English | Telugu

చంద్ర‌ముఖిలా భ‌య‌పెడుతూ ర‌చ్చ‌చేసిన లాస్య‌!

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న కామెడీ షో 'కామెడీ స్టార్స్‌'. ఈ ఆదివారం మ‌రింత ఫ‌న్నీగా సాగ‌బోతోంది. శేఖ‌ర్ మాస్ట‌ర్, శ్రీ‌దేవి జ‌డ్జెస్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఈ షోలో ముక్కు అవినాష్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌తో పాటు ప‌లువురు క‌మెడియ‌న్స్ స్కిట్‌లతో అల‌రించ‌బోతున్నారు. దాదాపు ఐదేళ్ల విరామం త‌రువాత లాస్య ఈ షోలోకి ర‌వితో క‌లిసి ఎంట్రీ ఇచ్చేసింది.

ర‌వితో క‌లిసి ఎంట‌ర్‌టైన్ చేస్తూ షోలో ఆక‌ట్టుకుంటోంది. గ‌త ఆదివారం 'ఉప్పెన‌' థీమ్‌కు పేర‌డీ చేసి ఆక‌ట్టుకున్న ర‌వి, లాస్య ఈ సారి చంద్ర‌ముఖిని రంగంలోకి దింపేస్తున్నారు. ఇందులో చంద్ర‌ముఖిగా లాస్య ప‌ర్ఫామ్‌ చేయ‌బోతోంది. ఈ వారం మ‌రో విశేషం ఏంటంటే డ్యాన్స్ మాస్ట‌ర్ బాబా భాస్క‌ర్ ఈ షో లోకి గెస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. స్వ‌త‌హాగా హ్యూమ‌ర్‌ని పండించే బాబా భాస్క‌ర్ ఈ 'కామెడీ స్టార్స్‌' షోలోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో అస‌లైన కామెడీ ఫైట్ ప్రారంభం కాబోతోంది.

ఇదే క్ర‌మంలో లాస్య చంద్ర‌ముఖిగా రెచ్చిపోయి ర‌చ్చ చేయ‌డం, అవినాష్ అమ్మాయి వేషంలో హాస్యాన్ని పండించ‌డం..ఇదే క్ర‌మంలో లాస్య ప‌క్క‌నుండ‌గానే ర‌విపై బాబా భాస్క‌ర్ క‌త్తి విస‌ర‌డం.. లాంటి వింత వింత విన్యాసాల‌తో వ‌చ్చే సండే కామెడీ స్టార్స్ ర‌చ్చ ర‌చ్చ చేయ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.