మం రంగు మారి కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని గురించి చింతించాల్సిన పనిలేదు.  ఈ పిగ్మెంటేషన్ ను సమర్థవంతంగా తొలగించడంలో బంగాళాదుంప అధ్బుతంగా పనిచేస్తుంది.  బంగాళాదుంపలలో ఎంజైమ్‌లు, విటమిన్లు,  మినరల్స్ ఉంటాయి, ఇవి డార్క్ స్పాట్‌లను తేలికపరచడానికి,  చర్మపు రంగును సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడతుంది. ఇందుకోసం బంగాళాదుంపను  ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. పిగ్మెంటేషన్ తొలగించడానికి బంగాళాదుంపను ఎలా ఉపయోగించాలి? బంగాళదుంప రసం టోనర్.. బంగాళాదుంప రసం సహజ టోనర్‌గా అద్భుతంగా పనిచేస్తుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.  పిగ్మెంటేషన్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ టోనర్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల డార్క్ స్పాట్స్‌ని తగ్గించి, స్కిన్ టోన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. బంగాళాదుంప టోనర్ ఎలా చేయాలంటే.. బంగాళాదుంప టోనర్ చేయడానికి, ఒక బంగాళాదుంపను చెక్కు తీసి దాన్ని సన్నగా  తురుముకోవాలి. తరువాత గట్టిగా పిండితే రసం వస్తుంది. దీన్ని ఒక చిన్న కప్ లో తీసుకోవాలి.  ముఖం మీద మచ్చలు, రంగు మారిన ప్రాంతాలను కవర్ చేస్తూ కాటన్ బాల్ లేదా కాటన్ ప్యాడ్ సహాయంతో రసాన్ని నేరుగా  ముఖంపై అప్లై చేయాలి. దీన్ని 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. బంగాళాదుంప మాస్క్ బంగాళాదుంప ముక్కలు చర్మానికి చల్లదనాన్ని,  మృదువు స్వభావాన్ని కలిగిస్తాయి.   పిగ్మెంటేషన్ ద్వారా చికాకు లేదా ఎర్రబడిన ప్రాంతాలను నయం చేయడంలో సహాయపడతాయి.  బంగాళాదుంపను మందపాటి చక్రాలుగా  కట్ చేసి వాటిని ముఖం మీద ప్రభావిత ప్రాంతాలలో ఉంచాలి. ఈ ముక్కలను సుమారు 15-20 నిమిషాలు అలాగే ఉంచండి, ఆపై  ముఖాన్ని నీటితో కడగాలి. దీన్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటే కాలక్రమేణా ముఖ చర్మం మీద  ఎరుపు,  పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బంగాళదుంప,  నిమ్మరసం ఫేస్ ప్యాక్..  బంగాళాదుంప రసానికి సమాన మొత్తంలో తాజా నిమ్మరసం మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని  ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ ను 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. నిమ్మరసం కొద్దిగా జలదరింపును కలిగిస్తుంది, కాబట్టి ఈ ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా ముఖ్యం. 15నిమిషాల తరువాత దీన్ని శుభ్రమైన నీటితో కడిగేయాలి. బంగాళాదుంప , తేనె ప్యాక్..  ఒక టీస్పూన్ తేనెతో మిక్సీ పట్టిన  బంగాళాదుంప పేస్ట్ కలపాలి. దీన్ని  మందపాటి పేస్ట్ గా  తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖంపై సమానంగా అప్లై చేసి 20-25 నిమిషాలు అలాగే ఉంచండి. 20-25 నిమిషాల తరువాత  నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖ చర్మానికి పోషణను ఇవ్వడమే కాకుండా ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్,  మొటిమట తాలూకు గుర్తులు తొలగిస్తుంది.                                                                   *నిశ్శబ్ద.

ముడతలు తొలగించి ముఖాన్ని అందంగా మార్చే హోం రెమెడీస్ ఇవే!

