English | Telugu

సెన్సేష‌న‌ల్ సింగ‌ర్‌.. ఊటీ డైరీస్‌!

సింగ‌ర్ మ‌ధుప్రియ చిన్న‌త‌నంలోనే "ఆడ‌పిల్ల‌నమ్మా నేను ఆడ‌పిల్ల‌న‌ని.." పాట‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. త‌ర్వాత కాలంలో ఓవైపు సింగ‌ర్‌గా మంచి పేరు తెచ్చుకుంటూ, మ‌రోవైపు వార్త‌ల్లోనూ నిలుస్తూ వ‌చ్చింది. 2015లో మంగి శ్రీ‌కాంత్‌తో ఆమె పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్‌గా, సంచ‌ల‌నంగా మారింది. ఒక‌వైపు భ‌ర్త‌, మ‌రోవైపు త‌ల్లిదండ్రుల ప్రేమ మ‌ధ్య చిక్కుకొని ఇబ్బందులు ప‌డింది. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి.

'ఫిదా' మూవీలో "వ‌చ్చిండే పిల్లా మెల్ల‌గ వ‌చ్చిండే" సాంగ్‌తో సంగీత ప్రియుల‌ను త‌న హుషారైన గాత్రంతో అల‌రించింది. ఆ పాట‌తో బెస్ట్ ఫిమేల్ సింగ‌ర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డునూ అందుకుంది. అలాగే 2020 సంక్రాంతికి వ‌చ్చిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాలో హీరోయిన్ ర‌ష్మిక కోసం ఆమె పాడిన "హి ఈజ్ సో క్యూట్" సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలిసిందే. సోష‌ల్ మీడియాలో మ‌ధుప్రియ బాగా యాక్టివ్‌. త‌ర‌చూ త‌న సోలో పిక్చ‌ర్స్‌తో పాటు ఫ్యామిలీ ఫొటోల‌ను కూడా షేర్ చేస్తుంటుందామె.

లేటెస్ట్‌గా ఆమె త‌న కుటుంబంతో ఊటీలో జాలీగా గడుపుతోంది. అమ్మానాన్న‌లు, అక్క‌చెల్లెళ్ల‌తో క‌లిసి ఆడిపాడుతూ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని పిక్చ‌ర్స్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది మ‌ధుప్రియ‌.

వాటిలో ఓ ఫొటోలో ఆమెను ఆమ్మానాన్న‌లు చెరో చెంప‌పై ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ పిక్చ‌ర్‌కు "మామ్ డాడ్" అనే క్యాప్ష‌న్ పెట్టింది. ఆమె షేర్ చేసిన వాటిలో అక్క‌, చెల్లెలితో క‌లిసున్న ఫొటోతో పాటు, ఊటీ తోట‌ల మ‌ధ్య పాట‌లు పాడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి.

వాటికి #ootydiaries అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది మ‌ధుప్రియ‌. ఆ ఫొటోలు చూస్తుంటే ఆమె ఎంత ఆనందంగా ఊటీలో గ‌డుపుతోందో అర్థ‌మ‌వుతోంది.

అంత‌కు ముందు మార్చి 18న అమ్మానాన్న‌ల‌తో విడివిడిగా దిగిన ఫొటోల‌ను షేర్ చేసి, వాటికి "ఈ దునియాల నిష్కల్మషంగా ఓ ప్రేమ ఉంది అంటే అది తల్లిదండ్రులదే. love you both mummy daddy forever. Happy Wedding Anniversary" అనే క్యాప్ష‌న్ పెట్టింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.