Read more!

English | Telugu

సుధీర్ పెళ్ల‌యితే ర‌ష్మి రియాక్ష‌న్ ఏంటి?.. లైవ్‌గా చూపించారు!

 

బుల్లితెర‌పై ఆక‌ట్టుకుంటున్న జంట ర‌ష్మీ గౌత‌మ్‌, సుడిగాలి సుధీర్‌. జబ‌ర్ద‌స్త్‌, ఢీ షోల‌లో వీరి మ‌ధ్య వ‌చ్చే స‌ర‌దా స‌న్నివేశాలు సోష‌ల్ మీడియాలో నిత్యం వైర‌ల్ అవుతుంటాయి. అంత‌గా వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ పాపుల‌ర్ అయ్యింది. ర‌ష్మీ లేక‌పోతే సుధీర్ స్కిట్‌కి ప‌వ‌ర్ లేదు.. సుధీర్ లేక‌పోతే ర‌ష్మిక యాంక‌రింగ్‌కు ప‌స వుండ‌ద‌ని అంతా అనుకుంటుంటారు. అంతే కాకుండా వీరిద్ద‌రి మ‌ధ్య చాలా కాలంగా ఏదో జ‌రుగుతోంద‌నే గుసగుస‌లు కూడా త‌ర‌చూ వినిపిస్తుంటాయి. వాటిని ఎప్ప‌టిలాగే కొట్టి పారేస్తుంటారు.

జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి మొద‌లైన వీరి రొమాన్స్ ఢీ వ‌ర‌కు పాకింది. ఇక ప్ర‌తీ ఎపిసోడ్‌లోనూ వీరి గురించి ప్ర‌త్యేక చ‌ర్చ జ‌రుగుతూనే వుంటుంది. తాజాగా అలాంటి స‌న్నివేశ‌మే ఒక‌టి 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌' షోలో చోటు చేసుకుంది. ర‌ష్మికి చెప్ప‌కుండా సుధీర్ పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ విష‌యం తెలిసి అత‌ని స్నేహితులు రామ్‌ప్ర‌సాద్‌, గెట‌ప్ శ్రీ‌ను ఈ విష‌యం ర‌ష్మికి చెప్పారు. త‌న‌ని తీసుకొచ్చి సుధీర్ పెళ్లిని చెడ‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నించారు. ఈ సంద‌ర్భంగా ర‌ష్మీ పెళ్లి కొడుకు అవ‌తారంలో సుధీర్‌ను చూసి క‌న్నీరు పెట్టుకుంది. ఇదంతా 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' షో కోసం ప్ర‌త్యేకంగా సుధీర్ పెళ్లి గురించి తెలిస్తే ర‌ష్మీగౌత‌మ్ రియాక్ష‌న్ ఏంటీ?.. అనే కాన్సెప్ట్‌తో చేసిన ఓ స్కిట్‌లో చోటు చేసుకుంది.

ఇదంతా చూస్తున్న జ‌డ్జెస్ మ‌నో, రోజా... సుధీర్‌, ర‌ష్మిల‌ని చూసి ఘొల్లున న‌వ్వుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. నిజంగా సుధీర్ పెళ్లికి రెడీ అయితే ర‌ష్మి ఇలానే ఫీల‌వుతుందా అనే స్థాయిలో ర‌ష్మిగౌత‌మ్ ఫీల్ కావ‌డం ఆడియ‌న్స్ మ‌న‌సు దోచేసేలా వుంది.