English | Telugu

Brahmamudi : పాపని చంపడానికి రుద్రాణి ప్లాన్.. కాపాడిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -951 లో....పాపకు ఆపరేషన్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. పాపకి ఏమవుతుందోనని కావ్య టెన్షన్ పడుతుంది. డాక్టర్ పాపని ఎలాగైనా బ్రతికించండి అని అపర్ణ డాక్టర్ తో చెప్తుంది. మా ప్రయత్నం మేమ్ చేస్తామని డాక్టర్ అంటుంది. రాజ్, కావ్య ఆపరేషన్ థియేటర్ ముందు టెన్షన్ పడుతారు. నర్సు నీలవేణికి రుద్రాణి ఫోన్ చేస్తుంది. నీ హెల్ప్ కావాలి రౌడీలు హాస్పిటల్ కి వస్తున్నారు. నువ్వు పాపని వాళ్ళకి చూపించమని రుద్రాణి చెప్తుంది.

మళ్ళీ ఏం చెస్తున్నారని నర్సు అడుగుతుంది. పాపని ఈ లోకంలో లేకుండా చేస్తున్నానని రుద్రాణి అనగానే నాకేం తెలియదు మొన్న చేసింది తెలిసి నన్ను ఏం చేయకుండా వదిలి పెట్టారని నర్సు అనగానే నువ్వు చెప్పింది చెయ్యకపోతే నీ పిల్లలని చంపేస్తానని రుద్రాణి బ్లాక్ మెయిల్ చెయ్యడంతో నర్సు ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రాజ్, కావ్య దగ్గరికి నర్సు వెళ్లి ఆపరేషన్ థియేటర్ లో ఉన్న పాపని మినిస్టర్ చంపాలని అనుకుంటున్నాడని నర్సు చెప్తుంది. సరే నేను చూసుకుంటాను. నువ్వు వాళ్ళు చెప్పింది చేయమని నర్సుకి రాజ్ చెప్తాడు.

ఆ తర్వాత రౌడీ లు హాస్పిటల్ కి వస్తారు. ఇప్పుడే లోపలికి వద్దు అందరు ఉన్నారని నర్సు చెప్తుంది. ఆ తర్వాత రాజ్ అక్కడ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్ లో ఉంటారు. వాళ్ళని రాజ్ ఇంటికి పంపిస్తాడు. మరొకవైపు తులసి తన భర్త దగ్గరికి వచ్చి ఈ రోజు కావ్య పాపకి ఆపరేషన్ ఏంత గొప్ప మనసు అండి తన బిడ్డని తన దగ్గరికి తెచ్చుకునే టైమ్ కి తన దగ్గరున్న పాపని పూర్తి ఆరోగ్యంతో ఆ తల్లికి అప్పజెప్పాలని ట్రై చేస్తుందని తులసి చెప్తుంది. ఆ తర్వాత మినిస్టర్ దగ్గరికి రుద్రాణి వచ్చి ఆపరేషన్ థియేటర్ లో ఉన్న పాపని చంపడానికి ట్రై రౌడీలని పంపించానని రుద్రాణి అనగానే మినిస్టర్ తన చెంప పగులగొడతాడు. నా కూతురిని చంపాలని అనుకుంటావా.. ముందు వాళ్ళకి ఫోన్ చేసి వద్దని చెప్పమంటాడు. ఇప్పుడు వాళ్ళ ఫోన్ పని చెయ్యదని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రౌడీలు లోపలికి వెళ్లి చూసేసరికి పాప ప్లేస్ లో బొమ్మ ఉంటుంది. అది చూసి వాళ్ళు షాక్ అవుతారు. రాజ్ వచ్చి రౌడీలని కొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.