English | Telugu
మాకు అమ్మాయి పుట్టిందోచ్..కూతురే పుట్టాలని దేవుడిని కోరుకున్నా
Updated : Dec 27, 2024
యాదమ్మ రాజు-స్టెల్లా.. వీళ్ళ గురించి చెప్పాలంటే తక్కువే కానీ జబర్దస్త్ లాంటి కామెడీ షోస్ లో యాదమ్మ రాజుకు మంచి పేరు వచ్చింది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఒక డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేసారు. ఐతే రీసెంట్ గా స్టెల్లా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇక తమకు పుట్టింది పాప, బాబా అని చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు దానికి క్లారిటీ ఇస్తూ ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఐతే తమకు పాప పుట్టిందంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎలాగైనా అమ్మాయే పుట్టాలని ఆ ఏసయ్యను ప్రార్ధించాను అని చెప్పింది స్టెల్లా. తన బంగారు తల్లి చూడడానికి చాలా క్యూట్ గా ఉందని చెప్పింది. మొదటి నుంచి పాప పుట్టాలని అనుకున్నాం ఒకవేళ బాబు గనక పుట్టి ఉంటే అప్సెట్ అయ్యేవాళ్ళం అన్నాడు యాదమ్మ రాజు. కూతురే ఎందుకు పుట్టాలి అని అనుకున్నామంటే కూతురు ఒక్కటే తల్లిని చివరికి వరకు చూస్తుంది అని..అలాగే ..ఒంట్లో కాస్త నలతగా ఉన్నా కూడా ఆమె సేవ చేస్తుంది, కొడుకు అంత బాగా చూసుకోలేడు అని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయినా తల్లిని గురించి తలుచుకునేది కూతురే అంటూ చెప్పింది.
ఇప్పుడు తన కూతురికి మంచి పేరు పెట్టాలని అనుకుంటున్నామని..ఎవరైనా సరే ఏ లెటర్ తో ఐనా కానీ మంచి పేరు చెప్పాలంటూ కూడా ఫాన్స్ ని కోరింది. దేవుడి దయ వలన అనుకున్నది సాధించా అని అంది . ఈరోజున కొడుకైన, కూతురైన ఒక్కటే..కానీ చిన్నవయసులో బిడ్డ పుట్టేయడంతో ఒక బాధ్యత వచ్చేసింది, ఐతే అమ్మ పాపను చూసుకుంటూ ఉంటే తాను ఫీడింగ్ ఇస్తున్నట్లు చెప్పింది స్టెల్లా. ఐతే యాదమ్మ రాజు సుమారు ఏడాదిన్నర క్రితం యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా పండంటి పాప కూడా వచ్చేసిందంటూ చాలా సంతోషంగా చెప్పారు.