ముడతలు తొలగించి ముఖాన్ని అందంగా మార్చే హోం రెమెడీస్ ఇవే!   అందంగా కనిపించాలంటే మన చర్మం ఆరోగ్యంగా ఉండాలి. చర్మంపై చిన్నపాటి నల్లటి మచ్చ కనిపించినా అది మన అందాన్ని డ్యామేజ్ చేస్తుంది. చిన్న వయసులోనే మనల్ని ముసలివాళ్లలా చేసే ఫైన్ లైన్లు, ముడతలు, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వీటినుంచి బయటపడేందుకు సహజసిద్ధమైన పద్ధతులను పాటిస్తే మంచిది. మార్కెట్‌లో లభించే వివిధ రకాల సౌందర్య సాధనాలను ఉపయోగించవచ్చు. కానీ వాటి ప్రభావం తాత్కాలికమే. వాటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ నేచురల్ రెమెడీస్ చర్మ సౌందర్యాన్ని శాశ్వతంగా పెంచుతాయి. నాలుగు పదుల వయసులోనూ అందంగా కనిపించాలంటే ఈ హోం రెమెడీస్‎ను ఉపయోగించడం మంచిది. గుడ్డులోని తెల్లసొన: గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు మీ చర్మ ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. చర్మంపై వచ్చే ముడతలకు నేచురల్ రెమెడీ అని చెప్పవచ్చు. -దీని కోసం మీరు ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొనను తీసుకొని నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు. -మృదువుగా మసాజ్ చేసి 15 నిమిషాలు ఆరనివ్వండి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. -ఇలా చేయడం వల్ల గుడ్లలో ఉండే ప్రొటీన్, విటమిన్ బి, విటమిన్ ఇ మీ చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ నూనె: రాత్రి పడుకునే ముందు మీ చర్మంపై కొన్ని చుక్కల ఆలివ్ నూనెతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. తర్వాత టవల్ తో శుభ్రం చేసుకోవాలి. మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. నిమ్మరసం: నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో చర్మంపై ముడతలను తొలగించే తత్వం ఉంటుంది. నిమ్మకాయను ముక్కలుగా చేసి, మీ ముఖంపై, చర్మం ముడతలు పడిన చోట మసాజ్ చేయండి. నిమ్మకాయలో మీ చర్మాన్ని మెరిసేలా చేసే ఆమ్ల గుణాలు ఉన్నాయి. అయితే నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించవద్దు. కలబంద: కలబందలో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం యొక్క సాగే లక్షణాలను పెంచుతుంది. దీని కోసం మీరు కొంత అలోవెరా జెల్ ను తీసుకుని ముడతలు పడిన చర్మంపై అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిమిషాలు ఆరనివ్వండి. ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. దీనిని విటమిన్ ఇ నూనెతో కూడా కలిపి ముఖానికి రాసుకోవచ్చు. అరటిపండు: ఆరోగ్యకరమైన ఆహారంలో, అరటి మన శరీరానికి పుష్కలంగా పోషకాలను అందిస్తుంది. దీన్ని చర్మంపై అప్లై చేయడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది. బాగా పండిన అరటిపండును పేస్టులా చేసి చర్మం ముడతలు పడిన చోట రాయాలి. ఇలా దాదాపు అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత ముఖం కడుక్కోవాలి. అరటిపండులో కొద్దిగా ఆవకాడో, తేనె కలిపి రాసుకోవచ్చు. క్యారెట్: క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా చర్మంపై ముడతలను తొలగిస్తుంది. దీని కోసం మీరు క్యారెట్ పేస్ట్‌ను తయారు చేసి, ప్రతిరోజూ మీ ముఖానికి అప్లై చేయాలి. ఒకట్రెండు క్యారెట్లను తీసుకుని నీళ్లలో బాగా మరిగించి ఆ తర్వాత కాస్త తేనె కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి అరగంట ఆగి సాధారణ నీళ్లతో కడిగేస్తే ముఖంలో మెరుపు పెరుగుతుంది. ఇది కాకుండా, మీరు తరచుగా పచ్చి క్యారెట్లను తినడం అలవాటు చేసుకోవాలి. పైనాపిల్: మన చర్మ ఆరోగ్యానికి మేలు చేసే అన్ని అంశాలు పైనాపిల్ పండులో ఉంటాయి. మన చర్మం యొక్క తేమను పెంచడంతోపాటు మృతకణాలను తొలగించడం వరకు, పైనాపిల్ నుండి ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియ జరుగుతుంది . ఇది మన చర్మానికి ఫైబర్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను అందిస్తుంది. ఇది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మంపై గీతలు మాయమవుతాయి. పైనాపిల్ ముక్కలను నేరుగా చర్మంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఎక్కువ నీరు త్రాగాలి: నీరు ఎక్కువగా తాగడం వల్ల మన చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. డిహైడ్రేషన్ను తగ్గిస్తుంది. మన చర్మం మరింత తేమను కలిగి ఉండటానికి సహాయపడుతుంది. రోజూ రెండు లీటర్ల నీళ్లు తాగే అలవాటు ఉన్నవాళ్లకు చర్మంపై ముడతలు కనిపించవు.

పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు

పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు వస్తుంటాయి. ఆహార లోపాలు, పెరుగుతున్న వయసుతోపాటు ఎక్కువ సేపు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం కూడా మడమల పగుళ్లకు దారి తీస్తుంటాయి. డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్ సమస్యలు కూడా పాదాల పగుళ్లను మరింత పెంచుతాయి. కొద్దిపాటి జాగ్రత్తతో పగిలిన పాదాలను ఇంట్లోనే మృదువుగా మార్చేసుకోవచ్చు. * రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సబ్బు నీటితో పాదాలను కడిగేసుకోవాలి. మృత చర్మం తొలగిపోయేలా రుద్దాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిచేసి.. పాదాలకు వెజిటబుల్ ఆయిల్స్‌ను రాయాలి. సాక్సులు ధరించి నిద్రించాలి. ఉదయాన్నే పాదాలు మృదువుగా ఉండటాన్ని గమనించొచ్చు. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. * చర్మం రఫ్‌గా మారడం పగుళ్లకు దారి తీస్తుంది. నిమ్మలోని ఆమ్ల గుణాలు రఫ్‌గా మారిన చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి పాదాలను పావు గంటపాటు అందులో ఉంచాలి. తర్వాత మడమల్ని రుద్దేసి.. కడిగేశాక.. పొడిగా ఉండే వస్త్రంతో తుడవాలి. నిమ్మ చెక్కని పగుళ్ళకి రుద్దడం వలన కూడా పగుళ్లు తగ్గుతాయి . * పాదాల పగుళ్లు వచ్చిన వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్లు తగ్గుతాయి. * గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమంతోనూ మడమల పగుళ్లను తొలగించొచ్చు. ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మడమలు, పాదాలకు రాయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గిపోతాయి.

దారుణమైన కండీషన్ లో ఉన్న జుట్టైనా సరే.. ఈ టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యంగా మారిపోతుంది..

