English | Telugu

పెళ్లి ఎప్పుడైంది సత్య ..? హీరోయిన్ గా ఎప్పుడు చేస్తున్నారు ?


జబర్దస్త్ షో ద్వారా ఒక రేంజ్ లో పాపులారిటీని పెంచుకున్న సత్యశ్రీ గురించి అందరికీ తెలుసు. కొన్ని మూవీస్ లో కూడా నటించింది. జబర్దస్త్ ని తన ఇంటి పేరుగా మార్చేసుకుంది సత్యశ్రీ. అలాంటి సత్యశ్రీ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక రీల్ ని పోస్ట్ చేసింది. "గోదారి గట్టు మీద" అనే ట్రెండింగ్ సాంగ్ కి డాన్స్ చేస్తూ ఉన్న వీడియో అది. ఐతే ఆ వీడియోలో ఆమె తన నుదిటిన కుంకుమ దిద్దుకుని కనిపించింది. ఇక నెటిజన్స్ ఐతే సత్యశ్రీ పెళ్లి పై ఆరా తీయడం మొదలు పెట్టారు. సత్యా పెళ్లెప్పుడయ్యింది ? పెళ్లి చేసుకోను అని చెప్పారు కదా చాలా ఇంటర్వ్యూస్ లో అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఐతే సత్యశ్రీ గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా పెళ్లి గురించి తన అభిప్రాయం చెప్పింది. పెళ్లి చేసుకుని భర్త షరతులు విధిస్తే ఇబ్బందిపడాలని తనను ఎవరైనా రూల్ చేస్తే తనకు నచ్చడంతో చెప్పుకొచ్చింది. తనకు మ్యారేజ్ ప్రపోజల్స్ ఎన్నో వచ్చాయని వాటిని ఆపుతూ వచ్చానని కూడా చెప్పింది. ఐతే ఒక వ్యక్తి పెళ్లిచూపులకు వచ్చి షూటింగ్స్ లొ పాల్గొనకూడదు అని చెప్పేసరికి తనకు బాగా కోపం వచ్చిందని వాళ్ళ మీద సీరియస్ అయ్యాయని కూడా చెప్పింది. అలాంటి సత్యశ్రీ నిజంగానే ఇప్పుడు పెళ్లి చేసుకుండా అనే డౌట్ ఈ రీల్ చూసేసరికి అందరిలోనూ వచ్చింది అలాగే ఈ రీల్ లో ఆమె ఒక హీరోయిన్ లా ఉందని చెప్తూ "హీరోయిన్ గా ఎప్పుడు చేస్తున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ ని మీకు ఇవ్వాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి సత్యశ్రీ రీసెంట్ గా లాస్ట్ మంత్ లో ఇంటి గృహప్రవేశం కూడా చేసుకుంది. ‘జబర్దస్త్’లో చమ్మక్ చంద్ర టీమ్‌లో లేడీ కామెడియన్‌గా జాయిన్ ఐన సత్యశ్రీ బులెట్ భాస్కర్ స్కిట్స్ లో కనిపిస్తోంది.