English | Telugu

ఫొటో ఫీచ‌ర్‌.. కొత్తిల్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీ!

'వరుడు' సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన దీక్షా పంత్ ఆ తరువాత చాలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. కానీ ఆమెకి సరైన గుర్తింపు మాత్రం రాలేదు. హీరోయిన్ గా కెరీర్ నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నించింది కానీ వర్కవుట్ కాలేదు. అదే సమయంలో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది. హౌస్ నుండి బయటకొచ్చిన తరువాత ఆమెకి కొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.

కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తనకు సంబంధించిన ఓ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఇటీవలే తను కొత్త ఇల్లు కొన్నానని తెలిపింది.

అలానే గృహ ప్రవేశం చేసిన సమయంలో తీసిన ఫోటోలను కూడా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతేకాకుండా గడిచిన కొన్ని సంవత్సరాల్లో తనకి తన కష్టంపై మరింత నమ్మకం ఏర్పడిందని చెప్పింది.

సొంతింటి కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను.. నా ఇల్లు నా ఫ్యామిలీని, మ‌రింత‌గా న‌న్ను గ‌ర్వ‌ప‌డేలా చేసింది. హార్డ్‌వ‌ర్క్‌కు ఫ‌లితం ఉంటుంది అని రాసుకొచ్చింది.

దీంతో అభిమానులు, స్నేహితులు ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దీక్ష.. 'మాయామాల్', 'హార్మోన్స్', 'తొండి' వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కిస్తోన్న 'ఐయామ్' అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.