దారుణమైన కండీషన్ లో ఉన్న జుట్టైనా సరే.. ఈ టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యంగా మారిపోతుంది.. అమ్మాయిలు జుట్టు గురించి తీసుకునే శ్రద్ద బహుశా ఆరోగ్యం గురించి కూడా తీసుకోరేమో. ఒత్తుగా, పొడవుగా, మెరుస్తూ ఉండే జుట్టంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. కానీ చాలా కారణాల వల్ల జుట్టు దెబ్బ తింటుంది. మెరుపును కోల్పోతుంది. విరిగిపోవడం, బూడిద రంగులోకి మారడం, చిట్లడం,  చుండ్రు వంటి సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. ఇవన్నీ జుట్టు స్వరూపాన్ని మార్చేస్తాయి. వీటి పరిష్కారం కోసం అందరూ ఎన్నో రకరకాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు. అయితే ఎన్ని జుట్టు సమస్యలున్నా కింద చెప్పుకునే టిప్స్ పాటించడం వల్ల జుట్టు తిరిగి ఆరోగ్యంగా, అందంగా  మారుతుంది. జుట్టురాలకుండా ఉండాలంటే.. జుట్టురాలే సమస్య ఉన్నవారు  జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి.  తలస్నానం చేయడానికి ముందు  జుట్టుకు నూనె రాయాలి. జుట్టుకు నూనె రాసిన తరువాత ఎక్కువసేపు ఉంచుకోకూడదు. కేవలం  10 నిమిషాలు మాత్రమే ఉంచుకుని ఆ తరువాత తలస్నానం చెయ్యాలి.  ప్రతి 8-10 వారాలకు ఒకసారి జుట్టు కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు ప్రోత్సాహకంగా ఉంటుంది.   వారానికి ఒకసారి తలస్నానానికి ముందు తాజా ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించాలి . ఇన్ని చేసినా జుట్టు రాలుతోంటే  వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొన్నిసార్లు  ఆరోగ్య సమస్యల  కారణంగా జుట్టు రాలుతుంది. కాబట్టి వైద్యుడిని సంప్రదించం కూడా సరైనదే.. జుట్టు మెరుపు లేకుంటే.. ఫ్యాషన్ పేరుతో జుట్టుమీద ప్రయోగాలు చేసేవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు  జుట్టును నిర్లక్ష్యం చేస్తే  జుట్టు మెరుపు కోల్పోతుంది. జుట్టుకు తరచుగా రసాయన చికిత్స చేయడం, హీట్ స్టైలింగ్ టూల్స్ వాడటం, ఇవి వాడుతూ  కండీషనర్‌ను అప్లై చేయకపోవడం వంటివి పొరపాట్లు జుట్టును నిర్జీవంగా మారుస్తాయి.  ఈ సమస్యకు మంచి పరిష్కారం ముందస్తు జాగ్రత్తలు.  హెయిర్ వాష్‌కు ముందు  జుట్టుకు పొడవునా నూనె రాయండి. వీలైతే, కనీసం నెలకు ఒకసారి హెయిర్ స్పా చికిత్సకు చేయించుకోవాలి. కుదరని పక్షంలో ఇంట్లోనే హాట్ ఆయిల్ మసాజ్, వేడి నీటిలో ముంచిన టవల్ తలకు చుట్టడం వంటివి ఫాలో కావాలి. జుట్టు మంచి కండీషన్లోకి వచ్చేవరకు జుట్టుకు వేడి, రసాయనాలు తగలకుండా జాగ్రత్త పడాలి. చుండ్రును తొలగించాలంటే.. చుండ్రులో జిడ్డు, పొడి అనే రెండు రకాలు ఉన్నాయి.  జిడ్డుగల చుండ్రును ఎదుర్కొంటున్నట్లయితే, వైద్య సహాయం అవసరమవుతుంది.  నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సందర్శించడం ఉత్తమం.  పొడి చుండ్రుతో బాధపడుతుంటే  తలస్నానానికి   సాధారణ షాంపూతో పాటు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను వారానికి ఒకసారి ఉపయోగించాలి. చుండ్రు సమస్య ఉన్నప్పుడు  జుట్టును మరింత శుభ్రంగా ఉంచుకోవాలి. జుట్టు నెరిసిపోవడాన్ని ఎలా అరికట్టాలంటే.. చిన్న వయస్సులోనే జుట్టు బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తే, రసాయన చికిత్సలను నివారించాలి. అదే వయసు పెరిగేకొద్ది  జుట్టు నెరిసిపోతుంటే దీనికి పరిష్కారంగా సహజమైన రంగులు లేదా గోరింటతో కవర్ చేయడం ఉత్తమ పరిష్కారం. ఎప్పుడూ మంచి బ్రాండ్ కలర్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. ఇందులో రసాయనాలు లేకుండా చూసుకోవాలి.  ఇంట్లో జుట్టుకు రంగేస్తుంటే చాలా జాగ్రత్తగా వాడాలి.                                                   *నిశ్శబ్ద.

