English | Telugu

ప్రేమ‌లో యాంకర్ వర్షిణి?

బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో షోలు చేస్తోన్న వర్షిణి సౌందరాజన్ ఇప్పుడు ప్రేమలో పడిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు బుల్లితెరపై యాంకర్ గా సెటిల్ అయిపోయింది. ఎన్నో షోలు, ఈవెంట్స్ తో బిజీగా ఉన్న సమయంలోనే ఆమెకి 'చందమామ కథలు' అనే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో కనిపించింది. కానీ ఆమెకి సరైన అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరకే పరిమితమైంది.

ఈ మధ్యలో 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ సక్సెస్ అవ్వడంతో వర్షిణి పాపులారిటీ పెరిగింది. ఈ క్రమంలోనే ఆమెకి 'ఢీ' షోలో యాంకరింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ భామ 'కామెడీ స్టార్స్' అనే షోకి యాంకరింగ్ చేస్తోంది. కొన్నాళ్లక్రితం వర్షిణి.. సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. రీసెంట్ గా హైపర్ ఆదితో డేటింగ్ చేస్తుందనే ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలను వర్షిణి ఖండించింది. వరుస షోలతో ఎంతో బిజీగా ఉన్న వర్షిణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.

తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ ఫోటో షేర్ చేసింది. అందులో వర్షిణి ఓ వ్యక్తి భుజంపై వాలిపోయి కనిపించింది. అత‌డి భుజానికి త‌ల ఆన్చి కళ్లు మూసుకుని త‌న్మ‌య‌త్వంలో మునిగి తేలుతోంది. అయితే ఫొటోలో ఉన్న వ్యక్తి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడింది. దీంతో ఈ ఫోటోకి సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫోటో చూసిన వారంతా వర్షిణి ప్రేమలో ఉందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. మరి దీనిపై అమ్మడు క్లారిటీ ఇస్తుందేమో చూడాలి! ఇంత‌కీ ఆమె త‌ల ఆనించిన ఆ భుజం ఎవ‌రిది?

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.