English | Telugu

"మీరొక మంచి అబ్బాయిని నాకిచ్చారు".. ఇమ్మానియేల్ త‌ల్లితో వ‌ర్ష‌!

బుల్లితెర‌పై కొత్త జంట సంద‌డి చేస్తోంది. అదే వ‌ర్ష‌-ఇమ్మా‌నియేల్ జంట‌. ఈ టీ‌వీలో వాలెంటైన్స్‌డే సంద‌ర్భంగా 'రెండు గంట‌ల్లో ప్రేమించ‌డం ఎలా?' అనే పేరుతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో యాంక‌ర్ వ‌ర్షకు రెడ్ క‌ల‌ర్ ల‌వ్ సింబ‌ల్ వున్న బెలూన్‌ని అందించి ఇమ్మానియేల్ ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన విజువ‌ల్స్ ఇటీవ‌ల నెట్టింట సంద‌డి చేశాయి.

అదే ఎపిసోడ్‌లో ఇమ్మానియేల్ త‌ల్లిని వ‌ర్ష ఆప్యాయంగా కౌగిలించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కార్య‌క్ర‌మంలో ఇమ్మానియేల్ పేరెంట్స్‌ని స్టేజ్ పైకి ఆహ్వానించారు. త‌న త‌ల్లిదండ్రులు స్టేజ్‌పైకి రావ‌డంతో ఇమ్మానియేల్ క‌న్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి లోన‌య్యాడు. త‌న ఎదుగుద‌ల‌కు త‌న కుటుంబం ఎంతో చేసింద‌ని, అన్న‌య్య త‌న జీవితాన్ని త్యాగం చేసి త‌న‌నింత వాడిని చేశాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇమ్మానియేల్‌ని చూసిన వ‌ర్ష కూడా ఎమోష‌న‌ల్ అయ్యింది. స్టేజి మీద‌కు వ‌చ్చి అత‌ని త‌ల్లిని ఆలింగ‌నం చేసుకుంది. త‌న తండ్రి ఇటీవ‌లే చ‌నిపోయాడ‌ని, ఆ స‌మ‌యంలో ఇమ్మానియేల్ త‌న‌కు అండ‌గా నిలిచాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకుంది వ‌ర్ష‌. "మీరొక మంచి అబ్బాయిని నాకిచ్చారు." అని ఇమ్మానియేల్ త‌ల్లితో అనడంతో అంద‌రూ చ‌ప్ప‌ట్లు కొడుతూ కేక‌లు వేశారు. "ఇమ్మానియేల్ వ‌ల్ల నీకే ప్రాబ్ల‌మ్ రాదు." అని ఆమె కూడా హామీ ఇవ్వ‌డంతో వ‌ర్ష సిగ్గుల మొగ్గ అయ్యింది. ఎనిమిదేళ్ల జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇలాంటి జోక్ ఎవ‌రూ వేయ‌లేద‌ని ఆది న‌వ్వించాడు. త‌మ అమ్మానాన్న‌ల‌ది ల‌వ్ మ్యారేజ్ అని రివీల్ చేశాడు ఇమ్మానియేల్‌.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.