చుండ్రును తగ్గించే తేలికైన ఉపాయాలు

చుండ్రును తగ్గించే తేలికైన ఉపాయాలు ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల రోజు రోజుకి చుండ్రు సమస్యలు ఎక్కువైపోతున్నాయి . చుండ్రు వల్ల జుట్టు రాలిపోవటం, పేలు రావడం, దురద లాంటివి మొదలవుతాయి. ఈ సమస్యను అరికట్టాలంటే చిన్న చిన్న చిట్కాలు చేయాల్సిఉంటుంది . అవేంటో చూసేద్దాం రండి .. * వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. దురదను తగ్గించడమే కాదు.. చుండ్రు పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది. రెండు గుపిళ్ల నిండుగా వేపాకు, కొద్దిగా మందారకు,కొద్దిగా కలబంద గుజ్జు ఈ మూడింటిని మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారైన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. * పిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు. ఇందుకోసం వెనిగర్ ను, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. * కొబ్బరి నూనెతోనూ చుండ్రుని తరిమేయొచ్చు. కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది. ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 - 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి. తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది. ఒకవేళ టీ ట్రీ ఆయిల్ లేకపోతే మామూలు కొబ్బరినూనె లో కొద్దిగా కర్పూరం పొడి వేసి కలిపి తలకి పెట్టుకున్న చుండ్రు తగ్గుతుంది. * తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి. నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.చుండ్రు తగ్గే వరకూ ఇలా చేయాలి. * పులిసిన పెరుగును మాస్క్‌గా వేసుకోవడం వల్ల కూడా చుండ్రు తగ్గుముఖం పడుతుంది. ఇందుకోసం ఒక గ్లాస్ పెరుగు లో ఒక స్పూన్ మెంతి పొడి కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం పూట తలకు పట్టించి గంటపాటు అలా వదిలేయాలి. తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.

వర్షాకాలంలో మొటిమలు ఎందుకు వస్తాయి?

వర్షాకాలంలో మొటిమలు ఎందుకు వస్తాయి? వేసవి కాలంలో పనిచేసే చర్మ సంరక్షణ ఉత్పత్తులు వర్షాకాలంలో పనికిరావు. వర్షాకాలంలో చర్మ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్‌లో.. మారుతున్న వాతావరణం చర్మంపై చాలా ప్రభావం చూపుతుంది. వాతావరణం మారినప్పుడు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో చర్మ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్‌లో వాతావరణంలో ఉండే తేమ, బ్యాక్టీరియా చర్మాన్ని అంటుకునేలా చేస్తుంది, దీని కారణంగా ముఖంపై మొటిమలు కనిపిస్తాయి. 1. రోజూ ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. లేదా సున్నిపిండి తో అయిన ఫేస్ వాష్ చేసుకోవచ్చు. 2. వర్షాకాలంలో చర్మంపై జిగట ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన ముఖం తేమగా ఉండదు. అయితే వర్షాకాలంలో కూడా ముఖం తేమగా ఉండాలి. అందుకు ముఖానికి తగిన మాయిశ్చరైజర్ వాడటం చాలా ఉత్తమం. 3. ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. చర్మ సమస్యల నుంచి బయటపడుతారు. నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ఎక్కువగా మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల మొటిమల సమస్య దూరమవుతుంది. అలాగే మీ స్కిన్ కూడా మెరుస్తూ ఉంటుంది. 4. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వేపను ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న వేప, దాని ప్యాక్లా చేసుకుని ఉపయోగించవచ్చు. వేప ప్యాక్ చేయడానికి.. 10-12 వేప ఆకులను తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్‌లో 3 టీస్పూన్ల పసుపు పొడిని మిక్స్ చేసి ముఖానికి  అప్లై చేసి 20 నిమిషాల పాటు వుంచాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి . ఇలా వారానికి ఒకసారి చేస్తే మొటిమలు తొలగిపోతాయి.

50ఏళ్ళ వయసులో 20ఏళ్ళలా యవ్వనంగా కనబడటం సాధ్యమా!

