English | Telugu

బంధం సేన బ‌ల‌వంతం.. అనుకి ఆర్య‌వ‌ర్ధ‌న్ తాళి క‌ట్టాడా?

జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్ 'ప్రేమ ఎంత మ‌ధురం'. గ‌త కొంత కాలంగా ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఆర్యవ‌ర్ధ‌న్‌ని అను నుంచి దూరం చేయాల‌ని అత‌ని ద‌గ్గ‌ర ప‌నిచేసే మీరా మాస్ట‌ర్ ప్లాన్ వేస్తుంది. ప్రేమికుల రోజు అనుని పార్క్‌కి ర‌ప్పించి అదే స‌మ‌యానికి అనుతో క‌లిసి సంప‌త్ వుండేలా చేస్తే నీ కొడుకు పెళ్లి అనుతో జ‌రిగేలా బంధం సేన చూసుకుంటుంద‌ని ర‌ఘురామ్‌కు స‌ల‌హా ఇస్తుంది.

అదే స‌మ‌యంలో అనుకి ఫోన్ చేసి పార్క్‌కి ర‌మ్మ‌ని రాంగ్ ఇన్‌ఫర్మేష‌న్ ఇస్తుంది. అలా ఆర్య‌వ‌ర్ధ‌న్‌కి తెలియ‌కుండా అనుని ప్రేమికుల పార్క్‌కి ర‌ప్పించిన మీరా అదే చోటికి ర‌ఘురామ్ త‌న కొడుకు సంప‌త్‌ని తీసుకొచ్చేలా చేస్తుంది. ఆ వెంట‌నే ర‌ఘురామ్‌తో బంధం సేన‌కు ఫోన్ చేయిస్తుంది మీరా. అయితే మీరా ప్లాన్ తెలియ‌క‌పోయినా మాన్సీ కాఫీలో నెయిల్ పాలిష్ క‌లిపి మీరా ఇల్లు క‌ద‌ల కుండా చేస్తుంది.

అను, ప‌క్క‌నే సంప‌త్ వుండేలా ప్లాన్ చేసిన మీరా, ర‌ఘురామ్.. బంధం సేన ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇక ఖ‌చ్చితంగా అనుకి, సంప‌త్‌కి పెళ్లి జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని సంబ‌ర‌ప‌డిపోతారు. ఇదే స‌మ‌యంలో ఆర్య‌‌వ‌ర్ధ‌న్ పార్క్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం, సంప‌త్ బ‌య‌టికి రావ‌డంతో ర‌ఘురామ్ షాక్‌కు గుర‌వుతాడు. అను, ఆర్య‌వ‌ర్థ‌న్‌ల‌ని చూసిన బంధం సేన త‌మ‌ ముందే ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని, అనుకి తాళికట్టాల‌ని ఫోర్స్ చేస్తుంది. ఈ నేప‌థ్యంలో అనుకి ఆర్య తాళి క‌ట్టాడా లేదా అన్న‌ది తెలియాలంటే ఈ రోజు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.