English | Telugu

ప‌ర్స‌న‌ల్ ఫొటో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఒకే బెడ్‌పై షణ్ముఖ్‌తో!

సోషల్ మీడియాలో దీప్తి సునయ‌న‌.. షణ్ముఖ్ జశ్వంత్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డాన్స్ వీడియోలతో ఈ జంట బాగా ఫేమస్ అయింది. అయితే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని గతంలో వార్తలొచ్చాయి. అదే సమయంలో దీప్తి సునయ‌న‌కు బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఛాన్స్ రావడంతో ఆమె పాపులారిటీ పెరిగింది. అయితే బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తరువాత దీప్తి.. షణ్ముఖ్ తో వీడియోలు చేయకపోవడంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారనే వార్తలు షికారు చేశాయి.

షణ్ముఖ్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని.. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు జోరందుకున్నాయి. ఇంతలో చాలా రోజుల తరువాత దీప్తి సునయ‌న‌, షణ్ముఖ్ ఇద్దరూ కలిసి తెగ షికార్లకు వెళ్తున్నారు. పార్టీల్లో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలో వీరిద్దరి లవ్ ట్రాక్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీప్తి, షణ్ముఖ్ లకు సంబంధించిన ఓ పర్సనల్ ఫోటో బయటకొచ్చింది.

తాజాగా వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్లుగా బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేసింది దీప్తి సునయ‌న‌. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకోవడంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారా..? లేక ఏదైనా షూట్ కోసం కలిశారా..? అని ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఈ జంట వీడియో సాంగ్స్ చేసి చాలా రోజులవుతోంది. దీంతో మరోసారి వీరిద్దరిని కలిసి వీడియో సాంగ్ లో చూడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.