English | Telugu

'నాన్న టిఫిన్ సెంట‌ర్‌'లో అమ్మాకూతుళ్ల గొడ‌వ‌!

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కార్తీక దీపం' ఈ బుధ‌వారం మ‌రో కొత్త ట‌ర్న్ తీసుకోబోతోంది. టిఫిన్ సెంట‌‌ర్‌కు 'నాన్న టిఫి‌న్ సెంట‌ర్‌' అని పెట్ట‌డంతో అంతా అడిగితే ఏం స‌మాధానం చెబుతావ‌ని దీప‌ని ప్ర‌శ్నిస్తుంది సంతాన ల‌క్ష్మి. ఇంత‌లో త‌న‌కు వీడియో కాల్ రావ‌డంతో అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. శౌర్య‌పై చిరాకు ప‌డుతుంది దీప‌. "నాన్న ఒక్క‌డే అనాథ‌లా వుంటాడ‌ని టిఫిన్ సెంట‌ర్‌కి పేరు పెట్టావ్‌. త‌ను అనా‌థ‌కాదు.. మ‌న‌ల్ని వ‌దిలేసి అనాథ‌‌ల్ని చేశాడు." అంటుంది కోపంగా. దీంతో "అమ్మా బోర్డు చెరిపేద్దామా?" అంటుంది శౌర్య‌.

క‌ట్ చేస్తే.. దీపని, దీప పిల్ల‌ల‌ని వెతుక్కుంటూ ఆమె తండ్రి ముర‌ళీకృష్ణ బ‌య‌లుదేర‌తాడు. ఇంత‌లో భాగ్యం త‌న మంగ‌ళ‌సూత్రం తీసేసి ప‌సుపుతాడు క‌ట్టుకుని "యుద్ధానికి వెళ్లే వీరుల కోసం భార్య‌లు ఎదురుచూసిన‌ట్టుగా మీ కోసం ఎదురుచూస్తుంటానండీ" అంటూ కామెడీ చేస్తుంది. ఎంత‌కీ మార‌డం లేద‌ని త‌ల‌కొట్టేసుకుంటూనే దీపని వెత‌క‌డం కోసం ముర‌ళీకృష్ణ బ‌య‌లుదేర‌తాడు. క‌ట్ చేస్తే ..

ఆనంద‌రావుతో మోనిత గురించి సౌంద‌ర్య చెబుతూ వుంటుంది. మోనిత చాలా ముదిరిపోయింద‌ని, కార్తీక్ చేతే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పించే దాకా వ‌చ్చింద‌ని, నేను మునుప‌టి సౌంద‌ర్య‌నైతే ఇప్ప‌టికే దాన్ని కాల్చిపారేసేదాన్న‌ని అంటుంది. ఈ డిస్క‌ష‌న్‌లో సౌంద‌ర్య‌కు అనుమానం మొద‌ల‌వుతుంది. కార్తీక్‌కి పిల్ల‌లు పుట్ట‌ర‌ని తెలిసి కూడా మోనిత త‌న‌ని పెళ్లి చేసుకోవాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తోంది? ఇందులో ఏదైనా మ‌త‌ల‌బు వుందా?.. అన్న మెరుపులాంటి ఆలోచ‌న త‌డుతుంది. ఇంత‌కీ మోనితని ప‌ట్టించే అస్త్రం సౌంద‌ర్య‌కి తెలిసిందా?.. దీప క‌థ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.