English | Telugu

స‌ర్‌ప్రైజ్ చేసిన రామ్‌.. క‌న్నీరు పెట్టుకున్న సునీత‌!

అవును. ఇది స్టార్ మా చాన‌ల్‌లో ప్రారంభం కానున్న '100% ల‌వ్ షో'లో చోటు చేసుకుంది. ఈ చాన‌ల్ ఇటీవ‌ల ప్రారంభించిన బిగ్ బాస్ ఉత్స‌వం, కామెడీ స్టార్స్ షోల‌కు మంచి టీఆర్పీ ల‌భిస్తోంది. తాజాగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని డ‌బుల్ చేయ‌డంలో భాగంగా '100% ల‌వ్'` పేరుతో మ‌రో వినూత్న‌మైన షోని ప్రారంభించ‌బోతోంది. 6 రియ‌ల్ క‌పుల్స్, 6 రీల్ క‌పుల్స్ ఈ షోలో ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతున్నారు. ఈ నెల 21 సాయంత్రం 6 గంట‌ల‌కి ఈ షో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. '100% ల‌వ్' మూవీ తీసిన లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ఈ ప్రారంభ షోలో సంద‌డి చేయ‌బోతున్నారు.

అలాగే న్యూ క‌పుల్ సింగ‌ర్ సునీత‌, రామ్ వీర‌ప‌నేని కూడా ఈ షోలో పాల్గొంటున్నారు. తాజాగా విడుద‌ల చేసిన ప్రోమో స్టార్ మా అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ పేజ్‌లో సంద‌డి చేస్తోంది. మొద‌ట ఒంట‌రిగా ఈ షోకి వ‌చ్చిన సునీత మైక్ ప‌ట్టుకొని మాట్లాడుతూ, "రామ్ ఐ రియ‌ల్లీ రియ‌ల్లీ ల‌వ్ యూ" అని చెప్ప‌గానే, వెనుక నుంచి వ‌చ్చి ఆమె వీపు త‌ట్టారు రామ్‌. షాక్‌తో "ఆ.." అని వెన‌క్కి తిరిగి చూసి, రామ్ క‌నిపించేస‌రికి ఒక్క‌సారిగా స‌ర్‌ప్రైజ్ అయ్యారు సునీత‌. ఆ త‌ర్వాత రామ్‌ను హ‌త్తుకున్నారు.

డైరెక్ట‌ర్ సుకుమార్ బెత్తం ప‌ట్టుకుని వ‌చ్చి మాట్లాడుతూ, "ఒక‌ళ్లు ప్రేమిస్తారు, ఇంకొక‌ళ్లు స్పందిస్తారు" అన‌గానే, ఎమోష‌న‌ల్ అయిన సునీత క‌ళ్ల‌ల్లోంచి నీటి బొట్లు ఆమె చెంప‌ల మీదుగా జారాయి. ఈ ఎపిసోడ్‌లో ఏం జ‌రుగుతుందో 21వ తేదీ మ‌నం చూడ‌బోతున్నాం. యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ ఈ షోకు వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.