50ఏళ్ళ వయసులో 20ఏళ్ళలా యవ్వనంగా కనబడటం సాధ్యమా! 50ఏళ్ళ వయసొచ్చినా 20ఏళ్ళ అమ్మాయిలా యవ్వనంగా కనిపించాలని చాలామంది కోరుకుంటారు. అయితే జీవన శైలి, తీకుకునే ఆహారం, అలవాట్ల కారణంగా 30ఏళ్ళకే ముఖం మీద ముడుతలు మొదలై ఆంటీలా కనబడుతుంటారు. ముడుతలు కనబడకూడదని చాలామంది మేకప్ తో కవర్ చేస్తారు, మరికొందరు యవ్వనంగా ఉంచుతాయంటూ చూపెట్టే ప్రతీ సౌందర్య ఉత్పత్తిని వాడుతారు. కానీ వీటి వల్ల ధీర్ఘకాలిక ఫలితాలు ఉండవు. ముఖం మీద ముడుతలు తొందరగా రాకూడదన్నా, అవి తొలగిపోవాలన్నా కష్టమేమీ కాదు. దీనికోసం చెయ్యాల్సిందల్లా ఒకే ఒక్క పదార్థం ఆహారంలో భాగం చేసుకోవడం. ఇంతకూ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందేమిటి? దీన్నెలా తీసుకోవాలి అనే విషయం తెలుసుకంటే.. బ్యూటీ ఉత్పత్తులు ఎప్పుడు ముడుతలు తగ్గించడంలో సహాయపడవు. అవి చర్మం మీద ప్రభావం చూపించి తాత్కాలికంగా ముడుతలు కవర్ చేసినా ఆ తరువాత నష్టాన్ని పెంచుతాయి. కాబట్టి ముడుతలు పోవాలన్నా, రాకూడదన్నా తీసుకోవాల్సిన ముఖ్య పదార్థం విటమిన్-సి. విటమిన్-సి బాగా తీసుకుంటూ ఉంటే ముఖం మీద ముడుతల సమస్యలు తగ్గిపోతాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆహార, ఆరోగ్య నిపుణులే సెలవిచ్చారు. విటమిన్-సి లో  సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ స్వభావాలుంటాయి.  ఇది చర్మానికి సంబంధించిన అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వయసుతో పాటు వచ్చే చర్మ సమస్యలను కూడా అధిగమిస్తుంది. విటమిన్-సి ముడుతలను తగ్గిస్తుంది కనీసం మూడు నెలల పాటు శరీరానికి సరిపడినంత  విటమిన్-సి ను  రోజువారీగా తీసుకుంటూ ఉంటే  ముఖం, మెడ చర్మంలో ముడతలు, మచ్చలు,  గీతలు మంత్రమేసినట్టు మాయమవుతాయి.  చర్మం యవ్వనంగా మారడమే కాకుండా ముఖ  ఆకృతిలో కూడా ఎంతో మార్పు  కనిపిస్తుంది.విటమిన్-సిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో మాత్రమే కాకుండా చర్మసంబంధిత   వ్యాధులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా  సూర్యకాంతి వల్ల వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్-సి కలిసిన  సన్‌స్క్రీన్‌  హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుందనే విషయం అధ్యయనాల్లో తేలింది. ఇది కేవలం బాహ్య రక్షణకోసం మాత్రమే ఉపయోగపడే మార్గం. సప్లిమెంట్స్ కాదు, ఆహారంపై శ్రద్ధ వహించాలి..  విటమిన్-సి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అది రెగులర్ గా తీసుకోవాలనే ఆలోచనతో చాలామంది విటమిన్-సి సప్లిమెంట్లు తీసకోవడం మీద ఆసక్తి చూపిస్తారు. అయితే ఇది చాలా పెద్ద తప్పు. విటమిన్-సి వల్ల ఆగోర్యకరమైన ప్రయోజనాలు, ఫలితాలు పొందాలి అంటే ఆహారం ద్వారా దాన్ని పొందడమే ఉత్తమం. విటమిన్-సి అనేక ఆహార పదార్థాలలో పుష్కలంగా లభిస్తుంది. నిమ్మ, నారింజ, పైనాపిల్, మామిడి వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. సీజన్ పండ్లే కాకుండా స్ట్రాబెర్రీ, కివి లాంటి అన్నిరకాల పుల్లని పండ్లలో కూడా ఈ విటమిన్-సి పుష్కలంగా లభ్యమవుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడం చాలా మంచిది. చర్మసమస్యలు ఏవైనా వచ్చినప్పుడు చర్మసంబంద వైద్యుడి సలహా లేకుండా ఎలాంటి ఉత్పత్తులు వాడకూడదు.                                                              *నిశ్శబ్ద.

