English | Telugu

ఈ టీవీన‌టి ఎంగేజ్‌మెంట్ ఇన్విటేష‌న్‌ ఇంత విల‌క్ష‌ణ‌మా!

బుల్లితెర న‌టులు సినిమా స్టార్‌ల‌కు ఏమాత్రం తీసిపోవ‌డం లేదు. ఆ రేంజ్‌లో హంగామా చేస్తున్నారు. ఓ సీరియ‌ల్ హిట్ట‌యితే స్టార్స్‌కి మించిన పాపులారిటీ బుల్లితెర తార‌ల‌కు సొంతమ‌వుతోంది. దీంతో వారు ఏది చేసినా క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోతోంది. ఇదిలా వుంటే బుల్లితెర న‌టి ఎంగేజ్‌మెంట్ ఇన్విటేష‌న్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ సీరియ‌ల్ 'నిన్నే పెళ్లాడ‌తా'. ఈ ధారావాహికలో హీరోయిన్‌గా న‌టించిన మ‌ధుబాల మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది‌. ఇదే సీరియ‌ల్‌కి రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌జా ప్ర‌భాక‌ర్‌తో గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వుంది. ఇరు కుటుంబాల వారు వీరి ప్రేమ పెళ్లికి సై అన‌డంతో ఈ నెల 17న వీరి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌బోతోంది.

మైసూర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్‌కు అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. ఇదిలా వుంటే వీరి ఎంగేజ్‌మెంట్ ఇన్విటేష‌న్‌ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌జా ప్ర‌భాక‌ర్ స్వ‌త‌హాగా రైట‌ర్ కావ‌డంతో త‌న స్టైల్‌ని నిశ్చితార్ధ ఆహ్వాన‌లేఖ‌లోనూ వాడాడు. అచ్చ‌మైన తెలంగాణ యాస‌లో తీర్చి దిద్దిన ఈ ఆహ్వాన‌లేఖ‌ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు ప్ర‌జా ప్ర‌భాక‌ర్. అది ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.