English | Telugu

అదే ముఖం.. కానీ భిన్న ద‌శ‌లు.. పున‌ర్న‌వి పిక్స్ వైర‌ల్‌!

'ఉయ్యాల జంపాల' సినిమాలో హీరోయిన్ అవికా గోర్ స్నేహితురాలిగా న‌టించింది పున‌ర్న‌వి. ఆ త‌ర్వాత 'మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానిరోజు' సినిమాలో శ‌ర్వానంద్ కూతురిగా క‌నిపించింది. 'పిట్ట‌గోడ' సినిమాలో అయితే హీరోయిన్‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. అయితే సినిమాల‌తో రాని పేరు ఆమెకు బిగ్ బాస్ సీజ‌న్ 3 తీసుకొచ్చింది. అందులో తోటి కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమె కెమిస్ట్రీ, ల‌వ్ ట్రాక్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారి, ఆమెకు విప‌రీత‌మైన పాపులారిటీ తెచ్చిపెట్టింది.

హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా కొన్ని రోజుల పాటు రాహుల్‌, పున‌ర్న‌వి ల‌వ్ స్టోరీ గురించి జ‌నం మాట్లాడుకుంటూనే వ‌చ్చారు. సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు కొన‌సాగాయి. అయితే త‌ర్వాత ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఫ్రెండ్‌షిప్ త‌ప్ప వేరే ఏమీ లేద‌ని తేలిపోయింది.

ఏదేమైనా బిగ్ బాస్‌తో వ‌చ్చిన ఫేమ్ త‌ర్వాత పున‌ర్న‌వి సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ఫాలోయ‌ర్స్ విప‌రీతంగా పెరిగారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు హాఫ్ మిలియ‌న్ పైగా ఫాలోయ‌ర్స్ ఉన్నారు. త‌ర‌చూ త‌న పిక్చ‌ర్స్‌ను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్‌ను ఆనందప‌రుస్తూ వ‌స్తోంది.

వాటిలో గ్లామ‌ర‌స్ ఫొటోల‌తో పాటు త‌ను పాల్గొన్న ఈవెంట్స్‌కు సంబంధించిన ఫొటోలు, వివిధ సంద‌ర్భాల్లో తీసుకున్న ఫొటోలు కూడా ఉంటున్నాయి.

లేటెస్ట్‌గా కొన్ని ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది పున‌ర్న‌వి. వివిధ ద‌శ‌ల్లో తీసిన ఫొటోలుగా వాటిని పేర్కొందామె. వాటిలో మేక‌ప్ లేకుండా ఉన్న ఫొటో కూడా ఉంది.

"అదే ముఖం.. కానీ నా జీవితంలోని భిన్న ద‌శ‌లు, చాలా విష‌యాలు మారాయి కానీ కొన్ని విష‌యాలు అలాగే ఉన్నాయి." అంటూ వాటికి క్యాప్ష‌న్ పెట్టింది పున‌ర్న‌వి. ఈ ఫొటోల‌ను షేర్ చేసిన కొద్ది సేప‌ట్లోనే వేలాది లైక్స్ వ‌చ్చి, ఆ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.