English | Telugu

సీతారాములుగా దీప‌-కార్తీక్‌!.. మ‌హారాజా కుర్చీలో సీత‌!!

ప‌రిటాల నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్‌ల‌కు 'కార్తీక దీపం' సీరియ‌ల్‌ తీసుకొచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. స్టార్ మాలో ప్ర‌సార‌మ‌వుతున్న ఈ సీరియ‌ల్‌కు ఉన్న ఆద‌ర‌ణ మ‌రే సీరియ‌ల్‌కూ లేదు. అది ప్ర‌సార‌మ‌వుతున్న స‌మ‌యంలో ఎంత సూప‌ర్ హిట్ సినిమాను ఏ చాన‌ల్ వేసినా దానికి టీఆర్పీ రాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన నిజం. అలాంటి సీరియ‌ల్‌లో దీప అలియాస్ వంట‌ల‌క్క‌గా ప్రేమి విశ్వ‌నాథ్‌, ఆమె భ‌ర్త డాక్ట‌ర్ కార్తీక్‌గా నిరుప‌మ్ అశేష ప్ర‌జానీకం అభిమానాన్ని చూర‌గొన్నారు.

లేటెస్ట్‌గా ఆ ఇద్ద‌రూ సీతారాముల అవ‌తారాలు ఎత్తారు. సీరియ‌ల్‌లో వారి పిల్ల‌లు శౌర్య‌, హిమ కూడా త‌మ రూపాలు మార్చుకొని ల‌వ‌కుశుల‌య్యారు. అవును. ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని స్టార్ మా చాన‌ల్ 'మా ఉగాది వేడుక' పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను ప్ర‌సారం చేయ‌నున్న‌ది. ఇందులో రామాయ‌ణ గాథ‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ గాథ‌లో శ్రీ‌రామునిగా నిరుప‌మ్‌, సీతాదేవిగా ప్రేమి న‌టించారు. ఆ వేషాల్లో వారు ఆక‌ట్టుకుంటున్నారు. సీతారాముల పిల్ల‌లైన ల‌వ‌కుశులుగా శౌర్య‌, హిమ జీవించారు.

అల‌నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'ల‌వ‌కుశ‌'లోని "ఎందుకు ఈ ప‌రీక్ష‌.. ఎవ్వ‌రికీ ప‌రీక్ష‌.. శ్రీ‌రాముని భార్య‌కా శీల‌ప‌రీక్ష" అంటూ పాట వినిపిస్తుండ‌గా, ఆ పాట‌కు శోక‌త‌ప్తులుగా ల‌వ‌కుశుల వేషాల్లోని శౌర్య‌, హిమ న‌టిస్తుంటే మ‌న‌మూ శోక‌త‌ప్తులుగా మార‌తామేమో అన్న‌ట్లుగా ఉంది 55 సెక‌న్ల ప్రోమో. చివ‌ర‌లో ఏడుస్తూ, "నా ప్ర‌భువు శ్రీ‌రామ‌చంద్రుని త‌ప్ప అన్య‌మెరుగ‌ని ఇల్లాలినైతే ఓ మాతా భూమాతా.. న‌న్నాద‌రించి నీ ఒడిలో చేర్చుకో" అని సీత పాత్ర‌ధారి ప్రేమి చెప్ప‌డం, భూమాత ఆమెను త‌న‌లోప‌లికి తీసుకోవ‌డం, ల‌వ‌కుశుల‌ను శ్రీ‌రాముడు ద‌గ్గ‌ర‌కు తీసుకోవ‌డం హృద‌యాల‌ను భారంగా మార్చేశాయి.

అయితే సీత కోసం ఓ మ‌హారాజా కుర్చీ రావ‌డం, ఆమె అందులో కూర్చొని భూమి లోప‌లికి వెళ్తున్న‌ట్లు చూపించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఈ ఉగాది స్పెష‌ల్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 13న స్టార్ మాలో ప్ర‌సారం కానున్న‌ది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.