English | Telugu

వంట‌ల‌క్క‌కు పోటీగా పాట‌ల‌క్క!

స్టార్ మా చాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న 'కార్తీక దీపం' సీరియ‌ల్‌లో వ‌చ్చే వంట‌ల‌క్క ఎంత ఫేమ‌స్సో అంద‌రికి తెలిసిందే. ఈ పాత్ర‌లో న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్‌ స్టార్ సెల‌బ్రిటీగా మారిపోయింది. త్వ‌ర‌లో సినిమాల్లోనూ క‌నిపించ‌బోతోంది. ఈ సీరియ‌ల్ ప్రేమికి సినిమాల్లో న‌టించే అవ‌కాశాన్ని తెచ్చి పెట్టింది.. అంత‌లా పాపుల‌ర్ అయిన వంట‌ల‌‌క్క‌కు పోటీగా పాట‌ల‌క్క రాబోతోంది.

జీ తెలుగు కోసం ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు 'కృష్ణ తుల‌సి' పేరుతో ఓ సీరియ‌ల్‌ని ప్రారంభిస్తున్నారు. వంట‌ల‌క్క త‌ర‌హాలోనే న‌లుపు రంగుతో డీ గ్లామ‌ర్ పాత్ర‌లో వుండే శ్యామ క‌థ‌ని బుల్లితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఇందులో శ్యామ పాట‌ల‌క్క‌గా క‌నిపించ‌బోతోంది. ఇచ్చిన మాట కోసం తన గొంతుని స‌వ‌తి త‌ల్లి కూతురికి అరువిచ్చి స‌వ‌తి త‌ల్లి చేతుల్లో అవ‌మానాలు ప‌డే పాత్ర‌లో శ్యామ క‌నిపించ‌బోతోంది.

ఇటీవ‌ల విడుద‌లైన ఈ సీరియ‌ల్ ప్రోమో చూసిన వారంతా వంటల‌క్క త‌ర‌హాలోనే శ్యామ కూడా పాట‌ల‌క్క‌గా పాపుల‌ర్ కావ‌డం గ్యారెంటీ అని కామెంట్స్‌ చేస్తున్నారు. "వంట‌ల‌క్క‌.. చెల్లి పాట‌ల‌క్క" అంటూ మీమ్స్ ని వైర‌ల్ చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి పాట‌ల‌క్క సీరియ‌ల్ 'కృష్ణ తుల‌సి' జీ తెలుగులో సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.