English | Telugu

మామిడి ప‌ళ్ల‌‌మ్ముకుంటున్న సుధీర్‌.. పూల‌మ్ముకుంటున్న ర‌ష్మి!

సుడిగాలి సుధీర్ స్కిట్ అంటేనే అదో సంద‌డి.. కార‌ణం తెలిసిందే.. యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్‌తో ఆ స్కిట్‌కు త‌ప్ప‌కుండా క‌నెక్ష‌న్ ఉంటుంది మ‌రి! వ‌చ్చేవారం రానున్న లేటెస్ట్ ఎపిసోడ్ అందుకు మిన‌హాయింపు కాదు. ఈసారి మామిడిప‌ళ్ల‌మ్ముకొనే స్కిట్ చేశాడు సుధీర్‌. "గున్నా గున్నా మామిడీ" అంటూ ఓ వైపు నుంచి సుధీర్‌, ఇంకోవైపు నుంచి రామ్‌ప్ర‌సాద్ మామిడి ప‌ళ్ల బ‌ళ్లు తోసుకుంటూ స్టేజ్ మీద‌కు వ‌చ్చేశారు. ప‌ళ్ల‌మ్ముకోడానికి "ఆ.. మామిడి ప‌ళ్లేయ్" అని సుధీర్ కేకేయ‌గానే, "హేయ్‌.. ప‌ర్‌ఫెక్ట్" అంది ర‌ష్మీ గౌత‌మ్‌ క‌ళ్లు పెద్ద‌వి చేసుకొని. పెదిమ బిగించి న‌వ్వాపుకోడానికి ట్రై చేశాడు సుధీర్‌. అదిచూసి ర‌ష్మి, జ‌డ్జిలు రోజా, మ‌నో ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేశారు.

ఒక‌త‌ను రామ్‌ప్ర‌సాద్ బండి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి "డ‌జ‌ను మామిడి ప‌ళ్లెంత‌?" అని అడిగాడు. "నూట యాభై" అని చెప్పాడు రామ్‌ప్ర‌సాద్‌. "వంద‌కు వ‌స్తాయా?" అని అడిగాడు వ్య‌క్తి. "రావు" అని చెప్పాడు రామ్‌ప్ర‌సాద్‌. వ్య‌క్తి "వ‌స్తాయ్ చూడ‌బ్బా" అన్నాడు. రామ్‌ప్ర‌సాద్ మామిడి పండు ద‌గ్గ‌ర ముఖం పెట్టి, "ఏమ్మా వంద‌కెళ్తావా?" అన‌డిగి, "రాద‌ట" అని చెప్పాడు వ్య‌క్తితో. ఆ వ్య‌క్తి బిత్త‌ర‌పోయి చూడ్డం, మిగ‌తా అంద‌రూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వ‌డం జ‌రిగిపోయాయి.

ఆ వ్య‌క్తి సుధీర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, "నువ్వు సుడిగాలి సుధీర్‌వి క‌దూ?" అన‌డిగాడు. రామ్‌ప్ర‌సాద్ వ‌చ్చి, "సుడిగాలి సుధీరే.. షోలోంచి తీసేశారు. ఇదిగో.. ఇప్పుడు నాతోపాటు వ్యాపారం పెట్టుకున్నాడు." అని చెప్పాడు. ఆ వ్య‌క్తి, "నీతో పాటు ర‌ష్మి ఉండాలి. ర‌ష్మి ఏం చేస్తోంది?? అని ప్ర‌శ్నించాడు. "రైల్వే స్టేష‌న్‌లో పూల‌మ్ముకుంటోందండీ" అని చెప్పాడు సుధీర్ చాలా క్యాజువ‌ల్‌గా. ర‌ష్మి షాకైన‌ట్లు పెద్ద‌గా నోరు తెరిచేసింది. అదిచూసి రోజా, మ‌నోల‌కు న‌వ్వాగ‌లేదు.

ఆ త‌ర్వాత సీన్‌లోకి గెట‌ప్ శ్రీ‌ను వ‌చ్చాడు, మ‌ధ్య‌వ‌య‌సులో ఉన్న వ్య‌క్తి గెట‌ప్‌తో. "డ‌జ‌నెలాగ?" అన‌డిగాడు రామ్‌ప్ర‌సాద్‌ను. "డ‌జ‌న్ నూట‌యాభై" అని చెప్పాడు రామ్‌ప్ర‌సాద్‌. "నూట యాభై అంటే ప‌న్నెండే క‌దా" అన్నాడు శ్రీ‌ను. "అదేంటి?" అని అర్థంకాక అడిగాడు రామ్‌ప్ర‌సాద్‌. "డ‌జ‌నుకి ప‌న్నెండేగా" అన్నాడు శ్రీ‌ను. అత‌ని వంక తెల్ల‌ముఖం వేసుకొని చూశాడు రామ్‌ప్ర‌సాద్‌. మిగ‌తా అంద‌రూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేశారు.

ఇలా సుడిగాలి సుధీర్ బ్యాచ్ మామిడి ప‌ళ్ల స్కిట్‌తో తెగ న‌వ్వించేందుకు ఏప్రిల్ 9న ప్ర‌సార‌మ‌య్యే ఎపిసోడ్‌తో వ‌స్తోంది 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'. చూసి వినోదించ‌డ‌మే త‌రువాయి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.