English | Telugu

ముమైత్‌ని ఏడిపించిన ఓంకార్‌!

జీ తెలుగులో 'డ్యాన్స్ బేబీ డ్యాన్స్' షోతో సంచ‌ల‌నం సృష్టించారు ఓంకార్‌. మ‌ళ్లీ అదే త‌ర‌హా షోని మ‌రో లెవెల్లో ప్ర‌జెంట్ చేస్తూ డ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ 'డ్యాన్స్ ప్ల‌స్‌' అంటూ తాజాగా ఓంకార్ స్టార్ మాలో కొత్త డ్యాన్స్ షోని ర‌న్ చేస్తున్నారు. దీనికి జ‌డ్జెస్‌గా బాబా భాస్క‌ర్‌, ర‌ఘు మాస్ట‌ర్‌, య‌ష్, ముమైత్‌ఖాన్‌, యానీ మాస్ట‌ర్‌, మోనాల్ గ‌జ్జ‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

గ‌త కొన్ని వారాలుగా ఈ షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. డ్యాన్స్‌కి నెక్ట్స్ లెవెల్ అన్న‌ట్టుగానే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్‌లు త‌మ డ్యాన్స్‌తో అద‌ర‌గొడుతున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌కు గ‌ట్టి పోటీనిస్తున్నారు. ప్ర‌తీ శ‌నివారం, ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు ఈ షో ప్ర‌సారం అవుతోంది. ఓంకార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే సంకేత్ అనే కంటెస్టెంట్ విష‌యంలో య‌ష్ మాస్ట‌ర్‌తో జ‌రిగిన వాగ్వివాదం కార‌ణంగా ముమైత్‌ఖాన్ ఉద్వేగానికి లోనైంది. య‌ష్ మాస్ట‌ర్ వాద‌న‌ని ఓంకార్ స‌మ‌ర్థించ‌డంతో షో నుంచి ముమైత్‌ఖాన్ ఏడ్చుకుంటూ లేచి వెళ్లిపోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం స్టార్ మా లో సంద‌డి చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఆమె తిరిగి వెన‌క్కి వ‌చ్చిందా, ఏం జ‌రిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడాలి.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.