English | Telugu

"ఆ టైమ్‌లో వీడు నావాడు అనిపించింది".. ఇమ్మానుయేల్‌పై వ‌ర్ష కామెంట్‌!

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న కామెడీ షో 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'. ఇంత వ‌ర‌కు ఈ షోని కొట్టే షో ఇంత వ‌ర‌కు రాక‌పోవ‌డం విశేషం. ఈ షోలో గ‌త ఏడేళ్లుగా టీవీ వీక్ష‌కుల్ని అల‌రిస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు సుడిగాలి సుధీర్‌, ర‌ష్మిగౌత‌మ్‌. వీరి ల‌వ్ ట్రాక్ గురించి ఎన్ని సార్లు చ‌ర్చ‌ల్లో నిలిచినా మా ఇద్ద‌రి మ‌ధ్య వున్న‌ది స్నేహం మాత్ర‌మే అని కొట్టి పారేస్తుంటారు సుధీర్‌, ర‌ష్మి‌.

తాజాగా వీరి త‌ర‌హాలోనే వార్త‌ల్లో నిలుస్తున్న మ‌రో జ‌బ‌ర్ద‌స్త్ జోడీ వ‌ర్ష‌, ఇమ్మానుయేల్‌. వీరిద్ద‌రి మ‌ధ్య స్టేజ్‌పై పండే రొమాన్స్ అంతా ఇంతా కాదు. వ‌ర్ష‌ని రోజా అడిగిన ప్ర‌తీసారి "రంగుదేముందు మేడ‌మ్ మ‌న‌సు ముఖ్యం గానీ" అంటూ వ‌ర్ష.. ఇమ్మానుయేల్‌ని స‌పోర్ట్ చేయ‌డం.. ఆ స‌మాధానానికి రోజా షాక్ కావ‌డం జ‌రుగుతూనే వుంది. తాజాగా వ‌ర్ష చెప్పిన ఓ మాట విని ఈ షోకు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌రోజా మ‌రోసారి షాక్‌కు గురయ్యారు.

"మేడ‌మ్ నేనొక‌టి చెప్పాలి. యూట్యూబ్‌లో ఎవ‌రో చ‌నిపోయార‌ని స్క్రోలింగ్ వ‌చ్చింది." అని వ‌ర్ష చెప్పింది. "వ‌ర్ష బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంది అని రాశారు." అని ఇమ్మానుయేల్ అందుకున్నాడు. "నైట్ టైమ్ ఫోన్ చేసి, వ‌ర్షా ఎక్క‌డున్నావ్‌? నువ్వు బాగానే ఉన్నావా?.. అని అడిగాడు." అని చెప్పింది వ‌ర్ష‌. "నీ ప్రాణం గిల‌గిల్లాడిపోయిందా?" అన‌డిగారు రోజా.

"కానీ నాకోటి అనిపించింది మేడ‌మ్‌.. నాకోసం వీడు ఇంత ఆలోచించాడా.." అని చెప్పింది వ‌ర్ష‌. "నిజ‌మైన ప్రేమ" అని కాంప్లిమెంట్ ఇచ్చారు రోజా. దాంతో వ‌ర్ష సిగ్గుల మొగ్గ‌యింది. "ఆ టైమ్‌లో వీడు నావాడు అనిపించింది." అని బ‌య‌ట‌పెట్టేసింది. దాంతో "ఆ.." అని ఆశ్చ‌ర్యంగా నోరు తెరిచేశాడు ఇమ్మానుయేల్‌. "అరెరెరే.." అని న‌వ్వారు రోజా. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.