English | Telugu
8 గంటల నిద్ర ఒక గంటలో ఎలా?
Updated : Jul 20, 2022
శ్రీముఖి ఎప్పుడూ ఎంత ఫన్నీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సరిగమప సింగింగ్ షోకి హోస్ట్ చేస్తూ తన మాటలతో నవ్వులతో అందంతో అలరిస్తోంది. అలాగే సింగర్ సాయిచరణ్ తో కలిసి అప్పుడప్పుడు సరదాగా కవ్విస్తూ అల్లరి చేయడం ఇద్దరో మధ్య ఎదో సంథింగ్ సంథింగ్ జరుగుతోందనే భ్రమను కల్పించడం చూస్తూనే ఉన్నాం. ఐతే ఇప్పుడు శ్రీముఖికి సాకేత్ కొమండూరి ఒక పెద్ద టాస్క్ ఇచ్చాడు. గూగుల్ సెర్చ్ లో 8 గంటల నిద్ర ఒక గంటలో ఎలా ? అనే ప్రశ్నకు జవాబు కోసం వెతికాడు. ఐతే శ్రీముఖి షోస్ చేస్తూ ఎప్పుడు బిజీగా ఉంటుంది కదా మరి నిద్ర ఎలా పోతోందో తెలుసుకోవాలని ఆ ప్రశ్నకు సంబంధించిన స్క్రీన్ షాట్ ని శ్రీముఖికి పంపించాడు.
"శ్రీముఖి ఎలా నిద్రపోవాలో ఒక టిప్ చెప్పవా" అని అడిగాడు దాంతో బ్లాక్ కాఫీ తాగితే నిద్ర పడుతుంది. లాట్స్ ఆఫ్ లాఫ్స్ తో.. అంటూనే బెస్ట్ టిప్ చెప్పింది శ్రీముఖి. ఆ స్క్రీన్ షాట్ ని శ్రీముఖి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టేసుకుంది అలాగే ఇదే స్టేటస్ ని ఆర్జే రవళి కూడా పోస్ట్ చేసుకుని ఆన్సర్ తెలీక ఏడుస్తున్నట్టుగా ఉన్న ఒక ఎమోజిని పెట్టుకుంది. అలాగే ఇంకో ఆసక్తికరమైన పోస్ట్ కూడా తన స్టేటస్ లో పెట్టేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 6 1 st ప్రోమో ఆగష్టు రెండో వారంలో ఉంటుందని, అలాగే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి షో స్టార్ట్ అవుతుందని చెప్పింది శ్రీముఖి.