English | Telugu

నిఖిల్ చేసిన మోసంపై కావ్యశ్రీ...స్పందించిన సోనియా


బిగ్ బాస్ సీజన్-8 లో‌ మోస్ట్ ఇన్ ఫ్లూయెన్స్ చేసిన కంటెస్టెంట్ సోనియా ఆకుల. ‌ఓ వైపు నిఖిల్, మరోవైపు పృథ్వీని ఇద్దరిని ఇన్ ఫ్లూయెన్స్ చేస్తూ హౌస్ ని తన గుప్పిట్లో పెట్టుకోగ అది నచ్చని ఆడియన్స్ ఓట్లు వేయకుండా తనని ఎలిమినేషన్ చేశారు.‌ ఇక బిగ్ బాస్ సండే ఎపిసోడ్ ముగింపులో‌ సోమవారం నాటి నామినేషన్ ప్రోమో వేశాడు. అది చూసి ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయ్.‌ ఎందుకంటే ఎలిమినేషన్ అయి బయటకి వచ్చిన సోనియా తిరిగి హౌస్ లోకి వచ్చింది.‌ ఇక తను ప్రేరణ, నిఖిల్ లని నామినేషన్ చేయడంతో హౌస్ లో ఒక్కసారిగా నామినేషన్స్ లో ఫైర్ వచ్చేసింది.

ఇక బయట నిఖిల్ చేసిన మోసంపై కావ్యశ్రీ పెట్టిన పోస్ట్‌లు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. ఇప్పుడు సోనియా ఆకుల అందులో జాయిన్ అయ్యింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్‌.. దాదాపు కావ్యశ్రీ ఏ విషయాల గురించి ప్రస్తావించిందో.. సోనియా ఆకుల కూడా అదే విషయానికి రిలేటెడ్‌గా ఉంది. ఇద్దరూ కూడా.. నిఖిల్ నమ్మించి మోసం చేయడం గురించి.. అతని మాస్క్ గురించి.. ప్రేమ పేరుతో చేసిన మోసం గురించే ఉండటంతో.. టైమ్ చూసి గట్టిగానే కొట్టినట్టుగా అనిపిస్తుంది. అయితే సోనియా. నిఖిల్ పేరుని ప్రస్తావించకపోయినా అతని గురించే అని అందరికి తెలుసు. సోనియా తన ఇన్ స్టాగ్రామ్ లో నిఖిల్ ని ఉద్దేశించి పోస్ట్ చేయడంతో తనని కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఇక సోనియా కూడా గట్టిగానే స్పందించింది. వాళ్ల ముసుగు చూసి మోసపోకండి.. ఫేక్ మనుషులు ఏదో ఒక సందర్భంలో వాళ్ల అసలు రంగుని బయటపెడతారు. వాళ్ల ముసుగు తొలిగేవరకూ వేచి చూడండి అని సోనియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

కావ్యశ్రీ నిఖిల్ గురించి పోస్ట్ చేసింది. కొంతమంది చాలా గొప్పగా నటిస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో వాళ్లకి బాగా తెలుసు. పాపం జనాలు ఆ నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతుంటారు. వాళ్ల యాక్టింగ్ కారణంగా.. నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అలాంటి నటుల గురించి వాళ్లని నమ్మే జనాలకు ఉన్న అభిప్రాయాన్ని మార్చలేం. ఎందుకంటే.. వాళ్లే బాధితులు అన్నట్టుగా నటిస్తారు.. నమ్మిస్తారు. నిజమైన బాధితుల్ని దోషులుగా చిత్రీకరించడంలో ఇలాంటి వాళ్లు మహా దిట్ట అంటూ కావ్య శ్రీ ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. నిఖిల్ విషయంలో తనే నిజమైన బాధితురాలిని అని.. అతనో పెద్ద నటుడని.. ఇలాంటి వాడి నిజస్వరూపం జనానికి తెలియక నమ్ముతున్నారని ఇన్ డైరెక్ట్‌గా పోస్ట్ పెట్టింది కావ్యశ్రీ. ఇద్దరి వల్ల నిఖిల్ కి ఓటింగ్ లో భారీగా నెగెటివ్ అయ్యేలా ఉంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.