English | Telugu

బిగ్‌ బాస్ సీజ‌న్ 5కి గ్లామ‌ర‌స్‌ న్యూస్ రీడ‌ర్‌!

టీవీ న్యూస్ రీడ‌ర్స్‌కి బిగ్‌బాస్ రియాలిటీ షో కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతోంది. సీజ‌న్ 2లో టీవీ9కి చెందిన దీప్తి న‌ల్ల‌మోతు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి గ‌ట్టి పోటీనిచ్చింది. ఆ త‌రువాత జ‌కీర్ ఎంట్రీ ఇచ్చాడు. మ‌ధ్య‌లోనే వెళ్లిపోయాడు.. కత్తి మ‌హేష్ కూడా ఇదే ఛాన‌ల్ నుంచి బిగ్ ‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయాడు.

ఇదే ఛాన‌ల్ నుంచి ఎంట్రీ ఇచ్చింది దేవి నాగ‌వ‌ల్లి. సీజ‌న్ 4లో స్ట్రాంగ్‌గానే క‌నిపించినా పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూప‌లేక‌పోయింది. ఇప్పుడు ఇదే ఛాన‌ల్ నుంచి మ‌రో న్యూస్ రీడ‌ర్ బిగ్ ‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఆమే ప్ర‌త్యూష‌. గ‌త కొన్నేళ్లుగా ఆమె టీవీ9లో న్యూస్ రీడ‌ర్‌గా ప‌నిచేస్తోంది. జూన్‌లో ప్రారంభం కాబోతున్న సీజ‌న్‌ 5 కోసం ఆమెని కంటెస్టెంట్‌గా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది.

న్యూస్ రీడ‌ర్‌గా వుంటూనే ప‌లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌ల‌కు, సెల‌బ్రిటీల ఇంట‌ర్వ్యూల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌త్యూష‌కు సెల‌బ్రిటీల‌తో మంచి ప‌రిచ‌యాలున్నాయి. సోష‌ల్ మీడియాలోనూ త‌న గ్లామ‌ర‌స్ స్టిల్స్‌ను షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. అవే ఆమెని బిగ్ ‌బాస్ సీజ‌న్ 5కి ఎంపిక‌య్యేలా చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్ర‌తీ సీజ‌న్‌కి టీవీ9 నుంచి ఎవ‌రో ఒక‌రిని ఎంపిక చేస్తుండ‌టం కూడా ప్ర‌త్యూష‌కు క‌లిసివ‌చ్చిన‌ట్టుగా చెబుతున్నారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.