English | Telugu

'ఉప్పెన'‌ సీన్‌లో త‌గ్గేదేలే అంటున్న‌ సుధీర్‌-ర‌ష్మి!‌

తెలుగు టీవీ తెర‌పై నంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్ జోడీ ఎవ‌రంటే ఠ‌క్కున వ‌చ్చే స‌మాధానం.. సుడిగాలి సుధీర్‌-ర‌ష్మి గౌత‌మ్ అని! ఆ జోడీ మ‌రోసారి వ్యూయ‌ర్స్‌ను మెస్మ‌రైజ్ చేసేందుకు ఉగాదికి మ‌న‌ముందుకు వ‌చ్చేస్తోంది. ఎట్లా అంటారా? బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'ఉప్పెన‌'లోని ఫేమ‌స్ సీన్‌ను రిక్రియేట్ చేయ‌డం ద్వారా! య‌స్‌.. 'ఉప్పెన' మూవీలో వ‌ర్షం వ‌స్తుండ‌గా స‌ముద్ర‌పు అల‌ల‌పై ఊగుతున్న ప‌డ‌వ‌లో హీరో హీరోయిన్లు వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి తొలిసారి శారీర‌కంగా ఒక్క‌ట‌య్యే సీన్ ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకుంది. చాలా పొయెటిక్‌గా ఆ సీన్‌ను డైరెక్ట‌ర్ బుచ్చిబాబా సానా చిత్రీక‌రించ‌గా, వైష్ణ‌వ్‌-కృతి మ‌ధ్య కెమిస్ట్రీ మెస్మ‌రైజ్ చేసింది.

అలాంటి సీన్‌ను "ఉగాది జాతిర‌త్నాలు" అనే స్పెష‌ల్ షో కోసం రిక్రియేట్ చేశారు. ఆ సీన్‌లో సుధీర్‌-ర‌ష్మి జోడీ న‌టించారు. ఒరిజిన‌ల్ త‌ర‌హాలోనే ఎమోష‌న‌ల్‌గా, పొయెటిక్‌గా ఆ త‌ర‌హా విజువ‌ల్స్‌తోటే దాన్ని తీశారు. సుధీర్‌, ర‌ష్మి ఎప్ప‌ట్లా త‌మ అమేజింగ్ కెమిస్ట్రీతో అల‌రించారు. ఆ ఇద్ద‌రినీ ఆ సీన్‌లో చూస్తుంటే ముచ్చ‌ట‌ప‌డ‌ని వాళ్లుండ‌రు. ఆ సీన్ ప్ర‌ద‌ర్శించిన త‌ర్వాత సుధీర్‌ను ఉద్దేశించి స్టేజిపై "వీడు ముస‌లోడు అవ్వ‌కూడ‌దు" అని చెప్పి ర‌ష్మి సిగ్గుప‌డిన విధానం, సుధీర్ మీసం మెలితిప్పిన విధానం కూడా ఆక‌ట్టుకుంటోంది.

దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ స్పెష‌ల్ షో ఉగాది రోజున అంటే ఏప్రిల్ 13న ఉద‌యం 9 గంట‌ల‌కు ఈటీవ‌లో ప్ర‌సారం కానున్న‌ది. ఈ షోకు గెస్టులుగా 'ట‌క్ జ‌గ‌దీష్' మూవీ హీరో హీరోయిన్లు నాని, రీతు వ‌ర్మ వ‌చ్చి అల‌రించ‌నున్నారు. అలాగే జ‌డ్జిలు మ‌నో, పూర్ణ క‌లిసి చేసిన స్కిట్ న‌వ్వులు పూయించ‌నుంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.