English | Telugu

'డ్రామా జూనియ‌ర్స్' కోసం మేక‌ప్.. ఫొటోలు షేర్ చేసిన రేణు దేశాయ్‌!

రేణూ దేశాయ్ బిజీగా మారారు. టీవీ రియాలిటీ షో 'డ్రామా జూనియ‌ర్స్' సీజ‌న్ 5 షూటింగ్‌లో ఏప్రిల్ 5 నుంచి పాల్గొంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఆమె, త‌న తొలిరోజు షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను షేర్ చేసుకున్నారు. త‌ను మేక‌ప్ వేసుకుంటున్న పిక్చ‌ర్స్‌తో పాటు, షో ఓపెనింగ్‌కు సంబంధించిన షాట్‌ను కూడా ఆమె షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ షో షూటింగ్ అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌రుగుతోంది.

ఈ షోలో రేణుతో పాటు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఎస్వీ కృష్ణారెడ్డి, సింగ‌ర్ సునీత జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. కృష్ణారెడ్డి ఓ టీవీ షోకు ప‌నిచేయ‌డం ఇదే తొలిసారి. అలాగే ఒక టీవీ షోకు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించ‌డం సునీత‌కూ తొలిసారే. ఈ షోలో పాల్గొంటున్న‌ పిల్ల‌ల‌తో క‌లిసి ముగ్గురు జ‌డ్జిలు స‌ర‌దాగా గ‌డుపుతున్న టీజ‌ర్‌ను టీవీ చాన‌ల్ రిలీజ్ చేసింది.

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా విధించిన లాక్‌డౌన్ కంటే ముందుగానే ఈ షోను అనౌన్స్ చేశారు. అప్ప‌ట్లో రేణు దేశాయ్‌, ఖుష్బూ సుంద‌ర్‌, అన‌సూయ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని అనుకున్నారు. ఇప్పుడు ఖుష్బూ, అన‌సూయ ప్లేస్‌లో కృష్ణారెడ్డి, సునీత వ‌చ్చారు.

మునుప‌టి సీజ‌న్ల మాదిరిగానే డ్రామా జూనియ‌ర్స్ సీజ‌న్ 5కు ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్య‌వ‌రించ‌నున్నాడు. ఇందులో కొంత‌మంది పిల్ల‌లు త‌మ యాక్టింగ్ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.