జుట్టుకు కలబందతో కలిగే లాభాలు!

జుట్టుకు కలబందతో కలిగే లాభాలు!  సీజన్‌ ను బట్టి స్కిన్ కేర్ టిప్స్ మారుస్తుంటారు అమ్మాయిలు. అయితే కేవలం స్కిన్ కేర్ మాత్రమే కాదు హెయిర్ కేర్ టిప్స్ కూడా పాటించాలి. మరీ ముఖ్యంగా హెయిర్ కేర్ టిప్స్ పాటించేవారు  కలబంధను తప్పనిసరిగా చేరుస్తుంటారు. అయితే కలబంధను ఎలా ఉపయోగిస్తున్నాం అనేదాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. తలలో చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు పలుచగా, టెంకాయ పీచులాగా ఉండటం వంటి సమస్యలకు కలబంద గొప్ప సొల్యూషన్ అని చెప్పవచ్చు. అయితే కలబందను వాడటంలోచాలా తప్పులు కూడా చేసేస్తుంటారు. కలబంద ఎలా వాడాలి?? ఎలా వాడితే పలితం ఉంటుంది?? తెలుసుకుంటే..   కలబందను ఉపయోగించడం వల్ల జుట్టు దృఢంగా మారడమే కాకుండా మెరుస్తుంది. అలోవెరాలో విటమిన్ సి, ఇ, ఎ ఉన్నాయి. ఇది జుట్టు పొడవును పెంచడంలో కూడా సహాయపడుతుంది. అందుకే అమ్మాయిలు దీన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దీన్ని సరైన మార్గంలో  ఉపయోగించడం ద్వారా జుట్టుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. జుట్టుకు అప్లై చేయడానికి సరైన మార్గం ఏంటంటే.. ముందుగా తాజా కలబందను మొక్కనుండి వేరు చేశాక శుభ్రంగా కడుక్కోవాలి. ఆకుపచ్చరంగులో వచ్చే పదార్థం మొత్తం వెళ్లిపోయేలా దాన్ని శుభ్రం చేయాలి.   కతి సహాయంతో లోపలి జెల్ ను మాత్రమే తీసుకోవాలి.  కలబంద జెల్ ను పొడి జుట్టు మీద అప్లై చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జెల్‌ని జుట్టు మూలాల్లో అప్లై చేయడం మొదలుపెట్టి జుట్టు చివర్ల వరకు అప్లై చేయాలి. కలబందను జుట్టుకు అప్లై చేసిన తర్వాత అరగంట మాత్రమే  ఉంచాలి. అరగంట తర్వాత గాఢత లేని షాంపూతో కడగాలి.. కలబందను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు కలబందను వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే, తల దురద, మంట, చుండ్రు మొదలైనవి కూడా పోతాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. కలబందను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది.                                       ◆నిశ్శబ్ద.

వేసవిలో ఆరెంజ్ పీల్ ఇలా ఉపయోస్తే మెరిసిపోతారు!

