English | Telugu

బిగ్ బాస్ సీజ‌న్ 5లోనూ మ‌ళ్లీ వాళ్ల‌దే హ‌వా!

బిగ్ ‌బాస్ సీజ‌న్ 4లో అత్య‌ధిక శాతం అన్‌నోన్‌ ఫేసెస్ క‌నిపించాయి. ఇందులో మ‌రీ ముఖ్యంగా యూట్యూబ్ స్టార్స్‌దే హ‌వా క‌నిపించింది. యూట్యూబ్‌లోపాపుల‌ర్ అయిన వాళ్ల‌నే ఎక్కువ‌గా ఈ షోలో తీసుకున్నారు. గంగ‌వ్వ‌, జోర్దార్ సుజాత‌, దేత్త‌డి హారిక, దిల్‌సే మెహ‌బూబ్‌, అరియానా గ్లోరీ, దివి వ‌డ్త్య‌, అఖిల్ సార్థ‌క్‌ వంటి యూట్యూబ్ స్టార్స్‌ని ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.

బిగ్‌బాస్ సీజ‌న్ 5కి కూడా యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న స్టార్స్‌నే ఈ ద‌ఫా కూడా ఎంపిక చేస్తున్నారు. త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న సీజ‌న్ 5 కోసం గ‌త కొన్ని రోజులుగా కంటెస్టెంట్‌ల ఎంపిక జ‌రుగుతోంది. కామ‌న్‌మెన్‌లుగా ఎంట్రీ ఇచ్చి త‌మ వీడియోల‌తో సెల‌బ్రిటీలుగా మారిపోయిన వారిని ఈ ద‌ఫా కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకురాబోతున్నారు. అత్య‌ధిక శాతం యూట్యూబ్ స్టార్స్‌తో ఈ సీజ‌న్‌ని జాన్‌లో ప్రారంభించ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం కంటెస్టెంట్‌ల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ పేరు దాదాపుగా ఖ‌రారైపోయింది. 'ఇన్ఫినిట‌మ్ మీడియా' నుంచి మ‌రో కంటెస్టెంట్‌ని ఎంపిక చేస్తున్నార‌ట‌. 'ట్విన్స్‌', 'బ‌బ్లూ వ‌ర్సెస్ సుబ్బులు' వంటి వెబ్ సిరీస్‌ల‌తో పాపుల‌ర్ అయిన బ‌బ్లూ మయా అలియాస్ చికెన్ బ‌బ్లూ (సాయికుమార్ బబ్లూ) ఈ సారి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. ఇక ఇదిలా వుంటే యాంక‌ర్ ర‌వి కూడా ఈ సారి ఖ‌చ్చితంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో స్టార్ మా నుంచి వెలువ‌డే అవ‌కాశం వుంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.