డార్క్ సర్కిల్స్ తగ్గించుకునే నేచురల్ రెమిడీస్ ఇవీ..!

డార్క్ సర్కిల్స్ తగ్గించుకునే నేచురల్ రెమిడీస్ ఇవీ..!

డార్క్ సర్కిల్స్.. ఎంత అందంగా ఉన్న అమ్మాయిల ముఖాన్ని అయినా పాడు చేసే పెద్ద సమస్య. కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఉంటే ఏదో జబ్బు చేసిన వాళ్లలా కనిపిస్తుంటారు. ఇప్పట్లో చాలామంది ఈ డార్క్ సర్కిల్స్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మేకప్ తో వీటిని కవర్ చేస్తుంటారు. కానీ శాశ్వతంగా ఇవి తొలగిపోవాలంటే.. ఆయుర్వేదం సూచించిన చిట్కాలను పాటించాల్సిందే..

కారణాలు..

డార్క్ సర్కిల్స్ ఎందుకొస్తాయి అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే డార్క్ సర్కిల్స్ కు ఒత్తిడి ప్రధాన కారణమట.  మానసిక, శారీరక ఒత్తిడి, పర్యావరణ లేదా భావోద్వేగ సమస్యలు కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట.  ఇవన్నీ  కలసి నిద్రలేమి, మానసికంగా అలసిపోవడం వంటి సమస్యలు సృష్టిస్తాయి.  ఎక్కువకాలం భావోద్వేగాలను క్యారీ చేయడం వల్ల ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు కొందరు.  ఇలాంటి వారిలో కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. కళ్ల కింద చర్మం పలచబడి రక్తనాళాలు ఎక్కువగా కనిపించేలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి.

అలోవెరా..

అలోవెరా లేదా కలబంద డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.  అలోవెరా జెల్ లేదా తాజా కలబంద ను శుభ్రం చేసి స్లైస్ లుకా చేసి  డార్క్ సర్కిల్స్ మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల  కళ్ల కింద నల్లటి వలయాలు నలుపు తగ్గి ఆ ప్రాంతంలో చర్మం కాంతివంతంగా మారుతుంది.

దోసకాయ..

చాలామంది కళ్లమీద దోసకాయను పెట్టుకోవడం చూస్తూనే ఉంటాం.  దోసకాయ చలువ చేస్తుంది.  కళ్లను రిలాక్స్ చేస్తుంది.  ఇక కళ్ల కింద నల్లని వలయాలు ఉన్నట్టైతే  దోసకాయ రసాన్ని కళ్ల కింద రాసినా లేదా దోసకాయ ముక్కలను చక్రాలుగా కట్ చేసి కళ్ల మీద  పెచ్చుకుని అలా కాసేపు రిలాక్స్ గా పడుకున్నా మంచి ఉపశమనం ఉంటుంది.  ఇది కేవలం డార్క్ సర్కిల్స్ ను తగ్గించడమే కాదు.. ఉబ్బిన కళ్లను తిరిగి నార్మల్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

పసుపు..

పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. నల్లని వలయాలను చాలా తేలికగా చేస్తుంది.


రోజ్ వాటర్..

రోజ్ వాటర్ డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇందులో ఉండే గుణాలు చర్మానికి చలువదనాన్ని ఇస్తాయి.  చర్మానికి రిలాక్సేషన్ ను ఇస్తాయి.


                                                   *రూపశ్రీ.