వేసవిలో ఆరెంజ్ పీల్ ఇలా ఉపయోస్తే మెరిసిపోతారు! విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటివి కలిగి ఉన్న నారింజ తొక్కలు చర్మానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయని మీకు తెలుసా ? ఆరెంజ్ పీల్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. నల్ల మచ్చలు తగ్గించడానికి నారింజ తొక్కను నేరుగా చర్మంపై రుద్దడం లేదా క్యారియర్ ఆయిల్‌తో కలిపిన నారింజ తొక్క పొడిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఆరెంజ్ పీల్ చర్మపు రంధ్రాలను బిగించి, అదనపు నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది, రిఫ్రెష్ అనుభూతిని అందిస్తుంది. ఆరెంజ్ పీల్ లోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మోటిమలు కలిగించే బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో సహాయపడతాయి, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్, అకాల వృద్ధాప్యం నుండి రక్షించడంలో సహాయపడతాయి. జిడ్డుగల చర్మం కోసం: 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి 1 Tbp నారింజ తొక్క పొడి అవసరం మేరకు రోజ్ వాటర్ ఒక చిన్న గిన్నెలో అన్ని పదార్థాలను కలపాలి. వారానికి ఒకసారి ఈ పేస్ట్‌ను ప్యాక్ లాగా వేసుకోవాలి.. పొడి చర్మం కోసం: 1 tbp శనగపిండి 1 tbp ఆరెంజ్ పీల్ పొడి 1 స్పూన్ తేనె అవసరమైనంత నీరు తేనెతో పాటు ఈ ఫేస్‌మాస్క్ అద్భుతాలు చేస్తుంది. అన్ని పదార్థాలను కలపి పేస్ట్ ల్లా చేసి ఫేస్ కు అప్లై చేసుకోవాలి.  వారానికి 1-2 సార్లు ఇలా చేయాలి. ఇది చాలా తొందరగా ముఖ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  ముఖం మీద టాన్ తొలగించడంలో సహాయపడుతుంది. శనగపిండి చర్మాన్ని మృదువుగా చేస్తుంది తేనె మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.  సాధారణ చర్మ రకం కోసం: 1 tbp ఆరెంజ్ పీల్ పొడి ఒక చిటికెడు పసుపు 1 టీస్పూన్ ముల్తానీ మట్టి, అవసరమైనంత పాలు పైన పేర్కొన్న పదార్థాలతో పేస్ట్ తయారు చేసి వారానికి ఒకసారి అప్లై చేయాలి. ముల్తానీ మట్టిని ఆరెంజ్ పీల్ ప్యాక్‌లో ఉపయోగించడం ద్వారా మీ చర్మం మీద బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ను తొలగించడానికి సహాయపడుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఆరంజ్ పీల్ పౌడర్ తో ఈ కింది ప్యాక్ లు కూడా ఉపయోగించవచ్చు.  ఆరెంజ్ పీల్ పౌడర్, కలబంద -  ఒక గిన్నె తీసుకొని, 2 టేబుల్ స్పూన్ల తాజాగా తీసిన కలబంద, 2 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ వేసి, 2-3 చుక్కల నిమ్మరసం పిండుకుని, పేస్ట్ చేయాలి. పేస్ట్‌ను అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. మీ ముఖాన్ని సాధారణ చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.  ఆరెంజ్ పీల్ పౌడర్, చందనం -  ఒక గిన్నె తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నారింజ గుజ్జు, ఒక స్పూన్ చందనం కలపాలి.  తర్వాత కొన్ని చుక్కల రోజ్ వాటర్, నిమ్మరసం వేసి పేస్ట్ లా చేసుకోవాలి. పేస్ట్‌ను అప్లై చేసి 10 నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత  ముఖాన్ని సాధారణ చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.  ఆరెంజ్ పీల్ పౌడర్, పెరుగు   ఒక గిన్నె తీసుకుని, అందులో 2 టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ తేనె మరియు 1 టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. దీన్ని మందపాటి పేస్ట్ లా చేసుకోవాలి.  పేస్ట్‌ను అప్లై చేసి 10-12 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత ముఖాన్ని సాధారణ చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్ పీల్ పౌడర్, పంచదార  ఒక గిన్నె తీసుకుని, 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, ½ టేబుల్ స్పూన్ పంచదార కలపాలి. ఇది పేస్ట్ చేయడానికి కొన్ని చుక్కల నిమ్మరసం, రోజ్ వాటర్ జోడించాలి. ఈ స్క్రబ్‌ని అప్లై చేసి 5-7 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. తరువాత ముఖాన్ని సాధారణ/చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.  ఇవి పాటిస్తే.. ఈ వేసవి కాలంలో ముఖం మెరిసిపోతుంది.                                        ◆నిశ్శబ్ద.