English | Telugu

మా నాన్నకు ఆ పిచ్చి.. దాని వ‌ల్లే ఆస్తులు పోగొట్టుకున్నాం!

ఒక‌వైపు బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోన్న అనసూయ.. మరోపక్క వెండితెరపై నటిగా తన సత్తా చాటుతోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనపై జరిగే ట్రోలింగ్‌కు ఘాటుగా కౌంటర్లు ఇస్తుంటుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి గతంలో చాలా సార్లు చెప్పింది. అమ్మానాన్న, చెల్లెళ్లు, భర్త గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది.

అయితే లేటెస్ట్‌గా కొన్ని కొత్త విష‌యంలు పంచుకుంది అనసూయ. తన చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డానని చెబుతోంది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని.. డబ్బులు సరిపోక బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లేదాన్ని అని వివరించిన అనసూయ.. తన తండ్రి గురించి చెబుతూ తమను ఎలా పెంచారో చెప్పుకొచ్చింది. స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని చెప్పేవారని.. ఆటోవాళ్లతో ఎలా మాట్లాడతామో, ఎలా హ్యాండిల్ చేస్తామోనని దూరం నుండి చూసేవారని ఆ మధ్య అనసూయ తెలిపింది.

తాజాగా తన తండ్రి గురించి మరికొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు చాలా రిచ్ గానే పెరిగామని.. ఈ విషయం ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదని తెలిపింది. తమ దగ్గర చాలా గుర్రాలు ఉండేవని.. తన తండ్రికి హార్స్ రేసింగ్, గ్యాంబ్లింగ్ అంటే పిచ్చి అని.. అలా ఆస్తులన్నీ పోగొట్టుకున్నామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల సినిమాల్లో నటిస్తోంది!

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.