English | Telugu

టెస్టుల‌కు వెళ్లిన డాక్ట‌ర్ బాబు.. దీప‌కు మాయ‌దారి రోగం!

'కార్తీక దీపం'ఈ రోజు 994వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. గ‌త నాలుగేళ్ల నుంచి మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ పాపుల‌ర్ సీరియ‌ల్ తాజాగా రోజుకో మ‌లుపులు తిరుగుతూ ఎండింగ్‌కి చేరువ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. హిమ దొరికిందంటూ ఓ మెడిక‌ల్ షాప్ వ్య‌క్తి ఫోన్ చేయ‌డంతో మోనిత త‌న కోసం బ‌య‌లుదేరుతుంది.

క‌ట్ చేస్తే .. దీప వంట గ‌దిలో ద‌గ్గుతూ వుంటుంది. "దేవుడా ఈ మాయ‌దారి రోగం న‌న్ను పీల్చి పిప్పి చేస్తోంది. భ‌గ‌వంతుడా నాకు ఏదైనా అయితే.. నేనే పోతే నా పిల్ల‌లు అనాథ‌లైపోతారు. దేవుడా నా ఆరోగ్యం బాగుండాలి." అంటూ ఏడుస్తుంటుంది. ఇంత‌లో పిల్ల‌లు దీప ఏడ్వ‌డం చూసి "ఏంట‌మ్మా ఏడుస్తున్నావ్ నాన్న గుర్తొచ్చాడా?" అంటారు. అప్పుడే సంతాన ల‌క్ష్మి వ‌చ్చి పిల్ల‌ల‌కు స్వీట్స్ ఇచ్చి వెళుతుంది... ఇదిలా వుంటే కార్తీక్ త‌ను టెస్ట్‌కి వెళుతున్న విష‌యం చెప్ప‌డానికి మోనిత ఇంటికి వెళ‌తాడు. ప్రియ‌మ‌ణి వుండ‌టం చూసి మోనిత ఫోన్ చేస్తే విష‌యం చెప్ప‌మంటాడు.

హిమ‌ని మోనిత వెత‌క‌డం మొద‌లుపెడుతుంది. ఇదే స‌మ‌యంలో హిమ‌ని తీసుకుని వార‌ణాసి జాత‌ర‌కు వెళ‌తాడు. మ‌రోవైపు దీపని వెతుక్కుంటూ వెళ్లిన‌ ముర‌ళీకృష్ణ ఓ టిఫిన్ సెంట‌ర్ వ‌ద్ద ఆగి ఇడ్లీ ఆర్డ‌ర్ చేస్తాడు. చెట్ని టేస్ట్ చేయ‌గానే ముర‌ళీకృష్ణ‌కు దీప గుర్తొస్తుంది. వెంట‌నే "ఈ టిఫిన్ సెంట‌ర్ ఎవ‌రిది?" అని అడ‌గ‌డంతో వార‌ణాసి బంధువు అప్పుడే వ‌స్తున్న దీప‌ని చూపిస్తాడు. తండ్రిని చూసిన దీప షాకవుతుంది. ఈ ఇద్ద‌ర్నీ చూసిన మోనిత ఎలా రియాక్ట్ అయింది? .. ఆత‌రువాత ఏం చేసింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.