English | Telugu

సుమ కోసం.. మైక్ కేక్!‌

రెండు ద‌శాబ్దాలుగా టెలివిజ‌న్‌పై తిరుగులేని యాంక‌ర్‌గా రాణిస్తున్నారు సుమ‌. న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌తో ఆమె వైవాహిక బంధం కూడా రెండు ద‌శాబ్దాల‌కు పైగా అన్యోన్యంగా సాగుతోంది. ఇటు వైవాహిక జీవితంలో, అటు వృత్తి జీవితంలో స‌క్సెస్ అయిన ఆమె పుట్టిన‌రోజు మార్చి 22. ఈ సంద‌ర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, స‌న్నిహితులు సోష‌ల్ మీడియాలో బ‌ర్త్‌డే విషెస్‌తో ముంచెత్తారు.

కాగా సుమ చిన్న‌నాటి స్నేహితులు కొంత‌మంది శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డానికి సోమ‌వారం ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. వారిలో ఒక‌రు మైక్ ఆకారంలో ఉన్న కేక్‌ను తీసుకురావ‌డం విశేషం. వారినీ, ఆ కేక్‌నూ చూసి సుమ చాలా హ్యాపీ ఫీల‌య్యారు. మంగ‌ళ‌వారం ఉద‌యం త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆ మైక్ కేక్ ఫొటోతో పాటు, స్నేహితులు ఫొటోల‌నూ షేర్ చేశారు.

"మీరంతా పంపిన బ‌ర్త్‌డే విషెస్‌ను ఇప్పుడే చ‌దివాను. మీ ప్రేమ‌కు క‌దిలిపోయాను. థాంక్ యూ సో మ‌చ్‌. ఐ ల‌వ్ యూ టూ. నిన్న నా ఫ్రెండ్స్‌తో గ‌డిపిన స‌మ‌యం చాలా ముఖ్య‌మైంది. వండ‌ర్‌ఫుల్ మైక్ కేక్ తీసుకొచ్చిన డాక్ట‌ర్ కీర్తికి థాంక్స్." అని ఆమె రాసుకొచ్చారు. చాలా త‌క్కువ టైమ్‌లోనే ఈ పోస్ట్ వైర‌ల్ అయ్యింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.