బొటాక్స్ ఫేస్ మాస్క్.. ఇది వాడితే ఎంత అందంగా కనిపిస్తారంటే..!
posted on Mar 2, 2025
బొటాక్స్ ఫేస్ మాస్క్.. ఇది వాడితే ఎంత అందంగా కనిపిస్తారంటే..!
ముఖం అందంగా కనిపించాలని కోరుకోని అమ్మాయి ఉండదు. అందంగా కనిపించడం కోసం మొదటగా సౌందర్య సాధనాలు ఉపయోగించడానికి, సౌందర్య ఉత్పత్తుల మీద ఆధారపడటానికే మొగ్గు చూపుతారు. ఆ తరువాత బొటాక్స్ ట్రీట్మెంట్, ఫిల్లర్లు వంటి స్కిన్ ట్రీట్మెంట్స్ వైపు మొగ్గు చూపుతారు. కానీ ముఖ కాంతిని పెంచడానికి, ముఖం అందంగా కనిపించడానికి రసాయన ఉత్పత్తులు అక్కర్లేదు. ఇంట్లోనే సహజంగా బొటాక్స్ ఫేస్ మాస్క్ ట్రై చేయవచ్చు. ఆయుర్వేద నిపుణులు చెప్పిన ఈ బొటాక్స్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి, ఇందుకోసం ఏం అవసరం అవుతాయి దీన్నెలా ఉపయోగించాలి? మొదలైన విషయాలు తెలుసుకుంటే..
సహజ బొటాక్స్ ఫేస్ మాస్క్ చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది .అలాగే చర్మంలో ఉన్న అడ్డంకులు తొలగించి చర్మాన్ని మరమ్మతు చేస్తుంది. అంతేకాదు ముఖంపై ముడతలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. అరటిపండుతో తయారు చేసే ఈ ఫేస్ మాస్క్ చర్మానికి గొప్ప మ్యాజిక్ ట్రీట్మెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
'సాధారణంగా బొటాక్స్ ట్రీట్మెంట్ కోసం 5-10 వేల రూపాయల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇంట్లో కేవలం 15-20 రూపాయలతో సులభంగా బొటాక్స్ ట్రీట్మెంట్ లాంటి ఫలితాలు పొందవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది మొదటి ప్రయత్నంలోనే మంచి ఫలితాలు ఇస్తుంది. ఫేస్ మాస్క్ తయారు చేయడానికి ఏ వస్తువులు అవసరమంటే..
కావలసిన పదార్థాలు..
అరటిపండు- 1
అలోవెరా జెల్ - 1 టేబుల్ స్పూన్
గ్లిజరిన్ - 1 టేబుల్ స్పూన్
విటమిన్ ఇ టాబ్లెట్స్ – 2
ఫిష్ ఆయిల్ క్యాప్సూల్ - 1
ఎలా తయారుచేయాలి?
ముందుగా ఒక గిన్నె తీసుకుని, అందులో పండిన అరటిపండును కట్ చేసి మెత్తగా చేయాలి.
దీని తర్వాత కలబంద జెల్, గ్లిజరిన్ వేసి బాగా కలపండి.
చివరగా విటమిన్ E, చేప నూనె వేసి మృదువైన పేస్ట్ తయారు చేయాలి.
ముఖానికి సహజమైన మెరుపును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న బొటాక్స్ ఫేస్ మాస్క్ ఇదే.
దీన్ని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.
ఫలితాలు..
ముఖం పొడిబారడం, కరుకుదనాన్ని తగ్గించడంలో గ్లిజరిన్ వాడకం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనిని పొడి, సాధారణ, జిడ్డుగల అన్ని రకాల చర్మాలపై ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా, క్లియర్ గా ఆకర్షణీయంగా చేస్తుంది.
*రూపశ్రీ.
