English | Telugu

ఫ్యామిలీకి దీప గురించి చెప్పిన సౌంద‌ర్య‌.. షాక్‌లో కార్తీక్!

'కార్తీక దీపం' ఎండ్ స్టేజ్‌కి వ‌చ్చేసిందా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు అలాగే క‌నిపిస్తున్నాయి. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ మ‌రింత కీల‌క మ‌లుపు తిర‌గ‌బోతోంది. డాక్ట‌ర్‌ బాబు ఎంత చెప్పినా విన‌క‌పోవ‌డంతో విసుగెత్తిన దీప త‌న పిల్ల‌ల‌ని తీసుకుని వార‌ణాసి ఆటోలో వేరే ఊరు వెళ్లిపోతుంది. ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి పిల్ల‌ల‌తో స‌హా ఊరు మారుతుంది. పాత ఇల్లు, కొత్త వాతావ‌ర‌ణం.. సోఫాలో కూర్చుని దీప ఆలోచిస్తుంటే.. హిమ‌, శౌర్య ఫొటోలు తీసి తుడుస్తూ వుంటారు.

"అమ్మా ఇక్క‌డ ఏయిర్ పోర్ట్ వుందా?" అని దీపని అడుగుతుంది శౌర్య‌. దీప "ఎందుకు అత్త‌మ్మా" అంటుంది. "నాన్న రావాల‌నుకుంటే.." అని న‌సుగుతుంది శౌర్య‌. దీంతో దీప‌కు ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చేస్తుంది. "మాటి మాటికి నాన్నా.. నాన్నా అన‌కండి. మీ జీవితంలో నాన్న అధ్యాయం ముగిసిపోయింది." అంటూ మండిప‌డుతుంది. దీప కోపం చూసి పిల్ల‌లు ఆశ్చ‌ర్యపోతారు. క‌ట్ చేస్తే ఆనంద‌రావు కోడ‌లు దీప‌ని, పిల్ల‌ల్ని ఇంటికి తీసుకొచ్చేద్దామ‌ని సౌంద‌ర్య‌తో చెబుతాడు.

పెద్దోడికి ఈ విష‌యం నువ్వే చెప్పాలంటాడు. ఈ సంభాష‌ణ జ‌రుగుతుండ‌గానే కార్తీక్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. "ఏంటీ ఏదో చెప్పాలంటున్నారు?" అని అడిగితే, "అది మీ అమ్మే చెబుతుంది" అంటాడు ఆనంద‌రావు. అయినా చెప్ప‌మ‌న‌డంతో "కోడ‌లుని ఇంటికి తీసుకొచ్చేద్దాం రారా కార్తీక్" అంటాడు. "మీరు ఆవేశ‌ప‌డ‌కండి" అంటుంది సౌంద‌ర్య‌. "అదేంటి నువ్వే క‌దా నాన్నని ఫోర్స్ చేయాలి. మ‌రి నువ్వేంటి వ‌ద్ద‌ని వారిస్తున్నావ్" అంటాడు కార్తీక్‌.

ఎంత‌కీ ఆనంద‌రావు విన‌క‌పోవ‌డంతో దీప లేద‌నీ, ఊరు వ‌దిలి ఎక్క‌డికో వెళ్లిపోయింద‌ని సౌంద‌ర్య చెప్పేస్తుంది. దీంతో షాక్ కు గురైన ఆనంద‌రావు కార్తీక్ చేయి వ‌దిలేసి సోఫాలో కుప్ప‌కూలిపోతాడు.. త‌ల్లి చెప్పిన మాట‌లు వినిని ఒక్క‌సారిగా షాకైన‌ కార్తీక్ శూన్యంలోకి చూస్తూ మెట్ల‌పై అచేత‌నంగా కూర్చుండి పోతాడు. ఇది ఈ రోజు ఆస‌క్తిక‌ర‌ ఎపిసోడ్‌. ‌

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.